ఒడిశాలో చిల్కా సరస్సు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఆ సరస్సు తీరాన ఉంది రంభా ప్యాలెస్. ఆ ప్యాలెస్ గురించి చెప్పాలంటే రెండు వందల ఏళ్ల వెనక్కి వెళ్లాలి. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
అది 1791. మనదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హవా నడుస్తున్న రోజులవి. ఇంగ్లిష్ ఇంజనీర్ థామస్ స్నోద్‌గ్రాస్, మన స్థానిక సహాయకులతో కలిసి నిర్మించిన ప్యాలెస్ అది. ఈప్యాలెస్ చక్కటి వెకేషన్ ప్లేస్. కోణార్క్ సూర్యదేవాలయానికి పూరీలోని జగన్నాథ ఆలయానికి కూడా 150 కిలోమీటర్ల దూరాన ఉంది. ఈ ΄్యాలెస్‌ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా 2018లో న్యూఢిల్లీకి చెందిన హాచ్ వెంచర్ కొన్నది. నిర్మాణాన్ని పునరుద్ధరించే బాధ్యతను శ్రీలంకకు చెందిన ఆర్కిటెక్ట్ చన్నా దాసవాతేకి అప్పగించింది. ఈ ఆర్కిటెక్ట్ ఆరేళ్ల పాటు శ్రమించి ప్యాలెస్ చారిత్రక వైభవానికి విఘాతం కలగకుండా పునరుద్ధరించాడు.
జాతీయోద్యమంలో భాగంగా సాగిన ఉత్కళ్ మూవ్‌మెంట్ జ్ఞాపకాలను పదిలపరుచుకుని ఉందీ ప్యాలెస్. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఉన్నతాధికారులతో సమావేశమైన గుర్తులున్నాయందులో. ప్యాలెస్‌లో నివసించిన అనుభూతి కోసం పర్యాటకులు రాజస్థాన్ వెళ్తుంటారు. ఒకసారి ఒడిశా సంస్కృతి సంప్రదాయాలను కూడా ఆస్వాదించండి’ అంటూ ఈ ప్యాలెస్ సహ యజమాని ఒడిశా రాజవంశానికి చెందిన వారసుడు హిమాన్‌గిని సింగ్ పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నారు. క్రిస్టమస్ వెకేషన్‌కి లేదా సంక్రాంతి వెకేషన్‌కి ప్లాన్ చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment