bunker
-
హెజ్బొల్లా రహస్య బంకర్లో భారీగా బంగారం, నోట్ల గుట్టలు
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అటు హమాస్, హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఇటీవల హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను చంపిన ఇజ్రాయెల్.. ఈసారి హెజ్బొల్లా ఆర్థిక ఆస్తులను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో హెజ్బొల్లా రహస్య బంకర్‌ను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో.. భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు గుర్తించింది. . ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వీడియో విడుదల చేసింది.“Tonight, I am going to declassify intelligence on a site that we did not strike—where Hezbollah has millions of dollars in gold and cash—in Hassan Nasrallah’s bunker. Where is the bunker located? Directly under Al-Sahel Hospital in the heart of Beirut.”Listen to IDF Spox.… pic.twitter.com/SjMZQpKqoJ— Israel Defense Forces (@IDF) October 21, 2024ఈ మేరకు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హెజ్బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేశాం. ఆ రహస్య బంకర్లో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడులకు ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. ఆ బంకర్‌పై ఇంకా తాము దాడులకు పాల్పడలేదని, ఆ బంకర్లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ. 4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నామని హగారీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్‌ను కూడా చూపించారు. అయితే బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు పాల్పడమని, తమ యుద్ధం కేవలం హెజ్బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. -
హమాస్ చీఫ్ బంకర్ చూస్తే షాక్ అవాల్సిందే.. భారీగా డబ్బు..
హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో మృతి చెందారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గాజాలోని ఖాన్ యూనిస్ ఉన్న ఈ బంకర్లో వంటగది సామాగ్రి, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ పంపిణీ చేసిన సహాయక సమాగ్రి, మిలియన్ డాలర్ల భారీ నగదు, పెర్ఫ్యూమ్, వ్యక్తిగత షవర్ ఉన్నాయి. ఈ వీడియో ఫిబ్రవరి నెలకు సంబంధించినదిగా తెలుస్తోంది.ఇక.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడికి సిన్వార్ సూత్రధారి. ఆయన రఫాకు పారిపోయే ముందు ఈ బంకర్లోనే కొన్నిరోజులు గడిపినట్లు తెలుసోంది. ఇస్మైల్ హనియే హత్య అనంతరం ఇజ్రాయెల్ సైన్యం సిన్వార్‌ను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపని దాడుల్లో సిన్వార్ మృతి చెందారు.Hamas' eliminated leader Yahya Sinwar was hiding in this underground tunnel months ago:Surrounded by UNRWA bags of humanitarian aid, weapons and millions of dollars in cash.He hid like a coward underground, using the civilians of Gaza as human shields. pic.twitter.com/0ylVjTCv7H— Israel ישראל (@Israel) October 20, 2024 ‘‘హమాస్ నుంచి తొలగించబడిన నేత యాహ్యా సిన్వార్ కొన్ని నెలల క్రితం ఈ భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. మానవతా సహాయం, ఆయుధాలు, మిలియన్ల డాలర్ల నగదుతో ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) బ్యాగులు ఉన్నాయి. ఆయన గాజా పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని, పిరికివాడిలా భూగర్భంలో దాక్కున్నారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎక్స్‌లో వీడియోను విడుదల చేసింది.Hamas leader Yahya Sinwar’s wife reportedly spotted with $32,000 Birkin bag as she went into hiding https://t.co/Dwqf0h7nTQ pic.twitter.com/JHZ5eMrYiZ— New York Post (@nypost) October 20, 2024 ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7 దాడికి ఒక రోజు ముందు యాహ్యా సిన్వార్ బంకర్ గుండా వెళుతున్నట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఫుటేజీలో.. హమాస్ నాయకుడు సిన్వార్ తన కుటుంబంతో కలిసి బ్యాగులు, సామాగ్రిని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు దృష్యాలు కనిపించాయి. సిన్వార్ భార్య సొరంగంలోకి పారిపోతున్నప్పుడు 32వేల అమెరికన్ డాలర్ల(సుమారు రూ. 27 లక్షలు) విలువైన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని తీసుకువెళ్లిన దృష్యం కనిపించింది.చదవండి: అక్టోబర్‌లో దాడులకు ముందు సిన్వర్ ఇలా.. -
ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా?
ఇరాన్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. సుమారు 400లకుపైగా బాలిస్టిక్ మిసైల్స్‌ను మంగళవారం ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు.. తాము వెంటనే అప్రమత్తమై ఇరాన్ మిసైల్స్‌ను తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక.. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అయితే.. మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్ దాడులు చేసిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బంకర్లో తలదాచుకోవడానికి పరిగెత్తినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇరాన్ అనుకూల సోషల్‌మీడియా ఖాతాల్లో వైరల్‌గా మారటం గమనార్హం.La carrera de Netanyahu hacia el búnker tras el lanzamiento de misiles iraníes. Lástima que no le cayera uno en toda la cabeza y lo pulverizara, a él y a toda su estirpe de hdp. pic.twitter.com/DGkRywBNbj— Jaime 🏳️🌈 (@Elpieizquierdo) October 2, 2024 ఇరాన్ మంగళవారం చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరుగులు పెట్టారని సదరు వీడియోకు కామెంట్లు చేస్తున్నారు ఇరాన్ అనుకూల నెటిజన్లు. అయితే ఆ వీడియో.. ప్రస్తుత వీడియో కాదని.. 2021 నాటికి సంబంధించిన వీడియో అని నిపుణులు తేల్చారు. నెస్సెట్ సెషన్ (చట్టసభకు) హాజరయ్యే క్రమంలో ప్రధాని నెతన్యాహు అలా పరుగులు తీశారని.. అప్పడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోందని వివరణ ఇచ్చారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్ -
బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం?
తరచూ బాంబు దాడులు జరిగే దేశాలలో భూగర్భ బంకర్లను నిర్మించడం తప్పనిసరి. ఇటువంటి దేశాలలో ఇజ్రాయెల్ ఒకటి. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలూ క్షిపణులను పరస్పరం ప్రయోగించుకుంటున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వారి ఇళ్లలోని బంకర్లలోనికి వెళ్లి తలదాచుకుంటున్నారు. యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బంకర్లలో తల దాచుకున్నవారు మాత్రం తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు. బంకర్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బంకర్ అంటే భూగర్భంలో నిర్మితమైన ఇల్లు. దీనిని భద్రతా ప్రయోజనాల కోసం నిర్మిస్తారు. ఈ బంకర్లు ఆర్మీ సైనికులు, అధికారులు, శివారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో అవసరం అవుతుంటాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బంకర్లను సైనిక అధికారులు, సైనికులు తమ భద్రత కోసం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతల నివాసాలలో బంకర్లు ఉన్నాయి. బంకర్ అనేది సామాజిక, రసాయన, బాంబు, వైమానిక దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ బంకర్లు సాధారణంగా ఉక్కు, కాంక్రీటు, కలపతో నిర్మిస్తారు. జాతీయ భద్రత కోసం పలు దేశాలు అణ్వాయుధాల నిల్వకు బంకర్లను నిర్మించాయి. ఈ బంకర్లు వేర్వేరు డిజైన్లను కలిగి ఉంటాయి. ఇది కూడా చదవండి: సౌదీ స్మార్ట్ సిటీ ‘నియోమ్’ ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది? -
పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? అమెరికా రిపోర్టులో హడలెత్తించే వివరాలు?
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు ధర లీటరు రూ.300కి చేరింది. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలపై మోజు పెంచుకుంటూపోతోంది. అణ్వాయుధాల తయారీలో పూర్తి స్వింగ్‌లో ఉంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం దాదాపు 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా ఏం కనుగొంది? పాకిస్తాన్ అణ్వాయుధాలను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఓపెన్ సోర్స్ మెటీరియల్స్‌ను అంటే ఇప్పటికే పబ్లిక్‌గా ఉన్న మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఉదాహరణకు.. వర్గీకరించిన పత్రాలు, రక్షణ బడ్జెట్ కేటాయింపు, సైనిక కవాతు, సైనిక అధికారుల ప్రకటనలు. ఇదేకాకుండా పాక్ మిలటరీ గార్రిసన్, ఎయిర్ ఫోర్స్ బేస్‌కు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను కూడా విశ్లేషించారు. వివిధ సైనిక దళాలు, వైమానిక దళ స్థావరాలకు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన తరువాత పాకిస్తాన్ అణ్వాయుధాల కోసం కొత్త లాంచర్ సౌకర్యాలను నిర్మించినట్లు అమెరికా కనుగొంది. 5 నుంచి 10 అణ్వాయుధాలు.. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ఒకవైపు అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూనే మరోవైపు కొత్త ఆయుధాల కోసం ముడిసరుకును కూడా వేగంగా సేకరిస్తోంది. పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 14-27 ఆయుధాలకు సరిపడా ముడిసరుకును సేకరిస్తోంది. కనీసంగా 5 నుండి 10 న్యూక్లియర్ వార్హెడ్లను ఉత్పత్తి చేస్తోందని నివేదిక అంచనా వేసింది. అణ్వాయుధాలను ఎక్కడ దాస్తోంది? నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేసేందుకు కనీసం 5 సైనిక, వైమానిక స్థావరాలను వినియోగిస్తోంది. ఇందులో అక్రో, గుజ్రాన్వాలా, ఖుజ్దార్, పనో అకిల్ మరియు సర్గోధా గారిసన్ ఉన్నాయి. కాగా పాకిస్తాన్ 4 కొత్త ప్లూటోనియం ఉత్పత్తి రియాక్టర్ల కోసం కూడా పని చేస్తోంది. అలాగే యురేనియం రియాక్టర్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. ఇందుకోసం కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇది పాక్ అణు సామర్థ్యాన్ని మరింతగా పెంచుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ అణ్వాయుధాల సంఖ్య 200కి చేరుకుంటుందని అంచనా. పెరిగిపోతున్న పాక్ రహస్య కార్యకలాపాలు ఈ నివేదికలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బంకర్ ప్రస్తావన కూడా ఉంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఇస్లామాబాద్‌కు సమీపంలోని వా కంటోన్మెంట్ పరిధిలోగల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇందులో కీలక పాత్ర ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరుగుతున్న కార్యకలాపాలను చాలా కాలంగా గమనిస్తున్నారు. 2020 నాటికే 60 నుండి 80 అణ్వాయుధాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల 6 ఇగ్లూ ఆకారపు బంకర్లు ఉన్నాయి. వీటిని చాలా నీట్‌గా కవర్ చేశారు. ఈ బంకర్ల చుట్టూ ఎల్లప్పుడూ బహుళస్థాయి భద్రత ఉంటుంది. ఈ బంకర్లలో అణ్వాయుధాలను దాచి ఉంచినట్లు అమెరికా అనుమానిస్తోంది. 2020 నాటికే పాకిస్తాన్ వద్ద 60 నుండి 80 అణ్వాయుధాలు ఉండవచ్చని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఈ తాజా నివేదిక అమెరికన్ ఏజెన్సీలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: లాహోర్ భారత్‌లో భాగం.. అయినా పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు? -
రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే
మాస్కో: రష్యాను ‘ఫ్లూ’ భయం వణికిస్తోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చాలామంది అంటువ్యాధి బారినపడినట్లు తెలిసింది. అధ్యక్ష భవనంలో అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పనిచేసే సిబ్బందికి సైతం ఫ్లూ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ను అధికారులు రష్యా తూర్పు ప్రాంతంలోని ఉరాల్ పర్వతాల వెనుక ఉన్న ఓ బంకర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం పుతిన్ అక్కడే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బంకర్లోనే జరుపుకుంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 70 ఏళ్ల పుతిన్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఏడాది రష్యా పార్లమెంట్ ఎగువ సభ డ్యుమాలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి ఏటా సంవత్సరం ఆఖరున నిర్వహించే మీడియా సమావేశాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. పుతిన్ ఇలా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వైఫల్యానికి సంబంధించి విలేకరులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకే ఆయన వార్షిక మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు!
అంతర్యుద్ధ కాలానికి చెందిన బంకర్ ఒకటి కారుచౌకగా అమ్మకానికి వచ్చింది. అణుబాంబుల దాడి నుంచి తప్పించుకునే ఉద్దేశంతో కట్టుదిట్టంగా నిర్మించిన ఈ బంకర్ ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన లెగ్బోర్న్ ప్రాంతంలో ఉంది. అంతర్యుద్ధ కాలానికి చెందిన చాలాబంకర్లు ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ టవర్లుగా రూపాంతరం చెందినా, లింకన్షైర్లోని ఈ బంకర్ మాత్రం యథాతథంగా నిలిచి ఉంది. దీనిని 1959లో నిర్మించారు. లోపల చూస్తే, ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఉంటుంది. ఒకవేళ అణుదాడి జరిగితే, అప్పుడు ముగ్గురు మనుషులు తలదాచుకోవడానికి వీలుగా ఇందులో ఒక ప్రత్యేక సొరంగం కూడా ఉంది. మార్క్ కోలెడ్జ్ అనే వ్యక్తి 2003లో దీనిని 12,500 పౌండ్లకు (రూ.11.65 లక్షలు) ఈ–బే వేలంలో సొంతం చేసుకున్నాడు. ఇప్పుడాయన దీనిని 25,000 పౌండ్లకు (రూ.23.31 లక్షలు) అమ్మకానికి పెట్టాడు. బాడీబ్యాగ్లు, గ్యాస్మాస్క్లు, అణుదాడులు జరిగినా పనిచేయగల ప్రత్యేకమైన రెడ్ టెలిఫోన్ వంటి సౌకర్యాలు ఉన్న ఈ బంకర్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి! -
దేశ స్వాతంత్ర వేడుకల వేళ... బయటపడ్డ 38 ఏళ్ల నాటి సైనికుడు మృతదేహం
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అజాది కా అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ.... నాటి త్యాగధనులను స్మరించుకుని ఆనంద పడుతున్న వేళ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ అనే వీర సైనికుడి మృతదేహం హిమనీనాదం నుంచి బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని హల్ద్వానీలో ఒక కుటుంబం నిరీక్షణకు ఫలితం దక్కి నాటి మేఘదూత ఆపరేషన్ పాల్గొన్న వీర సైనికుడి మృతదేహం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ 1984 సియోచిన గ్లేసియర్‌ని ఆక్రమించి పాకిస్తాన్ స్థానాలపై పట్టు సాధించేందుకు మేఘదూత ఆపరేషన్ని చేపట్టింది. అందులో భాగంగా భారత సైన్యం మే 29, 1984న19వ కుమావోన్ రెజిమెంట్ నుంచి ఒక బృందం ఈ ఆపరేషన్ కోసం బయలుదేరింది. అందులో లాన్స్ నాయక్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. ఐతే ఆ బృందం ఆ రోజు రాత్రి హిమనీనాదంలో చిక్కుకుపోయింది. దీంతో ఒక అధికారి సెకండ్ లెఫ్టినెంట్ పిఎస్ పుండిర్‌తో సహా 18 మంది భారతీయ ఆర్మీ సైనికులు మరణించారు అని ఒక అధికారి తెలిపారు. మొత్తం 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఐదుగురు గల్లంతయ్యారు. ఐతే భారత ఆర్మీ గస్తీకి వేసవినెలలో మంచు కరుగుతున్నప్పుడూ తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యతను అప్పగిస్తారు. అందులో భాగంగా గస్తీ వెతికే చర్యలు చేపట్టినప్పుడూ ఆగస్టు 13న సియాచిన్‌లో 16 వేల అడుగుల ఎత్తులో ఒక సైనికుడి అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు. ఆ అవశేషలపై ఉన్న ఆర్మీ నంబర్‌తో కూడిన డిస్క్ సాయంతో ఆ అవశేషం లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌దిగా గుర్తించారు. చంద్రశేఖర్‌కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు అతని హయాంలో ఉన్న ఆర్మీ సిబ్బందితో సహా ఇతర అధికారులు, బంధువులు స్నేహితులు హల్ద్వానీకి తరలివచ్చి ఆ వీరుడికి కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 1984లో భారత ఆర్మీ చేపట్టిన ఈ మేఘదూత ఆపరేషన్ పాకిస్తాన్‌పై చేపట్టిన అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్‌గా మిగిలింది. భారతదేశ నియంత్రణలో ఉన్న అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ తూర్పు కారాకోరం శ్రేణిలో పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ తోపాటు చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతాలైన షక్స్‌గామ్ వ్యాలీకి సరిహద్దుగా ఉంటుంది. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్‌ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్‌లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్‌ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
మేమున్న అపార్ట్‌మెంట్‌పై దాడి జరిగింది
కీవ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇక్కడ బాంబుల మోతమోగుతోంది. భద్రతా సిబ్బంది నన్ను, మరో 40 మంది విద్యార్థులను మా అపార్ట్మెంట్ నుంచి దూరంగా ఓ బంకర్‌కు తరలించారు. తర్వాత గంటకే మా అపార్ట్ మెంట్ పక్కన ఉన్న మెట్రో స్టేషన్‌పై మిస్సైల్ దాడి జరిగింది. మా అపార్ట్మెంట్లో రెండంత స్తులు కూడా దెబ్బ తిన్నాయి. బంకర్లో భయం భయంగా ఉంటున్నాం. కరెంటు, నీటి వసతి, ఆహారం సరిగా లేదు. త్వరగా ఇండియాకు తీసుకెళ్లాలి. – గాజుల అభిషేక్, మదనపల్లి, మాక్లూరు మండలం, నిజామాబాద్ -
‘ట్రంప్.. తిరిగి బంకర్లోకి వెళ్లు’
వాషింగ్టన్: సీటెల్ మేయర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తిరిగి బంకర్లోకి వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. సీహాజ్(క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్)లో జోక్యం చేసుకుంటానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై స్పందిస్తూ.. సీటెల్ మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ నరహత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. నిరసనకారులు రెచ్చిపోతుండటంతో వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేయి దాటకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రహస్య బంకర్లోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనను ఉద్దేశిస్తూ.. సీటెల్ మేయర్ ‘ట్రంప్ తిరిగి బంకర్లోకి వెళ్లు’ అంటూ వ్యాఖ్యానించాడు. జార్జ్ ఫ్లాయిడ్ నరహత్య వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులు సీటెల్‌ను ఆక్రమించుకున్నారు. వారిని ట్రంప్ దేశీయ ఉగ్రవాదులు అని వ్యాఖ్యానించారు. నిరసనకారులను వెనక్కి పివలకపోతే సీహాజ్లో జోక్యం చేసుకుంటానంటూ మేయర్ జెన్నీ దుర్కాన్వా, షింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే ఇన్స్లీలను ట్రంప్ హెచ్చరించారు. (బంకర్ బాయ్) Radical Left Governor @JayInslee and the Mayor of Seattle are being taunted and played at a level that our great Country has never seen before. Take back your city NOW. If you don’t do it, I will. This is not a game. These ugly Anarchists must be stopped IMMEDIATELY. MOVE FAST! — Donald J. Trump (@realDonaldTrump) June 11, 2020 -
ఆ సమయంలో బంకర్లో ట్రంప్..
వాషింగ్టన్ : పోలీస్ కస్టడీలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. వైట్‌హౌస్ వద్ద శుక్రవారం రాత్రి నిరసనలు మిన్నంటిన సమయంలో వైట్‌హౌస్ అడుగున నిర్మించిన బంకర్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తరలించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బంకర్లో ట్రంప్ దాదాపు గంటపాటు గడిపిన అనంతరం వైట్‌హౌస్ లోపలికి ఆయనను తీసుకువచ్చినట్టు ఆ కథనం పేర్కొంది. వైట్‌హౌస్ వద్దకు చొచ్చుకువచ్చేందుకు వందలాది మంది ప్రయత్నించిన క్రమంలో సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీస్ అధికారులు నిరసనకారులను నిలువరించారు. వైట్‌హౌస్ వద్ద ఒక్కసారిగా కలకలం రేగడంతో ట్రంప్ బృందం అప్రమత్తమైంది. కాగా ట్రంప్‌తో పాటు మెలానియా ట్రంప్, బారన్ ట్రంప్‌లను కూడా బంకర్లోకి అధికారులు తోడ్కొనివెళ్లారా అనేది స్పష్టం కాలేదు. మిన్నెపొలిస్‌లో పోలీసు కస్టడీలో నల్లజాతీయుడు మరణించడం పట్ల మే 25 నుంచి అమెరికా అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. నిరసనల నేపథ్యంలో దాదాపు 15 రాష్ట్రాల్లో పోలీసులు, నేషనల్ గార్డ్ సభ్యులను అధికారులు రంగంలోకి దింపారు. చదవండి : జీ7లో భారత్‌ను చేర్చాలి : ట్రంప్ -
రాజ్‌భవన్ కింద అద్భుతం
-
రాజ్‌భవన్ కింద అద్భుతం
ముంబయి: ఒకటి కాదు రెండు ఏకంగా 150 మీటర్ల పొడవైన పాతకాలం నాటి బంకర్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు వెలికి తీశారు. రాజ్ భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని ఆయనకు కొందరు పూర్వీకులు సమాచారం ఇచ్చిన మేరకు దీనిని వెలుగులోకి తెప్పించారు. ఆయన ఉంటున్న మల్బార్ హిల్స్‌లోని రాజ్‌భవన్ కింద దీనిని గుర్తించారు. సాధారణంగా ఉండే బంకర్లకంటే ఇది భిన్నంగా ఉంది. అతి పొడవుగా ఉండి చిన్నచిన్న గదులతో ఉన్న ఈ బంకర్ ఆశ్యర్యం గొలిపేలా ఉంది. దీనిని రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి. దీంతోపాటు దీనికి ప్రత్యేక మురుగనీటి పారుదల వ్యవస్ద లోపలికి వెళుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని మూసి పశ్చిమ వైపు ద్వారం తెరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని మూసి దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా బంకర్ ఉండటం ఆశ్చర్యకరం. గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర అధికారులు ఈ బంకర్ ను సందర్శించారు. ప్రత్యేక పురావస్తు అధికారులకు చెప్పి దాని సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారు. ఈ బంకర్ లో మొత్తం 13గదులు ఉన్నాయి. మొత్తం 5000 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఇందులో షెల్ స్టోర్, గన్ షెల్, కాట్రిజ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్ షాప్ వంటి రూములు ఇందులో ఉన్నాయి. దీనిని చక్కగా సంరక్షిస్తే మంచి పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చెందడం ఖాయం అని అధికారులు చెబుతున్నారు. -
సింగరేణిలో బంకర్ కూలి కార్మికుడి మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శ్రీరాంపూర్‌కు చెందిన శ్రీకాంత్(26) సీహెచ్‌పీ ప్రాంతంలోని బంకర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అది కూలటంతో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న మరో ఏడుగురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శిథిలాల నుంచి శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. అతని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. (శ్రీరాంపూర్) -
సొరంగం కాదు.. బంకర్లు