ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్, సినిమాల వ్యూస్ విషయంలో సరికొత్త రికార్డ్‌లను నమోదు చేస్తోంది. 2023లో ఒక్క భారత్ నుంచి నెట్‌ఫ్లిక్స్ 1 బిలియన్ వ్యూస్ వచ్చాయని, వెబ్‌సిరీస్, మూవీస్ వల్లే ఈ ఘనతను సాధించినట్లు ఓ నివేదికను విడుదల చేసింది.
వాట్ వి వాచ్‌డ్ : నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్ అనే పేరుతో జూలై నుండి డిసెంబర్ 2023 కాలానికి స్ట్రీమింగ్ సర్వీస్ వ్యూస్ డేటాను బహిర్ఘతం చేసింది. ఆ రిపోర్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సబ్‌స్క్రైబర్‌లు 2023 ద్వితీయార్థంలో నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు 90 బిలియన్ గంటల కంటెంట్‌ను వీక్షించారు.
తొలి స్థానంలో జానే జాన్
భారత్ నుంచి వ్యూస్ విషయంలో సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన జానే జాన్ 20.2 మిలియన్ల వీక్షణలతో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన తొలి చిత్రంగా పేరు సంపాదించింది. ఆ తర్వాత ‘జవాన్’ 16.2 మిలియన్ల వీక్షణలతో, ‘ఖుఫియా’ 12.1 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఓఎంజీ 2 (11.5 మిలియన్ వ్యూస్), లస్ట్ స్టోరీస్ 2 (9.2 మిలియన్ వ్యూస్), డ్రీమ్ గర్ల్ 2 (8.2 మిలియన్ వ్యూస్), కర్రీ అండ్ సైనైడ్ (8.2 మిలియన్ వ్యూస్) వచ్చాయి.
భోపాల్ గ్యాస్ లీక్ నేపథ్యంతో
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 1984 భోపాల్ గ్యాస్ లీక్ నేపథ్యంతో విడుదలైన ‘ది రైల్వే మెన్’ తొలిస్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కి 10.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత కోహ్రాకు (6.4 మిలియన్ వ్యూస్), గన్ అండ్ గులాబ్స్ (6.4 మిలియన్ వ్యూస్), కాలా పానీకి (5.8 మిలియన్ వ్యూస్) వచ్చాయి.
కొరియన్ సిరీస్‌లు సైతం
ప్రపంచ వ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ షోలు, వెబ్ సిరీస్ సైతం నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ వీక్షించారు. మొత్తం వ్యూస్‌లో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉన్నారు. నివేదిక ప్రకారం ఇందులో కొరియన్ (9 శాతం), స్పానిష్ (7 శాతం), జపనీస్ (5 శాతం) ఉన్నాయి.
జర్మనీ నుండి డియర్ చైల్డ్ (53 మిలియన్ వ్యూస్), పోలాండ్ నుండి ఫర్గాటెన్ లవ్ (43 మిలియన్ వీక్షణలు), మెక్సికో నుండి ఫ్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (21 మిలియన్ వ్యూస్), కొరియా నుంచి మాస్క్ గర్ల్ (21 మిలియన్ వ్యూస్) వచ్చినట్లు నివేదిక హైలెట్ చేసింది. జపాన్ నుండి యు యు హకుషో (19 మిలియన్ వ్యూస్), స్పెయిన్ నుండి బెర్లిన్ (11 మిలియన్ వ్యూస్) వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సినిమా లీవ్ ది వరల్డ్ బిహైండ్. ఈ సినిమాకు 121 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత ఆడమ్ శాండ్లర్ యానిమేషన్ చిత్రం లియోకి (96 మిలియన్ వ్యూస్) వచ్చాయని పేర్కొంది. వెబ్ సిరీస్‌లో యాక్షన్ సిరీస్ వన్ పీస్‌కి 72 మిలియన్ వ్యూస్‌తో ఆకట్టుకుంది.
అభిమానుల ఇష్టమైన ఒరిజినల్ వెడ్నెస్డే, రెడ్ నోటీస్,స్క్విడ్ గేమ్ నెట్‌ఫ్లిక్స్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదించిందని నెట్‌ఫ్లిక్స్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment