users charges
-
ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం!
ఎక్స్(ట్విటర్) యూజర్లు యాడ్స్ వద్దనుకుంటే డబ్బులు కట్టాల్సిందేనంటూ ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మస్క్ యూజర్లకు మరో భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఎక్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసినందుకే యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేసిన మస్క్ ఆ ఫ్లాట్‌ఫామ్‌లో ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఖాతాదారులు ఏడాదికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని మస్క్ నిర్ధారించారు. ప్రస్తుతం, రెండు దేశాల యూజర్ల నుంచి ‘నాట్ ఏ బోట్’ పేరుతో సబ్‌స్కిప్షన్‌ను వసూలు చేస్తున్నామని తెలిపారు. కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే ‘ఎక్స్ హెల్ప్ సెంటర్ పేజ్’లో ‘నాట్ ఏ బోట్’ పేరుతో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో ‘మేము రెండు దేశాల్లోని కొత్త వినియోగదారుల కోసం కొత్త సబ్స్క్రిప్షన్ పద్ధతి ‘నాట్ ఎ బాట్’ని పరీక్షించడం ప్రారంభించాము. స్పామ్,మానిప్యులేషన్‌ను తగ్గించేలా ఇప్పటికే మేం చేస్తున్న ప్రయత్నాలు మరింత బలోపేతం చేసేలా ఈ టెస్ట్ చేస్తున్నాం. అయితే ఈ నగదు చెల్లింపులు ఇప్పటికే ఎక్స్ వినియోగిస్తున్న యూజర్లకు వర్తించదు’అని పోస్ట్‌లో హైలెట్ చేసింది. రెండు దేశాల్లో ‘నాట్ ఎ బాట్’ పద్ధతి ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల యూజర్లకు వర్తిస్తుంది. ఈ రెండు దేశాల్లో యూజర్ ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? భవిష్యత్తులో ఇతర దేశాల్లో సైతం ఈ కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ని అమలు చేసే యోచనలో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. డబ్బులు చెల్లించ లేకపోతే సబ్స్క్రిప్షన్ చెల్లించలేని యూజర్లు కొత్త ఎక్స్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు.అయితే వారు పోస్ట్‌లను చూడటం, వీడియోలను చూడటం, ఇతర అకౌంట్లను ఫాలో అయ్యేందుకు వీలు లేదు. కేవలం చదివేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. వారు తమ సొంత కంటెంట్‌ను పోస్ట్ చేయలేరనే విషయాన్ని గుర్తించాలి. ధృవీకరించిన ఎలాన్ మస్క్ అదే విషయాన్ని ధృవీకరిస్తూ, మస్క్ ఒక ట్వీట్ చేశారు. ‘ఉచితంగా చదవండి, కానీ మీరు రాసింది పోస్ట్ చేయడానికి ఏడాదికి ఒక్క డాలర్ (83.29 Indian Rupee) చెల్లించాలి. నిజమైన వినియోగదారులను నిరోధించకుండా బాట్లతో పోరాడటానికి ఇది ఏకైక మార్గమని పేర్కొన్నారు. సైన్ అప్ చేయడం ఎలా? కాబట్టి, రెండు దేశాల్లోని కొత్త వినియోగదారులు ఎక్స్‌లో కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే ముందుగా ఫోన్‌నెంబర్‌ను ధృవీకరించాలి. మొదటి దశపూర్తయిన తర్వాత తమ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. వీటి ధరలు దేశం, కరెన్సీ ఆధారంగా మారుతాయి. చదవండి👉 హమాస్ ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం..‘టెస్లా నా ప్రాణం కాపాడింది’ -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాకిచ్చింది. పాస్వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని 100 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్లను కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు, యాడ్ సపోర్ట్ ఆప్షన్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసింది. 103 దేశాల యూజర్లకు ఇ-మెయిల్స్ నెట్‌ఫ్లిక్స్ మంగళవారం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ పాటు పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్నట్లు 103 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూజర్లకు మెయిల్ పెట్టింది. ఆ ఇ-మెయిల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌ను ఒకరే వినియోగించుకోవాలని, ఇతరులకు షేర్ చేస్తే అమెరికా యూజర్లు అదనపు ఛార్జీల కింద 8 డాలర్లను (భారత కరెన్సీలో రూ.700డాలర్లు) విధిస్తున్నట్లు పేర్కొంది. 100 మిలియన్లకు పైగా 100 మిలియన్లకు పైగా కుటుంబాలు తమ లాగ్-ఇన్ వివరాలు ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసినట్లు కంపెనీ అంచనా వేసింది. కాగా, మార్చి చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ చెల్లింపు కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 232.5 మిలియన్లు సబ్స్క్రిప్షన్ యూజర్లు ఉన్నారు. కొత్త పాలసీల ప్రకారం, ఒకే కుటుంబ సభ్యులు నెట్‌ఫ్లిక్స్ ఖాతాను వీక్షించవచ్చు. ప్రయాణంలో ఇతర డివైజ్‌లలో లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం! -
5జీకి ఎక్కువ చెల్లించడానికైనా రెడీ
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ రెడీ స్మార్ట్ఫోన్లు ఉన్న 10 కోట్ల మందికి పైగా యూజర్లు అత్యంత వేగవంతమైన సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటి కోసం 45 శాతం వరకూ ఎక్కువ చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఎరిక్సన్ కన్జూమర్ల్యాబ్ రూపొందించిన ’5జీ హామీ’ అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దీన్ని నిర్వహించారు. 5జీ సర్వీసులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (యూజరుపై సగటు ఆదాయం) ఆర్జించే అవకాశాలు దేశీయంగా టెల్కోలకు మరింత ఊతమివ్వగలవని నివేదిక పేర్కొంది. కంపెనీ లకు యూజర్లు కట్టుబడి ఉండాలంటే 5జీ నెట్వర్క్ పనితీరే కీలకంగా ఉంటుందని వివరించింది. సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఏ నెట్వర్క్ బాగుంటే దానికే మారిపోవాలని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది యూజర్లు తెలపడం ఇందుకు నిదర్శనం. మెరుగైన కవరేజీ కన్నా 5జీతో వినూత్నమైన కొత్త ఉపయోగాల గురించి ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం మంది పేర్కొన్నారు. ఇందుకోసం వారు ఆయా ప్లాన్ల కోసం 45 శాతం వరకూ ప్రీమియం చెల్లించేందు కైనా సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులో ఉన్న బ్రిటన్, అమెరికాలతో పోలిస్తే కొత్త సర్వీసులకు అప్‌గ్రేడ్ అవ్వాలని భావిస్తున్న వారి సంఖ్య భారత నగరాల్లో రెండింతలు ఎక్కువగా ఉంది. ► రెండేళ్లలో 5జీ హ్యాండ్సెట్ వినియోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 5జీ రెడీ ఫోన్లు ఉన్న 10 కోట్ల మంది పైగా యూజర్లు 2023లో 5జీ సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే యోచనలో ఉన్నారు. వీరిలో సగం మంది వచ్చే 12 నెలల్లో మరింత ఎక్కువ డేటా ప్లాన్లకు మారాలని భావిస్తున్నారు. ► సేవల నాణ్యత, లభ్యతపై మరింతగా దృష్టి పెడుతూ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు టెలికం సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదు. తొలినాళ్లలోనే 5జీ సేవలను ఎంచుకునే వారికి వినూత్నమైన అనుభూతిని అందించగలిగితే కంపెనీలు మరింతగా ఆర్జించే అవకాశాలు ఉంటాయి. -
ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట
కరోనా మహమ్మారి కొనసాగుతున్న ఈ తరుణంలో వినియోగదారులకు ఉపశమనం కలిగే విధంగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రోజులో ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేసే పరిమితిని పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు మీ పొరుగు శాఖకు(హోమ్ బ్రాంచ్ మినహా) వెళ్లి ఒక రోజులో విత్ డ్రా ఫారం సహాయంతో రూ.25000 వరకు విత్ డ్రా చేయొచ్చు. బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. విత్ డ్రా ఫారం ద్వారా మరొక శాఖకు వెళ్ళినప్పుడు వినియోగదారులు తమ పొదుపు ఖాతా నుంచి 25 వేల రూపాయల వరకు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది. అదే చెక్ ద్వారా అయితే మరో శాఖ నుంచి 1 లక్ష రూపాయల వరకు తీసుకోవచ్చు అని తెలిపింది. థర్డ్ పార్టీ నగదు ఉపసంహరణ పరిమితిని 50 వేల రూపాయలకు పెంచారు. తక్షణమే ఈ కొత్త నిబంధనల అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు 30 సెప్టెంబర్ 2021 వరకు వర్తిస్తాయి. నగదు ఉపసంహరించుకునే కొత్త నిబంధనలతో పాటు, బ్యాంక్ కూడా షరతులను అమలు చేసింది. థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా నగదు ఉపసంహరించుకోలేమని బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాకుండా థర్డ్ పార్టీ కేవైసీ పత్రం కూడా అవసరం. ఎస్బీఐ తన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలలో 8 ఉచిత లావాదేవీలను అందిస్తుంది. ఇందులో 5 ఎస్బీఐ ఎటిఎంలు, మరో 3 బ్యాంక్ ఎటిఎంల లావాదేవీలు ఉంటాయి. నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఎటిఎం లావాదేవీలు ఉంటాయి. ఇందులో 5 లావాదేవీలు ఎస్బీఐతో పాటు మరో 5 లావాదేవీలు వేరే బ్యాంకుల ఎటిఎంల ద్వారా తీసుకునే సదుపాయం కల్పించింది. చదవండి: గుడ్ న్యూస్ : మూడు రోజుల్లోనే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా -
రైలు ప్రయాణం: అదనంగా మరో రూ. 35!
న్యూఢిల్లీ: ప్రయాణీకులపై భారం పెంచాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఒక్కో టికెట్‌పై యూజర్ ఫీ రూపంలో రూ. 10 నుంచి రూ. 35 వరకు అదనంగా వసూలు చేయాలన్న ప్రతిపాదన ఉందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిపాయి. త్వరలో ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుందని పేర్కొన్నాయి. కాగా నవీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్ టికెట్ ధరతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: సివిల్స్ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..) ఇందులో భాగంగా దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలో 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్ అభివృద్దికి వినియోగిస్తామని వివరించారు. ఇక ప్రస్తుతం దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలని రైల్వే భావిస్తోంది. ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్లపాటు వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలనే యోచనలో ఉంది. ఈ విధంగా అభివృద్ధి చేసిన స్టేషన్ హబ్స్‌ను రైలోపోలిస్‌గా పిలుస్తారు. (రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్ సంస్థలకే..!) -
వైద్య ప్రదాత వైఎస్
తిరుపతి, న్యూస్‌లైన్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధర్మాస్పత్రుల్లో పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేసేవారు. చిన్న పాటి జ్వరం వచ్చినా వైద్యం చేయించుకోవాలంటే పేదలు దిక్కులు చూసేవారు. ఇక ఖరీదైన జబ్బులు వస్తే అంతే. చంద్రబాబు హయాంలో ప్రాణాం తక వ్యాధులకు చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ప్రాణాలు కోల్పోయి న వారు ఎందరో ఉన్నారు. ప్రజాప్రస్థా నం ద్వారా పేదల కష్టాలను తెలుసుకున్నారు మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి. ఖరీదైన జబ్బులకు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక ప్రాణాలు వదులుతున్న పేదల కష్టాలను తెలుసుకుని చలించిపోయా రు. ఆరోగ్యశ్రీ వంటి అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు వరం ప్రసాదించారు. 2007 జూలైలో చిత్తూరు జిల్లాలో ఈ పథకం అమలులోకి వచ్చింది. జిల్లాలోని 20 నెట్ వర్క్ (ప్రభుత్వ,ప్రైవేట్) ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ 80 వేల మందికి పైగా నిరు పేదలు ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె, కిడ్నీ, కార్డియో థొరాసిక్, న్యూరోసర్జరీ సంబంధిత వ్యాధులకు, క్యాన్స ర్ వంటి ప్రాణాంతక జబ్బులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. ఈ పథకం ద్వారా ఇప్ప టి వరకూ *250 కోట్లు విడుదలయ్యాయి. మహా నేత ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ పథకానికి తూట్లు పొడిచా రు. పేదలకు ఉచిత సేవలు అందుబాటులో ఉన్న 133 వ్యాధులను కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి తప్పించి ప్రభుత్వాస్పత్రులకు బదలాయించారు. దాంతో ఆ వ్యాధులకు నాణ్యమైన వైద్యసేవలు కరువయ్యాయి. ఆ 133 వ్యాధులతో కలుపుకుని ప్రస్తుతం 938 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. వైఎస్ఆర్ హయాంలో మహిళలకు సంబంధించిన గర్భకోశ వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవి. గర్భసంచి తొలగింపు వంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసేవారు. ఆ మహానేత మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని తొలగించి రకరకాల నిబంధనలు ప్రవేశపెట్టి ఇబ్బందులకు గురిచేసిం ది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించుకుని ప్రాణాపాయం నుంచి బయటపడిన వేలాది పేద కుటుంబాలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తమ గుండెల్లో నిలుపుకుని ఆరాధిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ధనవంతులతో సమానంగా శస్త్ర చికిత్సలు చేయించుకునే వారికి ఇంటి నుంచి కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చేందుకు రానుపోను ఉచిత రవాణా,భోజన సౌకర్యంతో పాటు పైసా ఖర్చులేకుం డా వైద్యం,ఉచితంగా మందులు పొందే సదుపాయాన్ని డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి కల్పించారు. అందుకే ఆ మహానేతను పేదలు దైవంతో సమానంగా భావిస్తున్నారు.జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చగల సత్తా రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు.