వైద్య ప్రదాత వైఎస్
తిరుపతి, న్యూస్‌లైన్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధర్మాస్పత్రుల్లో పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేసేవారు. చిన్న పాటి జ్వరం వచ్చినా వైద్యం చేయించుకోవాలంటే పేదలు దిక్కులు చూసేవారు. ఇక ఖరీదైన జబ్బులు వస్తే అంతే. చంద్రబాబు హయాంలో ప్రాణాం తక వ్యాధులకు చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ప్రాణాలు కోల్పోయి న వారు ఎందరో ఉన్నారు. ప్రజాప్రస్థా నం ద్వారా పేదల కష్టాలను తెలుసుకున్నారు మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి.
ఖరీదైన జబ్బులకు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక ప్రాణాలు వదులుతున్న పేదల కష్టాలను తెలుసుకుని చలించిపోయా రు. ఆరోగ్యశ్రీ వంటి అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు వరం ప్రసాదించారు. 2007 జూలైలో చిత్తూరు జిల్లాలో ఈ పథకం అమలులోకి వచ్చింది. జిల్లాలోని 20 నెట్ వర్క్ (ప్రభుత్వ,ప్రైవేట్) ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ 80 వేల మందికి పైగా నిరు పేదలు ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె, కిడ్నీ, కార్డియో థొరాసిక్, న్యూరోసర్జరీ సంబంధిత వ్యాధులకు, క్యాన్స ర్ వంటి ప్రాణాంతక జబ్బులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు.
ఈ పథకం ద్వారా ఇప్ప టి వరకూ *250 కోట్లు విడుదలయ్యాయి. మహా నేత ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ పథకానికి తూట్లు పొడిచా రు. పేదలకు ఉచిత సేవలు అందుబాటులో ఉన్న 133 వ్యాధులను కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి తప్పించి ప్రభుత్వాస్పత్రులకు బదలాయించారు. దాంతో ఆ వ్యాధులకు నాణ్యమైన వైద్యసేవలు కరువయ్యాయి. ఆ 133 వ్యాధులతో కలుపుకుని ప్రస్తుతం 938 వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. వైఎస్‌ఆర్ హయాంలో మహిళలకు సంబంధించిన గర్భకోశ వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవి. గర్భసంచి తొలగింపు వంటి ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసేవారు.
ఆ మహానేత మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని తొలగించి రకరకాల నిబంధనలు ప్రవేశపెట్టి ఇబ్బందులకు గురిచేసిం ది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించుకుని ప్రాణాపాయం నుంచి బయటపడిన వేలాది పేద కుటుంబాలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తమ గుండెల్లో నిలుపుకుని ఆరాధిస్తున్నాయి.
ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ధనవంతులతో సమానంగా శస్త్ర చికిత్సలు చేయించుకునే వారికి ఇంటి నుంచి కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చేందుకు రానుపోను ఉచిత రవాణా,భోజన సౌకర్యంతో పాటు పైసా ఖర్చులేకుం డా వైద్యం,ఉచితంగా మందులు పొందే సదుపాయాన్ని డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి కల్పించారు. అందుకే ఆ మహానేతను పేదలు దైవంతో సమానంగా భావిస్తున్నారు.జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చగల సత్తా రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు.