ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అటు హమాస్, హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఇటీవల హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను చంపిన ఇజ్రాయెల్.. ఈసారి హెజ్‌బొల్లా ఆర్థిక ఆస్తులను టార్గెట్ చేసింది.
ఈ క్రమంలో హెజ్‌బొల్లా రహస్య బంకర్‌ను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడిలో.. భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు గుర్తించింది. . ఓ ఆస్పత్రి కింద ఉన్న రహస్య సొరంగంలో మిలిటెంట్ గ్రూప్‌నకు సంబంధించి భారీగా బంగారం, నోట్ల గుట్టలు ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వీడియో విడుదల చేసింది.
“Tonight, I am going to declassify intelligence on a site that we did not strike—where Hezbollah has millions of dollars in gold and cash—in Hassan Nasrallah’s bunker. Where is the bunker located? Directly under Al-Sahel Hospital in the heart of Beirut.”
Listen to IDF Spox.… pic.twitter.com/SjMZQpKqoJ— Israel Defense Forces (@IDF) October 21, 2024
ఈ మేరకు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. హెజ్‌బొల్లా ఆర్థిక వనరులపై వరుసగా దాడులకు పాల్పడుతున్నాం. ఆదివారం రాత్రి జరిపిన దాడుల్లో ఓ బంకర్‌ను ధ్వంసం చేశాం. ఆ రహస్య బంకర్‌లో భారీగా బంగారం, వేల డాలర్ల నగదును గుర్తించాం. ఇజ్రాయెల్‌పై దాడులకు ఈ నగదునే వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంది.
ఈ మిలిటెంట్ గ్రూప్‌నకు బీరుట్ నడిబొడ్డున మరో రహస్య బంకర్ ఉంది. అల్ – సాహెల్ ఆస్పత్రి కింద ఉన్న ఆ రహస్య బంకర్‌లో వందల మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారం గుట్టలు ఉన్నట్లు తెలిసింది. ఆ బంకర్‌పై ఇంకా తాము దాడులకు పాల్పడలేదని, ఆ బంకర్‌లో 500 బిలియన్ డాలర్ల నగదు(రూ. 4,200 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా వేస్తున్నామని హగారీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంకర్ ఉన్న ప్రాంతం మ్యాప్‌ను కూడా చూపించారు.
అయితే బంకర్ ఉన్న ప్రాంతంలోని ఆస్పత్రిపై దాడులకు పాల్పడమని, తమ యుద్ధం కేవలం హెజ్‌బొల్లాతో మాత్రమే అని హగారీ స్పష్టం చేశారు. లెబనీస్ పౌరులకు ఎలాంటి హానీ కలిగించమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment