
ఎవరికైనా సొంతంగా కారు కొనుగోలు చేయాలని, దాన్ని డ్రైవ్ చేయాలనీ ఉంటుంది. కారు కొన్న గంటలోనే.. బూడిదైపోతే?, ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. అలాంటి ఘటనే జపాన్‌లో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
33 ఏళ్ల మ్యూజిక్ ప్రొడ్యూసర్ 'హోంకాన్' 10 సంవత్సరాలు డబ్బు పోగు చేసి, తనకు ఇష్టమైన ఫెరారీ 458 స్పైడర్ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 2.5 కోట్లు కంటే ఎక్కువే. ఇష్టమైన కొత్త కారు కొన్న ఆనందంలో.. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే, కారులో నుంచి పొగలు రావడం గమనించాడు. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. కారు పేలిపోతుందేమో అని భయపడ్డానని హోంకాన్ ట్వీట్ చేశారు.
కారు కాలిపోవడానికి.. సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఖరీదైన కారు మంటల్లో చిక్కుకుని ఉండటం, కాలిపోయిన తరువాత ఎలా ఉందనేది.. ఫోటోలలో గమనించవచ్చు.
ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..
కారు ప్రమాదానికి గురైన తరువాత.. అగ్నిమాపక సిబ్బంది 20 నిమిషాల్లో మంటలు ఆర్పారు. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణహాని కూడా జరగలేదు. కారులో ఎలా మంటలు చెలరేగాయి. కారుకు ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతోంది.
社長がフェラーリ買ったらしいから乗せてもらった1時間後に燃えた pic.twitter.com/kZq4QYgwkZ
— ポケカメン@ちょこらび (@GC5R5OGIKgV0yvz) April 16, 2025