జెరూసలేం: ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య 21 రోజుల కాల్పుల విరమణపై తమ ప్రభుత్వం అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో నేతన్యాహు పరోక్షంగా 21 రోజుల కాల్పుల విరమణకు తాము ఒప్పుకోవడం లేదనే సంకేతాలిచ్చినట్లయ్యింది.
హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకు పడుతుండడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఈ తరుణంలో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా కాల్పులు విరమించాలని అమెరికా,ఫ్రాన్స్‌తో పాటు యురోపియన్ యూనియన్ దేశాలు విజ్ఞప్తి చేశాయి. అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కార్యాలయం అధికారింగా ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనానలు చెబుతున్ననాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రధాని నేతన్యాహు అంగీకరించడం లేదు. మొత్తం సైన్యాన్ని మోహరించి దాడులు విస్తృతం చేయాలని నేతన్యాహు ఆదేశాలు జారీ చేశారని ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
భూతల దాడులకు సిద్దమైన ఇజ్రాయెల్
బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి సైనికులకు కీలక ఆదేశాలు జారీచేశారు. హిజ్బుల్లాపై సాధ్యమైనంత మేరకు భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో అగ్రరాజ్యం అమెరికా తోపాటు, ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాలు ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెచ్చాయి. ఆ ప్రతిపాదనని ఇజ్రాయెల్ తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment