హెజ్‌బొల్లా ఫైనాన్సింగ్ గ్రూపులపై ఇజ్రాయెల్‌ దాడులు | Hezbollah Financing Group Target Israel Strikes Southern Beirut | Sakshi
Sakshi News home page

హెజ్‌బొల్లా ఫైనాన్సింగ్ గ్రూపులపై ఇజ్రాయెల్‌ దాడులు

Published Mon, Oct 21 2024 8:00 AM | Last Updated on Mon, Oct 21 2024 10:26 AM

Hezbollah Financing Group Target Israel Strikes Southern Beirut

లెబనాన్‌లోని బీరుట్‌లో హెజ్‌బొల్లా గ్రూప్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తోంది. హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్‌ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా  బీరుట్ దక్షిణ ప్రాంతంపై క్షిపణులతో దాడులు చేస్తోంది.

 

బీరుట్‌లోని ఆ ప్రాంతాల్లో లెబనాన్‌ పౌరులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక.. దిక్కు తోచక బీరుట్‌ నుంచి వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లితున్నారు.హెచ్చరికల అనంతరం ఇజ్రాయెల్ ఆర్మీ.. పలు చోట్ల పేలుళ్లు జరిపింది. ఈ క్రమంలో భయంతో లెబనాన్ ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ చోటుచేసుకుంది.

 

అంతకు ముందు ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ.. ఉత్తర గాజాలోని బీట్ లాహియాపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 73 మంది మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గాజా ప్రభుత్వ మీడియా తెలిపింది. 

మరోవైపు.. ఇజ్రాయెల్ సైనిక ముట్టడి కారణంగా ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా మారింది. గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఆహారం, నీరు, ఔషధం వంటి అవసరమైన సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో హెజ్‌బొల్లా డ్రోన్ ప్రయోగించింది. దానికి ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్‌ హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలపై దాడులు చేస్తోంది.

చదవండి: మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement