ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని 100 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్లను కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు, యాడ్ సపోర్ట్ ఆప్షన్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసింది.
103 దేశాల యూజర్లకు ఇ-మెయిల్స్
నెట్‌ఫ్లిక్స్ మంగళవారం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ పాటు పాస్ వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్నట్లు 103 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూజర్లకు మెయిల్ పెట్టింది. ఆ ఇ-మెయిల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌ను ఒకరే వినియోగించుకోవాలని, ఇతరులకు షేర్ చేస్తే అమెరికా యూజర్లు అదనపు ఛార్జీల కింద 8 డాలర్లను (భారత కరెన్సీలో రూ.700డాలర్లు) విధిస్తున్నట్లు పేర్కొంది.
100 మిలియన్లకు పైగా
100 మిలియన్లకు పైగా కుటుంబాలు తమ లాగ్-ఇన్ వివరాలు ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేసినట్లు కంపెనీ అంచనా వేసింది. కాగా, మార్చి చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ చెల్లింపు కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 232.5 మిలియన్లు సబ్‌స్క్రిప్షన్ యూజర్లు ఉన్నారు. కొత్త పాలసీల ప్రకారం, ఒకే కుటుంబ సభ్యులు నెట్‌ఫ్లిక్స్ ఖాతాను వీక్షించవచ్చు. ప్రయాణంలో ఇతర డివైజ్‌లలో లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం!
Comments
Please login to add a commentAdd a comment