వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే మేం కూడా భారత్ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తామని స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ కామర్స్ సెక్రటరీగా హోవార్డ్ లుట్నిక్‌ను ఎంపిక చేయడంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా-చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్ సంబంధిత అంశాలపై చర్చించారు.
ట్రంప్ మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తున్నాయి. కానీ మేం ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్ విధించడం లేదు. ఇకపై అలా కుదరదు. వాళ్లు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తే మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తాం. అధిక మొత్తంలో పన్నులు విధించే జాబితాలో బ్రెజిల్, భారత్‌లు ఉన్నాయి.
భారత్,బ్రెజిల్ తమ ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తే, ప్రతిఫలంగా అమెరికా కూడా అదే చేస్తుంది. అమెరికాకు చెందిన ఏదైనా ఓ ఉత్పత్తిపై రూ.100 నుంచి రూ.200 వరకు భారత్,బ్రెజిల్‌లు వసూలు చేస్తున్నాయి. మేం కూడా అదే స్థాయిలో వసూలు చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు.
ట్రంప్‌కు కెనడా హెచ్చరికలు
ఇప్పటికే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వస్తువులపై టారిఫ్ విధిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తమ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై ట్రంప్ టారీఫ్‌లు విధిస్తే.. చివరకు వారు కొనే ప్రతి వస్తువు ధరను పెంచుతుందని అమెరికా ప్రజలే అర్థం చేసుకొంటున్నారని కెనడా ప్రధాని ట్రూడో హెచ్చరించారు. హాలీఫాక్స్ ఛాంబరాఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే.. తాము ప్రతిచర్యలకు దిగుతామని ట్రూడో హెచ్చరించారు. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే.. కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాళ్లతో కూడిన పనిగా ఆయన అభివర్ణించారు. 2016లో స్పష్టమైన ఆలోచనలతో వారు చర్చలకొచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment