donlad trump
-
సిరియాపై ట్రంప్ వ్యాఖ్యలు.. టర్కీ కౌంటర్
అంకారా: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు టర్కీ కౌంటరిచ్చింది. టర్కీకి చెందిన కొందరు కీలక వ్యక్తులే తిరుగుబాటుదారుల వెనుక ఉండి.. సిరియా బషర్ అల్ అసద్‌ను దేశం వెళ్లిపోయేలా చేశారు. సిరియాను ఆక్రమించుకోవడంలో టర్కీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ ట్రంప్ వ్యాఖ్యలను టర్కీ తిరస్కరించింది.ఈ నేపథ్యంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ ట్రాడ్కాస్టర్.. ట్రంప్ వాదనలను కొట్టేశారు. ఈ సందర్భంగా ఫిదాన్ మాట్లాడుతూ.. సిరియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాచరిక వ్యవస్థకు ప్రజలే స్వస్థి చెప్పారు. దీన్ని మేము స్వాధీనం చేసుకోవడం అని అనలేము. ఎందుకంటే సిరియా ప్రజల సంకల్పం మేరకే ఇలా జరిగిందని మేము భావిస్తాం. ట్రంప్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సిరియాలో జరిగిన పరిణామాలకు టర్కీకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా పాలన విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధిపత్యం కాదు.. ప్రతీ ఒక్కరికి ప్రజల సహకారం అవసరం అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. 2011లో చెలరేగిన అసద్ వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభ రోజుల నుండి టర్కీ అతని పాలనపై వ్యతిరేకంగా ఉంది. ఈ క్రమంలో సిరియాలో మద్దతుదారులకు కీలకంగా ఉంది. రాజకీయ అసమ్మతివాదులతో పాటు మిలియన్ల మంది శరణార్థులకు టర్కీ ఆతిథ్యం ఇచ్చింది. ఇదే సమయంలో సైన్యంతో పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులకు కూడా మద్దతు ఇచ్చింది. -
భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు.డొనాల్డ్ ట్రంప్ కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేయడంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా-చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్ సంబంధిత అంశాలపై చర్చించారు. ట్రంప్ మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్ విధించడం లేదు. ఇకపై అలా కుదరదు. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తే మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తాం. అధిక మొత్తంలో పన్నులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్‌లు ఉన్నాయి. భారత్,బ్రెజిల్ తమ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తే, ప్రతిఫలంగా అమెరికా కూడా అదే చేస్తుంది. అమెరికాకు చెందిన ఏదైనా ఓ ఉత్పత్తిపై రూ.100 నుంచి రూ.200 వరకు భారత్,బ్రెజిల్‌లు వసూలు చేస్తున్నాయి. మేం కూడా అదే స్థాయిలో వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు.ట్రంప్‌కు కెనడా హెచ్చరికలు ఇప్పటికే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వస్తువులపై టారిఫ్ విధిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తమ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్ టారీఫ్‌లు విధిస్తే.. చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకొంటున్నారని కెనడా ప్రధాని ట్రూడో హెచ్చరించారు. హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే.. తాము ప్రతిచర్యలకు దిగుతామని ట్రూడో హెచ్చరించారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాళ్లతో కూడిన పనిగా ఆయన అభివర్ణించారు. 2016లో స్పష్టమైన ఆలోచనలతో వారు చర్చలకొచ్చారన్నారు. -
ట్రంప్ టీమ్‌లోకి మరో భారతీయుడు..ఎన్ఐహెచ్ హెడ్‌గా భట్టాచార్య
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌లో వరుసగా ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. తాజాగా అమెరికా హెల్త్‌సైన్సెస్ పరిశోధనలకు కీలకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్) డైరెక్టర్‌గా భారతీయుడైన డాక్టర్ జే భట్టాచార్యను నియమించారు. అమెరికాలో మెడికల్ సైన్సెస్‌లో కీలక పరిశోధనలు చేసే మొత్తం 27 సంస్థలకు ఎన్ఐహెచ్ నుంచే నిధులు కేటాయిస్తారు. ఎన్ఐహెచ్ ఏడాది బడ్జెట్ రూ. 4 లక్షల కోట్ల దాకా ఉంటుందంటే దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. భట్టాచార్య ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.భట్టాచార్య 1968లో కోల్‌కతాలో జన్మించి అమెరికా వెళ్లారు. కొవిడ్ సమయంలో జో బైడెన్ ప్రభుత్వ పాలసీని తీవ్రంగా విమర్శించిన భట్టాచార్య రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. కాగా,ఇటీవలే ట్రంప్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఆర్ఎఫ్కెన్నెడీ జూనియర్ నియమితులైన విషయం తెలిసిందే.ఇప్పటికే భారత సంతతి వ్యాపారవేత్త వివేక్‌రామస్వామి ట్రంప్ టీమ్‌లో ఇలాన్ మస్క్‌తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ) హెడ్ పదవికి ఎంపికైన విషయం తెలిసిందే. -
ట్రంప్‌తో పోరుకు రెడీ.. నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం!
ప్యాంగ్యాంగ్: అణ్వాయుధాల తయారీలో ఉత్తర కొరియా దూసుకెళ్తోంది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో కిమ్ జోంగ్ ఉన్ అప్రమత్తమయ్యారు. గత ట్రంప్ పాలనలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు కిమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని కిమ్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇటీవల తన అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించారు. జపాన్‌తో కలిసి ఆసియా నాటో ఏర్పాటుచేయాలన్న ఆలోచనలను ఆయన తప్పుపట్టారు.మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకొంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారుచేస్తోంది. ఇక, ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు రెండు వారాల క్రితం నివేదికలు ఇచ్చాయి.ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జెలెన్ స్కీకి అమెరికా సహాకరించడాన్ని కిమ్ తీవ్రంగా ఖండించారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ప్లాన్ ప్రకారమే తన పలుకుబడి పెంచుకునేందుకు ఉక్రెయిన్‌కు సహకరిస్తోందన్నారు. 🚨#BREAKING: North Korea's Kim Jong Un Is Calling For A "New Cold War"This comes in response to the Biden Administration's recent actions in the East.Kim Jong Un also calls for UNLIMITED EXPANSION OF HIS NUCLEAR WEAPONS.Thoughts? pic.twitter.com/naRaJLkTs8— Donald J. Trump News (@realDonaldNewsX) November 18, 2024 -
ట్రంప్ కీలక నిర్ణయం.. కరోలిన్ సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. తాజాగా తన ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్‌ను ఎన్నుకున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చరిత్రలో లీవిట్(27) అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కారు.తన ప్రచార ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌ను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. నా ఎన్నికల ప్రచారంలో కరోలిన్ లీవిట్ ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పనిచేశారు. ఆమెను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తుందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. కరోలిన్ తెలివైనది. చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చే సమయంలో దేశ ప్రజలకు మా సందేశాన్ని అందించడంలో ప్రభుత్వానికి ఆమె ఎంతో సహాయపడుతుందని నాకు విశ్వాసం ఉంది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ ప్రెస్ కార్యాలయంలో లీవిట్ పనిచేశారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్ రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఇక, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార ప్రతినిధిగా లీవిట్ వ్యవహరించారు.Congratulations Karoline Leavitt can't wait till you blast the swamp flies and tell the truth pic.twitter.com/ISuRbcNUV7— Liberty Loving Granddad (@Kid60618) November 16, 2024 -
అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. రంగంలోకి ఎలాన్ మస్క్
వాషింగ్టన్ డీసీ: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ వడివడిగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ని ట్రంప్ రంగంలోకి దించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. సోమవారం ఓ రహస్య ప్రాంతంలో ట్రంప్,ఇరవానిల మధ్య భేటీ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. రెండు నుంచి మూడుగంటల పాటు జరిగిన ఈ భేటీ సానుకూలంగా జరిగినట్లు వెల్లడించింది. అయితే ఈ భేటీపై అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలుఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 1న ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని ఇరాన్ తెలిపింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ సుప్రీంనేత ఆయాతుల్లా అలీ ఖమేనీ ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు. తమని తక్కువ అంచనావేయొద్దని,తమకు జరిగిన నష్టానికి ఇజ్రాయెల్‌కు బదులిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.రంగంలోని ఎలాన్ మస్క్అయితే ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ప్రతిదాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధించామవి.., అలా కాదని ప్రతి దాడులు పాల్పడితే ఆ తర్వాత జరిగే పరవ్యసనాలను తాము బాధ్యులం కాదని తేల్చింది.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఎలాన్ మస్క్ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో భేటీ అవ్వడం ప్రపంచ దేశాల్లో ఆసక్తికరంగా మారింది. 👉చదవండి : ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు -
ట్రంప్ గెలుపుపై చైనా రియాక్షన్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు రిపబ్లిక్ పార్టీ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. ఇక.. ట్రంప్ సాధించిన భారీ విజయంపై భారత ప్రధాని మోదీతో సహా పలు దేశాధినేతలు, దేశాలు స్పందిస్తూ.. ఆయన అభినందనలు తెలియజేస్తున్నాయి. తాజాగా చైనా సైతం డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించింది. అయితే.. ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డ్రాగన్ దేశం స్పందించింది.‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల ఎంపిక నిర్ణయాన్ని గౌరవిస్తాం. అధ్యక్ష ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం. అయితే.. అమెరికా పట్ల చైనా విధానం స్థిరంగా ఉంది. పరస్పర గౌరవం, శాంతియుత జీవనం, సహకారం వంటి సూత్రాలకు అనుగుణంగా చైనా-యూఎస్ సంబంధాలను కొనసాగిస్తాం’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. మరోవైపు.. చైనాపై కఠినంగా వ్యహరిస్తారనే ముద్ర ఉన్న డొనాల్డ్ ట్రంప్.. రానున్ను రోజుల్లో డ్రాగన్ దేశంతో సంబంధాలు ఎలా కొనసాగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.చదవండి: ట్రంప్ విజయంపై మోదీ సహా ప్రపంచ నేతల స్పందన -
అధ్యక్ష ఎన్నికల వేళ.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో మారణహోమం జరుగుతోంది. వందల, వేల సంఖ్యలో ప్రజల బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇక, గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఇటీవల కూడా ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నవంబర్ ఐదో తేదీన అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. ఇక, ఇజ్రాయెల్ విషయంలో కమలా హారీస్ కూడా సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
ట్రంప్‌పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి
‘అహంకారం, ద్వేషం, విభజన వాదం నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అలాంటి వారు మనకొద్దు’ అంటూ ట్రంప్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు.త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తుండగా..తాజాగా ఆమెకు మద్దతుగా బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.‘గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్-19 ప్రారంభం నుంచి అమెరికన్లు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అధిక ధరలతో పాటు పలు ఇతర అంశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించే నాయకులు కావాలి. ట్రంప్ అందుకు అనర్హులు. ఆయనలో అహంకారం, ద్వేషం మెండుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలాహారిస్ మాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నాను’ అని ఒబమా పేర్కొన్నారు. -
ట్రంప్‌కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన కీలక యూనియన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అమెరికా పలు యూనియన్ల ఓట్ల కీలకంగా మారనున్నాయి. కొన్ని యూనియన్ల సభ్యులు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, అమెరికాలో ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ టీమ్‌స్టర్స్ యూనియన్‌కు సంబంధించిన ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారానున్నాయి. ఈ యూనియల్‌లో దాదాపు 1.3 మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్‌లో ట్రక్ డ్రైవర్లు, ఎయిర్‌లైన్స్ పైలట్స్, జూకీపర్ల వరకు అనేక ఇతర కార్మికులు కూడా ఉన్నారు. ఇక, యూనియన్‌కు సంబంధించి బుధవారం ఎలక్ట్రానిక్ పోల్‌ను విడుదల చేశారు. ఈ పోల్స్‌లో ఎక్కువ మంది డొనాల్డ్ ట్రంప్‌వైపే మొగ్గుచూపారు.యూనియన్ సభ్యుల జాతీయ ఎలక్ట్రానిక్ పోల్ ప్రకారం.. ట్రంప్‌కు 59.6 శాతం ఓట్లు రాగా, కమలా హారీస్‌కు మాత్రం కేవలం 34 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో, కమలాపై ట్రంప్ పైచేయి సాధించారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోకముందు ఆయనకు మద్దుతుగా 44 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, యూనియన్‌లో మెజార్టీ ఓటర్లు ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓట్లు అభ్యర్థులు ఇద్దరికీ యూనియన్ కీలకంగా మారనుంది. అయితే, 2000 సంవత్సరం నుంచి ఈ యూనియన్ సభ్యులు డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి సపోర్టు ఇస్తూ పోల్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు యూనియన్ మద్దతు ఇలా..1984లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్కు1988లో వైస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యు బుష్‌తో సహా రిపబ్లికన్లను ఆమోదించారు.1996 తర్వాత యూనియన్ ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి.2000 నుండి ప్రతి డెమోక్రాటిక్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం! -
ట్రంప్ ఎన్నికల స్టంట్.. రంగంలోకి మోదీ!
న్యూయార్క్: అమెరికా పర్యటనకు రానున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వచ్చేవారం భేటీ అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మంగళవారం మిచిగాన్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు. అదే విధంగా భారత ప్రధాని మోదీ ఓ అద్భుతమైన వ్యక్తి అని ప్రసంశలు కురిపించారు. అయితే మోదీతో భేటీకి సంబంధిచిన పూర్తి వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్.. ప్రధాని మోదీతో భేటీ అవుతానని ప్రకటించటంపై ప్రాధాన్యత సంతరించుకుంది.#BREAKING : Donald Trump says he will meet with PM Narendra Modi during Indian prime minister’s visit to US “He happens to be coming to meet me next week, Modi is a fantastic Man.” pic.twitter.com/jyM3R1PzPc— Siddhant Mishra (@siddhantvm) September 18, 2024 వచ్చే వారం సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షతను జరగనున్న నాలుగో క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొంటారు. సెప్టెంబర్ 21వ తేదీన న్యూయార్క్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. 22తేదీన న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’’లో కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.ఇక.. 2020 ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించిన సమయంలో ట్రంప్.. ప్రధాని మోదీతో చివరిసారి కలుసుకున్నారు.చదవండి: ట్రంప్ ‘ఐ హేట్ టేలర్ స్విప్ట్’ పోస్ట్.. క్యాష్ చేసుకున్న పాప్ స్టార్ -
మరోసారి ట్రంప్‌తో కమల కరచాలనం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు మరోసారి చేతులు కలిపారు. నిన్న డిబేట్ ప్రారంభానికి ముందు ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి కరచలనం చేసుకున్నారు.9/11 దాడులు.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన. నిన్నటితో దాడులకు 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంలో.. న్యూయార్క్‌లోని 9/11మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి బైడెన్ సమక్షంలో మరోసారి కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో 90 నిమిషాల ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ట్రంప్, హారిస్ ఇద్దరూ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. గత కొన్నేళ్లలో జరిగిన డిబేట్లలో అధ్యక్ష అభ్యర్థులెవరూ డిబేట్‌కు ముందు ఎవరూ ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. 🚨 After putting on a MAGA hat, Joe Biden told a group of Trump supporters: “No eating dogs and cats”pic.twitter.com/TIxtN5LDOa— Benny Johnson (@bennyjohnson) September 12, 2024ట్రంప్ టోపీ ధరించిన జో బైడెన్ ఇదే సంస్మరణ సభలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమానికి ట్రంప్2024 అని ఉన్న టోపీని ధరించిన ట్రంప్ అభిమానులున్నారు. ట్రంప్ అభిమానులు ధరించిన టోపీని చూసిన బైడెన్ సరదాగా వారితో మాట్లాడారు. అందులో ఓ ట్రంప్ మద్దతు దారుడు ధరించిన టోపీని బైడెన్ ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇదీ చదవండి : ట్రంప్- హారిస్‌ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి -
ట్రంప్‌కు భారీ షాక్, సొంత పార్టీలోనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ నుంచి భారీ షాక్ తగిలింది. సుమారు 200 మంది రిపబ్లికన్లు, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ లేఖ రాశారు. వీళ్లంతా.. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. అయితే ఇలా సొంత పార్టీ మద్దతు దారులే ట్రంప్‌ను వ్యతిరేకించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జార్జ్ డబ్ల్యు బుష్‌తో పాటు ఆయన మద్దతు దారులు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.తాజాగా మరోసారి ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. కమలా హారిస్‌కు మద్దతిస్తూ జార్జ్ డబ్ల్యూ బుష్ మద్దతు దారులు, రిపబ్లికన్ పార్టీ నేతలు రాసిన బహిరంగ లేఖలో..ట్రంప్ తిరిగి రెండోసారి ఎన్నుకుంటే దేశానికి విపత్తు అని తోటి రిపబ్లికన్లను హెచ్చరించారు. నిజమే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు ప్రతి ఒక్కరూ అంచనా వేస్తున్నారు’అని లేఖలో పేర్కొన్నారుఅంతేకాదు రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు జార్జ్ హెచ్డబ్ల్యు బుష్ మద్దతుదాలందరం ఒక్కటవుతాం. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ఓట్లు వేస్తున్నామని లేఖలో తెలిపారు. కమలా హారిస్‌తో మాకు విధానపరమైన విభేదాలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ఆమెకు ప్రత్యామ్నాయంగా, ఆ స్థాయిలో దేశానికి సేవ చేసే నేతలు లేరని స్పష్టం చేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు. -
ddos attack : మస్క్ - ట్రంప్ ఇంటర్వ్యూ.. ఎక్స్ వేదికపై సైబర్ దాడి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ ఆడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది వినియోగదారులకు ఆ ఇంటర్వ్యూ అందుబాటులోకి రాలేదని మస్క్ తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని ఆడియో ఇంటర్వ్యూని అందరికి అందిస్తామని చెప్పారు. డీడీఓఎస్ దాడి అంటే ఏమిటి?డీడీఓస్‘డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ అటాక్’. సైబర్ నేరస్తులు డీడీఓఎస్ అటాక్‌ను ఎంపిక చేసిన సర్వర్,నెట్వర్క్ లపై దాడి చేస్తారు. తద్వారా టెక్నాలజీ సంబంధిత కార్యకలాపాలు స్తంభించి పోతాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ దీనిని సైబర్ క్రైమ్‌గా పరిగణలోకి తీసుకుంది. డీడీఓఎస్తో నిర్ధిష్ట వ్యక్తుల్ని,సంస్థల్ని టార్గెట్ చేస్తారు.ఉదాహరణకు ఎలోన్ మస్క్ - ట్రంప్ మధ్య ఆడియో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూని యూజర్లు యాక్సెస్ చేయకుండా అడ్డుకున్నట్లు చెప్పింది. We tested the system with 8 million concurrent listeners earlier today https://t.co/ymqGBFEJX0— Elon Musk (@elonmusk) August 13, 2024 -
డొనాల్డ్ ట్రంప్ హత్యకు మరోసారి కుట్ర!
వాషింగ్టన్ డీసీ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. అయితే ఈ కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారు. కొన్నాళ్లు ఇరాన్లో ఉండి ఇటీవలే అమెరికాకు వచ్చిన పాకిస్థాన్ జాతీయుడు అసిఫ్ మర్చంట్ డొనాల్డ్ ట్రంప్, మరో వీఐపీని హత మార్చేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో తాము షూటర్లమేనంటూ ఎఫ్‌బీఐ అధికారులు అసిఫ్ మర్చంట్‌ను నమ్మించారు. ఆపై అదుపులోకి తీసుకున్నారు. అయితే అసిఫ్కు ట్రంప్‌పై కొద్దిరోజుల క్రితం జరిపిన కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా మీడియా తెలిపింది. సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా పరిగణించే జనరల్ ఖాసిమ్ సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు అసిఫ్ మర్చంట్ ట్రంప్‌పై కుట్రకు యత్నించినట్లు సమాచారం.ఖాసిమ్ సులేమానీ ఎవరు?బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా జనరల్ ఖాసిమ్ సులేమానీని పరిగణించే ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు వైమానిక దాడి జరిపి హతమార్చాయి. అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద్దిసేపటి ముందు ఏం జరిగింది,డ్రోన్ ఆపరేషన్‌లో సులేమానీ ఎలా మృతి చెందిందీ అనే విషయాలను ట్రంప్ బహిర్గతం చేశారు. నాటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ భావిస్తోంది. తాజాగా, ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్.. అసిఫ్ మర్చంట్‌ను అమెరికా పంపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
Trump Vs Kamala: ఎన్నికల సర్వేల్లో సూపర్ ట్విస్ట్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అగ్ర రాజ్యం అమెరికా రాజకీయం ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారీస్ పోటీ నిలుస్తున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. కాగా, ఆమె రేసులో వచ్చిన వెంటనే ట్రంప్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఎన్నికల సర్వేల్లో కమలా హారీస్ దూసుకుపోతున్నారు.వివరాల ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో సమానంగా కమల హారీస్ ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్స్‌లో వెల్లడించింది. ఇక, సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారీస్‌కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్‌పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారీస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్‌కు 48 శాతం, హారీస్‌కు 46 శాతం మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. రిపబ్లికన్లలో ట్రంప్‌ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్‌కు సైతం డెమోక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారీస్‌కు మాత్రం ఈ వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్‌కు 60 శాతం మద్దతు లభించింది.మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హరీస్ వచ్చిన వెంటనే ఆమెకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. అంతకుముందు జరిపిన ఓ ఎన్నికల సర్వేలో కూడా ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలోనే ఉన్నారు. దాదాపు రెండు శాతం ఓట్లతో కమలా దూసుకెళ్లారు. దీంతో, రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనంటూ డెమోక్రాట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలో కూడా నేతల నుంచి హారీస్‌కు పూర్తి మద్దతు లభించడం విశేషం. -
ట్రంప్‌పై ఆరురౌండ్ల కాల్పులు.. ఖండించిన ప్రముఖులు
వాషింగ్టన్ డీసీ : అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి.పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దుండగులు ఆరురౌండ్లు కాల్పులు జరిపారు. ట్రంప్ ప్రసంగిస్తున్న సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి కాల్పులు జరపడంతో ఆయన చెవికి గాయమైంది. కాల్పులు జరిపిన వెంటనే అప్రమత్తమైనా భద్రతా సిబ్బంది నిందితుల్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు సమాచారం.ఇక ట్రంప్‌పై జరిగిన దాడిన అధ్యక్షుడు బైడెన్ త్రీవంగా ఖండించారు. ఇది సరైనది కాదు.ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలి అని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో త్వరలో మాట్లాడతానని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.-జో బైడెన్వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రంప్ తర్వగా కోలుకోవాలి.ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.- కమలా హారిస్మన ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు ఖచ్చితంగా చోటు లేదంటూ ట్రంప్‌పై జరిపిన కాల్పులపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.- బరాక్ ఒబామా ట్రంప్‌పై దాడిని జార్జ్ డబ్ల్యూ బుష్ పిరికి పందచర్యగా అభివర్ణించారు.- జార్జ్బుష్ట్రంప్ త్వరగా కోలుకోవాలని అపరకుబేరుడు మస్క్ ఆకాంక్షించారు. కాల్పుల తర్వాత ఓ చేత్తో రక్తమోడుతున్న తన చెవికి అడ్డుపెట్టుకోగా మరో చేత్తో పిడికిలి బిగించిన ట్రంప్ ఫొటోని ఆయన షేర్ చేశారు.- ఎలాన్ మస్క్ -
అధ్యక్ష రేసులో కొనసాగుతా.. ట్రంప్‌ను ఓడించే వ్యక్తిని నేనే: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా తాను ఎట్టిపరిస్థితుల్లో తప్పుకోబోనని మరోసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రెసిడెంట్ జో బైడెన్ తేల్చిచెప్పారు. అయితే జూన్ 27న జరిగిన అధ్యక్ష ఎన్నికల తొలి డిబేట్లో డిమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారు. ఆయన వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారని దేశాన్ని ట్రంప్ నుంచి కాపాడాలంటే అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంతపార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖానించటం గమనార్హం. అయితే తాజగా ఆయన మరోసారి స్పందిస్తూ ప్రెసిడెంట్ రేసు నుంచి వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ‘‘నేను 2024 నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడించే సమర్థమైన వ్యక్తిని. నేను ప్రెసిడెంట్ రేసులోనే ఉంటాను. ప్రత్యర్థి రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడతాను’’అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన డెమోక్రాట్లకు ఓ లేఖ విడుదల చేశారు.జూన్ 27 నాటి తొలి డిబేట్లో జోబైడెన్ తూలటం, మాట్లాడుతూ తడబడటం, వృద్దాప్యంతో ఆలోచన సరళీ అదుపుతప్పటం స్పష్టంగా కనిపించింది. ఇక.. అప్పటి నుంచి ఆయన అధ్యక్ష రేసు నుంచి దూరంగా ఉంటే బాగుంటుందని పలువురు సూచించారు. కాగా, బైడెన్ తప్పుకుంటే ఉపాధ్యక్షురాల కమలా హారిస్ ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో దిగుతారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు.. జో బైడెన్ గత పదిరోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు, డెమోక్రటిక్ నేతల మద్దతూ కూడగట్టుకుంటున్నారు. -
‘నీలి విప్లవం’ పగటికలేనా!
డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపు నిశ్చయమై పోయింది. డొనాల్డ్ ట్రంప్ సజావుగా నిష్క్రమించడం ఒకటే మిగిలింది. నాలుగురోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఇంతవరకూ బైడెన్ 273 ఓట్లు సాధించారు. ట్రంప్ 214 దగ్గరే ఆగిపోయారు. ఈసారి ఎన్నికల్లో అమెరికా ఓటర్లు కనీవినీ ఎరుగని స్థాయిలో ఓట్లేశారు. కానీ డెమొక్రాట్లు ఆశిం చినట్టు అది ‘నీలి విప్లవం’గా రూపుదిద్దు కోలేదు. ఈ ఓట్ల లెక్కింపు, ఫలితాలపైనే దృష్టి పెట్టకుండా అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లోని ఉభయసభల్లో ఏమవుతున్నదో చూడాలి. ప్రతి నిధుల సభలో ఎటూ డెమొక్రాట్ల నియంత్రణే వుంటుంది. కానీ అక్కడ రిపబ్లికన్లు బాగానే పుంజుకుంటున్నారు. ప్రస్తుతానికి సెనేట్ పరిస్థితేమిటో చెప్పలేం. అయితే దానిపై రిపబ్లికన్ల ఆధి పత్యమే వుంటుందనిపిస్తోంది. కరోనా వైరస్ కాటు, దిగజారిన ఆర్థిక స్థితి, హోరాహోరీ రాజకీయ పోరు వగైరాలు కూడా డెమొ క్రాట్లకు పెద్దగా తోడ్పడిన దాఖలా కనబడటం లేదు. రిపబ్లిక న్లకు ఇదెలా సాధ్యమైంది? వారు డెమొక్రాట్లను ఎలా నిలువ రించగలిగారు? తీరుమార్చిన ట్రంప్ సందేహం లేదు. రిపబ్లికన్ పార్టీ తీరుతెన్నుల్ని ట్రంప్ పూర్తిగా మార్చగలిగారు. కనుక ఈ ఎన్నికల్లో ఓడినా ఆయన ఎటూ వెళ్లరు. అతి పెద్ద రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతారు. ఇప్పుడు వెలువడుతున్న గణాంకాలనుబట్టి ఆయనకు 6 కోట్ల 80 లక్షల ఓట్లు వచ్చాయి. 2016తో పోలిస్తే కీలక రాష్ట్రం ఫ్లోరి డాలో క్యూబన్ అమెరికన్ల మద్దతు సాధించి ఆయన అత్యధిక శాతం ఓట్లు తెచ్చుకున్నారు. పెన్సిల్వేనియా, మిన్నెసోటా, మిషిగాన్, ఐయోవా, నార్త్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడాల్లో ట్రంప్ 17 ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో చేసిన ప్రసంగాలు సాధారణమైనవి కాదు. డబ్బుకు ఆశపడి వైద్యులు కరోనా మరణాలను బాగా పెంచి చూపించారని ఆరోపించారు. అంటు రోగాల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫాసీని పదవినుంచి ఊడ బెరుకుతానని హెచ్చరించారు. మాస్క్ ధరించిన ఫాక్స్ న్యూస్ ప్రోగ్రాం నిర్వాహకురాలు లారా ఇన్‌గ్రాహంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రచారపర్వంలో ఇవన్నీ ఆయనకు బాగా కలి సొచ్చాయి. పోలింగ్ కేంద్రాల్లో భారీగా కనబడిన ఓటర్లను చూసి మనమంతా ‘నీలివిప్లవం’ అనుకున్నాం. అది డెమొ క్రాట్లను వైట్‌హౌస్‌కు పంపడానికి పనికొచ్చింది. కానీ సెనేట్ లోనూ, ప్రతినిధుల సభలోనూ ఉపయోగపడింది లేదు. ఆర్థికమే కీలకం ఈ ఎన్నికల్లో కరోనా, ఆర్థిక మాంద్యం ఎవరికీ పెద్దగా పట్ట లేదు. ట్రంప్ చేతుల్లో ఆర్థిక వ్యవస్థ భద్రంగా వుంటుందన్న విశ్వాసమే ఓటర్లలో కనబడింది. ఆర్థిక సమస్యలకు కరోనా కారణం తప్ప ట్రంప్ కాదని వారు నమ్మారు. తాను అధికా రంలో లేకుంటే సోషలిజం, కమ్యూనిజం, రాడికల్ లెఫ్ట్ తదితర భూతాలు ఆర్థిక వ్యవస్థను మరింత ధ్వంసం చేస్తాయని ట్రంప్ చేసిన హెచ్చరికలు ఫలించాయి. కరోనాను చైనాపైకి తోసి, దాన్ని అరికట్టడంలో తన బాధ్యతను ఆయన తెలివిగా దాటే యగలిగారు. అక్టోబర్ నెలాఖరుకు ఆయన రేటింగ్(44 శాతం) తగ్గిన మాట వాస్తవమేగానీ... అది అంచనాలకు తగినట్టులేద న్నది వాస్తవం. కరోనా మరణాలు, ఇతర సమస్యలు ట్రంప్‌ను కుంగదీస్తాయనుకుంటే రిపబ్లికన్లకు గతంలో వున్న మద్దతు స్థిరంగా కొనసాగింది. రిపబ్లికన్ ఓటర్లకు ఆయన సంప్రదాయ ఎజెండా నచ్చింది. తుపాకీ హక్కుల పరిరక్షణ, అబార్షన్లకూ, స్వలింగసంపర్క పెళ్లిళ్లకూ, ఎల్జీబీటీ హక్కులకూ ఆయన వ్యతిరేకంగా నిలబడటం వారిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సంప్రదాయవాది జస్టిస్ అమీ కోనీ బారెట్‌ను ఎన్నికల ముందు అడ్డగోలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం ఆయనపై విశ్వాసాన్ని పెంచింది. మైనారిటీల్లో అభద్రత శ్వేతజాతి ఆధిపత్యాన్ని, జాత్యహంకారాన్ని ఎగదోసి మైనారి టీల్లో ఒకరకమైన అభద్రతను కలిగించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఈ ఏడాది వ్యవస్థాగత జాత్యహంకారం, పోలీసు హింస, సామాజిక, రాజకీయ విభేదాలు బాగా పెరిగాయి. వీటినెక్కడా ట్రంప్ ఖండించలేదు. ఆ పనిచేస్తే శ్వేత జాతీ యులు దూరమవుతారు మరి. మైనారిటీ ఓటర్ల హక్కుల్ని అణచడం ఈ ఎన్నికల్లో బాహాటంగా కనబడింది. ఆఫ్రికన్ అమెరికన్లను ఓటేయనిస్తే తమకు నష్టమని గుర్తించి ఓటింగ్ హక్కుల చట్టంలోని కఠిన నిబంధనలు అమలుచేశారు. అయినా సరే డెమొక్రాట్లకు వైట్‌హౌస్ చేరువలోనే వుంది. కానీ తటస్థ రాష్ట్రాలపై ఈ ప్రభావం ఏమేరకుందో ఇంకా చూడాలి. సారాంశం ఏమంటే... డొనాల్డ్ ట్రంప్ నిష్క్రమణ ఖాయమే. కానీ ట్రంపిజం మున్ముందు కూడా శాసిస్తూనే వుంటుంది. ప్రభుత్వం ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తూనే ఉంటుంది. – అన్నా జాకబ్స్, అమెరికా రాజకీయ నిపుణురాలు -
నేడు కమల– పెన్స్ మాటల యుద్ధం!
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్ధులు కమలా హారిస్, మైక్ పెన్స్‌ల మధ్య బుధవారం సాల్ట్‌లేక్ సిటీలో జరగనుంది. వైస్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఒక శ్వేతజాతీయేతర, భారతీయ మూలాలున్న మహిళ పాల్గొనడం ఇదే తొలిసారి. ఇందులో కమలదే పైచేయి కావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఉపాధ్యక్ష అభ్యర్ధుల మధ్య ఒక్కసారి మాత్రమే ముఖాముఖి చర్చ జరుగుతుంది. ఇక తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం రిపబ్లికన్ ట్రంప్‌తో పోలిస్తే డెమొక్రాట్ బైడెన్‌కు ఆదరణ పెరిగినట్లు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ డిబేట్లో మాత్రం రిపబ్లికన్ పెన్స్ సులభంగా పైచేయి సాధిస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.(చదవండి: అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?) కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనాకు చికిత్స తీసుకుని సోమవారం శ్వేతసౌధానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక కోవిడ్-19 ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసి, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ట్రంప్ సర్కారు విఫలమైందని ఇప్పటికే డెమొక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. స్వయంగా అధ్యక్షుడే మహమ్మారి బారిన పడటంతో వారికి మరో అవకాశం లభించింది. బైడెన్ వలె కమల సైతం ఈ అంశాన్ని డిబేట్లో ప్రస్తావించి, మైక్ పెన్స్‌ను ఇరుకున పెడతారని ఆమె మద్దతుదారులు అంటున్నారు. (చదవండి: అగ్రరాజ్యంలో ‘కమల’ వికాసం!) ఆ అవసరం లేదు ఉపాధ్యక్ష డిబేట్లో భాగంగా ప్లెక్సిగ్లాస్ బారియర్(రక్షణ కవచం) ఉపయోగించాలని కమల టీం అంటుంటే, మైక్ పెన్స్ బృందం మాత్రం అలాంటి అవసరం లేదంటూ కొట్టిపారేసింది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంతటి నిర్లక్ష్యం పనికిరాదంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డిబేట్ నిర్వహించాలని, ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి తర్వాత ట్రంప్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ కావడం, ఈ కారణంగా జో బైడెన్ ఆరోగ్యం సైతం ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తిన విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో పెన్స్ టీం ఎట్టకేలకు ఇందుకు అంగీకరించింది. (చదవండి: ప్రేమ, పెళ్లి, అంతలోనే వరుస విషాదాలు..) చదవండి: నేనే గెలిచా.. కాదు నేను! -
అమెరికాతో యుద్ధానికి సిద్ధం
మా దేశాన్ని చుట్టుముట్టి నిర్బంధిస్తే అమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హెచ్చరించారు. యుద్ధానికి తమ సేనలను సమాయత్తం చేస్తున్నామని ప్రకటించారు. అమెరికా చట్ట వ్యతిరేకమైన బెదిరింపులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ వెనెజులా వ్యవహారంలో రష్యా, చైనా, ఇరాన్, క్యూబాల జోక్యాన్ని తాము సహించమని, అందుచేతనే ఆ దేశాన్ని దిగ్బంధించే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా బెదిరింపులు చూస్తుంటే ఆ దేశం తీవ్ర నిరాశ, చికాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఏ సైనిక చర్య తీసుకున్నా తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. ‘నేర సామ్రాజ్యవాద దేశానికి నేనిచ్చే సందేశం ఇదే. ఎవరైనా మమ్మల్ని ముట్టడిస్తే యుద్ధానికి సిద్ధం కావడానికి మేం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వారు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా మేం మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అమెరికా వెనెజులాపై అనేక రకాల ఆంక్షలు విధించింది. దేశాధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత యువాన్ గ్వాయిడోను గుర్తిస్తున్నామని అమెరికా దాని మిత్ర పక్షాలు ప్రకటించడమే గాక మదురోను తొలగించడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీని ఫలితంగానే గత కొంతకాలంగా అధ్యక్ష కార్యాలయాన్ని గ్వాయిడో అనుచరులు స్వాధీనం చేసుకోవాలని చూస్తుండటంతో ప్రస్తుతం వెనెజులాలో ఘర్షణ వాతావారణం నెలకొంది. -
ఇవాంకతో స్నేహం లేదు : చెల్సియా
కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ మధ్య స్నేహంపై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెల్సియా వాటికి తెరదించారు. స్టెఫెన్ కొల్బర్ట్ లెట్ షో లో మాట్లాడిన ఆమె తమ మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదని స్పష్టం చేశారు. చెల్సియా తల్లి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు సందర్భాల్లో వీరి స్నేహం గురించి పలు రకాల కథనాలు వెలువడ్డాయి. చెల్సియా స్పందిస్తూ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయని, వాటికి వైట్ హౌస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత నెలలో తన తండ్రి ట్రంప్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ఇవాంకని ప్రశ్నించినప్పుడు, ఆమె స్పందిస్తూ.. ఇది తనను అడగాల్సిన ప్రశ్న కాదని సూచించారు. ఒక కూతురిని తన తండ్రి గురించి ఇలాంటి ప్రశ్నలు అడగటం సరికాదన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మీరు ఇదే ప్రశ్ననే ఇతరుల కుమార్తెలను అడుగుతారని అనుకోవడం లేదన్నారు. ఇవాంకను ట్రంప్ సలహాదారుగా నియమించటం, ఇతర దేశాధినేతలతో సమావేశమైనప్పుడు అధిక ప్రధాన్యత ఇవ్వడాన్ని మీడియా విమర్శించింది. ఇప్పుడు చెల్సియా క్లింటన్ స్పందించిన తీరు చూస్తుంటే ఈ పరిణామాల మీదే ఆమె స్పందించినట్లు అర్థమవుతుంది. ఇవాంక మీడియాతో వ్యవహరించిన తీరుపైన చెల్సియా క్లింటన్ ఈ విధమైన వ్యాఖ్యాలు చేసినట్లు తెలుస్తోంది. -
నేను అద్భుతం చేయబోతున్నా: ట్రంప్
న్యూయార్క్: తన ఎన్నిక జరిగినప్పటి నుంచి అమెరికా గంపెడు ఆశతో ఉందని త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అదే సమయంలో తన ఎన్నికతో భవిష్యత్‌పై భయమేస్తోందంటూ వ్యాఖ్యానించిన అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా మాటలు గుర్తుచేశారు. ‘ఎప్పుడు బ్రహ్మాండమైన ఆశను కలిగి ఉన్నాం. బ్రహ్మాండమైన వాగ్దానం కూడా మనకు ఉంది. అలాగే పెద్ద మొత్తంలో శక్తిని కూడా మనం కలిగి ఉన్నాం. మనం తిరిగి భారీ విజయం సాధించబోతున్నాం. ఈ దేశంలో మనం అద్భుతం చేయబోతున్నాం. ఆ అద్భుతం నేనే చేస్తా’ అంటూ ట్రంప్ అలబామాలోని మొబైల్లో ర్యాలీ సందర్భంగా చెప్పారు. చివరికి మీకు ధన్యవాదాలు అంటూ ఆయన ముగించారు. గత శుక్రవారం ఆఫ్రా విన్ఫ్రే తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మిషెల్లీ మాట్లాడుతూ ట్రంప్ విజయం తర్వాత అమెరికన్లలో కాస్తంత ఆందోళన ఉందని, తనకు అలాంటిదే ఉందని, అయితే, జీవితంలో ఆశ కలిగి ఉండటం ముఖ్యమైనందున తాను కూడా మంచే జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు. -
ముంబైలోని ట్రంప్ టవర్స్‌కు జెట్ సర్వీసులు
ముంబై: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ పడుతున్న శత కోటీశ్వరుడు డొనాల్డ్ ట్రంప్ ముంబై నగరంలో ట్రంప్ టవర్స్ పేరిట లగ్జరీ టవర్లను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వీటిలో నివసించేవారికి ప్రైవేట్ జెట్ సర్వీసులను అందజేస్తామని తాజాగా ప్రకటించారు. ప్రైవేట్ జెట్ సర్వీసులు ఇంతవరకు భారత దేశంలోనే లేవు. క్రెకెట్ స్టేడియం, సినిమా థియేటర్, అంపీ థియేటర్, అథ్లెటిక్ ట్రాక్స్, స్పా బాత్‌లు, స్పాలు, స్మిమ్మింగ్ పూల్స్, జలపాతాలు, రిసార్ట్స్ లాంటి సౌకర్యాలతో మొత్తం 17 ఎకరాల్లో 800 అడుగుల ఎత్తై ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తున్నారు. 75 అంతస్థులుండే ఈ టవర్స్‌లో 400 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ముంబైకి చెందిన లోధా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ టవర్స్ 2018 సంవత్సరం నాటికి పూర్తవుతాయి. మూడు పడక గదుల ఫ్లాట్‌ను 9.10 కోట్లకు, ఐదు పడక గదులు కలిగిన ఫ్లాట్‌ను పదిన్నర కోట్ల రూపాయలకు విక్రయించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. ముంబై నగరంతోపాటు పుణెలో కూడా ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తున్నారు.