అమర్‌నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు బయలుదేరే భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్ అమర్‌నాథ్ యాత్రికులకు ఒక శుభవార్త తెలిపింది.
అమర్‌నాథ్ యాత్రికులకు ప్రయాణ సమయాన ఇబ్బందులను దూరం చేస్తే వార్త ఇది. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగించనుంది. అమర్‌నాథ్ యాత్ర చేసేవారు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే వారికి భారీ రాయితీ లభించనుంది. ఈ విషయాన్ని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్(ఏజేహెచ్‌ఎల్‌ఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్ములో బసచేసే అమర్‌నాథ్ యాత్రికులు ఇక్కడి హోటల్స్‌ను ముందుగానే బుక్ చేసుకుంటే 30 శాతం రాయితీ అందించనున్నట్లు ఏజేహెచ్‌ఎల్‌ఏ ఆ ప్రకటనలో తెలియజేసింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పవన్‌గుప్తా మాట్లాడుతూ తాము సదుద్దేశంతో అమర్‌నాథ్ యాత్రికులలో ఇక్కడి హోటల్స్‌లో బసచేసేవారికి 30 శాతం రాయితీ అందజేస్తున్నట్లు తెలిపారు. తద్వారా అమర్‌నాథ్ యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందన్నారు.
జూలై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర
ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్ గుహ దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల నడుమ, సమద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 62 రోజుల తీర్థయాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. వాటిలో ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలో 48 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. మరొకటి బందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనేవారు జూన్ 30 నాటికి జమ్మునకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈసారి అమర్‌నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తుల వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.
చదవండి: ‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ!
Comments
Please login to add a commentAdd a comment