ముంబై: 'విమెన్ కనెక్ట్ చాలెంజ్" ఇండియా కింద భారతదేశ వ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు(మంజూరుకర్తలు)గా ఎంపిక చేశారు. రిలయన్స్ ఫౌండేషన్, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్(USAID) కలసి విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియాను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం కింద కేటాయించిన రూ.11 కోట్ల(1. 5 మిలియన్ డాలర్లకు పైబడిన మొత్తం)ను లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు ఉపయోగించనున్నారు. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ రూ.8.5 కోట్ల మేరకు($ 1.1 మిలియన్ డాలర్లకు పైగా మొత్తం) సమకూర్చనుంది.(చదవండి: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!)
లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు వివిధ వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇది సాంకేతికత ద్వారా మహిళల ఆర్థిక సాధికారికతను అధికం చేయనుంది. అనుదీప్ ఫౌండేషన్, టీర్ ఫూట్ కాలేజ్ ఇంటర్నేషనల్, సెంటర్ ఫర్ యూత్ అండ్ అండ్ సోషల్ డెవలప్ మెంట్, ప్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్, నాంది ఫౌండేషన్, ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫర్ డెవలప్ మెంట్ యాక్షన్, సొసైటీ ఫర్ డెవలప్ మెంట్ ఆబ్బర్నేటివ్స్, సాలిడారిడాడ్ రీజనల్ ఎక్స్ పర్టయిజ్ సెంటర్, టీఎన్‌ఎస్ ఇండియా ఫౌండేషన్, జెడ్‌ఎంక్యూ డెవలప్ మెంట్ ఈ సంస్థల్లో ఉన్నాయి. మహిళా రైతులు, ఆంత్రప్రె న్యూర్లు, స్వయం సహాయక బృందాల సభ్యుల సమస్యలను, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించేందుకు, లింగ ఆధారిత డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు ఈ పరిష్కారాలు తోడ్పడుతాయి.(చదవండి: ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!)
ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్, వ్యవస్థాపక చైర్ పర్సన్ శ్రీమతి నీతా ఎం అంబానీ మాట్లాడుతూ.. “ప్రతీ జీవనశైలిలో మహిళలను సంసిద్దులను చేసి, వారికి సాధికారికత కల్పించడం మా లక్ష్యం. మేం జియోను ప్రారంభించినప్పుడు, సమాన అవకాశాలు కల్పించే విప్లవం గురించి మేం కల కన్నాం. జియో ద్వారా మేం మన దేశవ్యాప్తంగా అందుబాటు ధరలకే ఇంటర్నెట్ అందిస్తున్నాం. భారతదేశంలో లింగ ఆధారిత డిజిటల్ వివక్షను తొలగించేందుకు యూఎస్ ఎయిడ్ సంస్థతో కలసి రిలయన్స్ ఫౌండేషన్ పని చేస్తోంది. అసమానతలను పరిష్కరించేందుకు, వాటిని తొలగించేందుకు సాంకేతికత అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. విమెన్ కనెక్ట్ చాలెంజ్ ఇండియా విజేతలుగా నిలిచిన పది సంస్థలకు నా అభినందనలు" అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment