
కొలంబో: శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయ రాజపక్స అని ఆరోపణలు చేస్తూ... పెద్ద ఎత్తున ఆందోళన కారులు కొలంబో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిరసకారులు గోటబయ అధికార నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో గోటబయ లంకని విడిచిపెట్టి పారిపోక తప్పలేదు. ఐతే ఆందోళనకారులు.. గోటబయ నివాసంలో ఎంజాయ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని చల్లార్చుకుంటున్నారు.
ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల, జిమ్, పడకగది వంటి వాటన్నింటిని ఆక్రమించుకుని వారి ఇష్టారీతిన ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మధుహాన్సి హసింతర అనే యువతి కొలంబోలోని రాష్ట్రపతి నివాసాన్ని చూడాలనుకుంది. అనుకున్నదే తడువుగా గోటబయ అధికార నివాసానికి పయనమయ్యింది కూడా.
ఆ భవనంలోని విలాస వస్తువులన్నింటిని తన కెమెరాతో క్లిక్‌మనిపించింది. పైగా ఆ భవనాన్ని సందర్శించినట్లుగా ఆ నివాసం వద్ద నుంచున్న ఫోటోలను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఏప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు అధ్యక్షుడి నివాసం పర్యాటక ప్రదేశం మారిపోయిందని ఒకరు, మీరే అధ్యక్షురాలిగా మారాలి అని మరొకరు.. కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. గోటబయ నివాసం దగ్గర ఫోటోలు దిగాలని ఉబలాటపడిందేమో పాపం.. అంతే వేగంగా ఫోటోలను కూడా షేర్ చేసింది అంటూ మరొకకరు కామెంట్ చేశారు.
(చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,)
Comments
Please login to add a commentAdd a comment