వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో మారణహోమం జరుగుతోంది. వందల, వేల సంఖ్యలో ప్రజల బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇక, గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఇటీవల కూడా ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. నవంబర్ ఐదో తేదీన అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. ఇక, ఇజ్రాయెల్ విషయంలో కమలా హారీస్ కూడా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment