USAID
-
హైదరాబాద్‌లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) ఇండియా మిషన్ డైరెక్టర్ 'వీణా రెడ్డి' హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ క్వాల్కమ్ ఇండియాకు సంబంధించిన ఓఆర్ఏఎన్ రీసెర్చ్ ల్యాబ్‌లను సందర్శించారు. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ముందుకు సాగుతుందో గమనించారు.యూఎస్ఏఐడీ 5జీ అండ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌లతో సహా కొత్త వైర్లెస్ టెక్నాలజీలను పరీక్షించడంలో భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలకు కొన్ని సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టెలికమ్యూనికేషన్ హార్డ్‌వేర్ అమెరికన్ సరఫరాదారు అయిన 'క్వాల్కమ్ టెక్నాలజీ'.క్వాల్కమ్ టెక్నాలజీ సహకారంతో.. భారతీయ టెలికామ్ రంగం కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది, తద్వారా అనేక గ్లోబల్ అప్లికేషన్ల పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా వీణా రెడ్డి మాట్లాడుతూ.. జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా చెప్పినట్లుగానే యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలో విశ్వసనీయ టెలికమ్యూనికేషన్స్ వృద్ధి చెందుతాయని అన్నారు.డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంచడమే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు మెరుగుపరచడానికి మేము ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని వీణా రెడ్డి పేర్కొన్నారు. -
మహిళల సాధికారికత కోసం రిలయన్స్ ఫౌండేషన్ భారీగా నిదుల కేటాయింపు
ముంబై: 'విమెన్ కనెక్ట్ చాలెంజ్" ఇండియా కింద భారతదేశ వ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు(మంజూరుకర్తలు)గా ఎంపిక చేశారు. రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్(USAID) కలసి విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియాను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం కింద కేటాయించిన రూ.11 కోట్ల(1. 5 మిలియన్ డాలర్లకు పైబడిన మొత్తం)ను లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు ఉపయోగించనున్నారు. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్ల మేరకు($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది.(చదవండి: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!) లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు వివిధ వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇది సాంకేతికత ద్వారా మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేయనుంది. అనుదీప్ ఫౌండేషన్, టీర్ ఫూట్ కాలేజ్ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ యూత్ అండ్ అండ్ సోషల్ డెవలప్ మెంట్, ప్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, నాంది ఫౌండేషన్, ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్ మెంట్ యాక్షన్, సొసైటీ ఫర్ డెవలప్ మెంట్ ఆబ్బర్నేటివ్స్, సాలిడారిడాడ్ రీజనల్ ఎక్స్ పర్టయిజ్ సెంటర్, టీఎన్ఎస్ ఇండియా ఫౌండేషన్, జెడ్ఎంక్యూ డెవలప్ మెంట్ ఈ సంస్థల్లో ఉన్నాయి. మహిళా రైతులు, ఆంత్రప్రె న్యూర్లు, స్వయం సహాయక బృందాల సభ్యుల సమస్యలను, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించేందుకు, లింగ ఆధారిత డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు ఈ పరిష్కారాలు తోడ్పడుతాయి.(చదవండి: ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!) ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్, వ్యవస్థాపక చైర్ పర్సన్ శ్రీమతి నీతా ఎం అంబానీ మాట్లాడుతూ.. “ప్రతీ జీవనశైలిలో మహిళలను సంసిద్దులను చేసి, వారికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం. మేం జియోను ప్రారంభించినప్పుడు, సమాన అవకాశాలు కల్పించే విప్లవం గురించి మేం కల కన్నాం. జియో ద్వారా మేం మన దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకే ఇంటర్నెట్ అందిస్తున్నాం. భారతదేశంలో లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు యూఎస్ ఎయిడ్ సంస్థతో కలసి రిలయన్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. అసమానతలను పరిష్కరించేందుకు, వాటిని తొలగించేందుకు సాంకేతికత అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా విజేతలుగా నిలిచిన పది సంస్థలకు నా అభినందనలు" అని అన్నారు. -
Veena Reddy: కోవిడ్ సాయం.. ఐదు కోట్ల మందికి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేసిన సాయం భారత్‌లో సుమారు ఐదుకోట్ల మందికి చేరిందని యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో భారత్‌కు సాయం అందించిన కొద్దిసంస్థల్లో యూఎస్ ఎయిడ్ కూడా ఒకటి అని చెప్పారు. కరోనా తొలినాళ్ల నుంచి ఇప్పటివరకూ దాదాపు 22 కోట్ల డాలర్ల విలువ (సుమారు రూ.1,600 కోట్లు) చేసే సాయం అందివ్వగలిగామన్నారు. రాయలసీమలో పుట్టి మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లిన వీణారెడ్డి న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం యూఎస్ ఎయిడ్ భారత విభాగానికి మిషన్ డైరెక్టర్ అయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవి చేపట్టిన తరువాత తొలిసారి భారత్‌కు విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. (చదవండి: Veena Reddy: ఏపీ అభివృద్ధి సంతృప్తినిస్తోంది) ప్ర: యూఎస్ ఎయిడ్ భారత్ మిషన్ డైరెక్టర్‌గా నియమితులైన మీకు శుభాకాంక్షలు. మీరు పుట్టిన భారత్‌లో దాని ప్రణాళికలెలా ఉండబోతున్నాయి? జ: యూఎస్ ఎయిడ్ భారత్‌తో పాటు దాదాపు వంద దేశాల్లో పనిచేస్తోంది. యూఎస్ ఎయిడ్ ఏర్పాటై 60 ఏళ్లు అవుతుంటే.. భారత్‌కు అమెరికా సాయం అన్నది పదేళ్ల ముందే మొదలైంది. ఆరోగ్యం, కాలుష్య రహిత విద్యుదుత్పత్తి, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, అటవీ పరిరక్షణ వంటి అంశాల్లో యూఎస్ ఎయిడ్ భారత్‌లో పలు కార్యక్రమాలను చేపట్టింది. సమస్యల పరిష్కారానికి, సుస్థిరాభివృద్ధికి తగిన తోడ్పాటు అందిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సైతం స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి స్థానిక అభివృద్ధి విషయంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ప్ర: తెలంగాణ, ఏపీల్లో ఏ రకమైనప్రాజెక్టులు చేపట్టింది? జ: చాలా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ అటవీ శాఖ యూఎస్ ఎయిడ్ అభివృద్ధి చేసిన కొన్ని సాంకేతిక మెళకువలు, మొబైల్ అప్లికేషన్లను అటవీ నిర్వహణ కోసం ఉపయోగిస్తోంది. వీటి వాడకం కారణంగా అటవీ నిర్వహణ ప్రణాళికలు తయారు చేయడం సులువు కావడమే కాకుండా స్థానికుల జీవనోపాధి అవకాశాలూ పెరిగాయి. ‘వన్’ పేరుతో యూఎస్ ఎయిడ్ తయారు చేసిన మొబైల్ అప్లికేషన్‌ను మొదట మెదక్ అటవీ విభాగంలో ఉపయోగించారు. ఇప్పుడు తెలంగాణలోని దాదాపు 31 అటవీ విభాగాలకు విస్తరించారు కూడా. ఇది మచ్చుకు ఒక్క కార్యక్రమం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. గురువారం (సెప్టెంబర్ 23వ తేదీ) వైజాగ్‌లో ‘‘వాటర్ ఫ్రమ్ ఎయిర్’’ కేంద్రాన్ని సందర్శించనున్నాం. గాల్లోని తేమను నీరుగా మార్చే ఈ కేందాన్ని అవసరమైన చోటికి తరలించ వచ్చు కూడా. ఇలాంటి కొత్త టెక్నాలజీ కారణంగా నగర ప్రాంతాల్లోని పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ప్ర: కోవిడ్‌కు సంబంధించి భారత్‌కు ఎలాంటి సాయం అందింది? జ: కరోనా మొదలైనప్పటి నుంచి అనేక రకాలుగా సాయం అందించాం. పీపీఈ కిట్లు మొదలుకొని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వరకూ దాదాపు ఏడు విమానాల్లో తరలించాం. కరోనా రెండో దశను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో యూఎస్ ఎయిడ్, అమెరికా ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు తమవంతు సాయం అందించాయి. ఒక అంచనా ప్రకారం కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు యూఎస్ ఎయిడ్ అందించిన వేర్వేరు రకాల సాయం వల్ల ఐదు కోట్ల మంది భారతీయులు లబ్ధి పొందారు. ఇక కోవిడ్ కారణంగా జీవనోపాధులు నష్టపోయిన వారికి, చిరు వ్యాపారులకు, మహిళలకూ సాయం అందించాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కోవిడ్ తొలి, రెండో దశల్లో యూఎస్ ఎయిడ్ మంగళగిరి (ఏపీ), బీబీనగర్ (తెలంగాణ)లోని ఎయిమ్స్ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లను సరఫరా చేసింది. దాంతోపాటు ఆరోగ్య సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇప్పించాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో విజయవాడలో ఏర్పాటు కానున్న సీసీఎంబీ శాటిలైట్ సెంటర్‌కు యూఎస్ ఎయిడ్ సాంకేతిక పరిజ్ఞాన పరమైన సాయం అందిస్తోంది. ప్ర: ‘వాతావరణ మార్పులు’ అంశంలో ఎలాంటి పాత్ర పోషించనుంది? జ: వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు తరచూ చవిచూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువ గా గురయ్యే వర్గాలకు యూఎస్ ఎయిడ్ సాయం అందించే ప్రయత్నం చేస్తోంది. కాలుష్య రహిత విద్యుదుత్పత్తి రంగానికి ప్రోత్సాహం అందించడం కూడా ఇందులో ఒకటి. భారత ప్రభుత్వంతో కలసి సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు మరిన్ని ఏర్పాటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. తద్వారా కాలుష్య కారకమైన బొగ్గుపై ఆధారపడటం కొంతైనా తగ్గుతుంది. వాతవరణంలోకి చేరిన కార్బన్ డయాక్సైడ్ను శోషించుకునేందుకు అవసరమైన అటవీ సంపద పెరుగుదలకూ సహకరిస్తున్నాం. (చదవండి: అగ్రరాజ్యపు కీలక పదవిలో వీణారెడ్డి) రాయలసీమలో పుట్టి .. యూఎస్‌లో ఎదిగారు వీణారెడ్డి తల్లి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారైతే.. తండ్రి కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన వారు. చికాగో యూనివర్సిటీలో బీఏ, ఎంఏ విద్యనభ్యసించిన వీణారెడ్డి కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టర్ ఆఫ్ జ్యూరిస్ ప్రూడెన్స్ పట్టా పొందారు. న్యాయవాదిగా రాణించిన ఈమె ఆ తరువాతి కాలంలో యూఎస్ ఎయిడ్ ద్వారా పలు దేశాల్లో సేవలందించారు. మూడేళ్ల వయసులోనే అమెరికా వెళ్లినప్పటికీ తల్లి తనను తరచూ భారత్‌కు తీసుకువచ్చేదని, హైదరాబాద్‌తో పాటు కోయిలకుంట్లలోనూ బోలెడంత మంది బంధువులు ఉన్నారని వీణారెడ్డి చెప్పారు. తన తాత అంకిరెడ్డి జర్నలిస్టు మాత్రమే కాకుండా.. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని తెలిపారు. -
Veena Reddy: ఏపీ అభివృద్ధి సంతృప్తినిస్తోంది
సాక్షి, హైదరాబాద్: తాను జన్మించిన ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధి తనకెంతో సంతృప్తినిస్తోందని యూఎస్ ఎయిడ్ మిషన్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) డైరెక్టర్ వీణారెడ్డి అన్నారు. ఏపీ మరింత అభివృద్ధి సాధించేందుకు తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో జరిగిన ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో వీణారెడ్డి పాల్గొన్నారు. చదవండి: ‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు కాగా, మంగళవారం విశాఖలో ‘అమెరికన్ కార్నర్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరవుతారు. ఇందులో అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మ్యాన్, తదితరులు పాల్గొంటారు. గాల్లోని తేమను నీరుగా మార్చే యంత్రం ‘వాటర్ ఫ్రమ్ ఎయిర్’ కియోస్క్‌ను సందర్శిస్తారు. -
వీణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఏఐడీ) మిషన్ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ వీణా రెడ్డి గురువారం బాధత్యలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వీణా రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాలో భారత సంతతికి చెందిన మొదటి దౌత్యవేత్తగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. Congratulations Veena Reddy for being the first diplomat of Indian origin to head @usaid_india. Proud of your achievement. @USCGHyderabad @USAmbIndia @USAndIndia — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 యూఎస్ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన వీణా రెడ్డి భారత్‌తో పాటు భూటాన్‌లో సేవలు అందించనున్నారు. వీణా రెడ్డి ఇంతకాలం ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె మెరుగైన ప్రదర్శన కనపరిచారు. ఈ పదవుల కంటే ముందు వీణా రెడ్డి వాషింగ్టన్లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా పని చేశారు. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వం ఉంది. -
అగ్రరాజ్యపు కీలక పదవిలో వీణారెడ్డి
అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ మిషన్ డైరెక్టర్‌గా వీణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ ట్విటర్ పేజీ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా, యూఎస్ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి ఇండియన్-అమెరికన్ వ్యక్తి వీణా రెడ్డి కావడం విశేషం. ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందూ, వీణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలం ఆమె ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె తన సత్తా చాటారు. Best wishes, Veena @usaid_india . #India - @USAID partnership has the potential to make a difference to the lives of people not only in 🇮🇳 & 🇺🇸, but across the 🌏! https://t.co/t3KAIeblLo — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 26, 2021 ఈ పదవుల కంటే ముందు వాషింగ్టన్లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా ఆమె పని చేశారు. ఇక ప్రభుత్వ సర్వీసుల కంటే ముందు న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, లండన్‌లో కార్పొరేట్ కంపెనీలకు అటార్నీగా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వం ఉంది. -
సోలార్ పార్కుల అభివృద్ధికి భారత్ కు రూ.5,681 కోట్లు
యూఎస్ఏఐడీ, ఏడీబీ మధ్య ఒప్పందం న్యూఢిల్లీ: భారత్‌లో సోలార్ పార్కుల ఏర్పాటుకు గానూ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇవి రెండు క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా భారత్‌లో సోలార్ పార్కుల అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం భారత్‌కు రూ.5,681 కోట్లు అందించనున్నాయి.