Get Sachet Subscription Just Rs 10 Watch Netflix Movies - Sakshi
Sakshi News home page

Netflix: యూజర్లకు బంపరాఫర్‌..10రూపాయలకే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌..షరతులు వర్తిస్తాయ్‌

Published Mon, Jul 25 2022 6:12 PM | Last Updated on Mon, Jul 25 2022 7:58 PM

Get Sachet Subscription Just Rs 10 Watch Netflix Movies - Sakshi

మీరు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్‌ను వినియోగిస్తున్నారా? ఇందుకోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. రూరల్‌ ఏరియాల్లో ఉండే  యూజర్లు కేవలం 10 రూపాయిలు చెల్లించి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీని వీక్షించే సౌలభ్యం కలగనుంది.  

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ 'పే నియర్‌ బై' సాచెట్ సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో ప్రతి ఒక్క యూజర్లకు రూ.10కే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్‌ మాట్లాడుతూ..పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో "చాటింగ్, కంటెంట్,సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ డేటా ఒకేలా వినియోగిస్తున్నారు.రూరల్‌,సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో పోలిస్తే షాపింగ్, ఎడ్యుకేషన్‌, జాబ్‌ నోటిఫికేషన్‌, మెడిసిన్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వినియోగంలో పట్టణ జనాభా ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. 

అందుకే రూరల్‌ ఏరియాల్ని టార్గెట్‌ చేస్తూ భారత్‌ అనే పేరుతో క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా రూరల్‌ ఏరియా యూజర్లకు రూ.10కే ఒక మూవీని వీక్షించేలా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొని రానున్నాం. ఇందుకోసం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో సంప్రదింపులు జరిపామని, త్వరలోనే తక్కువకే సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement