ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. త్వరలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఫలితాల్లో స్ట్రీమింగ్ దిగ్గజం ఆదాయ పరంగా భారీ నష్టాలను చవిచూసింది. కానీ సబ్‌స్క్రిప్షన్ సంఖ్య భారీగా పెరిగింది. అందుకు పాస్‌వర్డ్ షేరింగ్ కారణమని పేర్కొంది. ఇప్పుడు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా పాస్‌వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు ఛార్జీల నిబంధన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాన్నట్లు స్పష్టం చేసింది.
అకౌంట్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మాట్లాడుతూ.. “అకౌంట్ షేరింగ్‌ను మానిటైజ్ చేసేందుకు ఆలోచనాత్మకమైన విధానాన్ని ప్రారంభించాము. 2023 ప్రారంభంలో దీన్ని మరింత విస్తృతంగా ప్రారంభిస్తాం. వినియోగదారుల అభిప్రాయాన్ని విన్న తర్వాత నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో లేని చైనా,రష్యా మినాహాయించి మిగిలిన దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌పై అదనపు రుసుమును విధిస్తాం’’ అని తెలిపింది. వినియోగదారులు పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఎంత ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై నెట్‌ఫ్లిక్స్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ పలు నివేదికల ప్రకారం.. 3 డాలర్ల నుంచి 4 డాలర్ల మధ్యలో ఉండే అవకాశం ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment