
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ ఆడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది వినియోగదారులకు ఆ ఇంటర్వ్యూ అందుబాటులోకి రాలేదని మస్క్ తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని ఆడియో ఇంటర్వ్యూని అందరికి అందిస్తామని చెప్పారు.
డీడీఓఎస్ దాడి అంటే ఏమిటి?
డీడీఓస్‘డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ అటాక్’. సైబర్ నేరస్తులు డీడీఓఎస్ అటాక్‌ను ఎంపిక చేసిన సర్వర్,నెట్‌వర్క్ లపై దాడి చేస్తారు. తద్వారా టెక్నాలజీ సంబంధిత కార్యకలాపాలు స్తంభించి పోతాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ దీనిని సైబర్ క్రైమ్‌గా పరిగణలోకి తీసుకుంది.
డీడీఓఎస్‌తో నిర్ధిష్ట వ్యక్తుల్ని,సంస్థల్ని టార్గెట్ చేస్తారు.ఉదాహరణకు ఎలోన్ మస్క్ - ట్రంప్ మధ్య ఆడియో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూని యూజర్లు యాక్సెస్ చేయకుండా అడ్డుకున్నట్లు చెప్పింది.
We tested the system with 8 million concurrent listeners earlier today https://t.co/ymqGBFEJX0
— Elon Musk (@elonmusk) August 13, 2024