ఎక్స్(ట్విటర్) యూజర్లు యాడ్స్ వద్దనుకుంటే డబ్బులు కట్టాల్సిందేనంటూ ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మస్క్ యూజర్లకు మరో భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఎక్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసినందుకే యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసిన మస్క్ ఆ ఫ్లాట్‌ఫామ్‌లో ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఖాతాదారులు ఏడాదికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని మస్క్ నిర్ధారించారు. ప్రస్తుతం, రెండు దేశాల యూజర్ల నుంచి ‘నాట్ ఏ బోట్’ పేరుతో సబ్‌స్కిప్షన్‌ను వసూలు చేస్తున్నామని తెలిపారు.
కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే
‘ఎక్స్ హెల్ప్ సెంటర్ పేజ్’లో ‘నాట్ ఏ బోట్’ పేరుతో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో ‘మేము రెండు దేశాల్లోని కొత్త వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ పద్ధతి ‘నాట్ ఎ బాట్’ని పరీక్షించడం ప్రారంభించాము. స్పామ్,మానిప్యులేషన్‌ను తగ్గించేలా ఇప్పటికే మేం చేస్తున్న ప్రయత్నాలు మరింత బలోపేతం చేసేలా ఈ టెస్ట్ చేస్తున్నాం. అయితే ఈ నగదు చెల్లింపులు ఇప్పటికే ఎక్స్ వినియోగిస్తున్న యూజర్లకు వర్తించదు’అని పోస్ట్‌లో హైలెట్ చేసింది.
రెండు దేశాల్లో
‘నాట్ ఎ బాట్’ పద్ధతి ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల యూజర్లకు వర్తిస్తుంది. ఈ రెండు దేశాల్లో యూజర్ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? భవిష్యత్తులో ఇతర దేశాల్లో సైతం ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ని అమలు చేసే యోచనలో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది.
డబ్బులు చెల్లించ లేకపోతే
సబ్‌స్క్రిప్షన్ చెల్లించలేని యూజర్లు కొత్త ఎక్స్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు.అయితే వారు పోస్ట్‌లను చూడటం, వీడియోలను చూడటం, ఇతర అకౌంట్లను ఫాలో అయ్యేందుకు వీలు లేదు. కేవలం చదివేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. వారు తమ సొంత కంటెంట్‌ను పోస్ట్ చేయలేరనే విషయాన్ని గుర్తించాలి.
ధృవీకరించిన ఎలాన్ మస్క్
అదే విషయాన్ని ధృవీకరిస్తూ, మస్క్ ఒక ట్వీట్ చేశారు. ‘ఉచితంగా చదవండి, కానీ మీరు రాసింది పోస్ట్ చేయడానికి ఏడాదికి ఒక్క డాలర్ (83.29 Indian Rupee) చెల్లించాలి. నిజమైన వినియోగదారులను నిరోధించకుండా బాట్‌లతో పోరాడటానికి ఇది ఏకైక మార్గమని పేర్కొన్నారు.
సైన్ అప్ చేయడం ఎలా?
కాబట్టి, రెండు దేశాల్లోని కొత్త వినియోగదారులు ఎక్స్‌లో కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే ముందుగా ఫోన్‌నెంబర్‌ను ధృవీకరించాలి. మొదటి దశపూర్తయిన తర్వాత తమ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. వీటి ధరలు దేశం, కరెన్సీ ఆధారంగా మారుతాయి.
చదవండి👉 హమాస్ ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం..‘టెస్లా నా ప్రాణం కాపాడింది’
Comments
Please login to add a commentAdd a comment