
న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా చేసిన సాయం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ వివాదంపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. భారత్‌కు రూ. 186 కోట్ల ఓటర్ టర్నవుట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్‌లో ఏదో ఒక పార్టీకి ఎన్నికల్లో సాయం చేయడానికే బైడెన్ ఈ సాయం చేసి ఉంటారని ట్రంప్ వ్యాఖ్యానించడం కూడా సంచలనమైంది.అయితే ఈ వ్యవహారంలో తాజాగా వీణారెడ్డి తెరపైకి వచ్చింది. వీణారెడ్డి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఎయిడ్)ఇండియాకు 2021-24 మధ్య డైరెక్టర్‌గా వ్యవహరించారు.
భారత్‌కు ఓటర్ టర్నవుట్ విషయంలో సాయం చేయడంలో వీణారెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈమె 2021లో భారత్‌కు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారు. వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ తాజాగా ట్వీట్ చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.
So #DOGE has discovered that #USAID allocated $21million for “voter turnout” in India ,a euphemism for paying voters to cast their votes to effect regime change. #VeenaReddy was sent to India in 2021 ( ominous?) as head of USAIDs Indian mission . Post #loksabha elections 2024 (…
— Mahesh Jethmalani (@JethmalaniM) February 16, 2025
వీణారెడ్డి యూఎస్‌ఎయిడ్ డైరెక్టర్‌గా ఉన్నపుడు అమెరికా నుంచి భారత్‌కు అందే సాయం గణనీయంగా పెరిగినట్లు సమాచారం.అమెరికా సాయంతో భారత్‌లో ఓటర్ టర్నవుట్ పెరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకి అయితే మేలు చేయదని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఇప్పటికే ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment