(2022 నాటికి) ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ సేవలు.
200 మిలియన్ల మంది అమెజాన్ ప్రైమ్ మెంబర్లు.
కేవలం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అమెజాన్‌కు వచ్చే ఆదాయం 35.22 బిలియన్ డాలర్లు
ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్ల నుంచి జరిగే వ్యాపారం విలువ12.9 బిలియన్ డాలర్లు.
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు ఇవేం సరిపోలేదట్లుంది. ఓటీటీ విభాగంలో అమెజాన్ ప్రైమ్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్త ఏడాది నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వీడియోలు చూసే సమయంలో యాడ్స్‌ను ప్రసారం చేయనున్నారు. తద్వారా మరింత ఆదాయాన్ని గడించనున్నారు.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ యూజర్లకు షాకిచ్చింది. ఇతర ఓటీటీ ప్లాట్‌పామ్ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది జనవరి 29 నుంచి అమెజాన్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఇకపై యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే ప్రకటనలపై అమెజాన్ యూజర్లకు మెయిల్‌కు సమాచారం అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
త్వరలో ప్రవేశపెట్టనున్న యాడ్స్ ఆప్షన్ వద్దనుకునే యూజర్లు నెలకు 3 డాలర్లు అంటే నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్ల ఏడాదికి రూ.11,575 వసూలు చేస్తుంది. తాజాగా యాడ్స్ వద్దనుకునే యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది.
ఓటీటీల్లో సరికొత్త సాంప్రదాయం
అమెరికాలో అమెజాన్ ప్రైమ్, మ్యాక్స్, పారామౌంట్ ప్లస్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ ఇలా ఐదు ఓటీటీ దిగ్గజ సంస‍్థలున్నాయి. వాటిల్లో మ్యాక్స్, పారామౌంట్ ప్లస్‌లు 2021లోనే వీడియోల్ని వీక్షించే సమయంలో యాడ్స్‌ను ప్రసారం చేసేలా కొత్త సాంప్రదాయానికి తెరతీశాయి. ఆ తర్వాత 2022లో నెట్‌ఫ్లిక్స్ సైతం యాడ్స్‌ను డిస్‌ప్లే చేసింది. ఇప్పుడు అమెజాన్ సైతం వీడియోలపై ఆయా కంపెనీల ప్రకటనలు ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో యాడ్స్ ప్రసారం చేస్తున్నామని, అమెరికా, యూకే, జర్మనీ, కెనడాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు చెందిన యూజర్లకు మెయిల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment