ఎక్స్.కామ్ బాస్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూట్యూబ్ టీవీకి పోటీగా త్వరలో అమెజాన్, శామ్‌సంగ్ వినియోగదారుల కోసం టీవీ యాప్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ మ్యాగజైన్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన మస్క్ స్మార్ట్ టీవీల్లో లాంగ్ ఫార్మ్ వీడియోలు త్వరలో అందుబాటులో తెస్తామని ప్రకటించారు.
గతంలో ఎక్స్.కామ్‌ను ఎవ్రీథింగ్ యాప్ మార్చే యోచనలో ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా యాప్‌లో నగదు లావాదేవీల సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత గత అక్టోబర్‌లో ఎంపిక చేసిన వినియోగదారుల కోసం వీడియో, ఆడియో కాలింగ్ ప్రారంభ వెర్షన్‌ను విడుదల చేశారు.
Coming soon https://t.co/JlnlSL7eS9
— Elon Musk (@elonmusk) March 9, 2024
ఇప్పుడు టీవీల్లో ఎక్స్.కామ్ టీవీ యాప్‌ను తెచ్చే పనిలో ఉన్నారు. ఇదే విషయంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్ క్లారిటీ ఇచ్చారు. త్వరలో వచ్చేస్తుంది. ఎక్స్.కామ్‌లోని లాంగ్ వీడియోలు టీవీల్లో చూసే వెసలు బాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment