శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్‌ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్‌లోకి ప్రవేశించి తప్పించుకోగలరు.
ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్‌లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్‌ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు.
కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు.
ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్‌ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం.
(చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!)
అధ్యక్షుడి భవనంలో కరెన‍్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు
Comments
Please login to add a commentAdd a comment