Gotabaya Rajapaksa
-
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్‌కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్‌కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్‌కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్‌కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లంకలో ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు. అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్‌లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు. గతంలో యూఎన్‌పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్‌జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్పీ) చెబుతోంది. అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్ఎల్పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్‌తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు. 2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే. ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి. -
శ్రీలంకలో మళ్లీ భగ్గుమంటున్న నిరసనలు.. ఐ డోంట్ కేర్ అంటున్న రణిల్
కొలంబో: శ్రీలంక గత కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహోజ్వాలలు కట్టలు తెంచుకోవడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతుందేమో! అనేలోపు మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక మరోవైపు ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేని పార్లమెంట్‌ని రద్దు చేసి, ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. దీంతో రణిల్ ప్రతిపక్షాల డిమాండ్‌ని తిరస్కరించడమే కాకుండా పాలన మార్పు లక్ష్యంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వచ్చిన వాటిని అణిచేవేసేందకు కచ్చితంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతానని నొక్కి చెప్పారు. ముందుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు పార్లమెంట్‌ను రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. అదీగాక రాజపక్స స్థానంలో వచ్చిన విక్రమిసింఘే మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేసేంతవరకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు రణిల్ ప్రభుత్వానికి ఎన్నికల విశ్వసనీయత లేదంటూ ముందస్తు పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిస్తున్నాయి. ఐతే ఆర్థిక సంక్షోభంలో రణిల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నెలక్నొన అశాంతి కాస్త రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి గత జూలై నెలలో గోటబయ రాజపక్సను వెళ్లగొట్టారు. ఆయన వెళ్లిపోయిన తదనంతరమే నిరసనలు అణిచివేసి శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విక్రమసింఘే మాట్లాడుతూ ఇలాంటి నిరసనులు మళ్లీ పునరావృతమైతే అణిచివేసేందకు సైన్యాని దింపుతానని కరాకండీగా చెప్పేశారు. తనను నియంతగా పిలచినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగనివ్వనని చెప్పారు. ఒకవేళ నిరసకారులు వీధి నిరసనలు నిర్వహించాలనుకుంటే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడకుండా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దే దింపే ఏ ప్రణాళికను అనమితించనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రయత్నాలకి ఆందోళనకారులు మళ్లీ మళ్లీ తెగబడితే వాటిని ఆపేలా అత్యవసర చట్టాలను సైతం ఉపయోగిస్తానని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు రణిల్ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రవాద నిరోధక చట్టం కింద ఇప్పటికే ఇద్దరు నిసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ ఆసుపత్రిపై రష్యా సేనల దాడి.. శిశువుతో సహా ముగ్గురు మృతి) -
శ్రీలంకలో మళ్లీ ఆందోళనలు.. విక్రమ సింఘేకూ ‘గొటబయ’ పరిస్థితే!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలాకనిపించటం లేదు. ఇటీవలే ఏర్పడిన కొత్త ప్రభుత్వంపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని కొలంబోలో బుధవారం వందల మంది ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరిస్థితి ప్రస్తుత ప్రెసిడెంట్‌కూ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనలను విపక్ష పార్టీలు, వాణిజ్య సంఘాలు, పౌర హక్కుల గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. నగరంలోని అధ్యక్ష నివాసం, ఇతర మంత్రుల నివాసలు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రజలు మూడుపూటల కడుపునిండా తినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయకపోగా.. భారీగా పన్నులు విధిస్తోంది. దీనికి పరిష్కారం కావాలి. అందుకోసం పోరాడుతూనే ఉంటాం.’అని టీచర్స్ యూనియన్ సెక్రెటరీ జోసేఫ్ స్టాలిన్ తెలిపారు. ఈ ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి చమురు, ఆహార పదార్థాలు, కుకింగ్ గ్యాస్, ఔషధాల వంటి నిత్యావసరాల దిగుమతులకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుని గత జూలైలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత రణీల్ విక్రమ సింఘే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 14న తొలి బడ్జెన్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పన్నుల పెంపు సహా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ ఆందోళనబాట పడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం వందల మంది కొలంబోలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా పట్టుకుని ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి: GOA New Rules: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
శ్రీలంకకు తిరిగొచ్చిన ‘గొటబయ’.. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేందుకు కారణమై, ప్రజాగ్రహంతో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్వదేశం తిరిగివచ్చారు. ఈ ఏడాది జూలై 13న దేశం విడిచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ పారిపోయిన గొటబయ సుమారు ఏడు వారాల తర్వాత శనివారం తెల్లవారుజామున దేశంలో అడుగుపెట్టారు. బ్యాంకాక్ నుంచి వయా సింగపూర్ మీదుగా కొలంబోలోని బందారనాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన పలువురు చట్టసభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ ఎయిర్పోర్ట్ నుంచి మాజీ అధ్యక్షుడిగా ఆయనకు కేటాయించిన ప్రభుత్వ అధీనంలోని భవనానికి చేరుకున్నారు గొటబయ. 2019లో శ్రీలంక అధ్యక్ష పదవిని చేపట్టారు గొటబయ రాజపక్స. అయితే, దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తటంతో ప్రజలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు తీవ్రమవటం వల్ల జులై 9న అధ్యక్ష భవనం నుంచి పరారయ్యారు. నాలుగు రోజుల తర్వాత మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు వారాలకు దౌత్య వీసా ద్వారా థాయిలాండ్‌కు వెళ్లారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స!
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. యూఎస్ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారని శ్రీలంక పత్రిక డైలీ మిర్రర్ వెల్లడించింది. గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గొట బయా అర్హుడే. ఎందుకంటే ఆయన భార్య రోమా కు అమెరికా పౌరసత్వం ఉంది. భార్య, కుమారుడితో కలిసి అమెరికాలో స్థిరపడాలని గొటబయా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ హోటల్లో భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 25న శ్రీలంకకు తిరిగివచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ వరకూ థాయ్లాండ్లోనే ఉండిపోవాలని తొలుత అనుకున్నప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
థాయ్‌లాండ్ చెక్కేసిన గొటబయ
కొలంబో: శ్రీలంక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కారణమంటూ నిరసనకారలు ఆందోళనలు చేపట్టడంతో గోటబయ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసింది. ఈ మేరకు ఆయన మాల్దీవుల నుంచి సింగపూర్‌కి పయనమయ్యారు. అక్కడే 14 రోజుల పర్యాటక వీసాపై తాత్కాలికంగా ఆశ్రయం పొందారు కూడా. అంతేగాక ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియునున్న తరుణంలో శ్రీలంక ప్రభుత్వం మరికొన్ని రోజులు గోటబయకి అక్కడే ఆశ్రయం ఇవ్వాల్సిందిగా సింగపూర్ అధికారులను కోరింది. మరీ ఏమైందో తెలియదు గానీ ఆయన హఠాత్తుగా థాయలాండ్ చెక్కేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు గోటబయ రాజపక్స గురువారానికి థాయ్‌లాండ్ చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది కూడా. దీంతో గోటబయ థాయలాండ్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైన తీవ్ర నిరసనలు నడుమ అధ్యక్ష పదవికి రాజీనామ చేసి దేశం వదిలి పారిపోయిన తొలి అధ్యక్షుడగా గోటబయ నిలిచిపోయాడు. (చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక) -
ప్లీజ్ గోటబయను అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయే నంటూ నిరసనకారులు ఆయన అధికార నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే మాల్దీవులో కూడా శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు నిరసన సెగ తగలడంతో పలాయనం చిత్తగించక తప్పలేదు. దీంతో ఆయన గత నెల జులై 14 నుంచి సింగపూర్‌లో 14 రోజుల పర్యాటక వీసాపై అక్కడే ఉంటున్నారు. ఐతే ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం రాజపక్సను మరో 14 రోజులు అక్కడే ఉండనివ్వండి అంటూ సింగపూర్ అధికారులను అభ్యర్థించినట్లు సమాచారం. దీంతో ఆయన మరికొన్ని రోజులు సింగపూర్‌లోనే గడపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గోటబయ జులై 15న రాజీనామ చేసినట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద అబేవర్ధన బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన దేశాన్ని వదిలి పారిపోయిన తదుపరి గోటబయ స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్ విక్రమసింఘే శ్రీలంక కొత్త అధక్ష్యుడిగా ఎన్నికయ్యారు. (చదవండి: వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు...లాక్డౌన్ దిశగా అడుగులు) -
Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగింపు
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సాదారణ స్థితికి వచ్చేలా కనిపించటం లేదు. ఇటీవలే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన పదవి చేపట్టిన క్రమంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. నిరసనకారుల టెంట్లను తొలగించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. తాజాగా.. దేశంలో ఎమర్జెన్సీని మరో నెల రోజుల పాటు పొడిగించింది విక్రమ సింఘే ప్రభుత్వం. అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది ఆ దేశ పార్లమెంట్. దీనిపై ఓటింగ్ చేపట్టగా 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది చట్టసభ్యులు వ్యతిరేకించారు. ప్రజాభద్రత, నిరాటంకంగా నిత్యావసరాల సరఫరా వంటి అంశాలను చూపుతూ జులై 18న దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రణీల్ విక్రమ సింఘే. ఆ ఆర్డినెన్స్‌కు 14 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం తెలపకపోతే అది రద్దవుతుంది. కానీ, తాజాగా పార్లెమెంట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో మరో నెల రోజుల పాటు దేశంలో అత్యవసర స్థితి అమలులో ఉండనుంది. సింగపూర్‌లో మరో 14 రోజులు గొటబయ.. ప్రజాగ్రహంతో దేశం విడిచి సింగపూర్ పారిపోయారు శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. జులై 14న మాల్దీవుల నుంచి సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయనకు 14 రోజుల పర్యటక పాస్‌ను ఇచ్చింది ఆ దేశం. అయితే.. సమయం ముగియనుండటంతో మరో 14 రోజులు పొడిగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆగస్టు 11 వరకు గొటబయ సింగపూర్‌లో ఉండనున్నారని తెలిపింది. మరోవైపు.. సింగపూర్ నుంచి గొటబయ తిరిగి వస్తారని రెండు రోజుల క్రితం శ్రీలంక కేబినెట్ ప్రతినిధి బందులా గునవర్ధనే పేర్కొనటం గమనార్హం. సింగపూర్ వెళ్లిన తర్వాత ఓ హోటల్లో బస చేసిన గొటబయ.. ప్రస్తుతం ప్రైవేట్ ఇంటికి మారినట్లు సమాచారం. ఇదీ చదవండి: Volodymyr Zelensky: భార్య ఒలేనాతో జెలెన్స్కీ పోజులు.. నెటిజన్ల విమర్శలు -
Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్..!
సింగపూర్: శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రజాగ్రహంతో దేశం విడిచిన గొటబయ రాజపక్స ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్నారు. అయితే.. అక్కడా ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రజాహక్కుల గ్రూప్ గొటబయపై క్రిమినల్ కేసు పెట్టింది. యుద్ధ నేరాల ఆరోపణలతో గొటబయను అరెస్ట్ చేయాలంటూ.. సింగపూర్ అటార్నీ జెనరల్‌కు 63 పేజీల ఫిర్యాదును అందజేశారు ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్(ఐటీజేపీ) న్యాయవాదులు. 2009లో జరిగిన అంతర్యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న రాజపక్సే.. జెనీవా ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. అవి అంతర్జాతీయ న్యాయపరిధిలో భాగంగా సింగపూర్ దేశీయ ప్రాసిక్యూషన్‌కు లోబడిన నేరాలుగా పేర్కొన్నారు. పిటిషన్ ప్రకారం.. అంతర్యుద్ధం సమయంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టం, అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను గొటబయ ఉల్లంఘించారు.‘అందులో హత్య, ఉరి తీయించటం, వేధించటం, అమానవీయంగా కొట్టటం, అత్యాచంర, ఇతర లైంగిక వేధింపులు, స్వేచ్ఛను హరించటం, మానసికంగా క్షోభకు గురిచేయంట వంటివి ఉన్నాయి. ఆర్థిక మాంద్యంతో ప్రభుత్వం పతనాన్ని చూసింది, అయితే శ్రీలంకలో సంక్షోభం నిజంగా మూడు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్రితం జరిగిన తీవ్రమైన అంతర్జాతీయ నేరాలతో ముడిపడి ఉంది. ఈ ఫిర్యాదు కేవలం అవినీతి, ఆర్థిక అవకతవకల గురించే కాదు.. తీవ్ర నేరాలకు బాధ్యత వహించాలని నమోదు చేశాం.’ అని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా పేర్కొన్నారు. గొటబయ రాజపక్సను అరెస్ట్ చేసి యుద్ధ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని కోరింది ఐటీజేపీ. 1989లో ఆయన ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు.. సుమారు 700 మంది కనిపించకుండా పోయారని ఆరోపించింది. ముఖ్యంగా రక్షణ శాఖ సెక్రెటెరీగా ఉన్నప్పుడు ఆ నేరాలు మరింత పెరిగాయని తెలిపింది. తన కింది అధికారులకు టెలిఫోన్ ద్వారా నేరుగా ఆదేశాలు ఇచ్చి ప్రజలపై దాడి చేయించే వారని ఆరోపించింది. ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టి చోరీకి పాల్పడిన దుండగులు.. వీడియో వైరల్! -
దేశాన్ని చక్కబెడతారా?
పాలకుడు మారితే పరిస్థితులు మారతాయని ఎక్కడైనా అనుకుంటారు. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభానికి ప్రయాణిస్తున్న శ్రీలంకకు ఆ సూత్రం పని చేయకపోవచ్చు. దేశాన్ని వదిలి పారిపోయిన గొటబయ రాజపక్సే స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్ విక్రమసింఘే గురు వారం కొత్త అధ్యక్షుడిగా కొలువు తీరడంతో ఇప్పుడు పలువురి అనుమానం ఇదే. గొటబయ బదులు ఆయన మాట జవదాటని సన్నిహితులే గద్దెపైకి చేరడంతో పేర్లు మారాయే తప్ప, పాలన మారుతుందా అని సందేహిస్తున్నారు. 1977లో రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఆరుసార్లు ప్రధాని పదవినెక్కి, ఏ ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని ఘనత రణిల్ది. కథ ముగిసిందనుకున్న ప్రతిసారీ రాజకీయంగా పునరుత్థానమై, గత అయిదు దశాబ్దాల శ్రీలంక రాజకీయ చరిత్రలో ‘జిత్తులమారి నక్క’గా పేరొందారు. అధ్యక్షపదవి కోసం పలుసార్లు విఫలయత్నం చేసి, ఎట్టకేలకు బుధవారం పార్లమెంటరీ రహస్య బ్యాలెట్లో జీవితకాల వాంఛ నెరవేర్చుకున్నారు. ఇక దేశానికి తొమ్మిదో అధ్య క్షుడిగా ఎంతకాలం నిలబడతారు, ఎలాంటి ఎత్తులు జిత్తులతో కథ నడుపుతారన్నది ఆసక్తికరం. లంక చరిత్రలో తొలిసారిగా నేరుగా ఎంపీల మద్దతుతో ఎన్నికైన ఈ మాజీ వకీలు గురువారం పదవీ బాధ్యతలు చేపడుతూనే, ప్రజాందోళనకారుల్ని ‘ఫాసిస్టులు’గా అభివర్ణించారు. ఉక్కుపాదం మోపుతానని తేల్చేశారు. పాఠశాలలో చిన్నప్పటి తన సహపాఠీ దినేశ్ గుణవర్దనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే పనిలోపడ్డారు. గొటబయ వర్గం మద్దతుతో సాగిన ఎన్నిక కానీ, పదవీ స్వీకారోత్సవానికి హాజరైన గొటబయ అన్న మహిందా ఆత్మీయత కానీ, రాజపక్సేయులకు నమ్మినబంటైన దినేశ్ ఎంపిక కానీ చూస్తే – ఒకటి స్పష్టం. రణిల్ నుంచి రాజపక్సేల వ్యతిరేక పాలననైతే చూడలేం. గతంలో ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ రాజకీయంగా రాజపక్సేలకు ప్రతిపక్షమే. కానీ, వ్యక్తిగత అనుబంధాలతో వివాదాస్పద రాజపక్సే కుటుంబానికి ఆయన వీర విధేయుడు. కాబట్టి, దేశ దుఃస్థితికి కారణమైన రాజపక్సేలను గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పటిలానే ఇప్పుడూ ఆయన కాపాడతారని నిరసనకారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమం ద్వారా తాము డిమాండ్ చేస్తున్న రాజ్యాంగపరమైన మార్పు కానీ, చివరకు అధ్యక్షుడికి ముద్దరముడుపుగా అధికారాలు కట్టబెట్టే ‘ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ’ విధానాన్ని కానీ రణిల్ మార్చకపోవచ్చని అనుమానిస్తున్నారు. అంటే, మొదట ప్రధాని స్థానం నుంచి మహిందా, తాజాగా అధ్యక్ష పదవి నుంచి ఆయన తమ్ముడు గొటబయ తప్పుకున్నా లంక వాసులు నిజాయతీగా ఆశించిన మార్పు రానే లేదు. రణిల్ తాజా వ్యాఖ్యలతో అసహనం పెరిగి, ఆందోళనలు కొనసాగే సూచనలున్నాయి. ఒకప్పుడు బలమైన ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’ (యూఎన్‌పీ)కి నేతగా వెలిగినా, ఆనక జనా దరణ కోల్పోయి, 2020లో జాబితా విధానంతో పార్లమెంట్లో తమ పార్టీకి ఏకైక ప్రతినిధిగా మిగిలారు రణిల్. మొన్న మే దాకా రాజకీయంగా దాదాపు తెర మరుగైన ఆయనకు ఆపద్ధర్మ ప్రధాని హోదా, ఇప్పుడు దేశాధ్యక్ష హోదా అనూహ్యంగా వచ్చి ఒళ్ళోపడ్డాయి. లెక్కప్రకారం గొట బయ పదవీకాలం ముగిసే 2024 నవంబర్ దాకా ఆయన అధ్యక్ష హోదాలో ఉండాలి. ఇది ఆయనకు ముళ్ళకిరీటమే. కానీ, ఆర్థిక వ్యవహారాల్లో దిట్టగా పేరున్న ఈ పాశ్చాత్య అనుకూల సంస్కరణవాదికి 2001లో సింహళాన్ని ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలాంటి ఇంద్రజాలం చేయగలరా? చైనా పన్నిన అప్పుల ఉచ్చులో చిక్కుకుపోవడమే సింహళ ఆర్థిక సంక్షోభానికి కారణమని అమెరికాకు చెందిన సీఐఏ లాంటివి తాజాగా ఆరోపిస్తున్నా, అది నిజం కాదని విశ్లేషకుల మాట. కొలంబోకున్న అప్పుల్లో చైనావి సుమారు 10 శాతమే అనీ, లంకేయుల వార్షిక విదేశీ రుణ సర్వీ సింగ్లోనూ అవి 5 శాతం మించవనీ వారి లెక్క. అనేకచోట్ల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి అధిక వడ్డీ రేట్లకు తెచ్చిన అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లు ఈ ద్వీపదేశపు విదేశీ మారక నిల్వలు కరిగి, ఖాళీ అయిపోవడానికి ఓ ప్రధాన కారణం. 2002కి ఆ బాండ్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం 1.5 బిలియన్ డాలర్లు మించి, మొన్న మేలో చెల్లించలేక చేతులెత్తేసి, దేశాన్ని దివాళా తీయించింది. ఆర్థిక, పాలనా సంస్కరణలే ఇప్పుడు రణిల్‌కు దిక్కు. సంప్రతింపుల్లో 3.5 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ కార్యక్రమానికి ఓకే చెబితే, ఇతర ద్వైపాక్షిక సాయాలకూ మార్గం సుగమం అవుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పీడిస్తున్న అవినీతి, అధికార అలసత్వాన్ని వదిలించుకోవాలి. భారత్ లాంటి స్నేహదేశాలతో ఆర్థిక వారధి నిర్మించుకోవాలి. వివాదాస్పద ప్రాజెక్టులకు 6 శాతం వ్యాపార వడ్డీ రేటుతో అప్పులిచ్చి, ముక్కుపిండి వసూలుకు దిగిన చైనా కన్నా, ఆహారం, ఆరోగ్యం, ఇంధనాల సాయంలో తోడు నిలిచిన భారత్‌తో దోస్తీ పెంచాలి. భారత్ సైతం హాంగ్‌కాంగ్ – చైనా నమూనాలో ద్వీపదేశంతో వాణిజ్య – పెట్టుబడుల జోడీ కడితే ఉభయతారకం. గత రెండు నెలల్లో ఆపద్ధర్మ ప్రధానిగా కొంత ప్రయత్నించిన రణిల్ ఇకపై ఏం చేస్తారో చూడాలి. అయితే, పులుకడిగిన ముత్యాన్నని చెప్పుకున్నా, గతంలో కేంద్ర బ్యాంకులో ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్న ఆయన ఈసారీ అలాంటి బాట పడితే జాతి క్షమించదు. సింహళంతో పాటు ఇప్పుడు యావత్ ప్రపంచం చూపూ రణిల్ మీదే! -
గోటబయకు ఊరట... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సింగపూర్!
కొలంబో: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆందోళనకారులు చేసిన నిరసనల నడమ లంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన మాల్దీవులు అక్కడ నుంచి సింగపూర్‌కు పరారయ్యారు. ఐతే గోటబయకు సింగపూర్ ఆశ్రయం ఇచ్చిందంటూ వార్తలు గుప్పుమనడంతో వాటన్నింటిని సింగపూర్ అధికారులు ఖండించారు. లంక మాజీ అధ్యక్షుడు ఆశ్రయం కోరనూలేదూ, తాము ఆశ్రయం ఇవ్వనూలేదని తెగేసి చెప్పింది. అది గోటబయ వ్యక్తి గత పర్యటన అని నొక్కి చెప్పింది. ఈ క్రమంలో సింగపూర్ ఇమిగ్రేషన్ అధికారులు మీడియా సమావేశంలో తాజాగా గోటబయకు స్వల్పకాలిక సందర్శన పాస్ మంజూరు చేసినట్లు పేర్కొంది. సింగపూర్పర్యటన నిమిత్తం వచ్చే పర్యాటకులకు ఇక్కడ బస చేసేందుకు సాధారణంగా 30 రోజుల వ్యవధితో కూడిని ఎస్టీవీపీ జారీ చేయబడుతుందని తెలిపారు. ఒకవేళ పొడిగించుకోవాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులబాటు కూడా ఉంది. గతవారం ఆశ్రయం ఇవ్వలేదన్న సింగపూర్ ఇప్పుడు మాటమార్చి పర్యటన పాస్ మంజూరు చేశామని చెప్పడం గమనార్హం. (చదవండి: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన) -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల వేళ.. భారత్ సాయం కోరిన ప్రేమదాస
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ నాయకుడు సాజిత్ ప్రేమదాస సోషల్ మీడియా వేదికగా భారత్‌కి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో... "ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయ పూర్వక అభ్యర్థన. అధ్యక్షుడిగా ఎవరూ ఎన్నికైనా భారత్ లంక తల్లికి మద్దతిచ్చి సహాయం చేస్తు ఉండాలని కోరారు." నెలల తరబడి సాగిన నిరసనకారులు ఆందోళనల నడుమ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతవారమే రాజీనామా చేశారు. రాజపక్స కుటుంబికులే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని వారివల్లే ఆర్థిక సంక్షోభానికి దారితీసిందంటూ వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో గోటబయ లంక విడిచిపెట్టి పోవాల్సి రావడమే కాకుండా పదవికి రాజీనామ చేయాల్సిన దుస్థితి ఎదురైంది. ఆయన వెళ్లిపోతూ.. లంక అధ్యక్ష బాధ్యతలు విక్రమ సింఘే రణిల్కి అప్పగించారు. దీంతో విక్రమసింఘే లంక తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ విక్రమసింఘేను రాజపక్స మిత్రపక్షంగా చూసే నిరసనకారులు ఆయన పట్ల విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఐతే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, వామపక్ష జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ ప్రకటించింది. ఐతే ఈ త్రిముఖ పోటీలో రణిల్ విక్రమసింఘేకే గెలిచే అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పెరమున నుండి విడిపోయిన గ్రూప్‌కు చెందిన కీలక నేత డల్లాస్ అలహప్పెరును అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తుండటంతో సాజిత్ ప్రేమదాస ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో బుధవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగనున్నారు. (చదవండి: Sri Lanka Presidential Election: శ్రీలంక అధ్యక్ష బరిలో ముగ్గురు.. విక్రమ సింఘేకే అవకాశం!) -
100వ రోజుకు శ్రీలంక ఆందోళనలు.. ఎప్పుడు ఏం జరిగిందంటే?
కొలంబో: శ్రీలంక.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి దీన స్థితికి చేరుకుంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. పెట్రోల్, గ్యాస్ కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు. పెరుగుతున్న ధరలతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాలకుల అసమర్థత వల్లే దేశం పరిస్థితి దారుణంగా మారిపోయిందనే కారణంతో తిరుగుబాటు చేశారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను చుట్టు ముట్టారు. దీంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఇది ఇలా ఉండగా.. శ్రీలంక ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఆదివారంతో వందవ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలతో.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స సహా కుటుంబ పాలనను గద్దె దించటమే లక్ష్యంగా.. ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్‌లలో పోస్టులు వెలిచాయి. వాటితో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సింహాళులకు తోడు మైనారిటీ తమిళులు, ముస్లింలు ఆందోళనల్లో పాల్గొన్నారు. మొదట ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం ముందు వేల మంది ప్రజలు నిరసనలు చేపట్టారు. నిర్వాహకులు ఊహించినదానికంటే.. ఎక్కువ మంది ఈ ఆందోళనకు రావటం గమనార్హం. మేలో మహింద రాజీనామా.. నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలను శాంతింపజేసేందుకు మహింద రాజపక్స ఈ ఏడాది మే నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రణీల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించారు గొటబయ. పార్లమెంట్లో ఒక్క సీటు ఉన్న రణీల్కు ప్రధాని పదవికి ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఆ చర్య సైతం ఆందోళన కారులను శాంతింపజేయకపోగా.. మరింత కోపానికి గురి చేసింది. దీంతో అధ్యక్ష భవనాన్ని వేలాది మంది చుట్టు ముట్టారు. ప్రధాని రణీల్ విక్రమసింఘే ప్రైవేటు ఇంటికి నిప్పు పెట్టారు. సింగపూర్‌కు గొటబయ.. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టేందుకు వేలాది మంది లంకేయులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 12న దేశం దాటారు అధ్యక్షుడు గొటబయ రాజపక్స. మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమసింఘే. కొత్త అధ్యక్షుడిని ఈనెల 20న ఎన్నుకోనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు.. రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు నిరసనకారుల ప్రతినిధి.'రణీస్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ఇందులో పాల్గొన్న గ్రూప్‌లతో చర్చిస్తున్నాం.' అని పేర్కొన్నారు. అయితే.. గొటబయ రాజపక్స దేశం విడిచిన తర్వాత నిరసనకారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అధ్యక్ష, ప్రధాని అధికారిక భవనాలను ఖాళీ చేశారు. ఇదీ చూడండి: అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన -
'గొటబయ' కుమారుడికీ నిరసనల సెగ.. అమెరికాలో ఆందోళనలు
వాషింగ్టన్: శ్రీలంకలో ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల దేశాన్ని విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులకు వెళ్లగా.. అక్కడ సైతం లంక పౌరులు గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఆ తర్వాత సింగపూర్ వెళ్లిపోయారు. ప్రస్తుతం గొటబయ రాజపక్స కుమారుడు మనోజ్ రాజపక్సకు సైతం నిరసనల సెగ తగిలింది. అమెరికా, లాస్‌ఎంజల్స్‌లోని ఆయన ఇంటి ముందు పలువురు లంకేయులు నిరసనలు చేపట్టారు. తన తండ్రి తిరిగి స్వదేశాని వెళ్లాలని చెప్పాలంటూ నినాదాలు చేశారు. గొటబయ రాజపక్స జులై 13న రాజీనామా చేసేందుకు ముందు ఆందోళనలు చేపట్టినట్లు అమెరికా మీడియా తెలిపింది. 'మేము లాస్‌ఎంజల్స్‌లో గొటబయ రాజపక్స కుమారుడు మనోజ్ రాజపక్స ఇంటి ముందు ఉన్నాము. ఆయన శ్రీలంక ప్రజల సొమ్మును దోచుకున్నారు. దాంతో విలాసవంతమైన ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. ఇది మా డబ్బు. ఇది మా ఆస్తి.' అని పేర్కొన్నారు నిరసనకారులు. మరోవైపు.. మనోజ్ రాజపక్స ఇంటి ముందు ఆందోళనలు చేయటాన్ని పలువురు శ్రీలంక నెటిజన్లు తప్పుపట్టారు. ఆయన రాజకీయాల్లో లేరని, అమెరికాలో ఉంటున్నారని గుర్తు చేశారు. ఆయన తండ్రి గొటబయ రాజకీయాలతో మనోజ్‌కు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే.. అమెరికా వచ్చినప్పుడు మనోజ్‌కు నిలువ నీడలేదని, ఇప్పుడు పలు ఇళ్లు కొనుగోలు చేశారని తిప్పికొట్టారు ఆందోళనకారులు. ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ -
‘కోవిడ్ కూడా ముంచింది’
కొలంబో: శ్రీలంక సంక్షోభానికి ఇతర అంశాలతో పాటు కోవిడ్ మహమ్మారి కూడా ఒక‡ కారణమని మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. కోవిడ్ వల్ల దేశం చాలా నష్టపోయిందని తాను పంపిన రాజీనామా లేఖలో నిందించారు. కోవిడ్ కారణంగా లాక్డౌన్లు విధించడంతో దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. సంక్షోభం నుంచి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తన శాయశక్తులా కృషిచేశానన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశానని తెలిపారు. రాజపక్స రాసిన ఆ లేఖను శనివారం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో సెక్రటరీ జనరల్ ధామ్మిక దస్సనాయకే చదివి వినిపించారు. పార్టీ నాయకుల ఆకాంక్ష మేరకే తాను రాజీనామా చేశానని, భవిష్యత్‌లో దేశానికి ఉత్తమ సేవలు అందించాలని అనుకుంటున్నానని రాజపక్స ఆ లేఖలో రాశారు. తదుపరి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ షురూ నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను పార్లమెంటు ప్రారంభించింది. జూలై 20న జరగబోయే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించడానికి పార్లమెంట్ శనివారం సమావేశమైంది. సమావేశంలో పార్లమెంటు అధ్యక్ష పదవికి ఎన్నికలు 20న జరుగుతాయని, 19న నామినేషన్లు తనకు సమర్పించాలని దస్సనాయకే అన్నారు. ఎక్కువ మంది బరిలో ఉంటే 20న సభలో ఓటింగ్ ఉంటుంది. అధికార పార్టీ తరఫున తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘె, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత ప్రేమదాస, జేవీపీ నాయకుడు అనుర కుమార దిస్సనాయకె, అధికార ఎస్ఎల్పీపీ చీలికపక్షం నాయకుడు దల్లాస్ అలహప్పెరుమ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. శ్రీలంక జనాభాలో 28శాతం అంటే 60 లక్షల మందికిపైగా ఆహార కొరతని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయని హెచ్చరించింది. ఆహారం, మందులు, వంట గ్యాస్, పెట్రోల్ చివరికి టాయిలెట్ పేపర్ దిగుమతి చేసుకోలేని పరిస్థితుల్లోకి దేశం వెళ్లిపోయిందని యూఎన్ తెలిపింది. -
గోటబయ నివాసాన్ని చూసేశా.. ఫోటోలు షేర్ చేసేశా!
కొలంబో: శ్రీలంకలోని ఆర్థిక సంక్షోభానికి కారణం గోటబయ రాజపక్స అని ఆరోపణలు చేస్తూ... పెద్ద ఎత్తున ఆందోళన కారులు కొలంబో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిరసకారులు గోటబయ అధికార నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో గోటబయ లంకని విడిచిపెట్టి పారిపోక తప్పలేదు. ఐతే ఆందోళనకారులు.. గోటబయ నివాసంలో ఎంజాయ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని చల్లార్చుకుంటున్నారు. ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల, జిమ్, పడకగది వంటి వాటన్నింటిని ఆక్రమించుకుని వారి ఇష్టారీతిన ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మధుహాన్సి హసింతర అనే యువతి కొలంబోలోని రాష్ట్రపతి నివాసాన్ని చూడాలనుకుంది. అనుకున్నదే తడువుగా గోటబయ అధికార నివాసానికి పయనమయ్యింది కూడా. ఆ భవనంలోని విలాస వస్తువులన్నింటిని తన కెమెరాతో క్లిక్‌మనిపించింది. పైగా ఆ భవనాన్ని సందర్శించినట్లుగా ఆ నివాసం వద్ద నుంచున్న ఫోటోలను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఏప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు అధ్యక్షుడి నివాసం పర్యాటక ప్రదేశం మారిపోయిందని ఒకరు, మీరే అధ్యక్షురాలిగా మారాలి అని మరొకరు.. కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. గోటబయ నివాసం దగ్గర ఫోటోలు దిగాలని ఉబలాటపడిందేమో పాపం.. అంతే వేగంగా ఫోటోలను కూడా షేర్ చేసింది అంటూ మరొకకరు కామెంట్ చేశారు. (చదవండి: ఎడారిలో స్మార్ట్ సిటీ...అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, ఎలివేటర్,) -
సంక్షోభంపై గొటబయ సంచలన వ్యాఖ్యలు.. అందుకు వారే కారణమటా!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తినడానికి సరిగా తిండి దొరకని దీన స్థితికి చేరుకుంది శ్రీలంక. ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో దేశం విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీలంక పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు గొటబయ. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. తాను పదవి చేపట్టక ముందే ఏళ్ల తరబడి కొనసాగిన ఆర్థిక అవకతవకల వళ్లే ఇది జరిగిందని ఆరోపించారు. సింగపూర్ వెళ్లిన తర్వాత తన రాజీనామాను స్పీకర్‌కు పంపించారు గొటబయ. దీంతో ఆయన రాజీనామాను పార్లమెంటు శుక్రవారం ఆమోదించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా గొటబయ రాజీనామాను చదివి నిపించారు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ధమ్మిక దసనయాకే. ఈ లేఖ ద్వారా దేశంలో నెలకొన్ని పరిస్థితులను వివరించారు గొటబయ. 'కొన్నేళ్లుగా అసమర్థ పాలన, ఆర్థిక అవకవతకల కారణంగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దాంతో పాటు కోవిడ్-19 శ్రీలంక పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ పర్యాటకులు రాకుండా చేసింది. ఆ సంక్షోభాన్ని తప్పించేందుకు.. సమైఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలను ఆహ్వానించటం సహా అన్ని రకాల చర్యలను చేపట్టానని నమ్ముతున్నా.' అని పేర్కొన్నారు. బుధవారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక.. అధ్యక్ష పదవికి నామినేషన్లను ఆమోదించేందుకు వచ్చే మంగళవారం సమావేశం కానుంది శ్రీలంక పార్లమెంట్. బుధవారం ఓటింగ్ ద్వారా దేశాధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం ప్రధాని రణీల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. ఇదీ చూడండి: కష్టాల్లో ఉన్న లంకను భారత్ ఆదుకుంటుంది: హైకమిషనర్ -
శ్రీలంక: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్
కోలంబో: ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో.. ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. #WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf — ANI (@ANI) July 15, 2022 ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిగ్గా తీవ్ర నిరసనల నడుమే ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. Sri Lanka's Supreme Court today issued an interim order preventing former Prime Minister Mahinda Rajapaksa and former Minister Basil Rajapaksa from leaving the country without the court's permission until July 28th: Sri Lanka's DailyMirror (File photos) pic.twitter.com/xg290lfmLX — ANI (@ANI) July 15, 2022 కుటుంబ పాలనతో ద్వీప దేశాన్ని సర్వనాశనం చేశారని రాజపక్స కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడిగా, అతని అన్న మహీంద రాజపక్సా ప్రధానిగా, మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను, పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు. -
అనూహ్యం.. అధ్యక్ష పదవికి గోటబయ రాజీనామా!
సింగపూర్: ప్రజాందోళనలకు తలొగ్గిన శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకుండా దేశం విడిచిపారిపోయిన ఆయన.. మాల్దీవులు అక్కడి నుంచి గట్టి భద్రత మధ్య ఇవాళ సింగపూర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌జెట్‌లో సింగపూర్ చేరుకున్న వెంటనే.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. జులై 13నే రాజీనామా చేస్తానని ప్రకటించిన రాజపక్స.. చెప్పాపెట్టకుండా మాల్దీవులకు పారిపోయాడు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రధాని నివాసం, ఆపై స్పీకర్ నివాసాలపై దాడులకు దిగారు నిరసనకారులు. ఈ క్రమంలో లంకలో అత్యవసర పరిస్థితి, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు, మిలిటరీ పహారా నడుమ శాంతి భద్రతలను రక్షిస్తోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. ప్రజల నిరసనలు తారాస్థాయికి చేరిన క్రమంలో రాజీనామా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. #SriLankaCrisis pic.twitter.com/Ye0V2uOSYT — NDTV (@ndtv) July 14, 2022 #WATCH Colombo | People celebrate at Galle Face Park following the resignation of Sri Lankan President Gotabaya Rajapaksa pic.twitter.com/cfWNYrpIdJ — ANI (@ANI) July 14, 2022 -
రాజపక్సకు ఆశ్రయం ఇవ్వలేదు: సింగపూర్
కొలంబో: శ్రీలంకలో నిరసనకారులు ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన భార్యతో సహా మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే అక్కడ కూడా గోటబయకి ఆందోళనకారుల నిరసన సెగ వదలకపోవడంతో ఆయన సింగపూర్ పయనమయ్యారని, అక్కడి ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందంటూ పలు వార్తలు వచ్చాయి. ఈ విషయమై సింగపూర్ ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్ వచ్చారే తప్ప తాము ఆయనకు ఆశ్రయం ఇవ్వలేదని అక్కడి ప్రభుత్వ పేర్కొంది. అయినా సింగపూర్ సాధరణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను మంజూరు చేయదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయన ఆశ్రయం కోరలేదని కూడా పేర్కొంది. రాజపక్స గురువారం మధ్యాహ్నం సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో సింగపూర్‌కి వచ్చినట్టు తెలిపింది. లంక అధ్యక్షుడు గోటబయ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లే ముందు కొంతకాలం సింగపూర్‌లో ఉంటారని లంక అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక గోటబయ సింగపూర్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ జెట్‌ను ఏర్పాటు చేయాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కూడా అధికారిక వర్గాలు తెలిపాయి. ఐతే ఆయన కొలంబో బయలుదేరే ముందే రాజీనామ పంపుతానని కూడా లంక నాయకులు హామీ ఇచ్చాడు కూడా. ఈ మేరకు గోటబయ సింగపూర్ చేరిన వెంటనే స్పీకర్‌కి రాజీనామ పంపినట్లు శ్రీలంక పేర్కోంది. (చదవండి: గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే.. మరోదేశం పోవాల్సిందే!) -
లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే!
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆందోళనకారుల నిరసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే దేశం విడిచి మాల్దీవులకు పరారైన రాజపక్సకు అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. రాజపక్స మాల్దీవులకు చేరిన విషయాన్ని తెలుసుకున్న అక్కడి శ్రీలంక పౌరులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గొటబయ గో అంటూ నినాదాలు చేశారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆయన మళ్లీ సింగపూర్‌కు పయనమవుతున్నారు. మాల్దీవుల నుంచి సింగపూర్‌కు బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో అక్కడి వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ టెర్మినల్ దగ్గర వేచి ఉన్న జర్నలిస్టులను అధికారులు బయటకు పంపించారు. అయితే సింగపూర్‌కు వెళ్లిన తర్వాత గొటబయ తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ మహిందాయాపా అబేయవర్ధనేకు అందించనున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చదవండి: రాజపక్స పారిపోతాడనుకోలేదు.. భారత్‌ను ఎంత సాయం అడుగుతాం! తన పదవికి బుధవారం రాజీనామా చేస్తానని చెప్పిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోవడంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభంతో అట్టుడుకుతున్న ఆందోళనలు ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధింపుతో మిన్నంటుతున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. కాగా గోటబయ తన భార్య ఇద్దరు సెక్యూరిటీ అధికారులతో కలిసి సైనిక విమానంలో బుధవారం ఉదయమే మాల్దీవులకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ దేశ స్పీకర్ మహ్మద్ నషీద్ ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు గోటబయ దేశం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్న జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. రోడ్డుపైకి చేరుకొని కేరింతలు కొట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేశం వీడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూలై 20న పార్లమెంట్లో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. -
మాల్దీవుల్లో ‘గొటబయ’కు నిరసనల సెగ.. మళ్లీ ఏ దేశం వెళ్తారో?
మాలే: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజాగ్రహంతో అట్టుడుకుతోంది శ్రీలంక. ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజామునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే.. అక్కడ కూడా గొటబయకు నిరసనల సెగ తగిలింది. పదుల సంఖ్యలో అక్కడి శ్రీలంక పౌరులు ఆందోళన చేపట్టారు. గొటబయకు మాలే ఒక సురక్షితమైన ప్రాంతం కాకూడదని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపాలని అక్కడి ప్రజలను కోరారు. శ్రీలంక జాతీయ జెండాలు, ప్లకార్డులతో రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ' ప్రియమైన మాల్దీవుల స్నేహితులారా.. క్రిమినల్స్‌కు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా మారకుండా మీ ప్రభుత్వానికి తెలియజేయండి' అని బ్యానర్ ప్రదర్శించారు. మరోవైపు.. మిలిటరీ విమానంలో వెలనా అంతర్జాతీయ విమానంలో దిగిన రాజపక్సకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తున్న వీడియోలను మాల్దీవులకు చెందిన మీడియాలు ప్రసారం చేశాయి. అలాగే.. మాలేలోని కృత్రిమ బీచ్ ప్రాంతంలో పలువురు శ్రీలంక పౌరులు నిరసనలు చేపట్టగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. సింగపూర్‌కు గొటబయ..! శ్రీలంక నుంచి పరారై మాల్దీవులకు చేరిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో తలదాచుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. అక్కడి నుంచి యూఏఈ లేదా సింగపూర్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 'ఆయన రెండు దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. ఆ దేశాల్లోనూ శ్రీలంక పౌరులు ఉన్నందున భద్రతాపరమైన సమస్యలు తలెత్తనున్నాయి.' అని శ్రీలంకకు చెందిన భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు. గొటబయ రాజపక్సను దేశంలోకి అనుమతించటాన్ని వ్యతిరేకించింది మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ. రాజపక్సను అనుమతించటం ద్వారా శ్రీలంకలోని తమ స్నేహితులకు ద్రోహం చేస్తున్నామని పీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక పౌరులు మాల్దీవుల్లోని విద్య, ఆరోగ్య, ఆతిథ్య రంగాల్లో పని చేస్తుండగా.. మాల్దీవుల పౌరులు సైతం పెద్ద సంఖ్యలోనే శ్రీలంకలో ఉన్నారు. ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
లంకలో సంచలన ఆదేశాలు: కనిపిస్తే కాల్చివేతే
కొలంబో: రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం(జులై 13న) ఎమర్జెన్సీ విధించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం(జులై 13) అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గోటబయ రాజపక్స.. దొంగతనంగా మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో.. ఈసారి ప్రధాని కార్యాలయం మీద విరుచుకుపడ్డారు నిరసనకారులు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చారు. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్‌కే మొగ్గు చూపారు. ఈ సాయంత్రంలోగా అధికారాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమారు 22 మిలియన్ల(2 కోట్ల 10 లక్షల దాకా) జనాభా ఉన్న శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ పాలనతోనే సర్వనాశనం అయ్యిందన్న వైఖరితో ఉన్న అక్కడి ప్రజలు.. రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పోరాడుతున్నారు. -
అల్లకల్లోలంగా లంక.. ఎమర్జెన్సీ విధింపు (ఫొటోలు)
-
శ్రీలంకలో ఎమర్జెన్సీ
-
శ్రీలంక విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స
-
దేశం దాటిన గొటబాయ.. తగ్గేదేలే అంటున్న లంకేయులు.. మళ్లీ ఎమర్జెన్సీ!
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కట్టలు తెంచుకున్న జనాగ్రహం చూసి అధ్యక్షుడు గొటబాయ బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా దేశం విడిచిపారిపోయారు. ఇది తెలిసిన జనం ఉదయం నుంచే మళ్లీ రోడ్డెక్కారు. కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది ర్యాలీగా బయల్దేరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొదట ఆందోళనకారులను పోలీసులు గానీ, సైన్యం గానీ నిలువరించలేదు. కానీ వారీ వారు ప్రధాని నివాసం గేటు వద్దకు చేరుకున్నాక పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే శ్రీలంక ప్రభుత్వం మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించింది. #WATCH Military personnel use tear gas shells to disperse protestors who scaled the wall to enter Sri Lankan PM's residence in Colombo pic.twitter.com/SdZWWRMwTn — ANI (@ANI) July 13, 2022 ప్రధాని నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు దేశం విడిచి పారిపోయిన గొటబాయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఆయన రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు. అయితే నిరసనకారులు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇద్దరూ తమ పదవుల నుంచి తక్షణమే తప్పుకోవాలని తేల్చి చెప్పారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 13న రాజీనామా చేస్తానని చెప్పిన రాజపక్స.. అదే రోజు దేశం విడిచి పారిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని విక్రమ సింఘే ఇదివరకే ప్రకటించారు. కానీ పరిస్థితులు దిగజారినందున లంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
శ్రీలంక నుంచి గొటబాయ జంప్, భారత్‌పై ఆరోపణలు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే?
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజూమునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆయన పారిపోయేందుకు భారత్ సహకరించిందని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం స్పందించింది. ఈ వార్తలు నిరాధారం, కల్పితమైనవని కొట్టి పారేసేంది. ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది. High Commission categorically denies baseless and speculative media reports that India facilitated the recent reported travel of @gotabayar @Realbrajapaksa out of Sri Lanka. It is reiterated that India will continue to support the people of Sri Lanka (1/2) — India in Sri Lanka (@IndiainSL) July 13, 2022 మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తర్వాతే గొటబాయ, ఆయన భార్య సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లారని సైన్యం వెల్లడించింది. మొదట మాలెలో దిగేందుకు అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అనుమతి ఇవ్వలేదని, అయితే మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ మజ్లిస్, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ జోక్యం చేసుకుని గొటబాయ విమానం ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమం చేశారని తెలిపారు. ఆంటొనొవ్ సైనిక విమానంలోనే గొటబాయ దేశం విడిచినట్లు ధ్రువీకరించారు. మంగళవారమే దేశం విడిచి పారిపోవాలనుకున్న గొటబాయకు ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది సహకరించలేదు. దీంతో ప్రత్యేక సైనిక విమానం ఏర్పాటు చేసుకుని బుధవారం వేకువజామునే మాల్దీవులకు వెళ్లారు. చదవండి: గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో.. -
గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి చివరికి...
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. గొటబాయ కుటుంబం మాల్దీవులకు వెళ్లిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. వారి పాసుపోర్టులపై స్టాంపులు వేసినట్లు పేర్కొన్నారు. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించారు గొటబాయ. సరిగ్గా అదే రోజు దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు గొటబాయను అరెస్టు చేయడానికి వీల్లేదు. రాజీనామా చేసిన తర్వాత తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే అంతకంటే ముందే ఆయన దేశం వీడి పారిపోయినట్లు తెలుస్తోంది. తన కుటుంబాన్ని వెళ్లినిస్తేనే రాజీనామా చేస్తానని గొటబాయ అధికారులకు చెప్పినట్లు సమాచారం. 24 గంటలు గొడవ గొటబాయ సోమవారమే వాణిజ్య విమానంలో దుబాయ్ పారిపోవాలని ప్రయత్నించారు. అయితే ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అతన్ని వీఐపీ టర్మినల్ ద్వారా వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. సాధారణ ప్రజల్లా పబ్లిక్ కౌంటర్ నుంచే రావాలని సూచించారు. జనం తమను చూస్తే ఎక్కడ దాడి చేస్తారో అనే భయంతో ఆయన పబ్లిక్ కౌంటర్ వైపు వెళ్లలేదు. 24 గంటలు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అవమానంతోనే వెనుదిరిగారు. చివరకు సైనిక విమానంలో బుధవారం వేకువజామున దేశం వీడారు. చదవండి: కళ్లుగప్పి పారిపోవాలనుకున్న శ్రీలంక మాజీ మంత్రి.. ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తుపట్టడంతో.. -
దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబాయ రాజపక్స
-
అర్ధరాత్రి దుబాయ్ చెక్కేసేందుకు ప్రయత్నించిన గొటబాయ సోదరుడు, కానీ..
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల ఆగ్రహావేశాలు చూసి నాయకులు వణికిపోతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సహా ఇప్పటికే చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా శ్రీలంక మాజీ మంత్రి, గొటబాయ సోదరుడు బసిల్ రాజపక్స దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దుబాయ్ వెళ్లేందుకు మంగళవారం ఉదయం 12:15గంటలకే కొలంబో విమానాశ్రయం చేరుకున్నారు బసిల్ రాజపక్స. చెక్ ఇన్ కౌంటర్లో ఉన్న ఆయనను అక్కడున్న వారు సహా ఇమ్మిగ్రేషన్ సిబ్బంది గుర్తుపట్టారు. దీంతో అతడ్ని దేశం దాటి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇక చేసేదేం లేక 3:15గం. వరకు వేచి చూసి విమానాశ్రయం నుంచి బసిల్ తిరిగివెళ్లిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక పరిస్థితులు చూసి ఉన్నతాధికారులు, నాయకులను దేశం వీడి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమతించట్లేదని సంబంధింత వర్గాలు తెలిపాయి. తమకు సరైన భద్రత కల్పించేవరకు వీఐపీ సేవలు కొనసాగించమని పేర్కొన్నట్లు చెప్పాయి. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ బుధవారం అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో శ్రీలంక అఖిల పక్షాలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చదవండి: లంకకు 20న కొత్త అధ్యక్షుడు -
శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో సుమారు రూ. 39 లక్షల నగదు..
శ్రీలంక అధ్యక్షుడు నివాసాన్ని నిరసనకారులు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు అధ్యక్షుడు నివాసంలో సుమారు రూ.39 లక్షల కొత్త నోట్ల నగదును కనుగోన్నారని అధికారులు తెలిపారు. అంతేగాదు నిరసనకారులు అధ్యక్షుడి భవనం నుంచి స్వాధీనం చేసుకున్న ఈ సొమ్మును పోలీసులుకు అప్పగించినట్లు వెల్లడించారు. ఆ నగదును సోమవారం కోర్టుకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి భవనంలో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, పత్రాలతో కూడిన ఒక సూట్‌కేసును కూడా వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు. మార్చి 31న నిరసనకారులు ఆయన వ్యక్తిగత ఇంటి పై దాడులు చేయడంతో...అప్పటి నుంచి ఆయన ఈ అధికారిక నివాసంలో తలదాచుకుంటున్నారు. నిరసనకారులు ఆందోళనల నడుమ ఆయన ఆ భవనం వదిలి వెళ్లిపోక తప్పలేదు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స పరారీలో ఉన్నాడని, శ్రీలంక నేవీ ఓడలో ఆయన వెళ్లిపోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇంతవరకు అధ్యక్షుడి ఆచూకి కానరాలేదు. ఐతే నిరసకారుల డిమాండ్ల మేరకు గోటబయ రాజపక్స రాజీనామ చేసినట్లు రణిల్ విక్రమసింఘే కార్యాలయం అధికారికంగా పేర్కొంది. ఆ తదనంతరం నూతన ప్రధానిగా నియమితులైన విక్రమసింఘే కూడా రాజనామ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే శ్రీలంక పార్లమెంట్ ఒక ఎంపీని ఎన్నకునేంతవరకు విక్రమసింఘేనే తాత్కాలికి ప్రధానిగా నవంబర్ 2024 వరకు కొనసాగుతాడు. (చదవండి: ప్రధాని నివాసాన్ని ఆక్రమించుకుని.. బెడ్‌పై రెజ్లింగ్ చేసిన లంకేయులు..) -
Sri Lanka Crisis: ప్రధాని బెడ్‌పై నిరసనకారుల రెజ్లింగ్.. వీడియో వైరల్
కొలంబో: దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని లంకేయుల కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆక్రమించారు. అనంతరం అక్కడి విలాస సదుపాయాలను కొందరు ఆందోళనకారులు ఆస్వాదించారు. భవనంలోని స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఈత కొట్టారు. కిచెన్‌లో వండుకుని తిన్నారు. బెడ్రూంలలో హాయిగా సేదతీరారు. జిమ్‌లో వర్కౌట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆయన బెడ్‌పై సరదాగా రెజ్లింగ్ చేశారు. ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపించేలా స్టంట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి దానికి బ్యాగ్రౌండ్లో నిజమైన రెజ్లింగ్ మ్యాచ్ కామెంటరీని కూడా జోడించారు. ఇందుకు సంబందించిన వీడియోను ఓ శ్రీలంక యూజర్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లర్లలా మారి ఆందోళనకారులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నిజమైన మ్యాచ్‌ను తలపించేలా బెడ్‌పై ‘కుమ్మేసుకున్నారు’. వీడియోలో ఓ ఆందోళనకారుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ ర్యాండీ ఆర్టన్లా పోజులివ్వడం ఆకట్టుకుంది. Video - #WWE Wrestling on Prime Minister's bed at Temple Trees 😃#LKA #SriLanka #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/5f2zE9uqLD — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 10, 2022 అంతకుముందు అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేయాలని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధాని ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసి అధ్యక్షుడు గొటబాయ పారిపోయారు. ప్రస్తుతం ఆయన శ్రీలంక నేవీ ఓడలో ఉన్నట్లు తెలుస్తోంది. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో పదవుల నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు, ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ‘భారత్ కూడా శ్రీలంకలాగే.. మోదీకి అదే గతి’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు. ఆదివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇద్రిస్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులను గమనిస్తే మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారి మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని ఇద్రిస్ అలీ జోస్యం చెప్పారు. #WATCH | West Bengal: Whatever happened with the President of Sri Lanka, will happen with PM Modi here. Looking at the things in India, PM Modi is a total failure...it will be even worse here. PM Modi will also resign and flee: TMC MLA Idris Ali in Kolkata pic.twitter.com/ailsU5jfgm — ANI (@ANI) July 10, 2022 కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ కూడా శనివారం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితులు భారత్‌లో కూడా కన్పిస్తున్నాయని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయారని వార్తలు వచ్చాక ఉదిత్ రాజ్ ఈమేరకు మాట్లాడారు. రాహుల్ గాంధీ సైతం మే నెలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. శ్రీలంకతో భారత్‌ను పోల్చిన ఆయన.. మోదీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోందని ధ్వజమెత్తారు. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయే కారణమంటూ ఆందోళనకారులు శనివారం ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఎవరికంటా పడకుండా పారిపోయారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటికి కూడా నిరసనకారులు నిప్పుపెట్టారు. ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారు పదవుల నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్‌ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్‌లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్‌ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
'గడ్డుకాలం ఎదుర్కొంటున్న లంకకు సాయం చేస్తాం'
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ స్పందించారు. పొరుగు దేశంతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కూడా తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం శరణార్థ సంక్షోభం లేదని జైశంకర్ పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది, ఏం జరుగుతుందో వేచి చూడాలని పేర్కొన్నారు. భారత్ నుంచి మాత్రం అవసరమైన సాయం అందుతుందని స్పష్టం చేశారు. సంక్షోభంతో అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అని, ఆయనే ప్రస్తుత పరిస్థితికి బాధ్యత తీసుకోవాలంటూ లక్షల మంది నిరసనకారులు శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఒకప్పుడు సుసంపన్నంగా ఉన్న తమను దారుణమైన పరిస్థితిలోకి నెట్టారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రధాని విక్రమసింఘే ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. జనాగ్రహం చూసి ఆయన ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో శ్రీలంకలో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి:అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
గొటబాయ నివాసంలో కరెన్సీ కట్టల గుట్టలు..!
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో ప్రజలు అక్కడి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో మార్పులు వచ్చినా ఎలాంటి పురోగతి కనిపించకపోవటంతో మళ్లీ పెద్ద ఎత్తున లంకేయులు ఆందోళనలకు దిగారు. ఎవరూ ఊహించని విధంగా శనివారం లక్షల మంది ప్రజలు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించారు. భద్రతావలయాన్ని దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలోనే గొటబాయ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్షుడి అధికారిక నివాసంలో ప్రవేశించిన నిరసన కారులు రచ్చ రచ్చ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం, గొటబాయ పడగది, వంటగదిలోని వీడియోలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. అధ్యక్షుడి భవనంలో పెద్ద మొత్తంలో నగదును నిరసనకారులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీలంక దినపత్రిక డైలీ మిర్రర్ ప్రకారం.. అధ్యక్ష భవనంలో దొరికిన సొమ్మును అక్కడి భద్రతా విభాగానికి అందించారు. దేశం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కోట్లాది రూపాయలు అధ్యక్షుడి భవనంలో లభించటంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఓ నిరసనకారుడు కరెన్సీ నోట్లను లెక్కిస్తున్నట్లు కనిపించాడు. ఆ నోట్ల కట్టలను అధ్యక్షుడి అధికారిక నివాసం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు నిరసనకారులు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాకే నిజానిజాలు తెలుస్తాయని, సరైన ఆధారాలతో సమాచారం అందిస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా.. దేశంలో పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో, కార్మిక, విదేశీ ఉపాధి శాఖ మంత్రి మనుష ననయక్కరలు ప్రకటించారు. మరోవైపు.. దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు, సైన్యానికి ప్రజలు సహకరించాలని కోరారు త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ శవేంద్ర సిల్వా. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న క్రమంలో త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఈ ప్రకటన చేశారు సీడీఎస్. ఇదీ చదవండి: కొనడానికి లేదు.. తినడానికి లేదు -
సూట్ కేసులతో పరుగులు... ఇవి రాజపక్సవేనా?
Suitcases Loaded On Sri Lanka Navy Ship: శ్రీలంక రాజధాని కొలంబోలో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టారు కూడా. ఈ మేరకు వారంతా ఆయన కార్యాలయం, అధికార నివాసం రెండింటిని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో గోటబయ పరారయ్యరంటూ పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెద్ద పెద్ద సూట్‌కేసులు తీసుకుని శ్రీలంక నేవీ ఓడలో పారిపోయారంటూ.. వార్తలు గుప్పుమన్నాయి. అందుకు సంబంధించిన పోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద సూట్‌కేసులతో ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు అనే నేవీ ఓడలో తీసుకువెళ్తున్నట్లు వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ విషయమై కొలంబో పోర్ట్‌లోని అధికారిని ప్రశ్నించగా...ఆయన కూడా ఒక బృందం పెద్ద పెద్ద సూట్‌కేసులతో గజబాహు అనే ఓడ ఎక్కి వెళ్లినట్లు తెలిపారు. అంతేకాదు ఈ విషయాన్ని శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది కూడా. ఐతే అతనితోపాటు ఎవరెవరు వెళ్లారు, ఎలా వెళ్లాడనేది వివరణ ఇవ్వలేదు. మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ ఆయన్ని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు పేర్కొంది. పైగా శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు అధ్యక్క్షుడు పరారయ్యడంటూ... విమానాశ్రయంలోని లంక అధ్యక్షుడు గోటబయ కాన్వాయ్‌ని చూపిస్తూ... వార్తలు ప్రసారం చేశాయి. కానీ లంక అధ్యక్షుడు గోటబయ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారో లేదా అనేది స్పష్టం కాలేదు. Lmao people actually made the president pack his suitcase and run for his life😂😂 #GoHomeGota #අරගලයටජය #GoHomeRanil pic.twitter.com/gw7Zkr1I5a — ♡ Sanda ♡ (@TachyonJaneesha) July 9, 2022 (చదవండి: ఇంటి నుంచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు!) -
లంకలో ఆందోళన.. నిరసనల్లో మాజీ క్రికెటర్ జయసూర్య
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఇంటి నుంచి విదేశీ ఓడలో పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. వేల సంఖ్యలో నిరసనకారులు అధ్యక్ష భవనం వద్దకు వచ్చి.. లంక జాతీయ జెండాలతో నిరసనలు తెలిపారు. కాగా, ఈ నిరసనల్లో లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య సైతం పాల్గొని నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. చేతిలో లంక జాతీయ జెండా పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జయసూర్య ట్విట్టర్ వేదికగా..‘ముట్టడి పరిసమాప్తమైంది. మీ కోట బురుజులు కుప్పకూలాయి. ఇకనైనా రాజీనామా చేసి గౌరవం నిలుపుకోండి’ అంటూ గొటబాయను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. NOW - Protesters storm the presidential palace in Sri Lanka's capital.pic.twitter.com/Wv6oQ10kBQ — Disclose.tv (@disclosetv) July 9, 2022 మరోవైపు.. నిరసనల్లో జయసూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు చక్కబడే వరకు ఈ విప్లవం శాంతియుతంగా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. లంకలో త్వరలోనే విజయోత్సవాలు జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఆందోళనల్లో భాగంగా జయసూర్యలో ఫొటోలు దిగేందుకు లంకేయులు పోటీపడ్డారు. The siege is over. Your bastion has fallen. Aragalaya and peoples power has won. Please have the dignity to resign now ! #GoHomeGota — Sanath Jayasuriya (@Sanath07) July 9, 2022 Ialways stand with the People of Sri Lanka. And will celebrate victory soon. This should be continue without any violation. #Gohomegota#අරගලයටජය pic.twitter.com/q7AtqLObyn — Sanath Jayasuriya (@Sanath07) July 9, 2022 ఇది కూడా చదవండి: లంక అధ్యక్షుడి ఇంట లంకేయుల రచ్చ.. షాకింగ్ వీడియో -
శ్రీలంకలో సీన్ రివర్స్.. అధ్యక్షుడి ఇంట లంకేయుల రచ్చ
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇంకా ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితం లంక ప్రధానమంత్రి మారినా పరిస్థితులు మాత్రం ఏమాత్రం చక్కబడలేదు. సరిపడా ఇంధన నిల్వలు లేకపోవడంతో వాహనాలు నడుపలేక పాఠశాలలకు సైతం సెలవులు ప్రకటించారు. దీంతో, ప్రభుత్వ తీరుపై లంకేయులు మళ్లీ ఆందోళనలకు దిగారు. 🇱🇰 BREAKING NEWS🇱🇰 Footage emerges said to be of President Rajapakse fleeing Sri Lanka aboard a Navy Vessel. pic.twitter.com/yvaYv5uGvB — UNN (@UnityNewsNet) July 9, 2022 ఇదిలా ఉండగా.. లంకలో శనివారం ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. ప్రజల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు ఆయన నివాసాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో గొటబాయ.. ఆయన నివాసం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. More than 3,000 Protestors have entered the Residence of #Srilankan President #GotabayaRajapaksa ⚡ Protestors are seen swimming in the Pool of President's Residence🏊♀️pic.twitter.com/5Jpw5t71G9 — The Analyzer (@Indian_Analyzer) July 9, 2022 అధ్యక్షుడి ఇంటి వద్ద ఆందోళనలకు దిగిన లంకేయులు.. బారికేడ్లను తొలగించి అధ్యక్షుడి కార్యాలయంలోకి ప్రవేశించారు. వందల సంఖ్యలో నిరసనకారులు అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో దిగి రచ్చ రచ్చ చేశారు. వంట గదిలో దూరి బీభత్సం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే పార్టీ నేతలను అత్యవసర సమావేశానికి పిలిచారు.గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటం వల్ల ఆయన కూడా ఇలాగే పారిపోయారు. అయితే, లంకేయుల నిరసనలు తెలుపుతున్న రుణంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులతో సహా 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. వీరందరూ కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. WATCH: Protesters storm presidential palace in Sri Lanka as economic crisis worsens pic.twitter.com/diIVaXx8Cd — BNO News (@BNONews) July 9, 2022 ఇది కూడా చదవండి: మంచి పని చేసినా.. విమర్శలు ఎదుర్కొంటున్న రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి -
కొలంబోలో రణరంగం
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం, ఆహార కొరతతో అల్లాడిపోతున్న శ్రీలంకలో శనివారం సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన అధ్యక్షుడు గొటబయా రాజపక్స, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం రణరంగం సృష్టించారు. ‘దేశమంతా కొలంబో’కు అంటూ ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా వేలాది మంది నిరసనకారులు గొటబయా రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించారు. పరిస్థితిని ముందే గ్రహించిన ఆయన శుక్రవారమే తన నివాసం నుంచి పరారయ్యారు. ప్రధాని విక్రమసింఘే నివాసానికి జనం నిప్పుపెట్టారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రజల భద్రత కోసం, ప్రతిపక్ష నాయకుల సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రధాని విక్రమసింఘే ట్విట్టర్లో స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై, పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకొనేదాకా విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని, ఈ తర్వాతే రాజీనామా చేస్తారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఈ ఏడాది మే నెలలో గొటబయా రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో విక్రమసింఘే నూతన ప్రధానిగా నియమితులైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబయా కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న పదవి నుంచి వైదొలుగుతానని స్పీకర్‌కు సమాచారమిచ్చారు. జనం అధీనంలోకి ప్రెసిడెంట్ హౌస్ సెంట్రల్ కొలంబోలో హై సెక్యూరిటీ కలిగిన ఫోర్ట్ ఏరియాలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అధికారిక నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, జవాన్లు మోహరించారు. దేశంలో సంక్షోభాన్ని పరిష్కరించలేని అధ్యక్షుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. శ్రీలంక జాతీయ జెండాలను చేబూని బారికేడ్లను ధ్వంసం చేస్తూ ముందుకు పరుగులు తీశారు. అధ్యక్షుడు దిగిపోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి రణరంగాన్ని తలపించింది జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో కనీసం 45 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులను నేషనల్ హాస్పిటల్‌కు తరలించారు. అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాన్ని నిరసనకారులు స్వా«ధీనం చేసుకున్నారు. గోడలు ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. అక్కడున్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొట్టి సేద తీరడం గమనార్హం. మరికొందరు లోపల వంటలు చేసుకొని, ఆరగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కొలంబోలో ప్రధానమంత్రి విక్రమసింఘే ప్రైవేట్ నివాసాన్ని సైతం జనం చుట్టుముట్టారు. విధ్వంసం సృష్టించారు. నివాసానికి నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కొలంబోకు రైళ్లను నడపాలని ఒత్తిడి చేస్తూ నిరసనకారులు గాల్లే, కాండీ, మతారా తదితర ప్రాంతాల్లో రైల్వే అధికారులతో ఘర్షణకు దిగారు. అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వం ప్రెసిడెంట్ హౌస్‌ను నిరసనకారులు చుట్టుముట్టినట్లు సమాచారం అందుకున్న ప్రధాని విక్రమసింఘే వెంటనే అన్ని పార్టీలతో అత్యవసర భేటీ నిర్వహించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ మహిందా యాపా అబేయవర్దనే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు గొటబయా రాజపక్స తప్పుకోవాలని, అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులు తేల్చిచెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తక్షణమే రాజీనామా చేయండి అని విక్రమసింఘే, గొటబయాకు స్పీకర్ అబేయవర్దనే సూచించారు. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడానికి, కొత్త ప్రధాని నేతృత్వంలో మధ్యంతర అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొద్ది కాలంలోపే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు అంగీకరించాక రాజీనామా చేస్తానంటూ ప్రధాని ప్రకటన విడుదల చేశారు. గొటబయాకు సొంత పార్టీ ఎంపీల లేఖ గొటబయా రాజపక్సకు చెందిన శ్రీలంక పొడుజనా పెరమునా పార్టీ ఎంపీలు ఆయనను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పదవి నుంచి తప్పుకోవాలని, అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వాన్ని లేఖలో కోరారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కొలంబోలో కర్ఫ్యూ విధించాలని పోలీసులు తొలుత నిర్ణయించారు. పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు. గొటబయా ఎక్కడున్నారు? నిరసనకారుల ముట్టడిని ముందే గ్రహించిన అధ్యక్షుడు గొటబయా శుక్రవారమే శ్రీలంక నావికాదళానికి చెందిన నౌకలో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు ఓ వార్తా చానల్ ప్రకటించింది. కొలంబో పోర్టు నుంచి రెండు నౌకల్లో లగేజీతో సహా కొందరు ప్రముఖులు వెళ్లిపోయినట్లు హార్బర్ మాస్టర్ చెప్పారు. వారు ఎవరన్నది తాను బయటపెట్టలేనని అన్నారు. అలాగే వీఐపీ వాహన శ్రేణి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. గొటబయా ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో తలదాచుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. (చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్) -
'గోట గో హోమ్' అంటూ పార్లమెంట్లో నినాదాలు... వీడియో వైరల్
"Gota Go Home" Chants: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. దాన్ని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే అధ్యక్షతన ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒకవైపు లంకలో రోజురోజుకి దిగజారిపోతున్న ఆర్థిక స్థితి. మరోవైపు రాజపక్సల పై ప్రజల్లో నెలకున్న ఆగ్రహం ఎంతమాత్రం చల్లారటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే విపక్షాల నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స. ఈ మేరకు మంగళవారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ సమావేశాలను హజరైన గోటబయను చూసి పార్లమెంట్ సభ్యులు ' గోట గో హోమ్' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో ఆయన చేసేదేమిలేక అక్కడ నుంచి నిష్క్రమించారు. విదేశీ కరెన్సీ నిల్వలు లేకపోవడంతో అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోలేని సంకట స్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. నెలలుతరబడి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని, ఇంధన సంక్షోభాన్ని, విద్యుత్ కోతలను ఎదుర్కొంది. ఈ సంక్షోభం వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశంలో చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధితో శ్రీలంక కొనసాగిస్తున్న చర్చలు ఆగస్టు నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రస్తుతం తాము దివాలా తీసిన దేశంగానే చర్చలో పాల్గొంటున్నామని చెప్పారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స పార్లమెంట్ నుంచి బలవంతంగా నిష్క్రమించిన వీడియోని పార్లమెంటు సభ్యుడు హర్ష డి సిల్వా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Ouch! This is how the arrival of #SriLanka President @GotabayaR to @ParliamentLK a few minutes ago ended: #GotaGoHome2022. Unplanned and never happened in the history. He had to get up and leave. pic.twitter.com/zuXiyQodAs — Harsha de Silva (@HarshadeSilvaMP) July 5, 2022 (చదవండి: శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత) -
సారీ.. ఏదో భావోద్వేగంలో భారత ప్రధాని పేరు చెప్పా!
Sri Lanka Adani Row: శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ బిడ్ వ్యవహారంపై పెనువివాదం చెలరేగింది. శ్రీలంక విద్యుత్ అథారిటీ చీఫ్ ఫెర్డినాండో ఈ ప్రాజెక్ట్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి మేరకే అధ్యక్షుడు గోటబయ రాజపక్స తలొగ్గి.. గౌతమ్ అదానీ గ్రూప్‌కి ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ ప్యానెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ బహిరంగ విచారణలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాజపక్స తనతో స్వయంగా చెప్పారని కూడా అన్నారు. ఐతే ఆ అభియోగాలను ఖండిస్తూ అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ...."మన్నార్‌లో 500 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టుని ఏ వ్యక్తికి లేదా ఏ సంస్థకు ఇవ్వడానికి తాను ఏసమయంలోనూ ఎవరికీ అధికారం ఇవ్వలేదని, పేర్కొన్నారు. అయితే ప్రాజెక్ట్‌ల కోసం సంస్థల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని, ఇది శ్రీలంక ప్రభుత్వంచే పారదర్శకంగా, జవాబుదారీ వ్యవస్థకు అనుగుణంగా నిర్వహించబడుతుంది" అని అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణలు చెప్పారు. ఆనుకోని ఒత్తిళ్లు, భావోద్వేగాలు కారణంగా భారత ప్రధాని పేరు చెప్పాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చారు. తాజాగా తన పదవికి కూడా రాజీనామా చేశారు. ఐతే శ్రీలంక తన చట్టాలను మార్పు చేసి, ఇంధన ప్రాజెక్టు కోసం పోటీ బిడ్డింగ్‌ని వదిలేయండంపై పార్లమెంట్లో చర్చ జరగడంతో ఈ వివాదం చెలరేగింది. వాస్తవానికి అదానీ గ్రూప్ డిసెంబర్లో మన్నార్, పూనేరిన్‌లలో రెండు విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లను దక్కించుకుంది. గౌతమ్ అదానీ శ్రీలంక సందర్శించడమే కాకుండా రాజపక్సతో సమావేశం గురించి ట్విట్టర్లో ట్వీట్ చేశారు కూడా. Re a statement made by the #lka CEB Chairman at a COPE committee hearing regarding the award of a Wind Power Project in Mannar, I categorically deny authorisation to award this project to any specific person or entity. I trust responsible communication in this regard will follow. — Gotabaya Rajapaksa (@GotabayaR) June 11, 2022 Privileged to meet President @GotabayaR and PM @PresRajapaksa. In addition to developing Colombo Port's Western Container Terminal, the Adani Group will explore other infrastructure partnerships. India's strong bonds with Sri Lanka are anchored to centuries’ old historic ties. pic.twitter.com/noq8A1aLAv — Gautam Adani (@gautam_adani) October 26, 2021 (చదవండి: ఉక్రెయిన్‌ని మట్టికరిపిస్తున్న రష్యాసేనలు.. యుద్దంలో కీలక పరిణామం) -
Sakshi Cartoon: శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత
శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత -
గొటబయకు ఊరట.. అవిశ్వాసంపై తక్షణ చర్చకు పార్లమెంట్ నో
కొలంబో: లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు మంగళవారం పార్లమెంట్లో ఊరట లభించింది. ఆయనపై అవిశ్వాసాన్ని వెంటనే చర్చించాలన్న ప్రతిపక్షాల వాదనను పార్లమెంట్ తిరస్కరించింది. రాజపక్సేను అభిశంసిచేందుకు తక్షణం చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష తమిళ్ నేషనల్ అలయన్స్ నేత సుమంత్రిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది, అనుకూలంగా 68 మంది ఎంపీలు ఓటువేశారు. మరోవైపు డిప్యుటీ స్పీకర్ ఎన్నికలో ప్రభుత్వ మద్దతున్న శ్రీలంక పొడుజన పెరుమున అభ్యర్థి అజిత్ రాజపక్సే గెలుపొందారు. ఆయనకు అనుకూలంగా 109 ఓట్లు, ప్రత్యర్థికి 78 ఓట్లు వచ్చాయి. ఎన్నిక సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. మహింద రాజపక్సే రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. విక్రమసింఘేపై విమర్శలు అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా పధ్రాని రణిల్ విక్రమసింఘే ఓటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘అధ్యక్షుడిని ఎవరు కాపాడుతున్నారో, మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారో దేశమంతా చూస్తోంది.’’ అని సుమింత్రన్ దుయ్యబట్టారు. పదవి కోసం రణిల్ తన నైతికతను అమ్ముకున్నారన్నారు. ఆయన ఒక తోలుబొమ్మ అని ప్రధాన ప్రతిపక్ష నేత కవిరత్న విమర్శించారు. రణిల్ చర్యను ఆయన పార్టీ సమర్ధించింది. అధ్యక్షుడిని కాపాడుతున్న ఎంపీల నిజస్వరూపాన్ని ఓటింగ్ బయటపెట్టిందని మానవహక్కుల కార్యకర్త భవానీ ఫొన్సెకా విమర్శించారు. దేశంలో స్కూళ్లను మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. కర్ఫ్యూను తొలగిస్తామని, రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!)