![Nita Ambani launches social media platform Her Circle for women - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/8/nita-ambani.jpg.webp?itok=147W-YqC)
న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ తాజాగా ’హర్ సర్కిల్’ పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళ లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది వేదికగా ఉండగలదని ఆమె తెలిపారు. ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం తదితర అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ మొదలైనవి హర్ సర్కిల్ సబ్‌స్క్రయిబర్స్‌కు అందుబాటులో ఉంటాయని నీతా అంబానీ పేర్కొన్నారు. ప్రాథమికంగా ఇంగ్లీష్‌లో ఉండే హర్ సర్కిల్ క్రమంగా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment