వేసవి కాలం వచ్చేసంది. ఈ ఎండలో చల్ల చల్లగా ఉపశమనం కోసం పర్యటక ప్రియులంతా సమ్మర్ వెకేషన్ కోసం ప్లాన్ చేస్తుంటారు. సమ్మర్ వెకేషన్ అనగానే అందరి టక్కున గుర్తొచ్చేది నార్త్ టూర్. కునుమానాలి, సిమ్లా ఇలా నార్త్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. కానీ మన సౌత్‌లో కూడా వేసవి విడిదికి ఉత్తమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందులో కూర్గ్ ఒకటి. సౌత్ టూర్ అనగానే అందరికి అరకులోయ, ఊటీ, కన్యాకుమారి ఇలా గుర్తొస్తాయి. కానీ దక్షిణ కర్ణాటకలోని ఈ కూర్గ్ ప్రాంతం చాలా తక్కువ మందికి తెలుసు.
భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్ ఇక్కడి ప్రత్యేకం. దీనిని ఇండియన్ స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. అత్యంతక సుందరమైన, ఆకర్షనీయమైన పర్వతపాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇవి మాత్రమే ఇక్కడ ఇంకా కూర్గ్‌లో చూడాల్సిన అందమైన ప్రాంతాలేన్నో ఉన్నాయి. అక్కడ ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలేవో ఓ సారి చూద్దాం.
అబ్బే జలపాతం
కూర్గ్ ముఖ్యంగా చూడాల్సిన పర్యాటక ప్రాంతం ఇది. కాఫీ తోటల మధ్య ఉండే ఈ జలపాతం చూడగానే అత్యంత అనుభూతిని ఇస్తుంది. స్వర్గాన్ని తలపించే ఈ అందమైన జలపాతాలను సందర్శించడానికి పర్యాటక ప్రియులు క్యూ కడుతుంటారు . కూర్గ్‌లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. ఈ జలపాతం ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో తరచూ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
నాగర్‌హొళె జాతీయ పార్క్
ఈ ఉద్యానవనంలో అనేక జాతి రకాలకు చెందిన వృక్షాలు, జంతువులు దర్శనం ఇస్తుంటాయి. ఆ కారణంగా నాగర్‍హొళె జాతీయ ఉద్యానవనం దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి. కూర్గ్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఇది ఒకటి.
హనీ వాలి
హనీ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన నీలకండి జలపాతం ఇది. దట్టమైన ఉష్ణమండల అడవుల మధ్య ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది మంచి రిఫ్రెషింగ్ స్పాట్. ఇక్కడ ముఖ్యంగా ట్రెక్కింగ్, అత్యుత్తమ సాహస క్రీడలు ప్రసిద్ధి.
హొన్నమన కెరె లెక్
కూర్గ్ సహజ అందాలలో ఒకటి. పచ్చని కొండలు, కాఫీ తోటల, గుహల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. సరస్సు సమీపంలోని ఆలయంలో జరుపుకునే గౌరీ పండుగ సమయంలో సరస్సును ప్రత్యేకంగా సందర్శిస్తారు.
సోమవారపేట్
సోమవారపేట్ కాఫీ తొటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు. ఇక్కడి పచ్చని తోటలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతం.
నామ్‌డ్రోలింగ్ ఆరామం
ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం నామ్‌డ్రోలింగ్ ఆరామం గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి ఆకర్షణీయంగా ఉంటుంది. విభిన్న శైలిలో కట్టడంగా ప్రసిద్ధి గాంచిన నామ్‌డ్రోలింగ్ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఓంకారేశ్వర ఆలయం
ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర అనే రాజు నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
మడికెరి కోట
బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడిన ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారని చెబుతారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment