
పెషావర్: పాకిస్తాన్ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ సైనిక చర్య జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టి, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీనికి సంబంధించిన వివరాలను పాక్ సైన్యం మీడియాకు తెలిపింది.
ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన నేపధ్యంలో దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన నేపధ్యంలో పాకిస్తాన్ సాయుధ దళాలను ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రశంసించారు.
దీనికి ముందు పాకిస్తాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 2025 జనవరి నుంచి పాకిస్తాన్‌లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్ కంటే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా?
Comments
Please login to add a commentAdd a comment