ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చేజారిపోతున్న సబ్‌స్కైబర్ల సంఖ్యను పెంచేలా 30 కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. ఈజిప్ట్, యెమెన్,జోర్డాన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా,స్లోవేనియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, వెనుజెలా, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజును భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే తగ్గించిన దేశాల్లో భారత్ లేకపోవడం గమనార్హం.
ఓటీటీ దిగ్గజం గత కొంత కాలంగా పాస్‌వర్డ్ షేరింగ్‌పై సర్ ఛార్జీలు వసూలు చేస్తుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సబ్‌స్క్రిప్షన్ చేసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో యూజర్లను తిరిగి రాబట్టుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా , మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ , ఏసియా పసిఫిక్ లాంటి రీజియన్స్‌లో 20 నుంచి 60 శాతం వరకు ఛార్జీలను తగ్గించింది.
ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. ప్రతి నెలా బేసిక్ ప్లాన్‌ను కొత్తగా వచ్చే యూజర్లకు, ఇప్పటికే వినియోగిస్తున్న యూజర్లు 28 మలేసియన్ రింగిట్స్‌కే అదిస్తున్నట్లు ట్వీట్ చేయగా.. ఇండియన్ కరెన్సీలో రూ.653 చెల్లించాల్సి ఉంది. కాగా, గతంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ బేసిక్ ధర 35 మలేసియన్ రింగిట్స్ ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment