యుద్ధం వేళ ఇజ్రాయెల్‌ నెతన్యాహు సంచలన నిర్ణయం | Israel PM Netanyahu Fires On Defence Minister Yoav Gallant | Sakshi
Sakshi News home page

యుద్ధం వేళ ఇజ్రాయెల్‌ నెతన్యాహు సంచలన నిర్ణయం

Published Wed, Nov 6 2024 7:53 AM | Last Updated on Wed, Nov 6 2024 7:53 AM

Israel PM Netanyahu Fires On Defence Minister Yoav Gallant

జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ బెంజిమెన్‌ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి యోవ్‌ గాలంట్‌ను పదవి నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. గాజాలో యుద్ధం మొదలు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్న కారణంగా ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.

గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ బెంజమిన్‌ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. రక్షణశాఖ మంత్రి యోవ్‌ గాలంట్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ..‘యుద్ధం సమయంలో ప్రధానికి, రక్షణశాఖ మంత్రికి మధ్య పూర్తి నమ్మకం అవసరం. మొదట్లో అలాంటి నమ్మకమే ఉండేది. దాడుల్లో సందర్బంగా ఎన్నో సానుకూల ఫలితాలు సాధించాం. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అలాంటిది జరగడం లేదు. ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి. విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో గాలంట్‌ స్థానంలో తన విశ్వాసపాత్రుడు, విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ను నియమించనున్నారు. విదేశాంగశాఖను గిడియాన్‌ సార్‌కు అప్పగించారు. తన మాజీ ప్రత్యర్థి అయిన గిడియాన్‌కు నెతన్యాహు ఇటీవలే తన కేబినెట్‌లో చోటిచ్చారు. అయితే, గాలంట్‌పై నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఇదిలా ఉండగా.. గత ఏడాది మార్చిలోనూ ఒకసారి గాలంట్‌ను తొలగించేందుకు యత్నించగా.. నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరిగాయి. ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం నెతన్యాహు ప్రవేశపెట్టిన కొత్త న్యాయ చట్టాన్ని యోవ్‌ గాలంట్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కారణంగా వారి మధ్య వైరం మొదలైనట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement