
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. 2 బిలియన్ డాలర్ల మానవతా సహాయాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాలని కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టి పారేసింది. మానవతా సహాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన కింద కోర్టు నిర్ణయాన్ని ఏకీభవించింది.
ఇటీవల అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ (USAID) సేవలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు వాషింగ్టన్‌కు చెందిన యుఎస్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన యుఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి అమిర్ అలీ మానవతా సాయం నిలిపి వేయడాన్ని తప్పుబట్టారు.
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (యూఎస్ఏఐడీ), రాష్ట్ర విభాగం అనుమతించిన గ్రాంట్లు, ఒప్పందాలపై పని చేసిన పాత చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణలో మానవతా సహాయంపై కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏదైనా ఉంటే ఆ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
ట్రంప్ నిర్ణయంతో ప్రతికూల ప్రభావం
ట్రంప్ ప్రభుత్వం విదేశాలకు మానవతసహాయం అందించడాన్ని 90 రోజుల పాటు నిలిపిలించింది. స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించే కార్యకలాపాల్ని స్తంభింపజేసింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మలేరియా, ఎయిడ్, అభివృద్ధి సహాయం, శరణార్థుల సహాయం వంటి విభాగాలపై ప్రతీకూలం ప్రభావం చూపింది.
మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు సైతం తప్పుబడుతున్నారు. మానవతా సహాయాన్ని నిలిపివేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షల మందికి శాశ్వతమైన నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా రోగాలు, సంక్షోభాలు నివారించడంలో అమెరికా ఇచ్చే నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment