ads services
-
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ షాక్!
(2022 నాటికి) ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ సేవలు. 200 మిలియన్ల మంది అమెజాన్ ప్రైమ్ మెంబర్లు. కేవలం నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అమెజాన్‌కు వచ్చే ఆదాయం 35.22 బిలియన్ డాలర్లు ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో అమెజాన్ ప్రైమ్ మెంబర్ల నుంచి జరిగే వ్యాపారం విలువ12.9 బిలియన్ డాలర్లు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు ఇవేం సరిపోలేదట్లుంది. ఓటీటీ విభాగంలో అమెజాన్ ప్రైమ్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్త ఏడాది నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వీడియోలు చూసే సమయంలో యాడ్స్‌ను ప్రసారం చేయనున్నారు. తద్వారా మరింత ఆదాయాన్ని గడించనున్నారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ యూజర్లకు షాకిచ్చింది. ఇతర ఓటీటీ ప్లాట్పామ్ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది జనవరి 29 నుంచి అమెజాన్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఇకపై యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే ప్రకటనలపై అమెజాన్ యూజర్లకు మెయిల్‌కు సమాచారం అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న యాడ్స్ ఆప్షన్ వద్దనుకునే యూజర్లు నెలకు 3 డాలర్లు అంటే నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్ల ఏడాదికి రూ.11,575 వసూలు చేస్తుంది. తాజాగా యాడ్స్ వద్దనుకునే యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. ఓటీటీల్లో సరికొత్త సాంప్రదాయం అమెరికాలో అమెజాన్ ప్రైమ్, మ్యాక్స్, పారామౌంట్ ప్లస్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ ఇలా ఐదు ఓటీటీ దిగ్గజ సంస్థలున్నాయి. వాటిల్లో మ్యాక్స్, పారామౌంట్ ప్లస్‌లు 2021లోనే వీడియోల్ని వీక్షించే సమయంలో యాడ్స్‌ను ప్రసారం చేసేలా కొత్త సాంప్రదాయానికి తెరతీశాయి. ఆ తర్వాత 2022లో నెట్‌ఫ్లిక్స్ సైతం యాడ్స్‌ను డిస్ప్లే చేసింది. ఇప్పుడు అమెజాన్ సైతం వీడియోలపై ఆయా కంపెనీల ప్రకటనలు ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో యాడ్స్ ప్రసారం చేస్తున్నామని, అమెరికా, యూకే, జర్మనీ, కెనడాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు చెందిన యూజర్లకు మెయిల్ చేసింది. -
యాపిల్ నుంచి బిగ్ అప్డేట్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారీ కీలక నిర్ణయం తీసుకుంది. లాభాల్ని గడించేందుకు ప్రయత్నిస్తున్న యాపిల్ తన ఐఫోన్ ఇంటర్ ఫేస్‌పై అనవరసరమైన బ్లోట్ వేటర్ అనే థర్డ్ పార్టీ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పాడ్ కాస్ట్, మ్యాప్స్,న్యూస్,మ్యూజిక్, మెజేస్‌లు యాపిల్ యాప్స్‌తో రానున్నాయి. అవసరం అయితే యూజర్లు వాటిని డిలీట్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు రెవెన్యూ కోసం సీఈవో టిమ్ కుక్ కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం.. ఐఫోన్లపై కనిపించే యాప్స్‌లో యాపిల్ యాడ్స్‌ను ప్రసారం చేయనుంది. ఇప్పటికే యాపిల్ యాపిల్ స్టోర్, ఇన్ హౌస్ న్యూస్, స్టాక్స్ యాప్‌పై యాడ్స్ ప్లే చేస్తుంది. థర్డ్ పార్టీ డెవలపర్ల సాయంతో ఆ సాఫ్ట్వేర్లను ప్రమోట్ చేస్తున్నట్లు హైలెట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ఐఫోన్, మాక్స్, ఐపాడ్, యాపిల్ మ్యాప్స్,పాడ్ క్యాస్ట్లపై యాడ్స్‌ను ప్రమోట్ చేయడం, అదే సమయంలో ఎంత వీలైతే అంత ఎక్కువగా యాడ్స్ వ్యాల్యూమ్ను పెంచనున్నట్లు బ్లూమ్ బర్గ్ అనలిస్ట్ మార్గ్ గుర్మాన్ వెల్లడించారు. అయితే ఇతర యాండ్రాయిడ్ యాప్స్‌లాగా ఐఫోన్ స్పామీ నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వదని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ యాడ్-సపోర్టెడ్ సబ్స్క్రిప్షన్ తరహాలో యాపిల్ టీవీ ప్లస్ టైర్లో అదే తరహా యాడ్స్ సపోర్టెడ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌ను అమలు చేయనుంది. -
సెకండ్ హ్యాండ్ వాహనాలు ఖరీదు చేస్తామని..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్మీ అధికారుల మాదిరిగా సంప్రదింపులు జరుపుతూ, వివిధ యాడ్స్ యాప్స్‌లో పోస్టు చేసిన సెకండ్ హ్యాండ్ వాహనాలు/వస్తువుల ఖరీదు చేస్తామంటూ టోకరా వేసే సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చారు. వీరు కొత్తగా ఆర్మీ మిషనరీ ప్రొసీజర్ పేరుతో టోకరా వేస్తున్నారు. ఖరీదు చేసిన వస్తువుకు రేటు చెల్లించకుండా ఆ మొత్తం తమ ఖాతాల్లో వేయించుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా కేసుల సంఖ్య పెరిగిందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ఈ తరహాలో రూ.50 వేలు మోసపోయిన ఓ వైద్య విద్యార్థి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదైంది. సదరు ఎంబీబీఎస్ స్టూడెంట్ తన వద్ద ఉన్న ఎక్సర్సైజ్ చైర్ విక్రయిస్తానంటూ ఓఎల్ఎక్స్లో పోస్టు చేయగా, ఉత్తరాదికి చెందిన ఆర్మీ అధికారిగా అతడికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. బేరసారాల అనంతరం రూ.15 వేలకు దానిని కొనుగోలు చేస్తానని చెప్పాడు. అయితే ఆర్మీ మిషనరీ ప్రొసీజర్ ప్రకారం నేరుగా డబ్బు చెల్లించడం సాధ్యం కాదని అన్నాడు. అందుకు సమానమైన మొత్తాన్ని గూగుల్ పే ద్వారా తమకు పంపిస్తే... దానికి రెట్టింపు తమ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందని ఎర వేశాడు. అదెలా సాధ్యమంటూ వైద్య విద్యార్థి ప్రశ్నించగా.. అనుమానం ఉంటే తొలుత రూ.5 పంపి పరీక్షించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ విద్యార్థి ఆర్మీ అధికారి చెప్పిన ఫోన్ నంబర్‌కు రూ.5 పంపాడు. అప్పటికే రూ.10కి క్యూఆర్ కోడ్ సిద్ధం చేసి ఉంచిన సైబర్ నేరగాడు వెంటనే దాన్ని తిప్పి పంపాడు. అలా విద్యార్థి ఖాతాలోకి రూ.10 వచ్చి పడ్డాయి. దీంతో అతడి మాటలు నిజమని నమ్మిన వైద్య విద్యార్థి రూ.15 వేలు గూగుల్ పే ద్వారా సైబర్ నేరగాడి ఫోన్‌కు పంపాడు. కొంత సేపు వేచి చూసినా డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితుడు అతడికి ఫోన్ చేశాడు. అయితే చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని, మరో రూ.10 వేలు పంపితే మొత్తం రూ.40 వేలు ఖాతాలోకి వచ్చేస్తాయని నేరగాడు నమ్మబలికాడు. ఇలా ఇతడి నుంచి మొత్తం రూ.50 వేలు కాజేసిన సైబర్ నేరగాడు ఆపై స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఉదంతంలో ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.57 వేలు కాజేశారు. ఇతడు కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా విదేశాలకు చెందిన దావ్నే జాన్సన్ అనే సంస్థలో వాలంటీర్‌గా చేరాడు. దీనికి సంబంధించిన ఆన్లైన్ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. తమ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఇస్తామంటూ అవతలి వ్యక్తులు చెబుతూ వచ్చారు. ఓ రోజు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సంస్థ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. సంస్థ తరఫున రూ.14 వేల విలువైన గిఫ్ట్ పంపిస్తున్నట్లు ఎర వేశారు. ఆపై కొరియర్ సంస్థ పేరుతో బాధితుడికి కాల్స్ వచ్చాయి. ఆ గిఫ్ట్‌కు సంబంధించిన తొలుత కొంత ట్యాక్స్ కట్టాలని, ఆపై మొత్తం రిఫండ్ వస్తుందని చెప్పారు. ఇలా బాధితుడి నుంచి రూ.57 వేలు తమ ఖాతాల్లో వేయించుకున్న సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఫేస్బుక్ రహస్యాలు లీక్..!
న్యూయార్క్: సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్ ఇక నుంచి యాడ్స్ (ప్రకటనలు)ను ప్రారంభించనుంది. ఫేస్బుక్ కు చెందిన చాటింగ్ యాప్ మెసెంజర్లో యాడ్స్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇందుకు మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ కు చెందిన కొన్ని కీలక డాక్యుమెంట్లు తాజాగా మార్కెట్లోకి లీకయ్యాయి. దీంతో కంపెనీ రహస్యాలు వెల్లడయ్యాయని ఫేస్ బుక్ ఆందోళన చెందుతోంది. కీలకపత్రాలు ఎలా లీక్ అయ్యాయని ఆరాతీయడం మొదలెట్టింది. అలా లీకైన డాక్యుమెంట్ల ద్వారానే.. ఫేస్బుక్ యాడ్స్ కు ఓకే చెప్పనుందున్న వార్త ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తోంది. కీలక పత్రాల్లో ఫేస్బుక్ సంస్థ యాడ్స్ కోసం 'ఎఫ్బీ.కామ్/ఎమ్ఎస్జీ/'ని రూపొందించినట్లు వెల్లడైంది. ప్రస్తుతానికి ఈ లింక్‌పై ఏ పేజీ కనిపించడం లేదు. 2016 రెండో త్రైమాసికంలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వదంతులపై స్పందించడానికి ఫేస్బుక్ సిద్ధంగా లేదని ఓ అధికారి తెలిపారు. మెసెంజర్‌తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూనే 80 కోట్ల తమ యూజర్లకు కొన్ని కొత్త సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నట్లు ఫేస్బుక్ సైట్లో పేర్కొన్నారు. యాడ్స్ కోసం తమను సంప్రదించేవారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తారని, సాధారణ యూజర్స్‌కు వీటి వల్ల ఏమాత్రం ఇబ్బందులు తలెత్తవని డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.