బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులకు సంబంధించిన భీకర వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భయానక బాంబు దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇక, తాజాగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా నేతలను టార్గెట్ చేసి దాడులు చేసింది. బాంబు దాడిలో అక్కడున్న నివాసాలు అన్ని ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహారం మరియు కమ్యూనికేషన్ పరికరాల ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు.. జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాల మీదుగా దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి.
It's mind-boggling how obsessed the Zionists are with destruction and death.
Israel's Channel 12 publishes the massive explosion in south Lebanon that triggered an earthquake alert in the north yesterday morning pic.twitter.com/zmOfZcx2Ec— Abier (@abierkhatib) October 27, 2024
Comments
Please login to add a commentAdd a comment