ట్విటర్ పూర్తిగా ఎక్స్.కామ్‌గా రీబ్రాండ్ అయ్యింది. ఎక్స్.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్.కామ్ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ శుక్రవారం తెలిపారు.
ఎలోన్ మస్క్ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్. కామ్‌గా రీ బ్రాండ్ చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు.
అయితే నిన్నటి వరకు ట్విటర్ లోగో, బ్రాండింగ్ మారింది. కానీ డొమైన్ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్.కామ్ డొమైన్ స్థానంలో ఇప్పుడు ఎక్స్.కామ్ వచ్చి చేరినట్లు మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పోస్ట్ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్‌స్క్రిప్షన్ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న యూజర్ అకౌంట్‌లు ఎక్స్.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment