బందీల విడుదల, సిరియాపై చర్చ
జెరుసలేం: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. హమాస్‌పై యుద్ధంలో విజయం సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సిరియా పరిస్థితులపై తన వైఖరిని ట్రంప్‌తో పంచుకున్నారు. సంభాషణలోని కీలకాంశాలను వివరిస్తూ నెతన్యాహు ఓ వీడియో ప్రకటన షేర్ చేశారు.
‘‘శనివారం సాయంత్రం జరిగిన సంభాషణలో ఇరువురం పలు అంశాలపై చర్చించాం. సంభాషణ చాలా స్నేహపూర్వకంగా సాగింది. ఇజ్రాయెల్ విజయాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాం. బందీల విడుదలకు మేం చేస్తున్న ప్రయత్నాల గురించి సుదీర్ఘంగా చర్చించాం. బందీలతో పాటు మృతులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ అహర్నిశలు కృషి చేస్తుంది’’ అని చెప్పారు.
אמרתי שנשנה את המזרח התיכון וזה מה שקורה.
סוריה היא לא אותה סוריה.
לבנון היא לא אותה לבנון.
עזה היא לא אותה עזה.
איראן היא לא אותה איראן. pic.twitter.com/IFVso1czkH— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) December 15, 2024
సిరియాతో ఘర్షణ ఇప్పట్లో లేదు
సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు కూలదోశాక అక్కడి పరిస్థితిని నెతన్యాహు ప్రస్తావించారు. ‘‘సిరియాతో ఘర్షణపై మా దేశానికి ఏ ఆసక్తీ లేదు. పరిస్థితులను బట్టి స్పందిస్తాం’’ అన్నారు. హెజ్‌బొల్లాకు సిరియా గుండా ఆయుధాల రవాణాకు అనుమతించడాన్ని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment