బీరూట్: లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం.. వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 52 మంది మరణించగా.. 72 మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు బీరూట్ దక్షిణ శివారు ప్రాంతం దహియేనులోని భవనాలను ధ్వంసం చేశాయి. అక్కడి నివాసితులు దాడులకు ముందే తరలిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అమెరికా, ఇతరుల దేశాల నుంచి కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ హెజ్‌బొల్లాకు వ్యతిరేకంగా దాడులను తీవ్రంగా చేస్తున్నాయి.
Smoke seen rising from several high-rise buildings in the Al-Hosh area of Tyre, Lebanon, following Israeli airstrikes. Footage captured the aftermath, with planes still circling overhead pic.twitter.com/saPah5YiZG
— RT (@RT_com) November 2, 2024
ఇజ్రాయెల్ దాడులు లెబనాన్ సరిహద్దు ప్రాంతాలను దాటి విస్తరిస్తున్నాయి. గత ఏదాడి ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య గెలరేగిన దాడులతో లెబనాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 2,900 మంది మృతి చెందగా.. 13,150 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment