బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. హెజ్‌బొల్లా గ్రూప్ టార్గెట్‌గా చేసిన ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో దేశవ్యాప్తంగా 33 మంది మృతి చెందినట్లు లెబనాన్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుగల గ్రూప్ హెజ్‌బొల్లాకు బలమైన ప్రాంతాలు ఉన్న బీరుట్‌లోని దక్షిణ శివారును లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసింది.
బీరుట్‌కు దక్షిణంగా ఉన్న చౌఫ్ ప్రాంతంలోని ఓ పట్టణంలో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చౌఫ్ జిల్లాలో జోన్‌పై ఇజ్రాయెల్ దాడిలో.. ఎనిమిది మంది మహిళలు, నలుగురు పిల్లలు సహా 15 మంది మరణించారని పేర్కొంది. ఈ దాడిలో మరో 12 మంది గాయపడ్డారని తెలిపింది.
అదే విధంగా బీరుట్‌కు తూర్పున ఉన్న పర్వతం అలే ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందిన ఇంటిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అధికారులు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఒకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment