ప‍్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తీరు మార్చుకోవడం లేదు. ఫ్రీ పాస్‌వర్డ్ షేరింగ్ పేరుతో కొత్త దందా తెరతీయడంతో స్క్రైబర్లను కోల్పోయింది. భారీ నష్టాల్ని కొని తెచ్చిపెట్టుకుంది. అయినా ఆ సంస్థ తీరు మార్చుకోవడం లేదు. ఈ సారి సబ్ స్క్రైబర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు వేసేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది.
నెట్‌ఫ్లిక్స్ ఇటీవల 'యాడ్ ఎక్స్‌ట్రా మెంబర్' అనే కాన్సెప్ట్ పేరుతో కొత్త ఆప్షన్‌ను అందుబాబులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్‌ను ఇంటి కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు ఓపెన్ చేసి చూడాలంటే అందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ చీలి, కోస్టారికా, పేరు దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఆ ట్రయల్స్ కొనసాగుతుండగా.. మరో ఆప్షన్‌ను ఎనేబుల్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
అదనపు వసూళ్లు షురూ!
నెట్‌ఫ్లిక్స్ అర్జెంటీనా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల,హోండురాస్‌తో సహా పలు దేశాల్లో 'యాడ్ ఏ హోం' పేరుతో మరో ఫీచర్‌ను డెవలప్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉన్నా.. భవిష్యత్‌లో యాడ్ ఏ హోం పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఈఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్‌లు పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని సూచించింది.కాబట్టి, కంపెనీ మరికొన్నినెలల్లో భారత్‌లో సైతం యాడ్ ఏ హోం ఫీచర్ సాయంతో అదనంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యాడ్ ఏ హోంపై అదనపు ఛార్జీలు ఎంతంటే?
వచ్చే నెల నుంచి 'యాడ్ ఏ హోం' ఆప్షన్‌ను పైన పేర్కొన్న ప్రాంతాల‍్లో వినియోగంలోకి రానుంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతాల్లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఇంట్లో ఒకరు మాత్రమే వీక్షించే సౌలభ్యం ఉంది. అదే అకౌంట్‌ను మరో వ్యక్తి లాగిన్ అవ్వాలంటే అదనపు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అర్జెంటీనాలో అదనంగా 219 పెసోలు, ఇతర ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ప్రాంతాలలో 2.99 డాలర్లు (అంచనా) చెల్లిస్తే ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేయోచ్చు. ప్రస్తుతానికి, నెట్‌ఫ్లిక్స్ మనదేశంలో వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను వారి కుటుంబేతర వ్యక్తులు వీక్షిస్తే ఎంత వసూలు చేస్తుందనే విషయంపై నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు.
నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లలో
నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు అదనంగా ఒక ఇంట్లో వీక్షించే అవకాశం ఉంది. స్టాండర్డ్, ప్రీమియం వినియోగదారులు వరుసగా రెండు, మూడు ఇళ్లకు చెందిన సభ్యులు వీక్షించొచ్చు. ఇలా ప్లాన్‌ల వారీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవాలంటే అదనపు చెల్లింపులు తప్పని సరి.
నెట్‌ఫ్లిక్స్‌ను ఆదరిస్తున్నారు.. తప్పులేదు
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ను వీక్షకులు ఆదరిస్తున్నారు.ఇతర కుటుంబ సభ్యులకు,స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారు. యూజర్లు చూడడం వేరు. వారి అకౌంట్‌లను ఇతరులకు షేర్ చేయడం వేరు. అకౌంట్‌లను షేర్ చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులతో దీర్ఘకాలిక లక్ష్యాల్ని చేరుకోలేమని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగీ లాంగ్ చెప్పారు.
చదవండి: తగ్గేదేలే: నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్!
Comments
Please login to add a commentAdd a comment