women empowerment
-
Driver Neelam: ఆటో డ్రైవర్ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్‌గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్‌ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. -
రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.‘భారత రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.‘ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్ కాలర్ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్ ఎండీ శర్మిష్ట ఘోష్ అభిప్రాయపడ్డారు. -
ఓటేసిన మహిళలు 25 శాతం పెరిగారు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అక్షరాస్యత రేటులో ఒక శాతం పెరుగుదలతో ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 25 శాతం పెరిగింది. ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇవే కాకుండా వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని నివేదిక తెలిపింది. 2019తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 1.8 కోట్లు పెరిగింది. వీరిలో అక్షరాస్యత శాతం పెరగడం వల్ల 45 లక్షల మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి అక్షరాస్యత రేటుతో పాటు ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి ఉపాధి పథకాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దీని కారణంగా సుమారు 36 లక్షల మంది మహిళా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. పరిశుభ్రత కూడా ఒక కీలక అంశంగా మారి, మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రభావితం చేసింది. పరిశుభ్రత ప్రచారం, దాని ప్రభావం కారణంగా మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 21 లక్షలు పెరిగిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. ఇవే కాకుండా స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలు కూడా మహిళా ఓటర్లపై సానుకూల ప్రభావం చూపాయి. అయితే వీటి వల్ల ఓటు వేయాలనే స్ఫూర్తిని పొందిన మహిళల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు. ఎన్నికలలో మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో మహిళలకు గృహ యాజమాన్య హక్కులు కూడా ముఖ్యమైనవిగా పరిగణించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది మహిళా ఓటర్లు పెరిగారు. పీఎం ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్లలో 74 శాతం మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వారిని ప్రేరేపించింది. విద్య, ఉపాధి, ప్రాథమిక అవసరాలపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియలోవారి భాగస్వామ్యాన్ని పెంచవచ్చని నివేదిక పేర్కొంది. -
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్‌గా మారింది. సాక్షి మాలిక్‌ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్‌తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్‌ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్‌ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్‌లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్‌ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్‌లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్‌ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
#HBDYSJAGAN అక్కాచెల్లెమ్మలకు అండగా, జగన్ మామగా..!
వైఎస్ జ‘గన్’.. ఆ పేరులోనే ఉంది డైనమిజం. జగన్ అంటే జన ప్రభంజనం. జగనన్నగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి రాజకీయ చతురతతో, పాలనా దక్షతతో అనతి కాలంలోనే డైనమిక్ లీడర్‌గా ఎదిగి, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకరిగా గుర్తింపు పొందిన తీరు ఆదర్శప్రాయం.మహిళల అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ది ముడి పడి ఉందని నమ్మి అక్క చెల్లెమ్మల సంక్షేమమే ఊపిరిగా, మున్నపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఆడబిడ్డకు ప్రయోజనం చేకూర్చేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు జగనన్న. ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో విద్యార్థినులు విజయపతాకను ఎగురేసేలా విప్లవాత్మక అడుగు వేశారు ‘జగన్ మామ’. మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన చరిత్ర ఆయనది. అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సున్నావడ్డీదాకా, జగనన్న పెళ్లి కానుక, ఇంకా పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చారు. అంతేకాదు రాజకీయంగా అన్ని స్థాయిల్లోనూ మహిళా నేతలకు పదవులు కట్టబెట్టడమే కాకుండా తన కేబినెట్లో కూడా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. మహిళా భద్రతకు భరోసా ఇచ్చిన ‘దిశ యాప్’ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.అంతేనా.. 2019 ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ 'నవరత్నాలు' అమలుతో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చిన జననేత. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనం చేత జన నీరాజనాలు అందుకొని, సంక్షేమ ప్రభుత్వంగా మన్ననలు పొంది, రాజకీయ జీవితంలో శిఖరాలను అధిరోహించినా... ఆయన చూపు జనం మీదనే. ఏ కష్టం కాలం వచ్చినా, తక్షణమే బాధితులకు అండగా నిలబడ్డారు. అకాల వర్షాల్లో రైతులకు భరోసా ఇచ్చినా, వరదల్లో బాధితులకు నేనున్నాంటూ అండగా నిలబడినా, విద్యార్థులకు, మహిళలకు, ఒకరనేమిటి, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు నభూతో నభవిష్యతి. రాజకీయ జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఒదిగి ఉండే నైజం ఆయనది. అంతేకాదు తాజా ఎన్నికల్లో ఊహించని పరాజయం ఆయన ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఈ పరిణామానికి సాకులు వెదకలేదు. ఎవర్నీ నిందించలేదు. అత్యంత నిబ్బరంతో ప్రజల ముందుకొచ్చిన వైనమే ఇందుకు నిదర్శనం.పదవి, అధికారంతో సంబంధం లేకుండా, తానెప్పుడూ బాధితుల పక్షమేననీ, జనంతోనే పయనం, జనం కోసమే పోరాటం అంటూ ప్రకటించిన పోరు పతాక వైఎస్ జగన్. అన్నమాట ప్రకారమే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటూ, ప్రజాసమస్యలపై గొంతెత్తుతున్న జననేత జగన్. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై గళం విప్పడంలో మహిళలకు అండగా నిలబడటంలో అప్పుడూ, ఇప్పుడూ అదే తెగువ.. అదే నిబద్ధత!అప్పుడైనా,ఇప్పుడైనా, ఎప్పుడైనా... జగన్ అంటే జనప్రభంజనం అంటోంది బడుగు బలహీన లోకం.ఆనాటి పాదయాత్ర నుంచి నిన్నామొన్నటి కర్నూలు పర్యటన దాకా జగన్ వెంటే జనం, జనంతోనే జగన్ అంటోంది మహిళాలోకం.జగన్ మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటోంది చిన్నారి లోకం. -
పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశం
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 9న హరియాణాలోని పానిపట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు నియామక పత్రాలను అందజేశారు. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యమని ఎల్ఐసీ తెలిపింది.The Honorable Prime Minister of India, Shri Narendra Modi will be launching LIC’s BIMA SAKHI yojana at Panipat on 09th December 2024 to celebrate Women as partner in the Nations Progress.#BimaSakhiYojana #LIC@narendramodi @PMOIndia@nsitharaman @DFS_India— LIC India Forever (@LICIndiaForever) December 8, 2024కీలక అంశాలు..అర్హులు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన 18-70 సంవత్సరాల వయస్సు గల మహిళలు.శిక్షణ, ఉపాధి: బీమా సఖీలుగా పిలువబడే మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇచ్చి ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశం అంతటా లక్ష మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.ఆర్థిక సహాయం: ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీ స్టైఫండ్ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000, రెండో సంవత్సరంలో రూ.6,000, మూడో సంవత్సరంలో రూ.5,000 పొందవచ్చు. అదనంగా రూ.2,100 ప్రోత్సాహకం లభిస్తుంది.బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు. మొదటి సంవత్సరం కమీషన్ రూ.48,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు! -
ఉద్యోగం కోల్పోతేనేం కుట్టు పనితో ఏకంగా..!
‘చేతిలో విద్య ఉంటే ఎడారిలో కూడా బతికేయవచ్చు’ అంటారు పెద్దలు. ఉద్యోగం కోల్పోయిన మంజూషకు కుట్టుపని బాగా తెలుసు. ఆ విద్యతో అతి తక్కువ పెట్టుబడితో ఫ్యాబ్రిక్ డిజైన్లకు సంబంధించిన ‘తోఫా’ బ్రాండ్‌కు శ్రీకారం చుట్టింది ముంబైకి చెందిన మంజూష ఆ బ్రాండ్ ద్వారా ఇప్పుడు లక్షలు అర్జించే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది మహిళలకు ఉపాధి ఇస్తోంది.యాభై రెండేళ్ల వయసులో మంజూష ఉద్యోగం కోల్పోయింది. బతకడానికి, కుమార్తెను చదివించడానికి మరో ఉద్యోగం వెదుక్కోక తప్పని పరిస్థితి. ‘ఈ వయసులో నాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు?’ అనుకుంది. అయితే మంజూషకు ఒక లా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రోజూ గంటల తరబడి ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లాలి. నీరసంగా ఉండేది, నిస్పృహగా ఉండేది. అయినప్పటికీ ‘ఇల్లు గడుస్తుందిలే’ అనే చిన్న సంతృప్తితో ఉద్యోగం చేసేది.కొన్నిసార్లు ఉద్యోగం మానెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చేది. ఇంతలో కూతురు చదువు గుర్తుకు వచ్చి తన నిర్ణయాన్ని మార్చుకునేది. తల్లి మౌనవేదనను గమనించిన కూతురు ఆమెతో వివరంగా మాట్లాడింది. ‘నాకు ఉద్యోగం చేయాలని లేదు. కానీ తప్పదు’ అన్నది మంజూష. ‘ఉద్యోగం లేకుండా బతకలేమా!’ అన్నది కూతురు నజూక. ‘ఎలా?!’ అన్నది తల్లి.‘కుట్లు అల్లికలు నీ హాబీ. మనం హాయిగా బతకడానికి ఈ విద్య చాలు’ అన్నది నజూక ఆత్మవిశ్వాసంతో. ఇంటిలో ఒక మూలన వన్స్ అపసాన్ ఏ టైమ్ కుట్టుమిషన్ ఉంది. ‘నీ కూతురు చెప్పింది నిజమే. ముందుకు వెళ్లు’ అన్నట్లుగా అభయం ఇచ్చింది ఆ పాత కుట్టు మిషన్.కుమార్తె నజుకా జేవియర్‌తో కలిసి ‘తోఫా’కు శ్రీకారం చుట్టింది మంజూష. ‘ఒకవేళ ఈ వ్యాపారంలో విఫలమైతే! ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందా....’ ఇలా రకరకాల సందేహాలు వచ్చేవి మంజూషకు. అయితే ఒక్కసారి పనిలో మునిగి΄ోయాక ఆ సందేహాలు దూరం అయ్యేవి. ఎంతో ధైర్యం వచ్చేది.చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్లో పాల్గొన్న తరువాత తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఇంటి అలంకరణలు, ఫ్యాబ్రిక్ డిజైన్లకు సంబంధించి తన బ్రాండ్‌కు అక్కడ మంచి స్పందన వచ్చింది. రెండు వేల రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ బ్రాండ్ ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది.‘సొంతంగా ఏదో ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకునేదాన్ని. కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. మరిచిపోయాను అనుకున్న కళ మళ్లీ నా దగ్గరకు వచ్చింది. కుట్టుపని నాలో ఆత్మవిశ్వాసాన్ని, నా జీవితంలో వెలుగుల్ని నింపింది’ అంటుంది మంజూష.మార్కెంటింగ్‌లో పట్టా పుచ్చుకున్న కూతురు నజూక బ్రాండ్ రూపకల్పనలో, విజయవంతం చేయడంలో తల్లికి సహాయం అందించింది. ‘అమ్మ దుబారా ఖర్చు చేసేది కాదు. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చేది. చిన్నప్పుడు నాకోసం బట్టలు కొనేది కాదు. పాత చీరలు, ఇతర దుస్తుల నుంచి నాకు అందమైన డ్రెస్‌లు కుట్టేది. అప్పటి ఆ విద్య వృథా పోలేదు. మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అంటుంది నజూక.‘కుమార్తె రూపంలో యువతరంతో కనెక్ట్ కావడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. అప్డేట్ అయ్యాను. మా వ్యాపారంలో ఇప్పటి వరకు ప్లాస్టిక్ వాడలేదు’ అంటుంది మంజూష. ‘తోఫా’ ద్వారా తాను ఉపాధి పొందడమే కాదు ఎంతోమంది చేతివృత్తి కళాకారులకు ఉపాధిని ఇస్తోంది మంజూష. వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న మహిళలను ఉద్దేశించి... ‘భయం, సందేహాలు ఎప్పుడూ ఉండేవే. అయితే అవి మన దారికి అడ్డుపడకుండా చూసుకోవాలి’ అంటుంది.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది సిగరెట్ అంటించకండి!) -
నౌకా నిర్మాణంలోనూ ఆత్మనిర్భర్
పూరీ: నౌకల తయారీలో 2047కల్లా ఆత్మ నిర్భరత సాధించడంపై నావికాదళం దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. నేవీ డే సందర్భంగా బుధవారం ఒడిశాలోని పూరీ సాగర తీరంలో జరిగిన వేడుకల్లో త్రివిధదళాధిపతి హోదాలో ఆమె పాల్గొన్నారు. మహిళా సాధికారతకు నేవీ తన వంతు కృషి చేస్తోందని ప్రశంసించారు. ‘‘ఐదు వేల ఏళ్ల పై చిలుకు ఘన చరిత్ర భారత నావికా రంగం సొంతం. దేశంలో తొలి మహిళా అగ్నివీర్లు నేవీలోనే చేరారు’’ అన్నారు. 15 యుద్ధనౌకలు, 37 వాయుసేన విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్ఎస్ జల్సా, మిసైల్, డి్రస్టాయర్ ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సూర్య, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ సతొపురా వంటి ప్రముఖ యుద్ధనౌకలతో పాటు జలాంతర్గాములూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. హాక్, సీ–కింగ్, మిగ్29కే వంటి యుద్ధవిమానాలు, చేతక్, ఎంఎస్ 60 హెలికాప్టర్లు, హాక్ విమానాల విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
స్త్రీ సాధికారతపై ఇంకా గొడ్డలి వేటా?
దేశంలో, రాష్ట్రాలలో, గ్రామాలలో, స్త్రీ వ్యక్తిత్వం మీద, వారి సాధికారత మీద, వారి జీవన వ్యవస్థల మీద నిరంతర దాడులు జరుగుతూనే ఉన్నాయి. పురుష ప్రపంచం, పితృస్వామిక పాలక వర్గం స్త్రీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మతోన్మాద భావజాలం, మూఢాచారాల కఠినత్వం భారత దేశంలో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నాయి. ఇప్పటికీ స్త్రీకి విద్యా నిరాకరణ జరుగుతోంది. ఇంకా బాల్య వివాహాలతో తల్లిదండ్రులు బాలికల విద్యను హైస్కూల్ స్థాయిలోనే నిలువరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం స్త్రీలకు కల్పించిన హక్కులను ఉల్లంఘించడమే! స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. స్త్రీ తన సాధికారత కోసం చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి నడవాలి.సొంత తల్లిదండ్రులే బాలుడిని ఒక రకంగా, బాలికను ఒక రకంగా చూసే పరిస్థితులు ఇంకా కొనసాగడం సిగ్గుచేటు. కొన్ని సామాజిక కులాలైతే మూడు దశాబ్దాల పాటు ఆడ శిశువు భ్రూణ హత్యలకు పాల్పడ్డాయి. బాలికలను చదివించకుండా ఎదుగుతున్న మెదళ్లపై ఉక్కుపాదం మోపాయి.అక్షరాస్యతలో నుండి నిజమైన విద్యావంతులు ఆవిర్భ విస్తారు. విద్యావంతుల నుండి మేధావులుగా అభివృద్ధి చెంద డానికి ఎక్కువ అవకాశం ఉంది. స్త్రీలకు తమ శరీరాన్ని గురించిన అవగాహన, ఆరోగ్యం, తినవలసిన ఆహార పదార్థాలు, ఏ పదార్థం ఏ శక్తినిస్తుంది మొదలైన అంశాలు అక్షరాస్యత వల్ల తెలుస్తాయి. చేతివృత్తులు, వ్యాపార రంగాల్లో కూడా స్త్రీ వృద్ధి చెందడానికి అక్షరాస్యత ఉపయుక్తం అయ్యింది.స్త్రీ ఉద్యోగంలోకి ప్రవేశిస్తేనే!స్త్రీల ఆరోగ్యం సమాజ మూఢాచారాల వలన కుంటుబడి మర ణాల రేటు పెరిగింది. అయితే కేరళ, మిజోరం వంటి రాష్ట్రాల్లో స్త్రీలు విద్య, వైద్య రంగాల్లోకి చొరవగా అడుగుపెట్టిన తరువాత ఆ సమా జాల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ఉపాధ్యాయులైన స్త్రీలు సమాజంతో అవినాభావ సంబంధాలు కలిగి ఉండటంతో వాళ్ళ ఆలోచన వల్ల సామాజిక స్ఫూర్తి, చైతన్యం పెరిగాయి. భర్తల వేధింపుల్ని, మానసిక హింసని మొదటిగా అడ్డుకుంది డాక్టర్లు, టీచర్లుగా ఉద్యో గాల్లో ప్రవేశించిన మహిళలే.అయితే, స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా వారి ఆస్తి హక్కుకు కుటుంబ సభ్యులు, పాలకులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూ వారసత్వ (సవరణ) చట్టం–2005 ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.వందల సంవత్సరాలుగా సాంప్రదాయ వాదులు, సంఘసంస్కర్తల మధ్య జరిగిన సంఘర్షణల అనంతరం ఆడపిల్లలకు ఆస్తిహక్కులు దక్కాయి. విభిన్న మతాలు, సంస్కృతులున్న మన దేశంలో ఈ ఆస్తి హక్కులన్నవి కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికపై వేరువేరుగా ఉన్నాయి. అదేకాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆస్తికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు ఉండటం వల్ల అటువంటి తేడాలు ఉన్నాయి. హక్కులు ఉన్నప్పటికీ...‘చట్టం దృష్టిలో అందరూ సమానులే’ అన్న ప్రాథమిక రాజ్యాంగ న్యాయసూత్రానికి విరుద్ధంగా ఆడపిల్ల ఏ హక్కులు లేకుండా పరా ధీనగా బతుకుతోంది. ఈ వివక్షను 2005 సవరణ చట్టం పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. 1956 నాటి హిందూ వారసత్వ చట్టం ఒక సమగ్రమైన, సమాన వారసత్వపు హక్కులు కల్పించిన మొదటి చట్టం. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 1956 చట్టంలోని కొన్ని లొసుగులని తొలగించింది. స్త్రీ సర్వతోముఖాభివృద్ధికి, సాధికా రతకు సంపూర్ణ ఆస్తిహక్కు కలిగి ఉండాలని గుర్తించి, సవరణలు చేసిన సంస్కరణ చట్టం అని దీన్ని చెప్పవచ్చు. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, కేంద్ర ప్రభుత్వం చేత మొత్తం దేశానికంతటికీ వర్తించేలా చేయబడిన చట్టం.దీని ప్రకారం, మగవారితో సమానంగా ఆడవాళ్లకు పుట్టుకతోనే ‘కోపార్సినరీ’ హక్కు ఉంటుంది. ఏ విధంగా కుమారునికి హక్కులు వస్తాయో, అదే విధంగా ఆడపిల్లలకి కూడ హక్కులు వస్తాయని విస్పష్టంగా పేర్కొంది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటా యని చెప్పింది. అలాగే వ్యవసాయ భూములలో కూడా హక్కులు యిచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు అడపిల్లకి వచ్చాయో, ఆ హక్కులు ఆమెకి సంపూర్ణమనీ, వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి, లేక అమ్ముకోవడానికి గానీ ఆమెకి పూర్తి హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించింది. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి.రామారావు ప్రభుత్వంలో వచ్చిన హిందూ వారసత్వ చట్టం అవివాహిత కుమార్తెలకు, కుమారులతో సమానంగా పూర్వీకుల ఆస్తిలో హక్కు కల్పించింది. ఆ చట్టం వచ్చేనాటికి వివాహమైన వారికి హక్కు ఇవ్వలేదు. 1985 తర్వాత వివాహం అయిన కూతుళ్ళకు కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. ఇంతకు ముందు ఒక్క స్త్రీధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి, అత్తింటి వారు బహుమతిగా ఇచ్చే వస్తువులు, కొద్దిపాటి ఆస్తుల మీద మట్టుకే హక్కు కలిగిన ఆడపిల్ల, ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన ‘కోపార్సినరీ’ హక్కు, ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో (వీలునామా లేని ఎడల) సమాన వాటా పొందే హక్కు పొందింది. ఈ ఆస్తిహక్కు ఆడపిల్ల సర్వతోముఖాభివృద్ధికి, సాధికారతకి తోడ్పడుతుంది. అయితే, ఆర్థికంగా ఆడపిల్లకు ఆస్తి ఇవ్వకూడదనే ఉద్దేశం అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక వారికోసం, వారు వాదించుకునే చట్టాలు తేవడం కోసం ఏ పార్టీ మహిళలకు సముచితమైన సీట్లు ఇవ్వడం లేదు.అందుకే అసెంబ్లీలు, పార్లమెంటు మహిళలు తక్కువగా వుండి వెలవెలబోతున్నాయి. అంతటా నిరాశే...ఇకపోతే ఇటీవల తెలంగాణ గురుకుల పాఠశాలల్లో బాలికల అస్వస్థత చూస్తే, నన్నయ విశ్వవిద్యాలయంలో ఆడపిల్లల అన్నంలో పురుగుల విషయం చూస్తే దేశంలో అన్ని బాలికల హాస్టళ్లలో అశుభ్రమైన, అరుచికరమైన, పౌష్టికాహార రహితమైన వాతావ రణం కనబడుతోందనిపిస్తోంది. పాలక వర్గాల పితృస్వామిక పరి పాలనను విద్యార్థినుల అవస్థలు కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.ఇక బాలికల మీద, యువతుల మీద నిరంతరం జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు. పురుషులు, యువకులు, మద్యం,గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కామ వ్యామోహితులవు తున్నారు. ఉచ్చనీచాలు తెలియకుండా కళ్ళు కనిపించని స్థితిలో వయస్సు భేదము లేకుండా మీదికి ఉరుకుతున్నారు. ఇటీవల బాపట్ల జిల్లాలో జరిగిన, ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న అనేక ఘటనలు గుండెల్ని పిండుతున్నాయి. స్త్రీకి రక్షణ, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. రాత్రిపూట తాగి ఆ తిక్కతో ఇతర దేశాలకు భర్తలు వెళ్ళి భార్యలు ఒంటరిగా ఉన్న ఇళ్ళ మీద పడి తలుపులు పగులగొట్టి అత్యాచారాలు చేస్తున్నా, వస్తువులు తీసుకెళుతున్నా ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా ఉంటున్నాయి.ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని 45వ అధికరణ చెబుతోంది. 14 ఏళ్ల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పా లన్న సూత్రం గతంలో ఈ అధికరణంలో ఉన్నది. అయితే ఆ ఆదేశిక సూత్రం ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చబడింది. అయితే కేవలం పదాల గారడీ తప్ప పరిస్థితిలో మార్పు లేదు. ఈ అధికరణను రోజూ పాలక వర్గాలు చదువుకోవాలి. ఇక, మత్తు పానీయాలను నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికరణం 47 చెబుతోంది. ప్రజలను ఆరోగ్య వంతులను చేయటం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచటం ప్రభుత్వ బాధ్యత.అయినా పితృస్వామ్య పాలక వర్గం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. తమ అభ్యున్నతి కోసం, ఆర్థిక పరిరక్షణ కోసం, రాజ్యాధి కారం కోసం స్త్రీలు చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు కలిసి నడవాలి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
యువతుల‘పడవ’ళ్లు!
దాల్ సరస్సులోని నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండి, శ్రీనగర్ పట్టణ ప్రాంత సోయగాలను, ప్రకృతి రమణీయతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక ఆ సరస్సులో సోమవారం జరిగిన బోట్ రేస్ ఏకంగా మహిళా సాధికారతనే పరవళ్లు తొక్కించింది! 150 మందికి పైగా అందరూ మహిళలే పాల్గొన్న అలాంటి ఒక రేస్ దాల్ సరస్సులో జరగటం ఇదే మొదటిసారి. మహిళా అథ్లెట్లను ప్రోత్సహించటం, జమ్మూ లోయలోని మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటం, సంప్రదాయ మూస పద్ధతులను బద్దలు కొట్టించి మహిళల్ని ఇంటి బయటికి రప్పించటం ఈ పడవ పోటీల లక్ష్యం. కశ్మీర్ మహిళలకు వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన ప్రఖ్యాత అథ్లెట్,పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశపు మొదటి మహిళా జ్యూరీ.. బిల్కిస్ మీర్ ఈ పోటీలను నిర్వహించారు.‘‘మహిళల కోసం దాల్ సరస్సులో ఏర్పాటు చేసిన ఈ మొట్టమొదటి ట్రాక్ రేస్ చరిత్రాత్మక మైనది. పురుషులకు ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. మహిళలకు అన్ని ఉండవు. ఇటువంటి మరిన్ని రేసులను నిర్వహించి, 35మంది యువతుల్ని వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని అంతర్జాతీయ పోటీలకు శిక్షణ ఇస్తాం’’ అని బిల్కిస్ మీర్ తెలి΄ారు. పోటీలోపాల్గొన్న మాదిహా ఫరూక్ అనే యువతి, తను ఈ రేసులో భాగం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ఆడపిల్లలకు ఆటలేంటి అనే భావజాలం సమాజం నుండి రూపుమాసిపోవాలి’’ అని అన్నారు.అందమైన జలమార్గాలకు పేర్గాంచిన కశ్మీర్లో, మహిళల్ని వాటర్ స్పోర్ట్స్‌లో ప్రోత్సహించటం ద్వారా సాధికారత వైపు పడవల్ని పరుగులెత్తించటం బాగుంది. -
లింగ సమానత్వంలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు అవసరమని సూచించింది. దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్ డేనియల్ సీమౌర్, భారత్‌లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గూసన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాలను మార్చడానికి, మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్లో 6.8 శాతానికి నిధులు పెరిగాయన్నారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి బడ్జెట్ నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులు అవసరమని ఫెర్గూసన్ పేర్కొన్నారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యంతో నాయకత్వంలో కూడా పురోగతి కనిపిస్తోందని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లింగ ఆధారిత హింస (జీబీవీ) దేశంలో నిరంతర సమస్యగా ఉందని, ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు ఎత్తిచూపారు. చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సామాజిక కట్టుబాట్లు మహిళలను అడ్డంకిగా మారాయన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయత్నాలను ప్రవేశపెట్టడానికి, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తోందని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగినప్పటికీ, సవాళ్లు ఉన్నాయని, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రతతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు. -
President Droupadi Murmu: మహిళా సాధికారతే దేశానికి బలం
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు. పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు. మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు. తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్‌ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు. -
మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి
న్యూఢిల్లీ: మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను అందించడానికి ఫైనాన్షియల్ రంగం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. మహిళలను ప్రోత్సహించే వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఆయన సూచించారు. సమగ్ర వృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ వాస్తవ అభివృద్ధి చెందిన భారతదేశం అంటే.. దేశంలోని ప్రతి పౌరుడు సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ఫిక్కీ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్‌ఐబీఏసీ– 2024 ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, భారత్ శ్రామిక శక్తి భాగస్వామ్యం (మహిళల భాగస్వామ్యం) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. బాలికల విద్యను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, పని ప్రదేశంలో భద్రత, సామాజిక అడ్డంకులను పరిష్కరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు. వినియోగం, డిమాండ్ సమిష్టిగా పెరగడంతో భారతదేశ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందన్నారు. భూమి, కారి్మక, వ్యవసాయ మార్కెట్లలో సంస్కరణల ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. -
Juhi Chawla: సిరిలో బెస్ట్
‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో దేశానికి పరిచయం అయిన జూహీ చావ్లా మన దేశంలో అత్యంత సిరి గల మహిళల్లో ఒకరిగా నిలిచింది.తాజాగా విడుదలైన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ ప్రకారం మనదేశంలో అత్యధిక సంపద కలిగిన మొదటి పదిమంది స్త్రీలలో జూహీ 6 వస్థానంలో ఉంది. సినిమా, క్రికెట్ వంటి రంగాల్లో పెట్టిన పెట్టుబడి ఆమెను ఈ స్థానానికి చేర్చింది. ఆమె పరిచయం, మిగిలిన స్థానాల్లో ఉన్న ఇతరుల గురించి కథనం.సంపద మగవాడి సొత్తు అనుకునే రోజుల నుంచి సంపద సృష్టించే మహిళా ΄ారిశ్రామికవేత్తల వరకూ కాలం మారింది. మారిందనడానికి వివిధ సూచికలు సాక్ష్యం పలుకుతున్నాయి. మన దేశంలో సంపన్నుల జాబితాను ఏ ఏటికా ఏడు వెల్లడి చేసే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో స్త్రీలు పెద్ద సంఖ్యలో ఉండటం సంతోషం కలిగించే సంగతి. పురుషుల్లో అదానీ 1,161,800 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే అంబాని 1,014,700 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే స్త్రీలలో జోహొ గ్రూప్‌కు చెందిన రాధా వెంబు 47,500 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, నైకా గ్రూప్‌కు చెందిన ఫాల్గుణి నాయక్ 32,200 కోట్లతో రెండోస్థానంలో ఉంది. పురుషులతో ΄ోల్చితే స్త్రీల దగ్గర సగం సంపదే ఉన్నా స్త్రీలు ఆ స్థాయిలో వ్యా΄ార సంపదను సృష్టించడం పెద్ద ఘనత. మరో ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే సంపద ఎక్కువ కలిగిన స్త్రీలలో జూహి చావ్లా 4,600 కోట్లతో ఆరవ స్థానంలో నిలవడం.సినిమా రంగంలో 2వ స్థానం‘హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2024’ వివిధ కేటగిరీలలో సంపద కలిగిన వారి ర్యాంకులను ఇచ్చింది. సినిమా రంగానికి సంబంధించి షారుక్ ఖాన్ 7,300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జూహి చావ్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. మూడో స్థానంలో హృతిక్ రోషన్ (2000 కోట్లు), ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ (1200 కోట్లు), కరణ్ జోహార్ (1400 కోట్లు) ఉన్నారు. జూహి చావ్లా దాదాపుగా సినిమాలలో నటించక΄ోయినా బాలీవుడ్లో భారీ ΄ారితోషికం తీసుకునే నటీమణులు ప్రస్తుతం ఉన్నా ఆమె సంపద భారీగా కలిగి ఉండటం ఆమెలోని ఆర్థిక దృష్టికి నిదర్శనం.ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ కూతురుజూహీ చావ్లా అంబాలా (హర్యాణా)లో పుట్టి ముంబైలో పెరిగింది. తండ్రి ఇన్‌కంటాక్స్ ఆఫీసరు. తల్లి గృహిణి. బాల్యంలో నటి ముంతాజ్, తర్వాత శ్రీదేవిలను చూసి సినిమాల్లోకి రావాలనుకున్న జూహీ మోడల్‌గా పని చేసింది. 1984లో ‘మిస్ ఇండియా’ కిరీటం సాధించడంతో ఆమెను బాలీవుడ్ గుర్తించింది. అదే సంవత్సరం ఆమె నటించిన మొదటి సినిమా ‘సల్తనత్’ భారీ అపజయం మూటగట్టుకుంటే వేషాలు లేని జూహి దక్షిణాదికి వచ్చి కన్నడ సినిమా ‘ప్రేమలోక’ (1987) చేసింది. ఆ సినిమాతో ఆమె పేరు మార్మోగింది. 1988లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లో నటించాక ఆమె వెనక్కు తిరిగి చూసే పని లేకుండా΄ోయింది.షారూక్ ఖాన్‌తో ్ర΄÷డక్షన్ హౌస్‘రాజూ బన్‌గయా జంటిల్మెన్’ సినిమాలో షారూక్, జూహీ చావ్లా స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం బలపడి నేటికీ కొనసాగుతూ ఉంది. మొదట అతనితో కలిసి ‘డ్రీమ్స్ అన్లిమిటెడ్’ అనే ్ర΄÷డక్షన్ సంస్థ స్థాపించి ‘ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ’, ‘అశోక’, ‘చల్తే చల్తే’ సినిమాలు తీసింది జూహీ. ఆ తర్వాత షారూక్ స్థాపించిన రెడ్ చిల్లిస్ సంస్థలో భాగస్వామి అయ్యింది. ఐíపీఎల్ మొదలయ్యాక షారూక్‌తో కలిసి కోల్కటా నైట్‌రైడర్స్‌కు సహ భాగస్వామి అయ్యింది.వ్యా΄ారవేత్తతో వివాహంజూహీ చావ్లా ‘మెహతా గ్రూప్’ అధినేత జయ్ మెహతాను 1995లో వివాహం చేసుకుంది. జయ్ మెహతా మొదటి భార్య సుజాతా బిర్లా విమాన ప్రమాదంలో మరణించడంతో జయ్ మెహత్ ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా దేశాలలో సిమెంట్, ΄్లాస్టిక్ తదితర పరిశ్రమలు ఉన్న జయ్ మెహతా వ్యా΄ారాల్లో కూడా జూహీ భాగస్వామి కావడంతో ఆమె సంపద మెల్ల మెల్లగా పెరుగుతూ ΄ోయింది. అయితే ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆటు΄ోట్లు ఎదుర్కొంది. సొంత అన్న, చెల్లి ఇద్దరూ మరణించారు. ఒక దశలో మాధురి దీక్షిత్ వంటి స్టార్ల హవా వల్ల సినిమాలు లేని స్థితి. ‘అయినా నీ లోపల ఉన్న ఆత్మిక శక్తిని ఉద్దీపనం చేయగలిగితే నువ్వు ముందుకు ΄ోగలవు’ అంటుంది జూహీ.మన దేశ మహిళా శ్రీమంతులురాధా వెంబు (మొదటి స్థానం – 47,500 కోట్లు): సోదరులు శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబుతో కలిసి రాధా వెంబు స్థాపించిన ‘జోహో’ సంస్థ భారీ విజయాలు సాధిస్తుండటంతో ఆమె సంపద పెరిగింది. జోహో అందరికంటే ఎక్కువ వాటా ఉన్న రాధాకే. చెన్నైలో పుట్టి పెరిగిన రాధ ఐఐటీ మద్రాసులో చదువుకుంది. పబ్లిసిటీకి దూరంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.ఫాల్గుణి నాయర్ (రెండవ స్థానం – 32,200 కోట్లు): ఆన్లైన్ బ్యూటీ బ్రాండ్‌కు ఏమాత్రం అనుకూలత లేని కాలంలో ‘నైకా’ స్థాపించి ఘన విజయం సాధించింది ఫాల్గుణి నాయర్. నైకా ్ర΄ారంభించేనాటికి ఆమెకు 50 ఏళ్లు. ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్‌లో చదవడం వల్ల ఆమెకు వ్యా΄ారసూత్రాల మీద పట్టు వచ్చింది. సౌందర్య సాధనాల పట్ల ఉన్న ఆసక్తి వినియోగదారులకు ఎలాంటివి కావాలో తెలిసేలా చేసింది. ఫాల్గుణి అమ్మే ఉత్పత్తులు ఆమెకు సంపద తెచ్చిపెడుతున్నాయి.జయశ్రీ ఉల్లాల్ (మూడవ స్థానం – 32,100 కోట్లు): లండన్ లో పుట్టి ఢిల్లీలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన జయశ్రీ ఉల్లాల్ ఇం/టనీరింగ్‌లో ఎం.ఎస్ చేసి ‘అరిస్టా’ అనే క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీని స్థాపించి బిలియనీర్‌గా ఎదిగింది.కిరణ్ మజుందార్ (నాలుగో స్థానం – 29,000 కోట్లు): తన బ్యాంకు ఖాతాలో ఉన్న పది వేల రూ΄ాయల పెట్టుబడితో ఒక కారుషెడ్డులో మొదలైన బయోకాన్ ఇండియా సంస్థ కిరణ్ మజుందార్‌ను ఇవాళ ప్రపంచవ్యాప్త గుర్తింపుతో, సంపదతో నిలబెట్టింది. నాడు మహిళలు ఎవరూ చదవని విభాగం ‘ఫర్మంటేషన్’లో పి.జి చేసిన కిరణ్ తొలత ఎంజైమ్స్ తయారు చేస్తూ నేడు మానవాళికి మేలు చేసే జీవ రక్షకాల తయారీ వరకూ చేరుకుంది. కిరణ్ ఎప్పుడూ అపర కుబేరుల టాప్ లిస్ట్‌లో ఉంటూనే ఉంటుంది.నేహా నార్ఖెడె (ఐదో స్థానం – 4,900 కోట్లు): కాన్ఫ్లుయెంట్ అనే క్లౌడ్ కంపెనీకి కో ఫౌండర్‌గా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న నేహా నార్ఖెడె ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ వంటి మహిళల నుంచి స్ఫూర్తి ΄÷ంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది. పూణె నుంచి అమెరికా వెళ్లి చదువుకుని 2014లో కాన్‌ఫ్లుయెంట్‌ను స్థాపించింది. -
డిజైన్, టెక్నాలజీలో మహిళలకు అగ్రస్థానం
ఐఫోన్ కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తమ భారత విభాగంలో మహిళలకు ప్రాధాన్యమివ్వడంపై మరింతగా దృష్టి పెడుతోంది. మహిళలను కేవలం అసెంబ్లింగ్ విభాగానికే పరిమితం చేయకుండా డిజైన్, టెక్నాలజీ సంబంధ హోదాల్లో సారథ్యం వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు తెలిపారు.మహిళలు తమ కెరియర్లో పురోగతి సాధించేందుకు కంపెనీ మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు లియు పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. ఫాక్స్‌కాన్‌కు సంబంధించి భారత్‌లో మొత్తం 48,000 మంది ఉద్యోగులు ఉండగా, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలు ఉన్నట్లు లియు వివరించారు. సంస్థ ఇటీవలే చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ఆవిష్కరించింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఫాక్స్‌కాన్ రూ.25,000 కోట్లతో కర్ణాటకలో మొబైల్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. దీనితో 40,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ యూనిట్ ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. -
ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలు
తయారీ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. పురుషులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఈ రంగంలో ఆటోమేషన్ (మెషినరీ సాయంతో పనుల నిర్వహణ)తో మహిళల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది భారత్ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో తయారీ రంగం మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఆటోమేషన్‌ను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది.టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ మాట్లాడుతూ..‘దేశీయంగా చాలా కంపెనీలు దశలవారీ ఆటోమేషన్‌ను అమలు చేస్తున్నాయి. మహిళల నియామకాలు మొదలు పెట్టాయి. తయారీ రంగాల్లో ఆటోమేషన్ అమలు పెరుగుతున్న కొద్దీ కంపెనీలు మరింత మంది మహిళలను పనుల్లోకి తీసుకుంటున్నాయి. భారత తయారీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు 15–20 శాతంలోపే ఉంటారు. ఆటోమేషన్‌ను వేగంగా అమలు చేస్తున్న కంపెనీల్లో ఇప్పటికే మహిళల నియామకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికం విడిభాగాల తయారీ సంస్థలు మరింత మంది మహిళలను తీసుకునేందుకు చర్యలు చేపట్టాయి. శ్రామికశక్తిలో లింగ సమతుల్యంపై కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి’ అని అన్నారు.ఇదీ చదవండి: కార్ల ధరపై భారీ డిస్కౌంట్లుకొన్ని విభాగాల్లో మెరుగైన అవకాశాలుతయారీలో కొన్ని రంగాలు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుండడడాన్ని టీమ్‌లీజ్ నివేదిక ప్రస్తావించింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో కార్మికుల్లో 70–80 శాతం మహిళలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే టెక్స్టైల్స్, వస్త్రాల తయారీలోనూ సహజంగానే మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఫ్యాబ్రికేటెడ్, బేసిక్ మెటల్స్, మెషినరీ, ఎక్విప్మెంట్, మోటారు వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమల్లో కఠినమైన పని పరిస్థితుల దృష్ట్యా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని, వీటిల్లో ఆటోమేషన్ అమలు తక్కువగా ఉన్నట్టు టీమ్‌లీజ్ తెలిపింది. ఇక ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్లోనూ పురుషులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
బడ్జెట్లో మహిళలు ఏం కోరుతున్నారంటే..
కేంద్ర బడ్జెట్ 2024ను జులై 23న ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొత్తగా కంపెనీలు స్థాపించిన మహిళలు వారికి సరైన ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంచేలా ప్రభుత్వం బడ్జెట్లో చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.పబ్లిక్ పాలసీ కన్సల్టింగ్ సంస్థ టీక్యూహెచ్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకురాలు అపరాజిత భారతి తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలి. స్టార్టప్ కంపెనీలు కలిగి ఉండడంలో భారతదేశం ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. అయినప్పటికీ 2020 నుంచి 2022 వరకు మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు సేకరించిన నిధుల వాటా మొత్తం స్టార్టప్ ఫండింగ్‌లో కేవలం 15 శాతం మాత్రమే. మహిళలకు సరైన నైపుణ్యాలు అందించి కొత్త కంపెనీలు స్థాపించే దిశగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు సారథ్యం వహిస్తున్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టేలా క్యాపిటల్ వెంచర్లను ప్రోత్సహించేలా బడ్జెట్‌ను రూపొందించాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: తగ్గనున్న కీలక వడ్డీ రేట్లు..?ఈ సందర్భంగా కినారా క్యాపిటల్ సీఈఓ హార్దికా షా మాట్లాడుతూ..‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలోని శ్రామికశక్తిలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు. వారికి సరైన నైపుణ్యాలు, ప్రోత్సాహకాలు అందించి ఎంఎస్ఎంఈలో పనిచేసేలా నిర్ణయం తీసుకోవాలి. మహిళా శ్రామిక శక్తి 2021-22లో 32.8 శాతం నుంచి 2022-23లో 37 శాతానికి పెరిగినప్పటికీ దీన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలి. సమీప భవిష్యత్తులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు లక్ష్యం 8 శాతంగా నిర్ణయించారు. దాన్ని సాధించడానికి మహిళల శ్రామిక భాగస్వామ్యాన్ని 50 శాతానికి పెంచడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. -
దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!
దేశీ అమ్మాయి కాస్త ప్రపంచ సుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకుంది. అక్కడి నుంచి మొదలైన ఆమె విజయపరంపర ప్రభంజనంలా దూసుకుపోయింది. నటిగా మెప్పించి అందరీ అభిమానాన్ని పొందింది. అందివచ్చిన ప్రతి అవకాశన్ని అందిపుచ్చుకుంది. అవకాశం చిక్కినప్పుడల్లా మహిళ హక్కుల గురించి విరుచుకుపడేది. అదే ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైనలో శక్తిమంతమైన మహిళగా నిలబెట్టింది. పైగా తన కళా నైపుణ్యంతో మహిళ సాధికారతనకు అసలైన నిర్వచనం ఇచ్చింది. ఎవరామె అంటే..ఆ మహిళ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. సాధాసీధా దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ ఐకాన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించికుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనలోని కొత్త వెర్షన్‌ని పరిచయం చేసింది. ఒక కూతురిగా, సోదరి, భార్య, తల్లిగా ఇలా అన్ని రోల్స్‌కి సమన్యాయం చేసింది. 2000లో మిస వరల్డ్ పోటీలో సాధించిన గెలుపుతో మొదలైన ఆమె ప్రస్తానం వెనుతిరిగి చూడాల్సిన పనిలేకుండా..విజయపరంపరతో దూసుకుపోయింది. అలాగే బాలీవుడ్లో కెరీర్‌ను మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో వేలాదిమంది అభిమానుల మనుసును గెలుచుకుంది. అక్కడి నుంచి హాలీవుడ్లో ప్రవేశించి తన కెరియర్ని నిర్మించుకుంది. అలాగే ప్రియాంక నటించిన అంతర్జాతీయ వెబ్ సిరీస్ క్యాంటికో ఆమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలా ఆమె గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకుంది.2018లో విదేశీయుడు జోనాస్‌ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలో ఉండే సాంప్రదాయ మూస పద్ధతులన్ని బద్దలు గొట్టింది. ఆ తర్వాత సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొంది..దానిపై ఉండే అపోహలను దూరం చేసింది. ఆమె తన నటనకు గానూ పద్మశ్రీ అందుకుంది. అలాగే యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలయ్యింది.అంతేగాకుండా ఫోర్బ్స్ వందమంది శక్తిమంతమైన మహిళల్లో ఆమె ఒకరిగా నిలిచింది. ప్రియాంక తరుచుగా లింగ సమానత్వం, విద్య, మహిళల హక్కులపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. అలాగే పలు టాక్ షోలు, ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను చెప్పేందుకు వెనకాడలేదు. అంతేగాదు బాలీవుడ్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి, రావాల్సిన మార్పు గురించి మాట్లాడుతుంది. మహిళలు జీవించే ప్రపంచం ఉండకూడదు, మహిళలు అభివృద్ధి చెందే ప్రపంచం ఉండాలని నర్మగర్భంగా చెబుతుంది. అలాగే సరళమైన పదాల్లో స్త్రీల హక్కులు లేనందున స్త్రీవాదం అవసమరమయ్యిందని తనదైన శైలిలో కౌంటరిస్తుంటుంది. ఆధునిక మహిళకు ప్రియాంక ఓ స్ఫూర్తి. తను ఎంచుకుని తీసే సిమాలలో అత్యంత శక్తిమంతమైన మహిళల పాత్రలతో సమాజానికి ఇవ్వాల్సిన సందేశం ఇస్తుంటుంది. అంతేగాదు తప్పు చేయడం మానవ సహజం దాన్నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ప్రధానమైనదని అంంటోంది. ఆమె అచంచలమైన శక్తి, అంకితభావం, సాధికారతకు ప్రియాంక నిలువెత్తు నిదర్శనం. ఓ స్త్రీగా ఏమేమో చేయొచ్చొ చేసి చూపించింది అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ మనవరాలే..!) -
సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగ్
సాక్షి, అమరావతి: 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై వారు నిలబడటమే కాకుండా, కుటుంబానికి కూడా ఆర్థికంగా తోడ్పాటునందించడానికి పలు పథకాలు ప్రవేశపెట్టారు. చిన్న వ్యాపారాల నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు వారికి అండదండగా నిలిచారు. దీంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొన్నారు. కుటుంబంలో వారి ప్రాబల్యం పెరిగి, కుటుంబ పొదుపు పెరిగింది. రాష్ట్రంలో మహిళలు సాధించిన ఈ సాధికారత పెరిగిన డిపాజిట్ల ఖాతాల రూపంలో, ఈ ఎన్నికల్లో మహిళల ఓట్ల రూపంలో ప్రతిబింబించిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. 2019 మార్చి నుంచి 2023 మార్చి వరకు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా మహిళల డిపాజిట్ల ఖాతాల్లో పెరుగుదల, రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 6 దశల లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన మహిళల ఓట్లను ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది.ఆంధ్రప్రదేశ్‌లో 2019 మార్చి నుంచి 2023 మార్చికి మహిళా డిపాజిట్ ఖాతాలు 90.4 లక్షలు పెరిగాయని తెలిపింది. తద్వారా మహిళలు నిర్ణయాత్మకంగా మారారని, దాని ఫలితంగానే 2019 ఎన్నికలను మించి 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అదనంగా 8.4 లక్షల మంది మహిళలు ఓటు వేశారని నివేదిక వెల్లడించింది. ఈ సంవత్సరం ఎన్నికల్లో పురుషులకన్నా మహిళా ఓటర్లు పోలింగ్‌లో అత్యధికంగా పాల్గొన్నారని తెలిపింది. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఓట్ల పెరుగుదల జనరల్ కేటగిరీ నియోజకవర్గాలకంటే ఎక్కువగా ఉండటం స్వాగతించదగ్గ అంశమని పేర్కొంది. ఆసక్తికరంగా, ప్రతి అదనపు 100 మంది పురుష ఓటర్లకు, ఎస్సీ నియోజకవర్గాల్లో 115 మంది, ఎస్టీ నియోజకవర్గాల్లో 111 మంది మహిళా ఓటర్లు ఉన్నారని, సాధారణ నియోజకవర్గాల్లో 105 మంది మహిళలు ఉన్నారని నివేదిక పేర్కొంది.6 దశల్లో 54.3 కోట్ల మంది ఓటు వేశారని..దేశవ్యాప్తంగా జరిగిన ఆరు దశల పోలింగ్‌లోనూ మహిళల ఓట్లు గతంలోకన్నా బాగా పెరిగాయని తెలిపింది. కేరళ, మణిపూర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో 2019 ఎన్నికలకన్నా 2024 ఎన్నికల్లో మహిళా ఓట్లు 1.73 లక్షలు పెరిగినట్లు చెప్పింది. 2019 మార్చి నుంచి 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళా డిపాజిట్ ఖాతాల సంఖ్య 30.97 కోట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 4.18 కోట్ల మహిళా ఖాతాలు, ఆ తరువాత ఢిల్లీలో 3.32 కోట్ల మహిళా ఖాతాలు పెరిగినట్లు తెలిపింది. 2024లో మొత్తం 57.8 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 2019లో తొలి 6 దశల్లో 54.3 కోట్ల మంది ఓట్లు వేశారని, ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 3.45 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. పెరిగిన 3.45 కోట్ల మంది ఓటర్లలో, మహిళా ఓటర్లు 1.73 లక్షలు, పురుష ఓటర్లు 1.62 లక్షలుగా తెలిపింది. ఇలా మహిళా ఓటర్లు పురుషులకంటే నిర్ణయాత్మకంగా ఉన్నారని, ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 107 మంది మహిళా ఓటర్లు ఉన్నారని నివేదిక విశ్లేషించింది. -
ఆరోగ్యం ఆమె హక్కు!
ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా ఒక హక్కే. ఈ విషయాన్ని ప్రపంచంలోని ప్రతి మహిళా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా మే 28న‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ ఉమెన్ హెల్త్’ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళ తన ఆరోగ్య సంరక్షణ కోసం అవగాహన పెంచుకోవడంతో ΄ాటు హక్కుగా ఎలా భావించాలో తెలుసుకోవాలి. మహిళల ఆరోగ్య సంరక్షణలో కొనసాగుతున్న ఇబ్బందులు, అవకాశాలను హైలైట్ చేసే ఒక ముఖ్యమైన వేడుకగా ఈ రోజును భావించాలి.మహిళల ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తొలగించడానికి లాటిన్ అమెరికన్, కరీబియన్ ఉమెన్ హెల్త్ నెట్వర్క్ 1987లో గ్లోబల్ నెట్వర్క్ (డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్)ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణలో మహిళల తక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ నెట్వర్క్ ఆవిర్భవించింది. మహిళల ఆరోగ్య సేవలు, హక్కులలో నిరంతరంగా వచ్చే అవాంతరాలను పరిష్కరించాలి. మరింత పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించాలనేది ఈ నెట్వర్క్ ఉద్దేశ్యం.మొదటిది ప్రసూతి ఆరోగ్యంమొదట పునరుత్పత్తి, ప్రసూతి సమయాలలో సురక్షితమైన ఆరోగ్య సేవలను ΄÷ందడంపై దృష్టి సారించడానికి ఈ రోజును కేటాయించారు. ప్రపంచంలో ముప్పై ఏళ్ల క్రితం ప్రసూతి మరణాలు అధికంగా ఉండటంతో తొలుత వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత స్త్రీల మానసిక ఆరోగ్యం, హెచ్ఐవి, గర్భనిరోధక సాధనాలు, నాన్–కమ్యూనికబుల్ వ్యాధులు, ఆర్థిక–సామాజిక కారకాల ప్రభావం... వంటి విస్తృత శ్రేణి అంశాలను చేర్చే దిశగా క్రమంగా విస్తరణ జరిగింది. ఒక విధంగా చె΄్పాలంటే ఈ అవగాహన అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సెమినార్లు, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను స్పాన్సర్ చేశాయి. నిధుల పెట్టుబడిని ్ర΄ోత్సహిస్తూ ‘సురక్షిత మాతృత్వం’ అనే థీమ్‌తో సమస్యను చేపట్టాయి. 1987 మే, 28 నుంచి ఈ రోజుకు ఓ ్ర΄ాధాన్యాన్ని కల్పిస్తూ అనేక ప్రభుత్వాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ ΄ûర సమాజ సంస్థలు మహిళల ఆరోగ్యం కోసం తమ చేయూతను అందిస్తున్నాయి. అవగాహనే కీలకంగా! ఎవరూ ఏ మాత్రం పట్టించుకోని, హాని కలిగించే వ్యాధులతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఈ రోజు చర్చకు తెస్తూ, వాటిని హైలైట్ చేస్తుంది. బహిరంగ సమావేశాల ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తూ, మహిళల ఆరోగ్య సంబంధిత విద్యలను ్ర΄ోత్సహిస్తుంది. .ఆరోగ్య హక్కుల కోసం న్యాయవాదిగా!మహిళల ఆరోగ్య హక్కుల కోసం వాదించడానికి, ఆరోగ్య సంరక్షణలో జెండర్ సమానత్వాన్ని ్ర΄ోత్సహించే విధానాల అమలుకు అవసరమైన కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని వివిధ ్ర΄ాంతాల నుంచి మహిళల ఆరోగ్య న్యాయవాదులు, సంస్థలు, కమ్యూనిటీలను ఒకచోట చేర్చి, వారిలో సంఘీభావాన్ని పెం΄÷ందిస్తుంది. ఈ సమష్టి చర్య మహిళల ఆరోగ్య హక్కుల కోసం చేసే ఉద్యమాలను బలపరుస్తుంది.మహిళా సాధికారత మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సుపై బాధ్యత వహించడానికి ఈ ప్రత్యేకమైన రోజు మహిళలకు ఓ శక్తినిస్తుంది. ఆరోగ్య సమాచారాన్ని వెతకడానికి, సేవలను ΄÷ందడానికి తామే నిర్ణయాత్మక శక్తిలా మారే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా మహిళలను ్ర΄ోత్సహిస్తుంది. మహిళల ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వాలు మద్దతునివ్వాలి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో మహిళల ఆరోగ్యం, హక్కులను ్ర΄ోత్సహించే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా చేయాలి. ఆరోగ్య నిపుణులు, విధాన రూపకర్తలు, కమ్యూనిటీ నాయకులతో సహా వివిధ సంస్థలు కూడా ఇందులో భాగం కావాలన్నది డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం. -
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్‌లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్‌కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది. మహిళా రైతులతో నెట్వర్క్విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్‌లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది. -
మన సర్పంచులు @ ఐరాస
మహిళాసాధికారతపై ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో ప్రసంగించడానికి భారతదేశం నుంచి ముగ్గురు సర్పంచులకు ఆహ్వానం అందింది. ఈ నెల 3న అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి నిర్వహిస్తున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి నుంచి సర్పంచ్ హేమకుమారి, త్రిపుర నుంచి సుప్రియాదాస్ దత్తా, రాజస్థాన్ నుండి నీరూ యాదవ్ పాల్గొంటున్నారు.‘భారతదేశంలో స్థానిక సంస్థల పాలనలో మహిళల భాగస్వామ్యం, వారు ఎలా దారి చూపుతున్నారు’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారతదేశం నుంచి ముగ్గురు మహిళా ప్రతినిధులతో ఒక ΄్యానెల్ చర్చ ఉంటుంది. ఈ కార్యక్రమంలో వారు తమ విజయగాథలను పంచుకుంటారు. అలాగే లింగ సమానత్వం, అభివృద్ధి కోసం వారి వారి పంచాయితీలలో చేసిన కృషిని కూడా పంచుకుంటారు. వీరిని మూడు రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.మూడు కీలకమైన స్తంభాలు: హేమకుమారిపశ్చిమగోదావరి జిల్లా పేకేరు గ్రామ పంచాయతీలో స్థిరమైన అభివృద్ధి, లింగ సమానత్వం కోసం కార్యక్రమాలను చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసింది. సర్పంచ్‌గా హేమకుమారి 2021లో పదవిని చేపట్టినప్పటి నుంచి మూడు కీలకమైన స్తంభాలపై దృష్టి సారించి పరివర్తన కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. అవి.. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం. సరైన ΄ోషకాహారం, ప్రసవానికి సంబంధించిన అవగాహన పెంచడానికి క్రమం తప్పకుండా హెల్త్ క్యాంపులు, విద్యాకార్యక్రమాలను చేపట్టింది. దీని ఫలితంగా ముప్పు అధికంగా గల గర్భధారణ కేసుల సంఖ్య, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ఈ విషయాలపై హేమకుమారి తాను చేసిన ప్రయోజనకరమైన పనులను, వచ్చిన ఫలితాలను తెలియజేయనుంది.హాకీ సర్పంచ్: నీరూయాదవ్ రాజస్థాన్‌లోని బుహనా తహసీల్‌లోని లంబి అహిర్ గ్రామ సర్పంచ్ నీరూ యాదవ్ ‘నాయకత్వ అనుభవం’పై తన అభి్రపాయాలను వెల్లడించనున్నారు. నీరూ యాదవ్ 2020లో లంబి అహిర్ గ్రామపంచాయితీకి సర్పంచ్ అయ్యింది. బాలికలు, మహిళల సాధికారత కోసం నీరూ యాదవ్ ఎన్నోపనులు చేశారు. భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడానికి ఐక్యరాజ్యసమితి నీరూని పిలవడానికి కారణం ఇదే. పంచాయితీ పనులతో పాటు రాష్ట్ర మహిళలకు స్ఫూర్తిదాయకంగా తన పంచాయితీలోని బాలికల హాకీ జట్టును తన సొంత ఖర్చుతో సిద్ధం చేసింది. ఈ చొరవ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే ఆమెను హాకీ సర్పంచ్ అని పిలుస్తారు. గ్రామ పంచాయితీని ΄్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చొరవ తీసుకుంది. పాత బట్టల సంచులను తయారు చేయడం ద్వారా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించింది. గ్రామ ప్రజలరె పర్యావరణం వైపుగా ్ర΄ోత్సహించేలా కొత్త ప్రచారాన్ని ్రపారంభించింది. ప్రతి నెలా వృద్ధులకు, వికలాంగులకు వారి ఇళ్ల వద్దకే పింఛన్ వెళ్లేందుకు శ్రీకారం చుట్టింది. పంచాయితీ స్థాయి సర్పంచ్ పాఠశాలను ్రపారంభించి, బాలికలకు కంప్యూటర్ విద్యతో పాటు డిజిటల్ అంగన్వాడీ, మోడ్రన్ ప్లే స్కూల్స్‌ను ఏర్పాటు చేసింది. చిన్న పల్లెటూరిలో ఉండి కూడా గొప్ప పని చేయగలమని నీరూ నిరూపించింది.చర్చావేదిక: సుప్రియా దాస్ దత్తా ఫార్మసీలో డిప్లమా చేసిన సుప్రియా దాస్ దత్తా త్రిపుర నివాసి. సెపాహిజాల జిల్లా పంచాయితీ అధ్యక్షురాలు. ప్రజాతీర్పులో మహిళల భాగస్వామ్యాన్ని చాటడానికి సుప్రియ బలమైన న్యాయవాదిగా ఎదుగుతున్నారు. సుప్రియ తన జిల్లాలో మహిళల కోసం చర్చా వేదికను ్రపారంభించారు. ఇక్కడ ప్రజలు జిల్లా పంచాయితీ అధికారులకు ముఖ్యమైన గ్రామీణాభివృద్ధి సమస్యలపై తమ ఆందోళనలు, ఆలోచనలను తెలియజేయవచ్చు. సుప్రియ చేస్తున్న పనులను ప్రధాని మోదీనీ ఆకట్టుకున్నాయి. పిల్లల సంరక్షణ సౌకర్యాలను ్ర΄ోత్సహించడంలో కూడా చురుకుగా పాల్గొంటున్నది. లోతుగా పాతుకు΄ోయిన సామాజిక నిబంధనలను పరిష్కరించడం ద్వారా లింగ సమానత్వాన్ని సాధించవచ్చని సుప్రియ గట్టిగా నమ్ముతోంది. సమాజంలో తాను ΄ోషించే పాత్ర ద్వారా మహిళలు పురుషులకంటే ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించాలనుకుంటోంది. -
Vipul Varshney: ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
‘కోరుకున్న రంగంలో రాణించాలంటే మనలో ఒక తపన ఉండాలి. ఒక తపస్సులా ఆ రంగాన్ని స్వీకరించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటారు ఐదు పదుల వయసు దాటిన విపుల్ వర్షిణే. లక్నోవాసి అయిన విపుల్ వర్షిణే ముప్పైఏళ్లుగా ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, గుర్తింపు పొందారు. ఒక్కరూ తన మాట వినడం లేదు అనే నిరాశ నుంచి రెండు విమానాశ్రయాల రూపకల్పన చేసేంత స్థాయికి ఎదిగారు. విపుల్ వర్షిణే తనను తాను శక్తిగా మలుచుకున్న విధానం నేటి మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తుంది. ‘నా పేరు విపుల్ అనే ఉండటంతో మగ ఆర్కిటెక్ట్ అనుకుని, సంప్రదించేవారు. నేను మహిళను అని తెలిసి వర్క్ ఇవ్వడానికి వెనకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొంతమార్పు చూస్తున్నాను కానీ, 30 ఏళ్ల క్రితం నేను ఆర్కిటెక్ట్ అని చెబితే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు నేను రెండు విమానాశ్రయాలను డిజైన్ చేసే స్థాయికి ఎదిగాక ఈ రంగంలో అమ్మాయిలూ రాణించగలరు అనే స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను చేసిన ప్రయత్నం ఆషామాషీ కాదు. సృజనతో అడుగు పుట్టి, పెరిగింది లక్నోలో. స్కూల్ ఏజ్ నుంచి పెయిం టింగ్స్ వేయడం, కార్టూన్స్ గీయడం వంటివి చూసి వాటిని పత్రికలకు పంపించే వారు నాన్న. మొదట నేను మెడిసిన్ చదవాలని కోరుకున్న మా నాన్న నాలోని సృజనాత్మకత చూసి ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేయమని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆర్కిటెక్చర్ సైన్స్, సృజనాత్మకతల సమ్మేళనంగా ఉంటుంది. మా నాన్న మనసులో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, అది నాకు సురక్షితమైనదని భావించేవారు. నేను ఎంచుకున్న రంగం చాలా శ్రమతో కూడుకున్నదని ఆయనకు తెలియదు. అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి రాత్రంతా డ్రాయింగ్ బోర్డ్ పైనే పని చేయాల్సి వచ్చేది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.. ’’నేను ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ముగ్గురం మాత్రమే అమ్మాయిలం. ఈ వృత్తిలో అబ్బాయిలదే అధిపత్యమని అప్పుడు అర్థమైంది. కాలేజీలో చదివే సమయంలోనే పెళ్లి అయ్యింది. మావారు సివిల్ ఇంజనీర్ కాబట్టి పెళ్లయ్యాక ఆయనతోనే కెరీర్ప్రారంభించాను. భవనాలు కట్టే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో మాట్లాడేందుకు కూలీలు తడబడేవారు. మేస్త్రీలు నా మాటలను అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒక మహిళ యజమానిగా మారడం వారెవరికీ ఇష్టం ఉండదని అప్పుడు అర్ధమైంది. అసలు నన్ను వారు నిర్మాణశిల్పిగా అంగీకరించలేదు. నిరాశగా అనిపించేది. కానీ, నా డిజైన్ ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని నా నిర్ణయాన్ని సున్నితంగానూ, అంతే కచ్చితంగానూ తెలియజేశాను. అక్కడ నుంచి ఆర్కిటెక్ట్‌గా ఎదగడానికి నన్ను నేను మార్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్‌లో నాకు, నా భర్తకు విడివిడిగా క్యాబిన్లు ఉండేవి. క్లయింట్స్ వచ్చినప్పుడల్లా నా సలహా తీసుకోవాలని నా భర్త తరచూ వారికి చె΄్పాల్సి వచ్చేది. తీసుకున్నప్రాజెక్ట్ పూర్తి చేయడం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టేదాన్ని. కానీ వచ్చిన వాళ్లు మాత్రం ‘మిస్టర్ విపుల్ వర్షిణే ఎప్పుడు వస్తారు’ అని అడిగేవారు. నేనే విపుల్ అని, ఆర్కిటెక్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయేవారు. 200 భవనాల జాబితా భవన నిర్మాణంలో నా వర్క్‌ని కొనసాగిస్తూనే లక్నోలోని చారిత్రక కట్టడాలపై, వాటి పరిరక్షణ గురించిప్రాజెక్ట్ వర్క్ చేశాను. అక్కడి వారసత్వ కట్టడాల పట్ల ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదని తెలుసుకొని దాదాపు 200 భవనాల జాబితాను తయారు చేశాను. ఆ జాబితాను పురావస్తు శాఖకు అప్పగించాను. ఆ సమయంలోనే 500 పేజీల ఆప్రాజెక్ట్ వర్క్‌ని పుస్తకంగా తీసుకువస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న సన్నిహితుల సలహాతో బుక్‌గా తీసుకువచ్చాను. అలా రచనా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇప్పటి వరకు మన దేశ వారసత్వ సంపదపైన ముఖ్యంగా లక్నో సంస్కృతి, వారసత్వ నగరం, చరిత్ర ద్వారా నడక, మ్యూజింగ్స్ ఇన్ బెనారస్, ఎ కెలిడోస్కోప్ ఆఫ్ ది హార్ట్, లక్నో ఎ ట్రెజర్ పేర్లతో 5 పుస్తకాలు ప్రచురిత మయ్యాయి. ఇటేవలే అయోధ్యకు సంబంధించి ఎ వాక్ త్రూ ది లివింగ్ హెరిటేజ్ ప్రచురితమైంది. ‘షామ్ ఎ అవద్ పుస్తకంలో లక్నో సంస్కృతిపై స్కెచ్‌లు కూడా వేశాను. లక్నోలోని చికంకారీ ఎంబ్రాయిడరీ, ఈ నగరంలోని వీధులు, మార్కెట్ల గురించి ప్రస్తావించాను. లక్నో ఇన్టాక్కి కన్వీనర్‌గా ఉన్నాను. లేహ్ విమానాశ్రయం .. ఓ సవాల్! 2018లో లేహ్ ఎయిర్పోర్ట్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. ఈప్రాజెక్ట్ నాకు అత్యంత సవాల్‌గా ఉండేది. ఎందుకంటే అక్కడ భూమి, పర్యావరణం చాలా భిన్నంగా ఉంటాయి. పర్వతాల కారణంగా భూభాగం చాలా తేడాగా ఉంటుంది. విమానాశ్రయం అరైవల్, డిపార్చర్ లాంజ్‌ల మధ్య 3 అంతస్తుల వ్యత్యాసం ఉంది. అక్కడ లగేజీ బెల్ట్ రివర్స్ చేయాల్సి వచ్చింది. ఉష్ణోగ్రత చాలా తక్కువ కాబట్టి, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగించే ద్రవం ఘనీభవన స్థానం కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రత్యేక రసాయనాలను ఉపయోగించి, దానిని ఏర్పాటు చేశాను. లేహ్‌లో అనేక బౌద్ధ విహారాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం వద్ద 30 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఉంచాను. అక్కడి స్థానిక సంస్కృతి, కళ, హస్తకళలను దృష్టిలో ఉంచుకుని రంగు రంగుల వలలు,ప్రార్థన చక్రాలను ఏర్పాటు చేయించాను. అయోధ్య విమానాశ్రయం పనిప్రారంభించినప్పుడు అక్కడ మహంతులు, సాధువులను కలుస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే అక్కడి నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సరైన సమాచారం కోసం చాలా పుస్తకాలు చదివాను. వివిధ వృత్తులలో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. దీంతో అయోధ్యపై నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత దానినే పుస్తకంగా తీసుకు వచ్చాను. ఒక సృజనాత్మక వ్యాపకం నన్నూ నా దిశను మార్చింది. సవాల్‌గా ఉన్న రంగంలో సమున్నతంగా నిలబడేలా చేసింది. ఏ రంగం ఎంచుకున్నా అందులో మనదైన ముద్ర తప్పక వేయాలి. అప్పుడే, ఎక్కడ ఉన్నా సరైన గుర్తింపు లభిస్తుంది’ అని వివరిస్తారు విపుల్ వర్షిణే. -
అతివకు అందలం!
ముంబై: దేశంలో ఉద్యోగాలు, ఇతర క్రియాశీలక పనుల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోంది. మహిళా సాధికారత దిశగా ఇదొక ముందడుగు అని చెప్పొచ్చు. ఇండియాలో 140 కోట్లకుపైగా జనాభా ఉండగా, వీరిలో 69.2 కోట్ల మంది మహిళామణులే. వీరిలో దాదాపు 37 శాతం మంది ఉద్యోగాలు, క్రియాశీలక పనుల్లో కొనసాగుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ‘కెరీర్‌నెట్స్’ అనే సంస్థ ‘ఇండియాలో మహిళా ఉద్యోగుల స్థితిగతులు’ పేరిట తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఉద్యోగాలు చేస్తున్న మహిళల విషయంలో హైదరాబాద్, పుణే, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. 2022తో పోలిస్తే 2023లో శ్రామికశక్తిలో అతివల ప్రాతినిధ్యం 2 నుంచి 5 శాతం పెరిగినట్లు తెలియజేసింది. జూనియర్ ప్రొఫెషన్ ఉద్యోగాలు, ఎగ్జిక్యూటివ్ బోర్డుల్లో వారి భాగస్వామ్యం పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► 2023లో కాలేజీల నుంచి వచ్చి కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ► ఒకటి నుంచి ఏడేళ్ల అనుభవం ఉన్న మహిళలకు కొత్తగా జరుగుతున్న నియామకాల్లో 20 నుంచి 25 శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. ► దేశ రాజధాని ఢిల్లీ మినహా ఇతర నగరాల్లో మహిళల నియామకం పెరిగింది. ఢిల్లీలో మాత్రం తగ్గిపోయింది. ► ఉద్యోగాల్లో మహిళల నియామకం రేటు హైదరాబాద్‌లో 34 శాతం, పుణేలో 33 శాతం, చెన్నైలో 29 శాతంగా నమోదైంది. ఢిల్లీలో ఇది కేవలం 20 శాతంగా ఉంది. -
సృష్టికి మూలం.. సీఎం జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: జగనన్న సంకల్పంతో.. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాజకీయ, పాలనా పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృద… pic.twitter.com/u8SkR9hoP7 — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 -
వనిత ప్రగతి పరుగు?!
"ఆడాళ్ళు మీకు జోహార్లు .. ఓపిక,ఒద్దిక మీ పేర్లు- మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు.." - ఆచార్య ఆత్రేయ. అది అక్షరాలా నిజం. 'క్షమయా ధరిత్రి' అన్న ఆర్యోక్తికి మరోరూపం ఇచ్చారు ఆచార్యులవారు. ప్రతి రంగంలోనూ ఒకరిని మించి మరొకరు దూసుకెళ్తునే ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కరించారు. "ఆడవాళ్లు - మగవాళ్లు ఇద్దరూ సమానమే,కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం". ముళ్ళపూడివారి మాటలు కూడా నిజాన్ని ప్రతిబింబించేవే. 'ఆకాశంలో సగం' అనే మాట వినడానికి అందంగానే ఉంటుంది కానీ, ఆచరణలో అన్నింటా ఆడవాళ్లకు సగభాగం దొరుకుతోందన్నది అర్ధసత్యం. ఇప్పటికీ ప్రపంచంలో స్త్రీ ఎక్కువ గౌరవాలు పొందుతున్నది మన భరతభూమిలో అన్నది కాదనలేని నిజం. కొంత ఛాందసాలు, చాదస్తాలు రాజ్యమేలుతున్నా, మన వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు మనల్ని మిగిలినవారి కంటే భిన్నంగా నిలుపుతున్నాయి. బంధాలు, బాంధవ్యాల వీచికలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. ప్రతి మార్చి 8వ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకోవడంతోనే సరిపోదు. నిజమైన పండుగ వారి గుండె గుడిలో నిండుగ ఉదయించాలి. ఈ వేడుకను ఒకొక్క దేశంలో ఒకొక్క రకంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే అమ్మను అమ్మవారుగా నిత్యం కొలిచే ఆచారం మనకు వేళ్లూనుకొని వుంది.అదే సమయంలో కష్టాలు,కన్నీళ్లు,బానిసత్వం, అణగదొక్కే విధానం,ఆచారాల పేరిట అసమానతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలోనూ ఆటవిక పోకళ్ళు వదలడం లేదు.'నిర్భయ' చట్టాల వంటివి ఎన్ని వచ్చినా,ఆడపిల్లలు నిర్భయంగా తిరిగే రోజులు ఇంకా రాలేదు. అక్షరాస్యత పెరుగుతున్నా,అరాచకాలు ఆగడంలేదు.ఉద్యోగిత పెరుగుతున్నా సమానత ఇంకా సాధ్యమవ్వలేదు. ఓటు హక్కు వచ్చినా,చట్ట సభల్లో మహిళలు ఇంకా ఆమడ దూరంగానే ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినా, ఆచరణకు ఏళ్ళుపూళ్ళు పట్టేలా వుంది. శాసనాలు చేసే అధికారం రావాలంటే ఇంకా చాన్నాళ్ళు ఆగాల్సిందే.అప్పటిదాకా శాసించే శక్తి మగవాళ్ల దగ్గరే వుంటుంది. ప్రజాస్వామ్యం,రాజ్యాంగం అందించిన అవకాశాలతో మహిళామణులు రాష్ట్రపతి , స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అందుకున్నా, అది సరిపోదు.సమత, సమతుల్యత ఇంకా సాధించాల్సి వుంది. ఇంకొక వైపు వరకట్నపు చావులు, అత్తారింటి వేదింపులు ఆగకుండా సాగుతూనే ఉన్నాయి. 'స్త్రీలకు స్త్రీలే శత్రువులు' అన్నది ఇంకా వీడడం లేదు. లింగవివక్ష నుంచి పూర్తిగా బయటపడే తరుణం కోసం తరుణులంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్ధిక స్వేచ్ఛ,సమానత్వం కోసం ఎదురుతెన్నులు కాస్తూనే ఉన్నారు.కార్మిక సంఘాలు ఏర్పడినా,చట్టాలు వచ్చినా మహిళా కార్మికులు,కర్షకుల వేతనాల చెల్లింపుల్లో అన్యాయం జరుగుతూనే ఉంది.1991లో భారతదేశం సరళీకరణ ఆర్ధిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం ఎంతో బలపడింది.ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి కానీ, ఎంపిక ప్రక్రియలో అసమానత అలాగే ఉంది.సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త నయం.అమ్మాయిలను తరలించే (విమెన్ ట్రాఫికింగ్) విషవ్యాపారం,బాలికలపై అత్యాచారాలు యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గ్రామీణ మహిళా సాధికారత ఎంతో పెరగాల్సి ఉంది. పేదరిక విముక్తి, ఆకలి నిర్మూలనకు ముగింపు వాక్యాలు పలకాల్సి ఉంది. 'పని సంస్కృతి' (వర్క్ కల్చర్ ) మారుతున్న క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులకు తగినట్లుగా సౌకర్యాలు పెరగాలి. 100 సంవత్సరాల పై నుంచీ 100 దేశాలకు పైగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటున్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదాన్ని వినిపిస్తున్నారు. అవి నినాదాల దశ దాటి ఆచరణ దశకు చేరుకోవడం లేదు. కొంత అభివృద్ధి, ప్రగతి చోటుచేసుకున్నప్పటికీ సమగ్రత,సంపూర్ణత సాధించాల్సి ఉంది. 'లింగ సమానత్వం సాధించడం' 2022 సంవత్సరంలో ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ డిజిటల్ యుగంలో, 'నవీనత్వం - సాంకేతికతలో లింగ వివక్షలేని సమానత్వం' 2023 ఎజెండాగా కల్పన చేసుకున్నారు. ' ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ - యాక్సలరేట్ ప్రోగ్రెస్ '- 2024 ఎజెండాగా పెట్టుకున్నారు. మహిళా సాధికారితను సాధించడానికి ఇంకెన్నాళ్లు పోరాడాలి? అనుకున్నది జరగాలి, ఈ పోరాటం ఆగాలి అన్నది మహిళాలోకం కోరుకుంటున్నది. మహిళా ప్రగతి వేగం పెరగాలని ఈ ఏటి ప్రధాన ఎజెండా. వినడానికి ఎజెండాలు ఎప్పుడూ బాగానే వుంటాయి. ఆచరణలో ఎక్కడ? అనే ప్రశ్నలు ఉదయించడం మానడంలేదు. మరోపక్క...స్త్రీలు అబల దశ నుంచి సబల దశకు చేరుకుంటూనే ఉన్నారు.అనేక రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని రంగాల్లో మించి పోతున్నారు. ఇది పూర్తిగా మహిళామణుల స్వయంకృషి,పట్టుదల, దీక్షాదక్షతలు మాత్రమే. అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నారు. సవాళ్లు, దాడులు ఎదుర్కొని నిలుస్తున్నారు.కాకపోతే, సమానత్వంలో సమగ్రత సాధించాలి. మహిళాలోకం వెలగాలి, వెలుగులు పంచాలి (అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మా శర్మ స్పెషల్ స్టోరీ..) - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
సుస్థిర ప్రగతే లక్ష్యం ఆపొద్దు ఈ పయనం
‘సమాజ పురోగతిని ఆ సమాజంలో మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తూ రాష్ట్రాభివృద్దికి బాటలు వేసింది. పేద, మధ్య తరగతి వారికి మంచి జరగాలంటే పాలకుడికి అనుభవం ఉంటే సరిపోదు. మంచి మనస్సు, వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో అద్భుతాలే జరిగాయి. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయం, సామాజికం, ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు అనేక అవకాశాలను కల్పించారు. సమాజంలో పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టింది. 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే పేద మహిళా కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం ‘వైఎస్సార్ చేయూత పథకం’ అమలు చేసింది. ఈ రెండు పథకాలు లక్షలాది కుటుంబాల వ్యవస్థ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం సొమ్మును నాలుగు ధపాలుగా వారికి అందిస్తామ’ని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరిగి ఎన్నికల జరిగే సమయానికల్లా ఆక్షరాల అమలు చేసి చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నూటికి నూరు శాతం బ్యాంకులకు తమ అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ దశలో దేశంలో ఇతర రాష్ట్రాల పొదుపు సంఘాలన్నింటికీ ఆదర్శంగా నిలిచాయి. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు ♦ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) నాన్ డీబీటీ ద్వారా రూ. 2,72,811 కోట్లు సాయం అందించింది. ♦ ఇంతకు ముందు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఐదేళ్ల కాలంలో ఒక ప్రభుత్వం అంత భారీగా స్థాయిలో పేద మహిళల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు. ♦ ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి సంస్థలతో బ్యాంకులతో ఒప్పందాలు చే సుకొని వారికి వ్యాపార మార్గాలు చూపించింది. ♦ ఈ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా అంతర్జాతీయ సంస్థలు, పేద మహిళల మధ్య సమన్వయం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్త (సెర్ప్) కార్యాలయంలో ప్రత్యేక విభాగం కొనసాగిస్తున్నారు. అతివలను అందలం ఎక్కించాలనే.. ♦ 57 నెలల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అందించిన సహాయం, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కువడానికి అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలోని 18,37,568 మహిళలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ♦ అంతకు ముందు లేనివి, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా పొదుపు సంఘాలకు అందించిన తోడ్పాటుతో 54 శాతం మంది రూ. 5 వేలకు పైనే అంటే ఏడాదికి రూ. 60 వేలకు పైబడి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ♦ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 14,01,519 మంది పొదుపు సంఘాల మహిళలు ఏటా రూ. లక్ష చొప్పున ఆదాయం పొందుతూ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకున్నారు. ♦ మరో 31,04,314 మంది ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ. 5 వేల నుంచి రూ. 8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ. 60 వేల నుంచి రూ. లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు ♦ 2021–2023 ఆర్థిక సంవత్సరంలో 1,126 మంది పొదుపు సంఘాల మహిళలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ఏర్పాటు చేసుకుని భావి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ♦ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే ఎస్సీ,ఎస్టీ మహిళలు తమ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తే ప్రత్యేకంగా ‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా ఆయా రంగాల్లో నైపుణ్యాలపై శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటు అందజేస్తోంది. స్వయం కృషి ‘వనిత’ర సాధ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 250 స్వయం సహాయ సంఘాల మహిళలంతా కలిసి కార్పొరేట్‌కు దీటుగా చేయూత మహిళా మార్ట్ పేరిట షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఒక్కో మహిళ కేవలం రూ.210 పెట్టుబడితో దీనిలో భాగస్తులయ్యారు. కేవలం పది నెలల్లోనే ఈ మార్ట్ మూడు కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది. గత సంక్రాంతి సీజన్లో రూ.రెండులక్షల వరకు అమ్మకాలు జరిపి అందరినీ అబ్బురపరిచింది. డాంబికాల ‘డప్పు’తో సరి ♦ 2014 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ♦ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే డ్వాక్రా అప్పులు మహిళలు బ్యాంకులకు కట్టొద్దని గొప్పగా డప్పు కొట్టారు. ♦ ఆయన చెప్పిన మాటలు నమ్మి రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మందికి పైగా తమ అప్పులు కట్టలేదు. ♦ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని ఐదేళ్ల కాలంలో అమలు చేయలేదు. దీనివల్ల ఏకంగా 18.36 శాతం పొదుపు సంఘాలు (అంటే దాదాపు 14 లక్షల మందికి సంబందించిన సంఘాలు) ఎన్పీఏ (బ్యాంకుల వద్ద రుణ ఎగవేతదారు)లుగా ముద్రవేయించుకున్నాయి. నూరుశాతం మహిళా సాధికారత మహిళా సాధికారత అనే మాట గతంలో వినడం తప్ప సాధించింది లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళా సాధికారత నూటికి నూరుశాతం అమలవుతోంది. మహిళలు సంక్షేమ పరంగా, రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. రాజకీయ ప దవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. – తానేటి వనిత, రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజకీయంగా ఇంకా చైతన్యం రావాలి మహిళలు రాజకీయంగా ఇంకా చైతన్యవంతులు కావాలి. గృహిణిగా పరిమితం కాక సమాజంలో అన్ని రంగాల్లో ఆమె పాత్ర ఉండాలి. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సంక్షేమంతోపాటు రాజకీయంగా మహిళలకు పురుషులతోపాటు సమభాగం కల్పిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మహిళకు కేటాయించడం అభినందనీయం. –ఘంటా పద్మశ్రీ, చైర్పర్సన్, పశ్చిమగోదావరి జెడ్పీ ధైర్యంగా ముందడుగు వేయాలి మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించాలి. మహిళలు మానసికంగా, ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలి. అప్పుడే సమాజం బలంగా ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపదలో ఉన్నవారికి, అన్యాయం జరిగిన మహిళలకు మహిళా కమిషన్ ద్వారా అండగా నిలుస్తున్నారు. – బూసి వినీత, మహిళా కమిషన్ సభ్యురాలు -
ఇంతింతై.. ఆకాశమంతై..
సాక్షి, అమరావతి: ‘నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారు.. అన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు.. అన్నది ప్రశ్న.’ ప్రముఖ రచయిత్రి, తత్వవేత్త అయిన్ రైన్డ్ చెప్పిన ఈ మాటలకు అర్థం ఈ రోజు మన రాష్ట్రంలో కళ్లెదుటే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ కన్పిస్తున్న ఆత్మవిశ్వాసమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రచించిన ప్రణాళికను 58 నెలలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు. అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారత సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు. మహిళా రాజకీయ సాధికారతలో మనమే నంబర్ వన్ ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో.. స్త్రీవాద రచయిత చలం తన రచనల్లో.. ‘స్త్రీకి శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. మెదడు ఉంది.. జ్ఞానం ఇవ్వాలి.. హృదయం ఉంది.. అనుభవం ఇవ్వాలి..’ అని ఉన్నతంగా చెప్పారు. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె.. ముద్దారగ నేర్పించినన్..’ అన్నారో కవి. ఆచరణకొచ్చేసరికి అతివల మాటకు విలువిచ్చే నేతలెందరుంటారు? వారికి సమున్నతంగా రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించే నాయకులు ఎందరుంటారు? మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శబాటసారి. చరిత్రాత్మక చట్టం చేసి మరీ పదవులు నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయడం ఇదే తొలిసారి. ఆ చట్టంలో పేర్కొన్న దాని కంటే నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు పడతులకే ఇచ్చారు. మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 ప్రమద లోకానికే ఇచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టుల్లో 102 మహిళలకే ఇచ్చారు. 1,356 రాజకీయ నియామకాల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం తరుణీమణులకే కేటాయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించిన సీఎం వైఎస్ జగన్ ► రాష్ట్రంలో 13 జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. ► 26 జడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. ► 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం మహిళలకు ఇచ్చారు. ► మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే.. అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. ► 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది.. అంటే 64 శాతం మహిళలే ఛైర్ పర్సన్లు. ► ఈ మున్సిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది.. అంటే 55 శాతం ప్రమదలకే దక్కేట్లు చేశారు. ► సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం ముదితలే ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దాదాపు 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం వనితలనే నియమించారు. ఇంకా దాదాపు 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో.. 51 శాతం మహిళలే ఉన్నారు. -
మహిళల రాజసం
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో.. స్త్రీవాద రచయిత చలం తన రచనల్లో.. ‘స్త్రీకి శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. ఆమెకు మెదడు ఉంది.. దానికి జ్ఞానం ఇవ్వాలి.. ఆమెకు హృదయం ఉంది.. దానికి అనుభవం ఇవ్వాలి..’ అని ఉన్నతంగా చెప్పారు. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె.. ముద్దారగ నేర్పించినన్..’ అన్నారో కవి. ఆచరణకొచ్చేసరికి అతివల మాటకు విలువిచ్చే నేతలెందరుంటారు? వారికి సమున్నతంగా రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించే నాయకులు ఎందరుంటారు?మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శ బాటసారి. ‘నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారు.. అన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు.. అన్నది ప్రశ్న.’ ప్రముఖ రచయిత్రి, తత్వవేత్త అయిన్ రైన్డ్ చెప్పిన ఈ మాటలకు అర్థం ఈ రోజు మన రాష్ట్రంలో కళ్లెదుటే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ కన్పిస్తున్న ఆత్మవిశ్వాసమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రచించిన ప్రణాళికను 58 నెలలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు. అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారత సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. ప్రధానంగా మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. - సాక్షి, అమరావతి కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు. ♦ రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. ♦ 26 జెడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. ♦ 12 మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చారు. ♦ మొత్తం మునిసిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే.. అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. ♦ 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది.. అంటే 64 శాతం మహిళలే ఛైర్పర్సన్లు. ♦ ఈ మునిసిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది.. అంటే 55 శాతం ప్రమదలకే దక్కేట్లు చేశారు. ♦ సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం ముదితలకే దక్కేలా చర్యలు తీసుకున్నారు. ♦ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దాదాపు 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం వనితలనే నియమించారు. ఇంకా దాదాపు 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో.. 51 శాతం వనితలే ఉన్నారు. చరిత్రాత్మక చట్టం చేసి మరీ పదవులు ♦ నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. ♦ దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయడం ఇదే తొలి సారి. ఆ చట్టంలో పేర్కొన్న దాని కంటే నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు పడతులకే ఇచ్చారు. ♦ మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 పదవులు ప్రమదాలోకానికే ఇచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చారు. అంటే మొత్తంగా 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం తరుణీమణులకే కేటాయించారు. -
‘చేయూత’ పండుగ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మనందరి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళా దినోత్సవం ముందు రోజు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మహిళా సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరొకటి లేదన్నారు. 45 – 60 ఏళ్ల వయసున్న మహిళలకు నాలుగో విడత ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అనకాపల్లి జిల్లాలోనే నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆర్థిక సాయంతో ఎదిగిన మహిళలంతా తమ విజయగాథలను వివరిస్తూ రానున్న 14 రోజుల పాటు సచివాలయాలవారీగా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు – దత్తపుత్రుడు గతంలో మేనిఫెస్టోలో అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదని మండిపడ్డారు. వారి పేరు చెబితే 8 రకాల మోసాలు, దగా గుర్తురాగా మన ప్రభుత్వం పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబును చూస్తే విశ్వసనీయతలేమి గుర్తుకొస్తుందని, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం తెచ్చేలా కార్లను మార్చినట్లు భార్యలను మార్చే వ్యవహారం గుర్తుకొస్తుందని విమర్శించారు. వారిని నమ్మితే కాటేసే పాముని నమ్మినట్టేనని, తినేసే పులిని ఇంటిని తెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ప్రతి ఇంటికీ మేలు చేసిన మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపైనర్లుగా నిలిచి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమాన్ని గురువారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడలో సీఎం జగన్ ప్రారంభించారు. ఆయన ఏమన్నారంటే.. 14 రోజులు పండుగ వాతావరణంలో.. మహిళా సాధికారతకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించే వైఎస్సార్ చేయూతలో ప్రజా ప్రతినిధులందరూ పాలుపంచుకుంటారు. అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి? అనే స్ఫూర్తిదాయక కధనాలను ప్రతి సచివాలయం, ప్రతి మండలంలో చర్చించుకునేలా తెలియచేయాలని ప్రతి అక్కనూ, చెల్లెమ్మనూ కోరుతున్నా. 45 ఏళ్లు పైబడిన అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు? వారికి తోడుగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదు. ఇంటిని నిలబెడుతూ.. ప్రతి అక్కచెల్లెమ్మ సొంత కాళ్లపై నిలబడేలా క్రమం తప్పకుండా చేయూత సాయంతోపాటు బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ అమూల్, ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, హిందుస్తాన్న్ లీవర్ తదితర కంపెనీలతో అనుసంధానించి తోడ్పాటునిస్తున్నాం. ప్రభుత్వం ఏటా రూ.18,500 చొప్పున ఇస్తోంది కాబట్టి కంపెనీలు, బ్యాంకులు కూడా వారికి అండదండలు అందించాయి. 1.69 లక్షల మంది అక్క చెల్లెమ్మలు కిరాణా షాపులు నిర్వహిస్తుండగా 85,630 మంది వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. 3,80,466 మంది గేదెలు, ఆవులు కొనుగోలు చేశారు. 1,34,514 మంది మేకలు కొనుగోలు చేశారు. 88,923 మంది ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తుండగా మరో 3,98,422 మంది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాల్లో ఉన్నారు. ఇంకో 2,59,997 మంది రకరకాల వ్యాపారాలతో సొంత కాళ్లపై నిలబడ్డారు. 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఏదో ఒక వ్యాపారం చేస్తూ నెలకు కనీసం రూ.6 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకుంటూ కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. నాలుగు విడతల్లో రూ.19,189 కోట్లు.. ఒక్క వైఎస్సార్ చేయూత పథకం ద్వారానే 58 నెలల వ్యవధిలో 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి పంపించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. వారికి ఒక మంచి తమ్ముడిగా, అన్నగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి రుణపడి ఉంటా. నవరత్నాల పథకాల ద్వారా మరో రూ.29,588 వేల కోట్ల మేర లబ్ధి పొందారు. ఇదే 33 లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలను చూస్తే మరో రూ.56,188 కోట్ల మేర కూడా మంచి జరిగింది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతతో గొప్పగా ఎదగాలని ప్రతి అడుగూ ముందుకు వేశాం. గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ వారికి రిజర్వేషన్ కల్పించిన తొలి ప్రభుత్వం ఇదే. గత ప్రభుత్వానికి ఇలా మేలు చేసిన చరిత్రే లేదు. అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తున్నాం. వసతి దీవెన మొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ వారి ఖాతాలకే డబ్బులను జమ చేసి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. నాడు ఛిన్నాభిన్నం.. నేడు నెంబర్ వన్.. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మనం మళ్లీ ఊపిరి పోశాం. నాడు చంద్రబాబు రుణమాఫీ మోసానికి పొదుపు సంఘాలన్నీ ఏకంగా 18.36 శాతం ఎన్పీఏలు, ఔట్ స్టాండింగ్‌లుగా చిన్నాభిన్నమయ్యాయి. ఇవాళ ఎన్పీఏలు కేవలం 0.17 శాతం మాత్రమే ఉన్నాయి. ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో మన పొదుపు సంఘాలు దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచాయి. వైఎస్సార్ చేయూత ద్వారా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఏకంగా రూ.19,190 కోట్లు మీ బిడ్డ ప్రభుత్వం అందించింది. కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదైతే ప్రతి అడుగులో అండగా నిలిచిన ఘనత మనది.గతానికి, ఇప్పటికి తేడా చూడమని కోరుతున్నా. మాట ఇచ్చిన చోటే... అత్యంత బాధ్యతగా వ్యవహరించే 45 – 60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే వారే కాకుండా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్ఫూర్తిగా ఆలోచన చేశాం. క్రమం తప్పకుండా ఏటా రూ.18,750 చొప్పున వారి చేతిలో పెట్టి జీవనోపాధి మార్గాలు చూపిస్తూ ముందుకు సాగుతున్నాం. చేయూత ద్వారా మొత్తం రూ.75 వేలు ఆర్థిక సహాయం చేస్తానని ఇదే జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడులో నాడు చెప్పా. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళి్టతో నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తూ ఇదే అనకాపల్లి జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు.. సొంతిల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందచేశాం. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా మనదే. ఇది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం. చంద్రబాబు ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చారా అంటే ఇచ్చింది సున్నా. తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం సచివాయాల్లో మహిళా పోలీసును నియమించాం. దిశ యాప్, భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలాంటి వ్యవస్థను తెచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమే. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలో ఏకంగా 50 శాతం వరకు మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే సేవలందిస్తున్నారు. పదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి.. చంద్రబాబు పాలనకు మన పాలనకు వ్యత్యాసం కళ్లకు కట్టినట్లు తెలియాలంటే గత పదేళ్లుగా మీ బ్యాంకు స్టేట్మెంట్లను తీసుకుని ఒక్కసారి పరిశీలించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మీ అకౌంటుకు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా? అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయో మీరే గమనించండి. లక్షాధికారులైన మహిళల జాబితాలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం కూడా చెప్పింది. మేనిఫెస్టోలో హామీలలో 99% అమలు చేసి మరోసారి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం మనదే. ఈ 58 నెలల కాలంలో మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరుతున్నా. చెడిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. మీ బిడ్డ ఒక్కడే ఆ పని చేయలేడు. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే సాధ్యం. బాబు – దత్తపుత్రుడు 8 మోసాలివిగో.. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది. 2014లో చంద్రబాబు – దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా? ► రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు. అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్‌మెంట్ వచ్చేది. ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు. ► ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు. ► మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ► ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. ► మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. ► పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు. ► బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. ► మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లు.. 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు. అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించారు. మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం. అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచడం మరో గజ మోసం. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు. బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా. -
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
అక్కచెల్లెమ్మలకు ఇది స్వర్ణయుగం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన రాష్ట్రంలో మహిళలకు స్వర్ణ యుగమని, మహిళలే కేంద్రంగా వారి సంక్షేమం, అభివృద్ధికి సీఎం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని పలువురు మహిళా మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. విజయవాడలోని ఒక హోటల్లో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన–మహిళా స్పందన’ అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో 90 శాతం మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు యునిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత, సంక్షేమంపై మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీత లఖంరాజు రూపొందించిన నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్రంలో ‘జగన్ సంక్షేమ పాలన కావాలో.. బాబు దోపిడీదారుల పాలన కావాలో’ తేల్చుకునే సమయం ఆసన్నమైందని, మళ్లీ జగన్‌ను గెలిపించుకునేలా తాము సిద్ధమంటూ పలువురు వక్తలు ప్రతినబూనారు. మహిళా సంస్కర్త జగన్ మహిళా సాధికారతతోనే సమాజం వృద్ధి చెందుతుందని నమ్మిన గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికం మహిళలే కేంద్రంగా అమలు చేస్తున్నారు. మహిళను హోంమంత్రిగా చేయడంతోపాటు ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కుకునేలా సున్నా వడ్డీ అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్సార్. ఇప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేసింది సీఎం జగన్ ఒక్కరే. పేదలు, మహిళల అభ్యున్నతికి జగన్ ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. –డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ జగన్ పాలనలో రూ.11.41 కోట్ల సంపద సీఎం జగన్ 58 నెలల పాలనలో రాష్ట్రంలోని మహిళలకు సుమారు రూ.11.41 లక్షల కోట్ల సంపద సమకూరింది. మరే రాష్ట్రంలో ఏ సీఎం కూడా మహిళల కోసం ఇంతలా చేయలేదు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఒక్కో సెంటు విలువ రూ.2.50 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన ఇళ్ల స్థలాల విలువ రూ.7.75 లక్షల కోట్లు. 31 సంక్షేమ పథకాలతో మహిళా లబ్ధిదారులకు రూ. 2.66 లక్షల కోట్లు అందించారు. సుమారు రూ.లక్ష కోట్లతో లక్షలాది గృహాలు నిర్మించి ఇస్తున్నారు. మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శమని ‘జర్నల్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నొవేటీవ్ రీసెర్చ్’ పుస్తకంలో కూడా పేర్కొన్నారు. –వీవీఆర్ కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ ప్రభుత్వం వచ్చాకే ప్రాధాన్యం నేను 25 ఏళ్లుగా సర్వీస్ సెక్టార్లో పనిచేస్తున్నాను. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాకే మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరిగింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జగన్‌లా మహిళలకు ఎవరూ పెద్దపీట వేయలేదు. సీఎం జగన్ దార్శనికతతో మహిళలు సాధికారత దిశగా ఆడుగులు వేశారు. –బండ్లమూడి రోజారాణి, యునిసెఫ్ ప్రతినిధి పెరిగిన మహిళల తలసరి ఆదాయం జగన్ ప్రభుత్వం వచ్చాకే మహిళలకు తలసరి ఆదాయం పెరిగిందని నివేదికలే చెబుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా నేరుగా మహిళల ఖాతాలకు నగదు జమ చేయలేదు. 58 నెలల జగన్ పాలనలో మహిళలకు సంపద సృష్టించి రికార్డు నెలకొల్పారు. –సునీత లఖంరాజు, మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు వైద్యానికి అధిక ప్రాధాన్యం జగన్ ప్రభుత్వం వచ్చాక వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 17 మెడికల్ కాలేజీలు పెట్టడంతో జగన్ చరిత్ర సృష్టించారు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చాలా గొప్ప నిర్ణయం. గడప గడపకు వైద్యులు వెళ్లి వైద్యం అందించడం గొప్ప పని. –డాక్టర్ షమా, హోప్ విన్ హాస్పిటల్స్ ఫౌండర్ లా చదివేందుకు మహిళల ఆసక్తి న్యాయవాదులను ప్రోత్సహించేలా సీఎం జగన్ లా నేస్తం ద్వారా నెలకు రూ.5 వేలు అందిస్తున్నారు. లా నేస్తం పథకంలో మహిళా లాయర్లు ఉండటంతో వారికి ప్రోత్సాహంగా ఉంది. దీని వల్ల లా చదివేందుకు మహిళల్లో ఆసక్తి పెరిగింది. –నరహరశెట్టి జ్యోతి, బెజవాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మహిళా సాధికారతకు ఐకాన్ జగన్ మహిళా సాధికారతలో సీఎం జగన్ ఐకాన్‌గా నిలిచారు. జగన్‌ను మళ్లీ సీఎం చేయడం ద్వారా రానున్న రోజుల్లో మహిళలు మరింత సాధికారత దిశగా అడుగులు వేస్తారు. –అరవింద రాజా గాలి, సామాజిక కార్యకర్త జగన్ దయతో బిడ్డల్ని చదివిస్తున్నా నా ఇద్దరు బిడ్డల్లో ఒకరినే చదివిద్దామనుకున్నా. జగన్ దయ వల్ల ఇద్దరు బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్, సంక్షేమ పథకాలతో నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాను – నక్కా సుసన్న, గృహిణి మళ్లీ జగన్ రావాలి జగన్ పాలన మళ్లీ వస్తేనే మహిళలకు భద్రతతోపాటు మరింత మేలు చేకూరుతుంది. మహిళలకు మేలు చేస్తున్న జగన్‌ను మనమంతా గుర్తించుకోవాలి. జగన్ రాకపోతే మళ్లీ దోపిడీకి గురవుతాం. – పులుగు సుశీలా రెడ్డి, సామాజిక కార్యకర్త మహిళల భద్రతకు భరోసా అయోధ్యలో రాముడి కోసం ఎదురు చూసినట్లు మహిళలంతా జగన్ కోసం చూశారు. జగన్ అందించిన భరోసా వల్లే మహిళలు నేడు తలెత్తుకుని తిరుగుతున్నారు. దిశా బిల్లు వంటి అనేక కార్యక్రమాలతో జగన్ ప్రభుత్వం మహిళలకు భరోసా ఇచ్చింది. – శిష్ట్లా ధనలక్ష్మి, బ్యాంకింగ్ రంగ నిపుణులు -
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి
విజయవాడ, సాక్షి: చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి.. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త. ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు రామచంద్రగుహ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇబ్బందులు తొలగిపోలేదు. అలాంటిది.. ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు ఓ మహర్షిలా జగన్.. .. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారాయన. అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్. దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరే. అందుకే ప్రజలు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి.. జగన్మోహన్రెడ్డి ఒక వ్యవస్థ. వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి. పేదలు...మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్. అందుకే జగన్ చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి. రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది చంద్రబాబు పనైపోయింది అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. గత పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది. చంద్రబాబు పనైపోయింది. ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి. అందుకే తన కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం. చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యం. జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు మీటింగ్‌లు పెడుతున్నాడు. సన్నాసి అయిన లోకేష్ కావాలా?.. మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలి. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ఏపీ ప్రజలను హెచ్చరించారామె. ఈ సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి,మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్త్రీ సాధికారతతోనే దేశ పురోగతి
ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల రాజకీయ ఉన్నతి పెరుగుతున్నది. స్త్రీలలో వస్తున్న నిరంతర చైతన్యం, పెరుగుతున్న సానుకూల దృక్పథం, అంకిత భావం, పోరాట శక్తి వారిని మునుముందుకు నడిపిస్తున్నాయి. పార్లమెంటులో స్త్రీలు అధిక సంఖ్యలో ఉన్నప్పుడే వారి ప్రతిపాదనలు, హక్కులు నెరవేరతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. స్త్రీ విద్యావంతురాలయితే ఆరోగ్యం, పరిసరాలు, సామాజిక ఘర్షణలన్నింటినీ చక్కగా అవగాహన చేసుకోగలుగు తుంది. స్త్రీలు తమ అస్తిత్వానికి సంబంధించి రాజీపడరు. వారు ఆత్మగౌరవ నిధులు. వారిలో జీవన ప్రతిభ ఎక్కువ. అందుకే వారు నాయకులుగా సులభంగా రాణించగలరు. అందుకే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో స్త్రీలకు గణనీయంగా స్థానాలు కేటాయించాలి. స్త్రీ అత్యున్నతంగా విద్యావంతురాలైన కేరళ రాష్ట్రంలో సమాజ వికాసం గొప్పగా ఉంది. స్త్రీ విద్య తక్కువ వున్న రాజస్థాన్‌లో ఇంకా స్త్రీ పట్ల దురాచారాలు కొనసాగుతుండగా, కేరళ స్త్రీ ప్రపంచ ఎల్లలను తాకుతున్నది. కేరళలో ఇంగ్లీషు విద్యను కూడా స్త్రీలకు నేర్పగలిగారు. స్త్రీలకు ఏ భాష అయినా త్వరగా వస్తుంది. ఈ రోజున యాంకర్స్‌లో స్త్రీలు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్‌లో జరిగిన విన్యాసాలలో అసమా నమైన ప్రతిభా పాటవాలు వారు చూపారు. స్త్రీలు ఈ రోజు శాస్త్ర రంగంలో, సాంకేతిక రంగంలో, జ్ఞాన రంగంలో అత్యున్నత దశలో ఉండడానికి కారణం వారికి విద్యార్జన శక్తి అత్యుత్తమంగా ఉండటమే! ‘నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను’ అని ప్రముఖ తత్వ వేత్త డెకార్ట్ అన్నట్లుగా... ‘నేను బాధను అనుభవిస్తున్నాను, కాబట్టే నేను ఉన్నాను’ అనుకొనే స్వభావం, బాధలో సౌఖ్యాన్ననుభవించే గుణం స్త్రీల స్వభావంలోనే ఉందనే నిందను స్త్రీవాదులు ఎదుర్కొ న్నారు. నటాలీ షైన్ అనే న్యూయార్క్ మానసిక వైద్యురాలు చెప్పి నట్లు, ‘స్త్రీ మానసిక శాస్త్రం ఒక సమగ్ర దర్శనంగా రూపొందినప్పుడే స్త్రీకి ఉన్న అన్ని కోణాలు, అంతరాంతరాల్లో ఆమె ఆలోచన సమగ్రంగా దర్శితమవుతాయి.’ స్త్రీలను సాహిత్యం, మనస్తత్వ శాస్త్రంతో పాటు మతం బలంగా పురుష పెత్తనం కిందికి నెట్టింది. అది హిందూమతంలోనే కాదు, అన్ని మతాల్లోను కొనసాగింది. స్త్రీ మానసికంగా బలహీన మైనదని చెబుతున్నవన్నీ అబద్ధాలు. ఆమె ఒక పని తీసుకుంటే ఆ పని పూర్తి అయ్యేవరకు నిదురపోదు. ప్రపంచంలో మానసిక తత్వవేత్తలు అందరూ ఇప్పుడు స్త్రీ ఆత్మ స్థైర్యం మీద సానుకూలంగా స్పందిస్తు న్నారు. అందుకే ఆమె ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోతున్నది. నిజా నికి స్త్రీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా కుటుంబ నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాదు... ఆమె రాజ్య, ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నదని అర్థమవుతుంది. ఈనాడే కాదు, స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీలు ఆయా దేశాల్లో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళారు. క్లియో పాత్రా (ఈజిప్ట్), క్వీన్ ఎలిజబెత్ (బ్రిటన్), కేథరిన్ ది గ్రేట్ (రష్యా), మేడమ్ డె పాంపెడర్ (ఫ్రాన్స్), సిరిమావో బండారునాయకే (శ్రీలంక), మార్గరెట్ థాచర్ (బ్రిటన్), ఇవా పెరాన్(అర్జెంటీనా), గోల్డా మెయిర్ (ఇజ్రాయెల్) లాంటి నాయకురాళ్ళు పితృస్వామ్య వ్యవస్థలోనే రాజ కీయ ఆధిపత్యాన్ని వహించగలిగారు. ఇకపోతే 17వ లోక్‌సభలో స్త్రీల సంఖ్య పెరగడం గుణాత్మకమైన మార్పు అనక తప్పదు. యువకులు, విద్యావంతులైన నాయకులతో కూడిన సభగా 17వ లోక్‌సభ నిలిచింది. గతంలో కంటే లింగ నిష్పత్తి మెరుగైంది. లింగ నిష్పత్తిలో చాలా దేశాల కంటే వెనుకంజలో ఉన్న ప్పటికీ మెరుగుదల కనిపించింది. మొదటిసారి ఎంపీలు దాదాపు సగం (260 మంది) ఉన్నారు. తిరిగి ఎన్నికైన ఎంపీల సంఖ్య కూడా పెరిగింది. 70 ఏళ్లు పైబడిన ఎంపీలు తగ్గి, 40 ఏళ్ళ కంటే తక్కువ వయస్సుగల ఎంపీలు పెరిగారు. ఎంపీల సగటు వయస్సు 54 ఏళ్లుగా ఉంది. తొలి లోక్‌సభలో 26 శాతం మంది యువ ఎంపీలు ఉంటే, 16వ లోక్‌సభ నాటికి 40 ఏళ్ల లోపు వారు 8 శాతం మందే ఉన్నారు. ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. పిన్నవయస్సుగల సభ్యురాలిగా 25 ఏళ్లకు ఎంపీగా ఎన్నికైన బిజూ జనతా దళ్ నేత చంద్రాణి ముర్ము (ఒడిషా) నిలిచారు. వయోవృద్ధుడిగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్ వాదీ ఎంపీ షఫీకుర్ రెహమాన్ బర్క్ (90) ఉన్నారు. పురుషుల కంటే తక్కువ వయస్సు గల మహిళా ఎంపీలు ఈ సభలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 716 మంది ఉంటే, 78 మంది ఎన్నికయ్యారు. 2014లో 62 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. అయితే చాలా దేశాల్లో మహిళా ఎంపీల శాతం ఎక్కువగా ఉంది. రువాండాలో 61 శాతంగా, దక్షిణాఫ్రికాలో 43 శాతంగా, బ్రిటన్‌లో 32 శాతంగా, అమెరికాలో 24 శాతంగా, బంగ్లాదేశ్‌లో 21 శాతంగా ఉంది. 17వ లోక్‌సభ ఎంపీల్లో 39 శాతం మంది తమ వృత్తిని రాజకీయాలు, సామాజిక సేవగా పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తామని 38 శాతం మంది, వ్యాపారవేత్తలమని 23 శాతం మంది వెల్లడించారు. ఇకపోతే స్త్రీలు తమ విద్యా సంపత్తితో పాటు రాజకీయ అవ గాహనను కూడా పెంచుకోవాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు అన్నీ స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెబుతున్నాయి. 2016లో నిర్వహించిన లింగ సమానత్వ సూచిలో 87వ ర్యాంక్ పొందిన ఇండియా... 2023 నాటికి 146 దేశాల్లో 144వ స్థానానికి పరిమితమయ్యింది. 2021 నాటికి దేశంలో కార్మికుల్లో స్త్రీల శాతం (19.2) మాత్రమే అని ప్రపంచ బ్యాంకు నివేదించింది. 2022–23కు 37 శాతానికి పెరిగిన ప్పటికీ, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాలతో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. చైనా ఇప్పుడు 61 శాతం స్త్రీ శ్రామిక శక్తిని కలిగింది. ఈ విష యాలన్నీ పార్లమెంటులో ఎత్తిచూపి నిలవేయాలంటే దళి తులు ఎక్కువగా పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులు కావలసి ఉంది. వ్యాపార రంగంలోనూ, విద్యా రంగంలోనూ, శాస్త్ర రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ స్త్రీలు మరింతగా ఎదగాలంటే రాజకీయరంగంలో స్త్రీల సంఖ్య పెరగాలి. మరో పక్క మహిళలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరుగు తున్నాయి. వాస్తవంలో మహిళలపై దాష్టీకాల ఘటనలు అధిక సంఖ్యలో ఉంటాయనీ, చాలా వరకు అవి బయటకు రావనీ పరిశీలనలు చెబుతున్నాయి. అసంఘటితరంగంలో ఈ వేధింపులు మరింత అధికంగా ఉంటాయని అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క పని ప్రదేశం అని ఏముంది... ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, రహదారులు, ఇలా అన్ని చోట్లా మహిళలు లైంగిక వేధింపులకు గుర వుతున్నారు. పనిచేసే చోట ఇలాంటి అకృత్యాలకు గురయ్యే మహిళల్లో దాదాపు 69 శాతం మంది బయటకు చెప్పుకోవడానికి సైతం సంకో చిస్తున్నారని ‘ఉమెన్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ సర్వే వెల్లడించింది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కొరవడటం, వృత్తిపర మైన ఎదుగుదలకు అవరోధంగా మారుతుందన్న భయంతో బాధిత మహిళల్లో చాలామంది ఫిర్యాదు చేయడానికి వెనకంజ వేస్తు న్నారు. ఉద్యోగం మాన్పించేస్తారన్న భయంతో చాలామంది కుటుంబ సభ్యులకు సైతం చెప్పుకోవడం లేదు. ఇకపోతే పురుషుల మానసిక వ్యవస్థలలో వస్తున్న వికృతమయిన మార్పులవల్ల బాలికలపై కూడా దాడులు పెరుగుతున్నాయి. 11, 12 సంవత్సరాల బాలికలపై దాడులు జరుగుతున్న ప్రాంతాలలో ముంబయి, అమృత్సర్, వడోదరా, అహ్మదాబాద్, మీరట్ ముందు వరుసలో ఉన్నాయి. చివరకు తండ్రే కూతురిని వేధించే అసహ్య కరమైన కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో రాజ్యాధికారంలో స్త్రీల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్లో స్త్రీల విద్య, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని మహిళా ఎంపీలు చైతన్యవంతంగా మాట్లాడుతున్నారు. ఇది శుభ పరిణామం. స్త్రీ సాధికారత జాతీయ పురోగతికి తోడ్పడుతుంది. కరుణ, ప్రేమ, ప్రజ్ఞల విస్తృతికి తోడ్పడుతుంది. ఆ దిశగా మనమందరం నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
సాధికార విజయం..మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
-
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్‌జీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఎకానమిస్ట్‌గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్‌షిప్ అడ్వైజర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం
రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది. – సాక్షి, అమరావతి మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన బడ్జెట్ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మహిళా సాధికారత కోసం.. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్ – చైల్డ్ బేస్డ్ బడ్జెట్లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు.. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది. సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్ యాప్, దిశ పెట్రోల్ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. -
విద్యాప్రవీణ
మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్‌ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ. రాజస్థాన్‌లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది. చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు. స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్స్ట్రక్షన్ వర్కర్‌తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు. ‘సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్‌గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది. ‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు. సర్పంచ్‌గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ. బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్‌ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు. ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది. ‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్‌కు చెప్పి స్కూల్‌కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ. -
Budget 2024-25: మహిళాసాధికారతకు ప్రధాన డిమాండ్లు
మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా వారు రాణిస్తున్నారు. కానీ, భాగస్వామ్యం ఆశించినమేరకు లేదనేది వాస్తవం. ఉదాహరణకు కంపెనీల్లో అత్యున్నతస్థానంలో పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ సదరు సంస్థల్లో వారి సంఖ్య పెరగడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రైవేటు సంస్థలు, ఇతర రంగాలు మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. వీటిని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. రానున్న బడ్జెట్లో వారి అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలంటు డిమాండ్ చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్లో భాగంగా పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసే నగదుపై లభించే వడ్డీను పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని కొందరు కోరుతున్నారు. ప్రసుత్తం 7.5శాతం వడ్డీ అందిస్తున్నారు. దీన్ని మరింత పెంచాలనే డిమాండ్ ఉంది. వర్కింగ్ మహిళలకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే కొందరు భావిస్తున్నారు. మహిళల సాధికారత కోసం సంప్రదాయ వ్యవహారాలకు భిన్నంగా వారికి కొత్త నైపుణ్యాలను నేర్పించేలా చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు. ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి సంబంధించి జెండర్ గ్యాప్ కనిపిస్తుంది. అది తగ్గించడానికి బడ్జెట్లో నిర్ణయాలు చేపట్టాలని కోరుతున్నారు. 15-50 సంవత్సరాల వయసు ఉన్న మహిళల్లో 57 శాతం మందికి రక్తహీనత ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. దాంతో చాలామంది మృతి చెందుతున్నట్లు వెల్లడైంది. రానున్న బడ్జెట్లో మహిళల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ఆశిస్తున్నారు. ఒంటరి మహిళల భద్రత, వారికి నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేలా నిర్ణయాలు ఉండాలని కొందరు భావిస్తున్నారు. నిర్భయ ఫండ్ అనేది మహిళల భద్రత కోసం 2013లో స్థాపించిన నాన్ లాప్సబుల్ కార్పస్ ఫండ్. డిసెంబర్ 2023లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం 70 శాతం నిధులు మాత్రమే అంటే రూ.7,212 కోట్లలో రూ.5,119 కోట్లు పథకం ప్రారంభం నుంచి వినియోగించారు. నేరాలు జరుగుతున్నా వాటిని అరికట్టేలా చర్యలు ఉండడం లేదు. ఈసారి బడ్జెట్లో మరింత నిధులు పెంచి వాటిని సమర్థ్యంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుతున్నా వారు తక్కువ జీతం, తక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాలను చేపడుతున్నట్లు చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆ పరిస్థితులు రాకుండా కేంద్రం బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
Padma Awards 2024: అసామాన్య పద్మశ్రీలు
స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది. ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా... లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము... విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్... కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్... గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది. ఏనుగుల రాణి భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి. కళ్లు తెరవగానే ఏనుగు ‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఏనుగే తోడు 1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్‌సైక్లోపిడియాగా మారింది. క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది. ‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్‌లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది. నారియల్ అమ్మ దక్షిణ అండమాన్‌లోని రంగచాంగ్కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్‌లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్‌లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్. అవమానాలను అధిగమించి గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్‌లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ఆది రాణి అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్. మొక్కవోని ఆత్మస్థైర్యం ‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్‌కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది.... తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను. అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి. ‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్‌లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్షెడ్లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి. ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. -
కుకింగ్ టు కామెడీ క్వీన్స్..
ఒకరు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అయ్యారు.. మరొకరు హెల్త్ కోచ్ అయ్యారు ఇంకొకరు పాకశాస్త్ర ప్రావీణ్యతను చాటుతున్నారు. పై చదువులు చదివి ఇంట్లో కూర్చున్న మహిళలు ఇంటర్నెట్లో ప్రభావశీలురుగా మారారు. ఇంటినుంచే వ్యాపారాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు తీయిస్తున్నారు. సాధారణంగా గృహిణి జీవితం ఉదయం 4–5 గంటలకు నిద్రలేచి, ఇల్లు–వాకిలి శుభ్రం చేసుకొని, పిల్లలను స్కూల్‌కు పంపించి, అందరికీ అవసరమైనవి చేసి పెడుతుండగానే సాయంత్రం అవుతుంది. తిరిగి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. సాయంత్రం టీ, టిఫిన్లు, పిల్లల హోంవర్క్‌లు, రాత్రి భోజనం సిద్ధం చేయడం. రాత్రి పది–పదకొండు గంటలలోపు అన్నీ శుభ్రం చేసి అలసిపోయి అదే చిరునవ్వుతో అందరికీ గుడ్‌నైట్ చెప్పి నిద్రపోవడం. ఇలా ఇల్లు, పెద్దలు, భర్త, పిల్లల గురించి ఆలోచిస్తూ తమని తాము విస్మరించుకునే మహిళలకు ఇప్పుడు ఇంటినుంచే పని చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. మంగళూరుకు చెందిన లిండా ఫెర్నాండేజ్ క్రెస్టా గృహిణి. నాలుగేళ్లుగా కామిక్ రీల్స్ చేస్తూ ప్రజాదరణ పొందింది. క్రెస్టాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక బ్రాండ్లు ఆమెను సంప్రదిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మంగళూరు వీధుల్లో ఆమె హోర్డింగులు కూడా పెట్టారంటే ఆమెకున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ‘గృహిణిగా ఉండటం ఎప్పుడూ కష్టమనిపించలేదు. కానీ, నా కొడుకుకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకున్నాను. దీంతో పాటు ఇంటి బాధ్యతనూ నిర్వర్తించాలనుకున్నాను. అందుకు మా కుటుంబమూ మద్దతు ఇస్తూ వచ్చింది’ అని చెబుతుంది క్రెస్టా. హోమ్ చెఫ్ నాజ్ అంజుమ్ హైదరాబాద్‌లో నివాసముంటున్న హోమ్ చెఫ్. ఏడేళ్ల క్రితం అంజుమ్ తన పేరుతో హోమ్ కిచెన్‌ను ప్రారంభించింది. ఈ రోజుల్లో గృహిణుల ఆలోచనే మారిపోయింది అనడానికి అంజుమ్ ఒక ఉదాహరణ. కాలంతో పాటు సమాజం ఆలోచనా విధానం కూడా మారింది. ఇంట్లో కూర్చున్నా నాకు సోషల్‌మీడియా చాలా ఆర్డర్లు తెచ్చిపెడుతోంది అని చెబుతుంది అంజుమ్. ‘నాకు ముగ్గురు పిల్లలు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి, వారిని స్కూల్‌కి రెడీ చేసి, పంపించిన తర్వాత కిచెన్ బాధ్యత తీసుకుంటాను. 80 రూపాయలతో నా పని ప్రారంభించాను. మా చుట్టూ ఉన్నవారు నా వంటలు తిని మెచ్చుకునేవారు. మా అపార్ట్మెంట్ వాసులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయమని సలహా ఇచ్చారు. అలా చేసిన వంటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. ఆర్డర్లు వరుసగా రావడం ప్రారంభించాయి. ఈ రోజు సోషల్‌మీడియాలో హైదరాబాద్ ఫుడ్ సూపర్ హిట్‌గా పేరొందింది. దీంతో ఒక గృహిణిగా ఉన్న నేను ఉద్యోగినిగా మారిపోయాను’’ అని ఆనందంగా చెబుతుంది అంజుమ్. గృహిణి నుంచి ఒక మహిళ గృహ నిర్వాహకురాలిగా మారింది. ఈ ౖహె టెక్ ప్రపంచంలో గృహిణి తనకంటూ కొత్త బిరుదును సంపాదించుకుంటుంది. ఇప్పుడు తనను తాను పని చేసే గృహిణి అని పిలవడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదిస్తూ, బాధ్యతలను నెరవేర్చడంలో తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంది. మారుతున్న కాలంలో ఈ తరహా ఆలోచన గృహిణితో పాటు ఇంట్లో అందరికీ నచ్చుతోంది. చేతి కళకు ఆదరణ నేటి యాంత్రిక యుగంలో చేతితో తయారు చేసిన వస్తువులు దొరకడం కష్టం. నాణ్యమైన సంప్రదాయ పనితనం కోసం అన్ని వైపుల నుండి డిమాండ్ వస్తోంది. ప్రావీణ్యం కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది గృహిణులు తమ జ్ఞానం ఆధారంగా హోమ్ ట్యూషన్, బ్యూటీపార్లర్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు. జర్నల్ ఆఫ్ కల్చరల్ ఎకానమీలో ప్రచురించిన ఒక అధ్యయనం సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్లు గృహిణిని ‘అందం’ గా మార్చేశాయి అని నిర్వచించింది. సంప్రదాయ గృహిణులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా మారారు. ఈ చిన్న ఆరంభం మహిళను ఉద్యోగ గృహిణిని చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2020–21లో దేశంలో కేవలం 32 శాతం వివాహిత మహిళలు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వివాహిత మహిళల్లో 68 శాతం మంది గృహిణులుగా ఉన్నారు. మారిన కాలంలో ఇప్పుడు గృహిణిగా ఇంట్లో ఉంటూనే ఆర్థిక స్వావలంబన సాధిస్తోంది. ఇది ‘ఆమె’ నైపుణ్యాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంలో చాలా మహిళలు నైపుణ్యం ఉన్నవారే. కొందరు కుట్లు–ఎంబ్రాయిడరీ చేయడంలో, కొందరు వంటలలో, మరికొందరు పెయింటింగ్‌లో నిష్ణాతులు. పనిచేసే గృహిణికి ఆమె ప్రతిభే ఆదాయ వనరుగా మారుతోంది. గృహిణి నిర్వచనంలోనే మార్పు.. కరోనా లాక్డౌన్ కారణంగా సోషల్ మీడియా గృహిణులకు డబ్బు సంపాదించే శక్తిని ఇచ్చింది. ఇప్పుడు అదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. యుఎస్ జనరల్ సోషల్ సర్వే 1972 నుండి 2020 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఇందులో శ్రామిక మహిళలు, పని చేసే గృహిణులు ఎంతో సంతోషంగా ఉన్నారని భావించారు. వీళ్లలో ఎక్కువ మంది మధ్య, ఉన్నత తరగతికి చెందిన 40 ఏళ్ల పైబడిన వారు. ఉద్యోగరీత్యా గృహిణిగా ఉన్నా ఇంటి నిర్వహణ, సంపాదనతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నామనే విషయాలను ఈ సర్వే వెల్లడి చేసింది. -
AP: మరో మహిళా విప్లవం
‘జగనన్న తోడు’ ద్వారా మహిళా సాధికారత, సామాజిక సాధికారతలో మరో విప్లవాన్ని సాధించాం. పథకం ద్వారా లబ్ధి పొందిన మొత్తం 16.73 లక్షల మంది చిరువ్యాపారుల్లో 87.13 శాతం మంది నా అక్క చెల్లెమ్మలే కావడం, అందులోనూ 79.14 శాతం మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉండటం దీనికి నిదర్శనం. పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించ గలుగుతున్నాం. తద్వారా రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. రికవరీ బాగుండటంతో మళ్లీ రుణాలు అందుతున్నాయి. ఇదంతా ఒక చక్రం మాదిరిగా కొనసాగుతోంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘జగనన్న తోడు’ ద్వారా చిరువ్యాపారులకు ప్రభుత్వం తోడుగా నిలుస్తూ మానవత్వానికి మరో పేరుగా నిలిచిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే దిక్సూచిలా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీద ‘పీఎం స్వనిధి’ ద్వారా ఏడు శాతం వడ్డీకి రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఏపీలో జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.3,373 కోట్లు రుణాలు అందజేశామన్నారు. జగనన్న తోడు ద్వారా వరుసగా 8వ విడత చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇస్తూ, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10,000, అంతకు పైగా కలిపి 3,95,000 మంది చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీలేని కొత్త రుణాలను సీఎం జగన్ అందచేశారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్ కింద 5.81 లక్షల మందికి రూ.13.64 కోట్లను కూడా ప్రభుత్వం అందచేస్తోంది. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏంమాట్లాడారంటే.. దశాబ్దాల దుస్థితికి పరిష్కారం.. లక్షల మంది చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమమిది. చిరువ్యాపారుల బతుకులు ఎలా ఉంటాయో మన కళ్లముందే కనిపిస్తున్నా ఆ కష్టాలను ఎలా కడతేర్చాలని ఎప్పుడూ, ఎవరూ ఇంతలా మనసుపెట్టి, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోలేదు. నా పాదయాత్రలో ప్రతి జిల్లాలో వారి కష్టాలను చూశా. వ్యాపారం చేసుకోవడానికి కూరగాయలు, పనిముట్లు, ముడిసరుకు కోసం కనీసం వెయ్యి రూపాయిలు పెట్టుబడి అవసరం. రూ.1,000 అప్పు ఇస్తే ప్రైవేట్ వ్యాపారులు అప్పటికప్పుడే వడ్డీ కింద రూ.100 మినహాయించుకుంటారు. ఇలా రూ.10 వడ్డీకి వెయ్యి రూపాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలా తీసుకుంటే కానీ వారి జీవితాలు ముందుకు సాగని దుస్థితి. దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నా దీనికి పరిష్కారం చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మానవత్వానికి చిరునామా.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లతో మాట్లాడాం. బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తూ ఎలాంటి హామీ లేకుండా రూ.10 వేలు అప్పు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. సకాలంలో తిరిగి చెల్లించేలా లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ వడ్డీ భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఒక భరోసా కల్పించాం. ఇవన్నీ చేస్తూ ఇవాళ 8వ దఫా కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన ప్రభుత్వం మానవత్వానికి చిరునామాగా నిలిచిందని గర్వంగా చెబుతున్నాం. ఇతరులకూ ఉపాధి చూపుతున్నారు.. చేతి వృత్తిదారులు, ఫుట్‌పాత్ విక్రేతలు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, గంపలు, బుట్టలపై అమ్మకాలు చేసేవారు, ఆటోలు, సైకిళ్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేవారు, వివిధ వృత్తుల కళాకారులంతా స్వయం ఉపాధితో తాము జీవించడమే కాకుండా మరికొందరికి కూడా ఉపాది కల్పిస్తున్నారు. ఇలాంటి వారికి జగనన్న తోడు కార్యక్రమం ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు రూ.10 వేలు ఎలాంటి గ్యారంటీ లేకుండా అందించి సకాలంలో చెల్లించిన వారందరినీ ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తరపున వడ్డీని వెనక్కి ఇచ్చాం. ఏటా రూ.1,000 చొప్పున ఈ మొత్తాన్ని పెంచుతూ రూ.13,000 వరకూ తీసుకుని వెళ్లేలా పథకాన్ని అమలు చేయడం సంతోషాన్నిస్తోంది. రుణాలైనా.. రీయింబర్స్మెంటైనా రాష్ట్రంలో గొప్ప విప్లవాత్మక అడుగులు పడుతున్నాయన్నది ఒక అంశం కాగా రెండోది మన ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్రం 7% వడ్డీకి 58,65,000 మందికి ‘పీఎం స్వనిధి’ పేరుతో రూ.10,220 కోట్ల రుణాలు ఇవ్వగా ఒక్క ఏపీలోనే 16,74,000 మందికి రూ.3,373 కోట్ల మేర వడ్డీలేని రుణాలివ్వగలిగాం. మనం ఎలా చేయగలిగాం? మిగిలిన రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి 7%వడ్డీ మొత్తం కింద రూ.138 కోట్లు చెల్లిస్తే ఒక్క ఏపీలోనే చిరు వ్యాపారులకు రూ.88 కోట్లను వడ్డీ రీయింబర్స్మెంట్ కింద తిరిగి అందచేశాం. జీవనోపాధి కల్పిస్తూ అడుగులు.. మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి 18% ఎన్పీఏలుగా ఉంటే మనం వచ్చిన తర్వాత అది 0.3% లోపే ఉంది. పరివర్తన అనేది ప్రతి అడుగులోనూ జరిగింది. అక్కచెల్లెమ్మలు, మహిళా సాధికారత విషయంలో గొప్ప అడుగులు పడుతున్నాయి. వారికి జీవనోపాధి కల్పించేలా అడుగులు వేశాం. అమూల్, రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వారికి వ్యాపార అవకాశాలు కల్పించడంతోపాటు బ్యాంకులతో అనుసంధానించి రుణాలతో తోడ్పాటు కల్పించాం. వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ లాంటి పథకాల ద్వారా అన్ని రకాలుగా తోడుగా నిలిచి మహిళ సాధికారత దిశగా అడుగులు వేయించగలిగాం. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేకూర్చిన లబ్ధి అందుకు నిదర్శనం. ఎలా సాధ్యమైందంటే..? మిగిలిన రాష్ట్రాలకు – మనకు ఎందుకు ఇంత తేడా వచ్చింది? మన ఫెర్ఫార్మెన్స్ (పనితీరు) మిగిలిన రాష్ట్రాల కన్నా ఎందుకని మెరుగ్గా, భిన్నంగా ఉంది? దేశానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఎలా అడుగులు పడ్డాయి? అనేది ఒకసారి గమనిస్తే మన దగ్గర ఉన్న గొప్పవైన సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలే దానికి కారణం. వీటి ద్వారా మనం పారదర్శకంగా రుణాలిప్పించడంతో పాటు అంతే స్థాయిలో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయించగలుగుతున్నాం. అందులో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలది కీలకపాత్ర. రుణాల రికవరీ 95 శాతానికిపైగా ఉంది. సాధికారత విషయంలో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. కొత్త వారికి వడ్డీలేని రుణాలు.. రెన్యువల్ ఇవాళ జగనన్న తోడు 8వ విడతలో మరో 86,084 మంది చిరువ్యాపారులకు రూ.86 కోట్లు వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నాం. వీరితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్ కూడా చేస్తున్నాం. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.418 కోట్లను 3,95,000 మందికి ఇవాళ కొత్త రుణాలుగా అందిస్తున్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీం ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వడ్డీ కింద రూ.13.64 కోట్లను తిరిగి వారికి ఇస్తున్నాం. మొత్తంగా ఇవాళ దాదాపు రూ.430 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చుతూ చిరు వ్యాపారులకు మంచి చేస్తున్నాం. ఇప్పటిదాకా రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలు జగనన్న తోడు పథకం ద్వారా తాజాగా చేకూరుస్తున్న లబ్ధితో కూడా కలిపి ఇప్పటివరకు 16,73,576 మంది చిరువ్యాపారులకు రూ.3,373 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చాం. దీంతో పాటు వారు కట్టిన వడ్డీలు రూ.88.33 కోట్లను మళ్లీ తిరిగి వెనక్కి ఇచ్చే గొప్ప అడుగులు ఈ నాలుగున్నరేళ్లలో పడ్డాయి. ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందిన వారి వివరాలను గమనిస్తే మొత్తం లబ్దిదారుల్లో 73,072 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 5,10,241 మంది మూడుసార్లు డబ్బులు కట్టి తీసుకున్నారు. 3,98,229 మంది చిరువ్యాపారులు రెండు దఫాలు రుణాలు పొంది వాటిని తిరిగి చెల్లించి మళ్లీ తీసుకున్నారు. గడప గడపలో సంతోషాన్ని చూశాం చిరు వ్యాపారులు, కుల వృత్తులపై ఆధారపడే కుటుంబాలు గతంలో అప్పు తీసుకుంటే ప్రైవేట్ వ్యాపారులు ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టించుకుని రూ.6 నుంచి రూ.10 వడ్డీ వసూలు చేసేవారు. రూ.10,000 రుణానికి రూ.9,000 మాత్రమే ఇచ్చి రూ.వెయ్యి తిరిగి వసూలు చేసేవారు. ఆ పరిస్థ్ధితుల నుంచి ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున అందచేస్తూ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. వడ్డీ లేని మొత్తాన్ని ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 వరకూ అందిస్తోంది. ఆ కుటుంబాలన్నీ మేం గడప గడపకూ వెళ్లినప్పుడు సంతోషంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపాయి. – బూడి ముత్యాల నాయుడు, డిప్యూటీ సీఎం (పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) ఇన్ని ఆలోచనలు.. మీకెలా సాధ్యం? నేను పూల వ్యాపారం, టైలరింగ్ చేస్తున్నా. మా ఆయన మెకానిక్. కరోనా సమయంలో డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. రూ.10 వేలు అప్పు తీసుకుంటే వెయ్యి తగ్గించుకుని రూ.9,000 మాత్రమే ఇస్తామన్నారు. ఆ సమయంలో వలంటీర్ జగనన్న తోడు గురించి చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎవరి సిఫారసు లేకుండా నా ఖాతాలో రూ.10 వేలు పడ్డాయి. ఆ తర్వాత సకాలంలో తిరిగి కట్టడంతో వడ్డీ వెనక్కి వచ్చింది. ఇది చాలా గొప్ప ఆలోచన. దేశంలో ఎవరూ ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. నాకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ కూడా వచ్చింది. గతంలో మా సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోయేది. వైఎస్సార్ చేయూతకు కూడా నేను అర్హత పొందడంతో నేరుగా రూ.18,750 నా ఖాతాలోకి వచ్చాయి. ఇలా మూడు విడతల్లో లబ్ధి పొందా. ఇప్పుడు నాలుగో విడత కూడా వస్తుంది. ఇలా నాకు అన్ని పథకాలు అందడంతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. నా కోడలు కాన్పు సమయంలో సిజేరియన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.1.50 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద చేరడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. పైగా తిరిగి రూ.5,000 ఓ అన్నలా ఆర్థిక సాయం అందచేశారు. ఇన్ని ఆలోచనలు మీకెలా వస్తున్నాయి అన్నా? మా అమ్మ గతంలో ఫించన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఇప్పుడు వలంటీర్ ఇంటి వద్దే ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. ఈసారి రూ.3,000 పెన్షన్ తీసుకుంది. మిమ్మల్ని నా పెద్ద కుమారుడు అని గర్వంగా చెబుతోంది. నాకు ఇల్లు కూడా వచ్చింది. మీరు కులం, మతం, రాజకీయం చూడకుండా అన్నీ గొప్పగా చేస్తున్నారు. మమ్మల్ని ఇప్పుడు వ్యాపారస్తులుగా గుర్తించి గౌరవిస్తున్నారు. గతంలో పేదలను ఎవరూ గుర్తించలేదు. ఈరోజు మేం బ్యాంకులకు వెళ్లి ధైర్యంగా కూర్చుని లోన్ కావాలని అడుగుతున్నామంటే మీరే కారణం. మీరు సీఎంగా రావడం మా అదృష్టం. మిమ్మల్ని తిరిగి గెలిపించుకుంటాం. – లక్ష్మీదేవి, చిరువ్యాపారి, అనంతపురం మీ చిరునవ్వుతో రాష్ట్రంలో వెలుగులు ఎవరి పూచీకత్తు లేకుండా బ్యాంకులో రూ.10 వేలు ఇచ్చారు. మళ్లీ చెల్లించడంతో వడ్డీ తిరిగి ఇచ్చారు. టైలరింగ్ ద్వారా నెలకు రూ. 6,000కిపైగా సంపాదిస్తున్నా. నాకు అమ్మ ఒడి వస్తోంది. విద్యా దీవెన ఇస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ఖాళీ అయ్యాయి. గవర్నమెంట్ స్కూళ్లలో సీట్లు లేవని బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. మీరు మా నుంచి వచ్చారు కాబట్టి ఇన్ని పథకాలు ఇస్తున్నారు. మీరు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్. మా గ్రూప్ ద్వారా బ్యాంకులో రూ.10 లక్షలు లోన్ తీసుకున్నాం. వైఎస్సార్ సున్నా వడ్డీ వస్తోంది. ఆసరా ద్వారా రూ.3.60 లక్షలు మా గ్రూప్ మొత్తానికి ఇవ్వగా నాకు రూ.36 వేలు వచ్చాయి. నవరత్నాలలో భాగంగా ఇల్లు కూడా వచ్చింది. మా నాన్నకు హార్ట్ ఎటాక్ రావడంతో రూ.5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇంటిల్లిపాదీ బాధపడుతున్న సమయంలో మీరు డాక్టర్ రూపంలో కనిపించారు. ఆరోగ్యశ్రీ కింద వెంటనే ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాన్న క్షేమంగా ఇంటికి వచ్చారు. అంతేకాకుండా ఏడాది వరకూ ప్రతి నెలా చెకప్, ఉచితంగా రూ.3,000 మందులు ఇస్తున్నారు. గతంలో వయసు మళ్లిన వారు ఎందుకు బతుకుతున్నామా అని భారంగా గడిపేవారు. ఇవాళ వారంతా ఇంటివద్దే పెన్షన్ ఇస్తున్న మిమ్మల్ని తమ బిడ్డలాగా భావిస్తున్నారు. మా నాన్న కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు జగనన్న నాకు దేవుడని చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే మా ఇంట్లో మేమంతా మీ ఫోటో చూస్తాం. మీరిచ్చిన పథకాల ద్వారా నేను రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు లబ్ధి పొందా. మా అత్తమ్మకు ఆసరా సాయం అందడంతో రెండు ఆవులు కొనుగోలు చేశారు. మా మామకు రైతు భరోసా వస్తోంది. ఏపీలో మీ పథకం అందని ఇల్లంటూ లేదు. ఒక్కొక్కరు నాలుగైదు పథకాలు పొందుతున్నారు. గ్యారెంటీగా ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు దాకా ప్రయోజనం పొందుతున్నారు. ఇంతకంటే ఏం కావాలన్నా? మరెవరూ ఇన్ని పథకాలు అందజేయలేదు. మాకు ఏం కావాలో మీకు తెలుసు. మీ చిరునవ్వుతో ఏపీ వెలిగిపోతుంది. – గౌరి, చిరువ్యాపారి, విజయనగరం రుణమాఫీ మోసంతో చెవి పోగులు పోయాయి.. రోడ్డు పక్కన కాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాం. కరోనా సమయంలో వ్యాపారం లేక, అప్పులు ఇచ్చిన వారు నానా మాటలు అంటుంటే చావాలో బతకాలో తెలియని పరిస్ధితి ఎదుర్కొన్నాం. అలాంటప్పుడు జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు అందాయి. ఏటా పెంచుతూ ఇప్పుడు రూ.13,000 ఇచ్చారు. సకాలంలో తిరిగి చెల్లిస్తున్నాం. మాకు వడ్డీ భారం లేకుండా తిరిగి వెనక్కి ఇస్తున్నారు. గతంలో రోడ్డు పక్కన వ్యాపారం చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మీరు అందించిన సాయంతో సొంతంగా షాప్ పెట్టుకుని ఓనర్‌గా నిలబడ్డాం. గత సర్కారు డ్వాక్రా రుణమాఫీ అంటే నమ్మి మోసపోయాం. వడ్డీల మీద వడ్డీ వేసి నోటీసులు పంపారు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. దీంతో బంగారం తాకట్టు పెట్టి కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్నిసార్లు తిరిగినా లోన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం నన్ను చాలా మోసం చేసింది. నాడు చెవిదిద్దులు కూడా లేని నేను ఈరోజు గొలుసు వేసుకున్నానంటే నిజంగా మీ దయవల్లే జగనన్నా! అలాంటిది మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామన్నా! మాకు వేరే సీఎం, వేరే గవర్నమెంట్ ఎందుకన్నా! మాకు మీరుంటే చాలు. నేను ఇక్కడికి వచ్చే ముందు అమ్మా నువ్వు జగన్‌గారితో మాట్లాడాలని మా పాప ముద్దు పెట్టి పంపింది. టెన్త్ చదువుతున్న మా పాప గతంలో సంక్రాంతి సెలవులు వస్తే ఊరికి వెళ్లేది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్‌లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు హోమ్‌వర్క్‌లు చేసి సార్లకు పంపాలట. ఇప్పుడు చదువులు చాలా బాగున్నాయి. నాడు – నేడు ద్వారా స్కూళ్లు ఎంతో బాగున్నాయి. స్కూల్‌కు ఒక్క పూట మానేస్తే ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఆరోగ్యం బాగోలేదంటే తగ్గిందా లేదా అని తరువాత విచారిస్తున్నారు. నా భర్తకు గుండె పోటు రావడంతో ఆరోగ్యశ్రీ కింద రూపాయి ఖర్చు లేకుండా విజయవాడ ఆసుపత్రిలో వైద్యం చేశారు. మా అమ్మమ్మ విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతోంది. ఆమె దగ్గర ఎవరూ లేకపోయినా ఆసుపత్రిలో వారే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. మందులు ఇచ్చి కోలుకున్న తర్వాత మాకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఇదంతా ఆరోగ్యశ్రీ వల్లే! మా అమ్మమ్మ జగన్‌గారికి చూపించమని తన వీడియో కూడా పంపింది. ఆవిడ తరపున కూడా మీకు ధన్యవాదాలు అన్నా! ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ కాపులను గుర్తించలేదు. మీరు కాపు మహిళలకు సాయం చేస్తున్నారు. ఆ డబ్బులతో చీరల వ్యాపారం చేస్తున్నా. రొటేషన్‌తో రూ.50 వేలకు పెంచగలిగా. నేను అమ్మ ఒడి కూడా తీసుకుంటున్నా. నా భర్తకు పెన్షన్ వస్తోంది. కలెక్టర్ పక్కన కూర్చుని మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. – అడబాల సత్యవతి, చిరువ్యాపారి, కృత్తివెన్ను, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి -
Rajasthan Election 2023: కాంగ్రెస్‌కు అవినీతే పరమావధి
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి వారసత్వ రాజకీయాలు, అవినీతి మాత్రమే పరమావధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలతో కూడిన ‘అహంకార కూటమి’కి మహిళా సాధికారత అంటే ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడాన్ని ఆ పారీ్టలు జీరి్ణంచుకోలేకపోయానని, మహిళా సాధికారితకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాయని మండిపడ్డారు. మన తల్లులు, సోదరీమణులు గురించి విపక్ష నాయకులు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. బిహార్ అసెంబ్లీలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి మహిళలను కించపర్చేలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నోరెత్తలేదని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రంగును రాజస్తాన్ ప్రజలు గుర్తించారని తెలిపారు. సోమవారం రాజస్తాన్‌లోని పాలీ, హనుమాన్‌గఢ్ జిల్లాలో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేసిందని, సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి కుట్రలు పన్నిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని, బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వమే రాష్ట్రానికి ఇప్పుడు అవసరమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల సొమ్ము లూటీ రాజస్తాన్‌లో దళితులపై అరాచకాలు, వేధింపులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని మోదీ తప్పుపట్టారు. కళ్ల ముందు ఘోరాలు జరుగుతున్నా స్పందించలేదని అన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అల్లర్లు, ఉగ్రవాదం పెచ్చరిల్లాయని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే రాజస్తాన్ సంస్కృతిని నిర్మూలించడమే అవుతుందని తేలి్చచెప్పారు. దేశంలో కాంగ్రెస్ ఎప్పుడు, ఎక్కడ అధికారంలో ఉన్నా సరే అవినీతి, బంధుప్రీతికే అత్యధిక ప్రాధాన్యం దక్కుతుందని అన్నారు. కేంద్రంలో 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలనలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా లూటీ చేశారని దుయ్యబట్టారు. -
స్త్రీ సాధికారతతోనే దేశ పురోగమనం
ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను అనుసరించి భారతీయ సమాజం కూడా ఆధునికీకరణ చెందుతోంది. విద్య, వైద్యం, ఆరోగ్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యావరణ, సాంకేతిక రంగాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు స్త్రీలు అంకురార్పణ చేస్తున్నారు. సుమారు వందమంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చంద్రయాన్–3 మిషన్‌లో కీలక సేవల్ని అందించారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామంలోనూ స్త్రీలు వారి ప్రతిభను చూపుతూనే వున్నారు. ఇది వారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం. వివక్ష, అణిచివేత వారిని నిలువరించలేక పోతున్నాయి. అయితే స్త్రీల రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెరిగినప్పుడే సమానత్వం పునాదిగా కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో ప్రాముఖ్యతను సాధించేందుకు, వివక్షకు వ్యతిరేకంగా స్త్రీలు యుద్ధం చేస్తూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాల్లో ప్రకటించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులలోస్త్రీలకు ఒక్కటి కూడా లభించలేదు. వీటిని ప్రతి సంవత్సరం 45 ఏళ్ళ లోపు వయసున్న 12 మంది అసాధారణ యువ శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. ఈ అంశంపై పలువురు మహిళా శాస్త్రవేత్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ రంగంలో అయినా సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు హేతుబద్ధత అవసరం. 1958 నుండి ఆరు దశాబ్దాలుగా 592 మంది భట్నాగర్ పుర స్కారాన్ని స్వీకరించారు. ఇప్పటి వరకు 20 మంది మహిళా శాస్త్ర వేత్తలకు మాత్రమే ఈ అవార్డు లభించింది. మహిళలు తమ కుటుంబ, సమాజ బాధ్యతలు పూరించేందుకుగానూ కోల్పోయిన కెరీర్ సంవ త్సరాలను వారి జీవ సంబంధ వయస్సుతో నిర్ణయించకుండా, ‘అకడమిక్’ వయసుతో పరిగణించాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ బహుమతి గ్రహితల్లో స్త్రీకి ప్రాధాన్యం లేకపోవడంపై 2019లో ‘నేచర్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ వివక్షను వారు సైద్ధాంతికంగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. మహిళలకు అందుబాటులో వున్న వనరులు తక్కువగా ఉండటంతో, వారి ప్రచురణలు పురుషులతో పోల్చినప్పుడు తక్కు వగా వుంటున్నాయి. అధ్యాపక రంగంలో వున్న మహిళలు పురుషు లతో సమానంగా వారి ప్రచురణార్థం ఖర్చు చేసుకోలేక ప్రచురణలో వెనుకబడుతున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీల ఉత్పాదక తపై పరిశోధన గావించిన క్లాడియా గోల్పిన్కు ఆర్థిక శాస్త్రంలో 2023లో నోబెల్ బహుమతి లభించిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధా న్యత సంతరించుకుంది. అయితే ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నోబెల్ బహుమతి పొందినవారిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. మానవ నాగరికతను పరిశీలించినపుడు, ప్రతి కీలకమైన పరి ణామంలో స్త్రీ ప్రధాన భూమిక పోషించింది. బ్రిటీష్ వారి అణచి వేతను ఎదుర్కోవలసినప్పుడు ముందుండి పోరాటాన్ని నడిపించిన ధీర వనితలు ఎందరో దేశం కోసం అసువులు బాశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కుల మతాలకు తావులేకుండా కొల్లిపర సీతమ్మ, కొర్రపాటి అంతమ్మ, నాదెళ్ళ రంగమ్మ, మల్లంపాటి రత్నమాణి క్యమ్మ, దోనేపూడి బాలమ్మ, గొర్రెపాటి సరస్వతమ్మ, మానేపల్లి సరళా దేవి, సూరపనేని వెంకట సుబ్బమ్మ, మిక్కిలినేని వరలక్ష్మమ్మ మొద లుగు మహిళామణులు స్వాతంత్య్రోద్యమ సమరాన్ని ముందుండి నడి పారు. పోరాటాలను భారతీయ మహిళలకు కొత్తగా నేర్పించా ల్సిన పనిలేదు. వారి మాతృత్వం, కరుణ, సమానత్వం వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది. ఇటీవలే నూతన పార్లమెంటు భవనంలో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొలి బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. అసలు చట్ట సభల్లో 33 శాతం మహిళలకు కేటాయించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఎందుకు కలిగిందో ఆలోచించాలి. 1970లో లోక్‌సభలో వీరి ప్రాధాన్యం 5 శాతంగా వుండగా, 2009లో అత్యధికంగా 15 శాతం మంది మహిళా ప్రతినిధులు లోక్‌సభలో ప్రవేశించారు. 12.7 శాతం ప్రతినిధులు రాజ్యసభలో సభ్యత్వం పొందగలిగారు. ఈ గణాంకాలు భారతీయ సమాజం సమానత్వానికి ఎంత దూరంలో వుందో స్పష్టం చేస్తున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవు తోంది. అయినా రాజకీయ రంగంలోని లింగవివక్షను రూపు మాపాలంటే, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అసమానతలను రూపు మాపాల్సి ఉంటుందని గుర్తించాలి. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నట్లు ఆర్థిక స్వావలంబన భారతీయ సమాజంలో స్త్రీకి యింకా పూర్తిగా లభించలేదు. అందుకే వారి రాజకీయ ప్రాతినిధ్యం పది నుండి పదిహేను శాతానికి పరిమి తమైంది. నూతన నారీ శక్తి వందన చట్టం అమలులోకి వస్తే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఎక్కువమంది స్త్రీలు నాయకులుగా ఈ దేశానికి అవసరం. స్త్రీ నాయకురాలైనపుడు వ్యవస్థలో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవ, మాతృస్వామ్య గుణం వర్ధిల్లుతాయి. వీరి సారథ్యంలో దేశం నిష్పాక్షికంగా పురోగతి సాధిస్తుంది. స్త్రీ సాధికారికతను వారి సుస్థిత ఆర్థిక ప్రగతి, పురోగతి నిర్దేశిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత, సమానత్వం పెంపొందించడం ద్వారా మరింత మహిళా భాగస్వామ్యం మెరుగుపరచడానికి అవకాశం వుంటుంది. అదే విధంగా అసంఘటిత స్త్రీలు, విద్యాధికు లతో పోల్చినపుడు ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు రాజకీయ నాయకురాళ్ళుగా మరింత ఉత్సా హంగా భాగస్వాములు కావాల్సి వుంది. ఈ లక్ష్యాలు నెరవేరడానికి స్త్రీపై పెట్రేగిపోతున్న దమనకాండను నిలువరించాలి. విద్యార్జన కొరకు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న వారిపై జరుగుతున్న లైంగిక దాడుల నుండి సమాజం రక్షణ కల్పించాలి. ఆనాడే వారు అభివృద్ధిలో కీలక భాగస్వాములు కాగలుగుతారు. వారి జీవన గమనాన్ని నిర్దేశించే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాల్సి వుంది. రాజకీయాల్లో స్త్రీ పాత్రపై విశ్లేషించినపుడు పలు ఆసక్తికర అంశాలు ముందుకు వస్తున్నాయి. కేవలం ప్రాతినిధ్యం వలన రాజ కీయ సమానత్వం సాధ్యమేనా? క్రియాశీలక నిర్ణయాధికారానికి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల్లో సమర్థులుగా పరిగణింపబడుతున్నారా? మహిళల నేతృత్వంతో అభివృద్ధి ఆకాంక్షిస్తున్న వేళ కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదు. ఆయా పార్టీలు రాజకీయ అవగాహనా తరగ తులు నిర్వహించి వారిని ప్రోత్సహించవలసి వుంది. అనేక సందర్భాల్లో డిబేట్స్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ నాయకమణులుగా గొంతు విప్పుతున్న స్త్రీలు టార్గెట్ అవుతున్నారు. ఇది రాజకీయ చైతన్యవంతులుగా ముందుకు వస్తున్న వారిని నీరు గార్చుతుంది. వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. ఒక పార్టీకి ప్రతినిధులుగా ఎదిగిన స్త్రీలు కూడా అవతలి పార్టీలలో వున్న మహిళా నాయకురాళ్ళను దారుణంగా దుర్భాషలాడుతుండడం గమ నిస్తున్నాము. ఆయా రాజకీయ పార్టీల వేదికను గౌరవిస్తూనే, పార్టీల కతీతంగా స్త్రీలందరూ ఐక్యంగా నైతిక విలువలు పెంపొందించాలి. వ్యక్తిగత పోరు వల్ల రాజకీయాలలో వున్న స్త్రీ గౌరవం ఇనుమడించే అవకాశం లేదు. నేటి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలకు తలాడించే వారుగా వున్నారో లేదా స్వతంత్ర భావవ్యక్తీకరణ ద్వారా స్ఫూర్తిదాయకంగా వుండదల్చుకున్నారో నిర్ణయించుకోవాల్సిన సందర్భం యిది. రాజకీయ ప్రవేశం స్త్రీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసేదిగా వుంటే మరింత మంది మహిళా మణులు ఈ రంగంలో కదంతొక్కే అవకాశం వుంటుంది. మహిళా మణులు పురుషాధిక్య సమాజం చేతిలో పావులుగా మిగిలిపోతున్నారనే బాధ కలుగుతుంది. ఈ పరిస్థితి మారాలి. పార్టీ లకు అతీతంగా మహిళా నాయకురాళ్ళు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తాలి. అదే విధంగా అణగారిన మహిళలను ముందుకు నడిపించాలి. చట్టాల్ని రూపొందించే ప్రక్రియలో భాగస్వా మ్యమే అసమానతల్ని రూపుమాపే కార్యాచరణకు పునాది. సమా నత్వం పునాదిగా కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం. డా‘‘ కత్తి సృజన వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ -
Kudumbashree Mission: బడి రెక్కలతో మళ్లీ బాల్యంలోకి...
ఆ క్లాసురూమ్‌లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్‌లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్‌ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్‌రూమ్‌లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్‌తో మళ్లీ బడిపిల్లలయ్యారు.... దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్‌కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్‌లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్‌లో తిరిగే స్కూల్లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. ‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్‌కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం డిజిటల్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల. ‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్‌లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్‌రూమ్‌లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు. ‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్‌కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్‌కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు. పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్‌లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత. -
స్వశక్తితో ఎదిగే మహిళల కోసం ‘మహిళా శక్తి’
సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత లక్ష్యంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వశక్తితో ఎదగాలనుకొనే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకొని, వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా ‘మహిళా శక్తి’ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రైవింగ్ నైపుణ్యం ఉండీ పలువురు మహిళలు ఆటోలను కిరాయికి తీసుకొని నడుపుకొంటున్నారు. ఇకపై వారు అద్దెవి కాకుండా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం పొందేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ‘మహిళా శక్తి’కి రూపకల్పన చేశారు. ఈ పథకంలో ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో పది శాతం లబ్ధిదారు అయిన మహిళ భరిస్తే సరిపోతుంది. మిగతా 90 శాతం సెర్ప్ ద్వారా ప్రభుత్వమే రుణంగా అందిస్తుంది. ఈ రుణానికి వడ్డీ ఉండదు. మొత్తం రుణాన్ని 48 నెలలు కిస్తీ రూపంలో చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయూతనందిస్తుంది. ఇప్పటికే 229 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి, వారికి డ్రైవింగ్‌లో నాలుగు రోజుల పాటు అదనపు శిక్షణ ఇచ్చారు. ఆటోలకు వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ సమయంలో భద్రత తదితర అంశాలపై శిక్షణ కూడ పూర్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబరు 6వ తేదీన లబ్ధిదారులకు కొత్త ఆటోలు అందజేస్తారు. మిగిలిన మండలాల్లో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, వారికీ అంబేడ్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న కొత్త ఆటోలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.లక్షన్నర దాకా అదనపు ప్రయోజనం సాధారణంగా ఆటోల కొనుగోలుకు బ్యాంకులు లేదా ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి. దీనిని నెలవారీ కిస్తీల రూపంలో తిరిగి చెల్లించాలి. వీటిపై కనీసం రూ. లక్షన్నర వడ్డీనే అవుతుంది. ఇది ఆటో డ్రైవర్లకు ఆర్థిక భారమే. మహిళా శక్తి ద్వారా ఆటోలు పొందే లబ్ధిదారులకు ఇచ్చే రుణంపై వడ్డీ లేనందున, వారికి ఈ లక్షన్నర ఆర్థిక ప్రయోజనం అదనంగా కలుగుతుందని అధికారులు వివరించారు. -
రిజర్వేషన్ పేరుతో మహిళలను మోసం చేస్తున్నారు
-
నాడు పేద మహిళలు.. నేడు లక్షాధికారులు 'ఆమె' బలోపేతం
ఈమె పేరు నగీనా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి సొంతూరు. శ్రీవాణి స్వయం సహాయక పొదుపు సంఘం సభ్యురాలు. అంతకు ముందు కుటుంబ పోషణ ఎలా అని మథనపడ్డ ఈమె ఐదు నెలల క్రితం గ్రామంలోని రైలుగేట్ వద్ద ఫ్యాన్సీ, చెప్పుల దుకాణం ప్రారంభించింది. ప్రస్తుతం ఇంటి ఖర్చులు పోను నెలకు రూ.6 వేల చొప్పున చెల్లించే చిట్టీలో సభ్యురాలిగా చేరింది. (కృష్ణా జిల్లా బాపులపాడు, వీరవల్లి గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి మేడికొండ కోటిరెడ్డి) : రాష్ట్రంలో 14,01,519 మంది పేదింటి పొదుపు సంఘాల మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల చొప్పున స్థిర ఆదాయం పొందుతూ కొత్తగా లక్షాధికారులుగా మారిపోయారు. ఇంకొక 31,04,314 మంది పేదింటి ‘పొదుపు’ మహిళలు నెలవారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల చొప్పున ఏటా రూ.60 వేల నుంచి రూ.లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా, వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే పెరిగింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులపై ఒక సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులతో పాటు గత నాలుగేళ్ల కాలంలో పొదుపు సంఘాల మహిళ ఆదాయాలు పెరిగిన తీరును సేకరించింది. పొదుపు కార్యక్రమాలలో క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే మండల కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో అన్ని చోట్ల గ్రామ సమాఖ్య సహాయకులు – వీవోఏల ద్వారా గత 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ ఆఖరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల ఆదాయ వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతంలో మొత్తం 89.29 లక్షల పొదుపు సంఘాల మహిళలకు గాను 84.90 లక్షల మంది వివరాలు సేకరించగా, అందులో 54 శాతం మంది ఆదాయం ఏటా రూ.60 వేలకు పైగా పెరిగింది. మరో 39 శాతం మంది ఆదాయం కూడా రూ.రెండు వేల నుంచి ఐదు వేల మధ్య పెరిగినట్టు తేలింది. ఆచరణలో మహిళా సాధికారత ► వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత అన్నది కేవలం ఒక నినాదంగా కాకుండా, ఒక లక్ష్యంగా అమలుకు పూనుకుంది. దీంతో పేదల ఇళ్లలో సిరులు కనిపిస్తున్నాయి. మహిళా సాధికారిత సాధన కోసం ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటిస్తూ క్రమతప్పకుండా వాటిని అమలు చేస్తూ వస్తోంది. ► ప్రత్యేకించి రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది మహిళలకు సంబంధించి 7.96 లక్షల పొదుపు సంఘాల పేరిట గత అసెంబ్లీ ఎన్నికల పొలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి బ్యాంకుల్లో ఉన్న రూ.25,571 కోట్ల అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆయా మహిళలకు చెల్లించే కార్యక్రమాన్ని చేపట్టింది. ► దాదాపు 7.96 లక్షల పొదుపు సంఘాలు సరాసరి రూ.3.21 లక్షల చొప్పున ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. దీనికితోడు, బ్యాంకుల నుంచి మహిళలు తీసుకున్న ‘పొదుపు’ రుణాలపై వడ్డీ భారాన్ని వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ప్రభుత్వమే భరిస్తోంది. ► ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు నగదు రూపంలో (డీబీటీ) 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2.31 లక్షల కోట్లను అందజేసింది. పొదుపు సంఘాల మహిళల్లో అత్యధికులకు తద్వారా లబ్ధి చేకూరింది. ఇందులో కేవలం మహిళా లబ్ధిదారులకే రూ.1.64 లక్షల కోట్లు చేరాయి. ► వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా మహిళలకు చేరిన డబ్బులను అసక్తి ఉన్న వారు నెల వారీ స్థిర ఆదాయం వచ్చే జీవనోపాధి మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకుంటే వారికి తగిన ‘చేయూత’ అందజేసేలా ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీలు ఐటీసీ, హిందూస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, రిలయెన్స్, అమూల్ వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కొత్తగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే వారికి అవసరమైతే అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలోనూ ప్రభుత్వం తోడ్పడింది. సంక్షేమ కార్యక్రమాలతో పేదల ఇంట సిరులు జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ తదితర మొత్తం 28 రకాల సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న లబ్ధిని మెజారిటీ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాల మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. 2022 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ ఆఖరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల ఆదాయ వివరాల సేకరణ సమయంలో ఈ విషయం నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అందజేసిన లబ్ధిని ఉపయోగించుకొని కొందరు తమ తమ ఊళ్లలో చిరు వ్యాపారాలు మొదలు పెద్ద దుకాణాల వరకు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కేవలం కూలి పనుల మీద ఆధారపడే బతికే వారిలో చాలా మంది కొత్తగా పాడిగేదెలు, అవులు, మేకలు వంటివి కొనుగోలు చేసుకొని స్థిరమైన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నారు. అన్నింటికీ మించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా పిల్లల చదువులు, వ్యవసాయ పెట్టుబడులు ఇలా ప్రతి అవసరానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం తగ్గిపొయింది. పాత అప్పులు కూడా తీర్చేశారు. తద్వారా ఏటా రూ.25 వేల నుంచి రూ.40 వేల దాక కట్టే వడ్డీల బెడద తగ్గిపోయిందని సర్వే సమయంలో మహిళలు అభిప్రాయపడ్డారు. ఎన్ఐఆర్డీ ద్వారా అధ్యయనం పొదుపు సంఘాల మహిళల ఆదాయాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ద్వారా సర్వే చేసిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి సమగ్ర విశ్లేషణకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనంలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ) ద్వారా అధ్యయనం చేయించేందుకు పూనుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ఎన్ఐఆర్డీ మధ్య ప్రాథమికంగా ఒక అవగాహన ఒప్పందం పూర్తయింది. ఈ అధ్యయనం కార్యక్రమం మొదలు కావాల్సి ఉందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. నెల వారీ స్థిర ఆదాయం బాపులపాడు మండలంలోని వీరవల్లికి పక్కనే ఉండే కొడూరుపాడు గ్రామం శివారు ఉమామహేశ్వరపురానికి చెందిన రెడ్డి నాగరాణికి సొంతంగా వ్యవసాయ భూములు లేకపోయినా, కౌలు భూములు సాగు చేసుకుంటోంది. కౌలుదారు కార్డుతో ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకంలో లబ్ధి పొందింది. గ్రామంలో పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఈమె తన రెక్కల కష్టంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నెలా వారీ ఆదాయం మూడు రెట్లకు పైగా పెంచుకుంది. మొదటి నుంచి పాడి గేదెల వృత్తిగా కొనసాగుతున్న ఆ కుటుంబం మూడేళ్ల కిత్రం వరకు ప్రతి 15 రోజులకు రూ.6 వేల నుంచి రూ.7 వేల ఆదాయం పొందుతుండేది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ఈమె కుటుంబం ఇప్పుడు 11 అవులను పోషిస్తోంది. రోజూ 40 లీటర్ల పాలు కేంద్రానికి పోస్తూ ప్రతి 15 రోజులకు రూ.20 వేల ఆదాయం పొందుతోంది. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా పాలకు లీటరుకు అదనంగా నాలుగు రూపాయలు ప్రయోజనం చేకూరిందని ఈమె కుటుంబం సంబరపడుతోంది. సొంత కాళ్లపై నిలదొక్కుకున్న సభ్యులు బాపులపాడు మండల కేంద్రంలో ఓం గణపతి స్వయం సహాయక పొదుపు సంఘం పది మంది సభ్యులతో 2007లో ఏర్పాటైంది. వీరు ప్రతి నెలా కొద్ది మొత్తం చొప్పున ఇప్పటి వరకు రూ.2.53 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ సంఘానికి వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.2.12 లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. వారు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించి ఆ మహిళలు ఈ నాలుగేళ్ల కాలంలో చెల్లించాల్సిన వడ్డీకి సంబంధించి మరో రూ.41 వేలు మూడు విడతల్లో అందించింది. ఆ సంఘంలో సభ్యులు అమ్మఒడి, వైఎస్సార్ దీవెన, కాపు నేస్తం, రైతు భరోసా.. ఇలా వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. ఈ సంఘంలో సభ్యురాలిగా ఉండే చోడిశెట్టి లక్ష్మీ కుటుంబం వ్యాపారం నిర్వహించే అద్దె షాపును పది నెలల కిత్రం కొనుగోలు చేసింది. ఇదే సంఘంలో సభ్యురాలిగా ఉండే కుర్ర అనూష కుటుంబం మూడేళ్ల కిత్రం వరకు అద్దె ఇంటిలో ఉండి, ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుగోలు చేసింది. ఇంకో సభ్యురాలి కుటుంబం కొత్తగా వ్యాను కొనుగోలు చేసింది. గతంలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే ఆమె భర్త ఇప్పుడు వ్యాను యజమాని అయ్యారు. బాపులపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎరికపాటి హేమలత.. వెన్నల స్వయం సహాయక పొదుపు సంఘ సభ్యురాలు. వీళ్ల ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే వీరవల్లిలో గత ఏడాది డిసెంబర్లో జనరల్ స్టోర్ ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఆమెకు అలాంటి వ్యాపారం నడపాలన్న ఆలోచనే లేదు. కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమై గృహిణిగా కొనసాగుతుండేది. భర్త అక్కడికి దగ్గరలో ఉండే స్పిన్నింగ్ మిల్లులో పనిచేసేవారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న తోడ్పాటుతో కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టింది. -
ఆ మహిళలు.. పేరుకే సర్పంచులు
రాంచీ: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. జార్ఖండ్‌లో చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. ధన్‌బాద్ జిల్లాలో 95 మంది మహిళా సర్పంచులున్నారు. తమ ఫోన్‌కాల్‌కు వీరిలో 11 మంది సర్పంచులు మాత్రమే స్వయంగా స్పందించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. మిగతా 84 మందిలో సర్పంచుల భర్తలో, మరుదులో, లేక ఆమె కుటుంబంలోని ముఖ్యులో ఆ ఫోన్ కాల్లకు స్పందించారు. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం సర్పంచులకు బదులుగా వారి భర్తలు, ఇతర కుటుంబసభ్యులే హాజరవుతున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది. బ్లాక్, సబ్ డివిజిన్, జిల్లా స్థాయి సర్పంచుల సమావేశాలకు హాజరై వీరు తమను ఫలానా గ్రామ సర్పంచి భర్త అనో లేక ఇతర కుటుంబ సభ్యులమనో పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలకు మహిళా సర్పంచులు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. వారికి బదులుగా కుటుంబసభ్యులను, ఇతరులను లోపలికి రానివ్వద్దంటూ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది! -
ప్రతి పథకంలోనూ ఆడవాళ్లను ముందంజలో ఉంచడం ద్వారా సీఎం వైయస్ జగన్ మహిళల ఆర్థికాభివృద్ధికి సాకారం..!
-
మహిళా సాధికారతలో ఏపీ దేశానికే రోల్ మోడల్
-
కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సాయం.. జీ20 సదస్సుకు ఫెషాలికా
పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కన్న షెఫాలికా పండా ఆ కలకు దూరమై పేదలకు దగ్గరైంది. మహాపట్టణం నుంచి మారుమూల పల్లె వరకు ఎన్నో ప్రాంతాలు తిరిగింది.తమ ఫౌండేషన్ తరఫున ఎంతోమందికి అండగా నిలబడింది.కష్టాలు, సమస్యల్లో ఉన్నవారికి సహాయం చేయడమే కాకుండా స్త్రీ సాధికారతకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘జీ20 ఎంపవర్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మెంటార్షిప్’ కన్వీనర్‌గా స్త్రీ సాధికారతకు సంబంధించి విస్తృత స్థాయిలో పనిచేసే అవకాశం షెఫాలికా పండాకు లభించింది... కాలేజీ రోజుల్లో ‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’ కావాలని కలలు కనేది షెఫాలికా. అయితే ఒకానొక సంఘటనతో ఆమె కలల దారి మారింది. తమ బంధువు ఒకరు అనారోగ్యం పాలుకావడంతో, ఒడిషాలో సరిౖయెన వైద్య సదుపాయాలు లేకనోవడంతో దిల్లీకి తీసుకుపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి అసౌకర్యాల వరకు ఎన్నో సంఘటనలను దగ్గరగా చూసింది షెఫాలికా పండా.బ‘చదువుకున్న వారు, ఆర్థికంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే ఒడిశాలోని మారుమూల ప్రాంతాలలో ఉండే పేద ప్రజల పరిస్థితి ఏమిటి?’ అని ఆలోచించింది. ఆ ఆలోచనల ఫలితంగా సేవారంగంలోకి వచ్చిన షెఫాలికా ఎంతోమంది పేదలకు అండగా నిలబడింది. బన్సిధర్ అండ్ ‘ఇలా పండా’ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవాకార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లింది.‘నాయకుల ఎదుగుదలకు సంబంధించి అనుభవం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంత అనుభవం ఉంటే అంత బలం సమకూరుతుంది. సామాజిక సేవా రంగంలో పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సమాజంలో సానుకూల మార్పు తేవాలనుకునేవారికి సమస్యను అర్థం చేసుకోవడంతో పాటు దానిపై పని చేయడానికి చాలా ఓపిక కావాలి. సామాజిక సేవలో మా అత్తమ్మ ‘ఇలా పండా’ నాకు ఆదర్శం. ఎలాంటి ఆడంబరం లేకుండానే ఎన్నో సంవత్సరాలు సేవ చేసింది. ఎండనకా, వాననకా తిరిగినా ఆమె ముఖంలో ఎప్పుడూ అలసట కనిపించేది కాదు. సామాజిక సేవ తన ఆరోగ్య రహస్యంగా చెప్పుకునేది. ఆమె చురుకుదనం, సామాజిక సేవాదృక్పథాన్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. అందులో నేను ఒకరిని’ అంటుంది షెఫాలికా. ‘అవసరం ఉన్న చోట మేముంటాం’ అనే నినాదంతో బన్సిధర్ అండ్ ‘ఇలా పండా’ ఫౌండేషన్ ట్రస్టీ, సీయివోగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది.‘మహిళలపై ప్రధానంగా దృష్టి పెట్టడానికి కారణం అసమానత, లింగ వివక్షత. మహిళల జీవితాలు మారాలంటే ఆమె పిల్లల జీవితాల్లో కూడా మార్పు రావాలని బలంగా నమ్ముతాను’ అంటుంది షెఫాలికా. అవకాశాలు దొరికేవారు, దొరకని వారు అని మహిళలకు సంబంధించి రెండు రకాల వర్గీకరణలున్నాయి. అవకాశాలు దొరికేవారు సులభంగానే విజయం సాధించి పెద్ద స్థాయికి చేరుకుంటారు. మరి దొరకని వారి పరిస్థితి ఏమిటి? సాంకేతిక, జీవన నైపుణ్యాలు, చదువు రూపంలో అలాంటి వారిని వెలుగులోకి తీసుకువచ్చి విజయపథంలోకి తీసుకువెళ్లడంపై, మహిళలకు సమాన అవకాశాలు ఎలా కల్పించాలనే దానిపై జీ20 సదస్సు దృష్టి పెడుతుంది. జీ20 ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారవేత్తలు కావాలనుకునేవారికి, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఎంతో మేలు జరుగుతుంది. 30,000 మంది ఎంటర్ప్రెన్యూర్ల అనుభవాలు పాఠాలుగా ఉపయోగపడతాయి. – షెఫాలికా, కన్వీనర్, జీ20 ఎంపవర్ వర్కింగ్ గ్రూప్ ఆన్ మెంటర్షిప్ -
Kanika Talukdar: జై కొట్టాల్సిందే!
అస్సాంకు చెందిన కనిక భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కనికకు భవిష్యత్ చీకటిగా కనిపించింది. తాను ఎలా బతకాలి? అనే ఆందోళన మొదలైంది. ధైర్యం ఉంటే అదే దారి చూపిస్తుంది అంటారు. డీలా పడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వర్మికంపోస్ట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టిన కనిక ఇప్పుడు లక్షాధికారి అయింది... పెళ్లయిన మూడు సంవత్సరాలకు అస్సాంలోని బోర్జాహర్ గ్రామానికి చెందిన కనికా తలుక్దార్కు బిడ్డ పుట్టింది. బిడ్డ మూడు నెలల వయసులో ఉన్నప్పుడు భర్త అనారోగ్యంతో చనిపోవడం కనికను విషాదసాగరంలోకి నెట్టింది. కళ్ల ముందు పసిపాపే కనిపిస్తుంది. భవిష్యత్ మాత్రం మసకబారిపోయింది. ఆ సమయంలో వర్మికంపోస్ట్ రూపంలో ఒక వెలుగు కిరణం కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో వర్మికంపోస్ట్, చేపల పెంపకం, కోళ్ల పెంపకం...మొదలైన వాటి గురించి తెలుసుకుంది కనిక. వర్క్‌షాప్ తాలూకు విషయాలు గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు వర్మికంపోస్ట్ తయారీ సులభం అనిపించింది. ఎందుకంటే ఆవు పేడలాంటి ముడిసరుకులు సేకరించడానికి తాను పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా తన చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వనరులతోనే వర్మికంపోస్ట్ తయారుచేయవచ్చు. 2019లో నార్త్ ఈస్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్ రెండు నెలల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం కనికకు ఎంతో ఉపకరించింది. శిక్షణలో భాగంగా వర్మివాష్ను తయారు చేయడం నేర్చుకుంది. ఇది వర్మికంపోస్ట్ నుంచి తయారుచేసే ద్రవసారం. సాధారణ వర్మికంపోస్ట్ కంటే ఎక్కువ నత్రజని, భాస్వరం..మొదలైనవి ఇందులో ఉంటాయి. అయిదు వందల రూపాయల పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగు పెట్టింది కనిక. కృషి విజ్ఞాన కేంద్ర ఉచితంగా వానపాములను అందించింది. ‘జై వర్మికంపోస్ట్’ బ్రాండ్‌తో వర్మికంపోస్ట్, వర్మివాష్ అమ్మకానికి రెడీ అయింది. తయారీ సంగతి సరే, మరి కొనేవారు ఎవరు? రసాయన ఎరువులకు అలవాటు పడిన రైతులకు వర్మికంపోస్ట్ నచ్చుతుందా? అందుకే తన ఉత్పత్తికి తానే ప్రచారకర్తగా మారింది. వర్మికంపోస్ట్ వాడకం వల్ల నేలకు జరిగే మేలు ఏమిటో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసింది. ఆమె శ్రమ వృథా పోలేదు. వ్యాపారం అడుగుల స్థాయి నుంచి పరుగుల స్థాయికి చేరుకుంది. పేడ కోసం మొదట రెండు ఆవులను కొన్న కనిక ఆ తరువాత నాలుగు ఆవులను ఒకేసారి కొనగలిగే స్థాయికి చేరింది. ఒకప్పుడు ‘జై’ కంపెనీ ఒక సంవత్సరంలో 800 కిలోల వర్మికంపోస్ట్‌ను ఉత్పత్తి చేసేది. ప్రస్తుతం అది నెలకు 35 టన్నుల స్థాయికి చేరుకుంది. అస్సాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు మేఘాలయా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్‌లో ఎన్నో నర్సరీలు జై ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుత విజయం సాధించిన కనిక ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విద్యార్థుల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (అస్సాం) ప్రతి నెల కనికతో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. ‘ఇది కలలో కూడా ఊహించని విజయం. ఎలా బతకాలో అని భయపడిన నేను ఎంతోమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఎలా బతకాలో తెలియక ఒకప్పుడు ధైర్యం కోల్పోయిన నేను ఇప్పుడు ఎంతోమందికి ధైర్యం చెబుతున్నాను. ఈ విశాలమైన ప్రపంచంలో మన కోసం ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిలో ఒకటి అందిపుచ్చుకున్నా మన జీవితమే మారిపోతుంది’ అంటుంది నలభై అయిదు సంవత్సరాల కనికా తలుక్దార్. -
మహిళా సాధికారతకు చంద్రయాన్–3 చిహ్నం
న్యూఢిల్లీ: ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించే నవ భారత స్ఫూర్తికి చంద్రయాన్–3 మిషన్ ఒక ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం సజీవ ఉదాహరణ అని కొనియాడారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతమైన అంతరిక్షాన్ని భారతీయ మహిళలు సవాల్ చేస్తున్నారని అన్నారు. ‘ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయొచ్చు. చంద్రయాన్–3 మిషన్ దీనికి నిలువెత్తు ఉదాహరణ’ అని చెప్పారు. చంద్రయాన్ మిషన్‌లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా భాగస్వాములైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయేలా జీ20 సదస్సు ‘సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సు అందరినీ కలుపుకొని పోయేలా ఉంటుంది. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. భారత్ సత్తా సెపె్టంబర్లో అందరికీ తెలుస్తుంది. ప్రపంచ క్రీడల్లో భారత్ రాణించాలి. అందుకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశీయ క్రీడలైన హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో మనం వెనకబడకూడదు. సెపె్టంబర్ నుంచి దేశంలో ప్రతీ ఇంటి నుంచి, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఆ మట్టిని అమృత కలశాల్లో భద్రపరిచి అమృత్ కలశ యాత్ర నిర్వహిస్తాం. ఆ మట్టితో ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణం జరుగుతుంది’ అని మోదీ అన్నారు. తెలుగు కూడా ప్రాచీన భాషే ‘మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కావాలంటే మాతృభాష శక్తిమంతమైన మాధ్యమం. తెలుగు భాష సాహిత్యంలో వారసత్వ సంపదలో ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయి’ అంటూ తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని మోదీ కొనియాడారు. ‘సంస్కృతం మాదిరిగా తెలుగు ప్రాచీన భాషే. ప్రతీ ఏడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం’ అని గుర్తుచేసిన ప్రధాని మోదీ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్‌షాప్‌లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్‌షాప్‌లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్‌షాప్‌ల వల్ల పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్‌పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్‌కు ఉపకరించే సబ్జెక్ట్‌లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
సాధికారత సాక్షాత్కారం.. మహిళల బ్యాంకు డిపాజిట్లలో టాప్‌లో ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికారత సాక్షాత్కారమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా అందజేస్తున్న చేయూతతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు వారి జీవన స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ అభ్యున్నతి దిశగా సాగిపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ వారు విద్య, వ్యాపార రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నారు. ఇందుకయ్యే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్బీఐ రిసెర్చి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య డిపాజిట్లు, రుణాలపై సవివర నివేదిక విడుదల చేసింది. ‘మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలే. స్థిరమైన మహిళా సాధికారతకు ఇవి నిదర్శనం’ అని ఆ నివేదిక పేర్కొంది. దేశంతో పాటు రాష్ట్రంలో మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడంతో పాటు మహిళలకు బ్యాంకు రుణాలు కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం బ్యాంకు డిపాజిట్లలో మహిళలు చేసినవే 35 శాతానికిపైగా ఉన్నాయని తెలిపింది. దేశంలో 2019 – 2023 మధ్య మహిళలు చేసిన తలసరి డిపాజిట్ మొత్తం రూ.4,618కి పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6,444కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2023 మార్చికి మొత్తం డిపాజిట్లు రూ. 4.56 లక్షల కోట్లు ఉండగా అందులో మహిళలు చేసినవి రూ.1.59 లక్షల కోట్లు’ అని ఆ నివేదిక వివరించింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా మహిళల∙డిపాజిట్లు 35 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణలో మహిళల డిపాజిట్ల పెరుగుదల తక్కువగా ఉందని పేర్కొంది. ముగిసిన 2022–23 ఆరి్థక సంవత్సరంలో దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు 10.2 శాతం పెరిగాయని, వీటిలో వ్యక్తుల వాటా తగ్గిందని తెలిపింది. ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో మహిళా కస్టమర్ల వాటా 20.5 శాతానికి పెరిగిందని విశ్లేషించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుదల దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. కోవిడ్ సంక్షోభం ముందు సంవత్సరం 2019లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల వాటా 25 శాతం ఉండగా 2023కి 30 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్లు బాగా పెరుగుతున్నాయని, 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఇవి 50 శాతానికి చేరాయని పేర్కొంది. మొత్తం డిపాజిట్లలో 37 శాతం 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపల వారివేనని, వారి వ్యక్తిగత డిపాజిట్లు రూ. 34.7 లక్షల కోట్లని తెలిపింది. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్ల డిపాజిట్లు రూ. 36.2 లక్షల కోట్లు అని, ఈ వ్యక్తిగత డిపాజిట్లు 38 శాతమని తెలిపింది. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ మహిళల వ్యక్తిగత డిపాజిట్లు రూ.13.2 లక్షల కోట్లుగా తెలిపింది. పెరిగిన మహిళల పరపతి మరో పక్క గత తొమ్మిదేళ్లుగా మహిళలకు వ్యక్తిగత బ్యాంకు రుణాల మంజూరు బాగా పెరిగిందని నివేదిక తెలిపింది. గత తొమ్మిదేళ్లలో దేశంలో కొత్తగా 7.6 కోట్ల మహిళలకు రూ.10.3 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి మహిళలకు బ్యాంకు రుణాల మంజూరు బాగా పెరిగిందని తెలిపింది. 2019 మార్చికి రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన బ్యాంకు రుణాలు రూ.47,548 కోట్లు ఉండగా 2023 మార్చికి ఏకంగా రూ.1,44,792 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. అంటే ఈ నాలుగేళ్లలో రుణాలు మూడింతలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ఈ నివేదికే తార్కాణమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడి జీవనం కొనసాగిస్తున్నారని, దీంతో డిపాజిట్లు, వారి పరపతి పెరగడంతో వారికి రుణాలివ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధితో పురోగతి
గాంధీనగర్: మహిళల ఆర్థిక పురోగతితో దేశాభివృద్ధి సాధ్య మని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మహి ళల నేతృత్వంలో అభివృద్ధి కార్య క్రమాలు చేపడితే మహిళా సాధికారత కూడా సాధ్యప డుతుందన్నారు. మహిళలు సంపన్నులైతే ప్రపంచం సుసంపన్నంగా మారుతుందన్నారు. జీ–20 సన్నాహక సదస్సుల్లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మహిళా సాధికారతపై మంత్రుల సదస్సునుద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా రాణించడానికి ప్రభుత్వాలు చేయాల్సినదంతా చేయాలన్నారు. ‘‘మహిళలు వాణిజ్య రంగంలోనూ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవడమే మనందరి లక్ష్యం కావాలి. మార్కెట్, గ్లోబల్ వాల్యూ చైన్, రుణాలు వంటివి వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకుల్ని అధిగమించాలి. అప్పుడే మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు’’ అని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని మోదీ కొనియాడారు. ఒక ఆదివాసీ మహిళ అయి ఉండి కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ మహిళగా ఎదిగారని, త్రివిధ బలగాలకు నేతృత్వం వవహిస్తున్నారని చెప్పారు. స్థానిక ప్రభుత్వాల్లో 46% మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. -
మహిళాశక్తిపై మారీచ యుద్ధం!
పవన్ కల్యాణ్ అమ్ముల పొదిలో అన్నీ పచ్చబాణాలే ఉంటా యన్న నిజం ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూనే వస్తున్నది. ఇటీవల ఆయన వదిలిన ఒక పచ్చబాణం మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంత నిబద్ధత లేనప్పుడు, స్వార్థ ప్రయోజనాలే ఆ పార్టీ కార్యక్రమంగా ఉన్నప్పుడు... మాయోపాయాలతో కూడిన వ్యూహాలనూ,ఎత్తుగడలనూ ఆశ్రయిస్తుంది. అటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. తాను అధికారంలోకి రావడానికి కారణమైన ఎన్నికల మ్యానిఫెస్టోను మాయం చేసి, వెబ్సైట్లోంచి కూడా తొలగించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. పార్టీ అధ్యక్షుడు తన సిద్ధాంతగ్రంథంగా వెలువరించిన ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని కూడా మార్కెట్లో ఎక్కడా లభ్యం కాకుండా మాయం చేసిన ఘనత ఆ పార్టీదే. ఇటువంటి ఘనత ప్రపంచంలో మరో పార్టీకి లేదు. స్వార్థ ప్రయోజనాలకూ, సిద్ధాంత నిబద్ధతకూ చుక్కెదురు. తన ఆశయ గ్రంథాన్నీ, ఎన్నికల హామీలనూ జనంలో లేకుండా దాచేయడం సిద్ధాంత నిబద్ధత లేదనడానికి నిదర్శనం. స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పటికెయ్యది ప్రయోజనమో అప్పటికా జెండా ఎత్తడాన్ని ఆ పార్టీ ఒక వ్యూహంగా అనుసరిస్తూ వస్తు న్నది. ప్రత్యర్థి పార్టీ ఒక భావజాల నిబద్ధతతో ఉన్నప్పుడు, తాను ప్రకటించిన కార్యక్రమాలను వరుసగా అమలు చేస్తున్న ప్పుడు, తన మ్యానిఫెస్టోకు పటం కట్టి, ఇంటింటికీ వెళ్లి మీరే మార్కులేయండని అడుగుతున్నప్పుడు... ఈ పారదర్శకతను ఎదుర్కోవడం, ఈ నిబద్ధతతో తలపడటం స్వార్థపక్షానికి సాధ్య మవుతుందా? కాదు కనుకనే వైసీపీపై మారీచ యుద్ధ వ్యూహాన్ని టీడీపీ ఎంచుకున్నది. వైసీపీ అమలు చేస్తున్న పేదల అనుకూల కార్యక్రమాలన్నింటిపైనా దుష్ప్రచారం చేయడమే ఎజెండాగా అది తలకెత్తుకున్నది. ఇందులో ఎల్లో మీడియా, రాజకీయ భాగ స్వామిగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ పార్టీ తమకు తాము నిర్దేశించిన పాత్రలను పోషిస్తున్నాయి. పేదల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఒక్క పైసా వృధా కాకుండా ఇప్పటికి రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేసింది. ఈ కార్యక్రమం వల్ల ఏపీ మరో శ్రీలంక కాబోతున్నదని వీరు చేసిన ప్రచారం సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ కార్యక్రమం రాష్ట్రాన్ని మాంద్యంలోకి జారకుండా కాపాడిందనీ, జీఎస్డీపీ వృద్ధికి దోహదపడిందనీ ఆర్థికవేత్తలు పలువురు ప్రశంసించడంతో వారి గొంతులో వెలక్కాయ పడింది. నగదు బదిలీ అంశాన్ని వదిలిపెట్టి అడ్డ గోలు అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం తప్పని మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విడుదల చేసిన రాష్ట్రాల వారీ అప్పుల జాబితా రుజువు చేసింది. పేద పిల్లల ఇంగ్లీషు మీడియం చదువుపై చేసిన దుష్ప్ర చారం కూడా ఈ కోవలోదే. భాషాభిమానులను రెచ్చగొట్టడానికి చేతనైనంత ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి దాకా రాజ్యాంగ పదవులు నిర్వహించిన ఒకరిద్దరి సేవలను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే నగరం మైలపడిపోతుందని కోర్టుకెక్కారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి కాలనీలు ఏర్పాటు చేస్తుంటే చేసిన తప్పుడు ప్రచారం కూడా అప్పుడే మరిచిపోయేది కాదు. ఇటువంటి ఉదాహరణలు కొన్ని వందలు ఇవ్వొచ్చు. జగన్ ప్రభుత్వం మహిళా సాధికారత కార్య క్రమం కూడా ఇప్పుడు వీటి సరసన చేరింది. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్య కార్యక్రమాల్లో మహిళా సాధికా రత ఒకటి. చంద్రబాబు – పవన్ – ఎల్లో మీడియా కూటమికి సిద్ధాంత నిబద్ధత లేకపోవడంతో పాటు ప్రత్యేకంగా మహిళా సాధికారత పట్ల వ్యతిరేకత, మహిళల పట్ల వివక్ష వారి స్వభావా ల్లోనే ఉన్నది. బహిరంగంగా వారు మాట్లాడిన మాటల ద్వారానే ఈ సంగతిని గ్రహించవచ్చు. వీరి మహిళా వ్యతిరేక వైఖరిని ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి మనస్తత్వమున్న వ్యక్తులు మహిళా సాధికారతను ఎలా సహిస్తారు? అలాగని ఆ భావనను బహిరంగంగా వ్యతిరేకించలేరు. అందుకని దుష్ప్రచా రాలతో చేసే పరోక్ష దాడినే ఎంచుకున్నారు. ఈ దాడిలో తొలి బాణాన్ని వేసే బాధ్యతను పవన్ కల్యాణ్‌కు అప్పగించారు చంద్రబాబు. గోదావరి జిల్లాల పర్యటనలో పవన్ కల్యాణ్ ఈ దాడులకు దిగారు. పవన్ ప్రసంగంలోని రెండు అంశాలను మహిళా సాధికారతపై పరోక్షంగా జరిగిన దాడిగా విశ్లేషకులు పరిగణి స్తారు. మొదటి అంశం – ‘ఉమన్ ట్రాఫికింగ్’. రాష్ట్రం నుంచి మూడేళ్లలో 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందనీ, ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నదనీ పవన్ ఆరోపించారు. రెండో అంశం – ‘వలంటీర్ వ్యవస్థ’. ఒంటరి మహిళలు, వితంతువులు, నిస్సహాయుల వివ రాలు సేకరించి వలంటీర్లు సంఘవిద్రోహ శక్తులకు అప్పగించారనీ, అందువల్లనే ఇన్ని వేలమంది అక్రమ రవాణా సాధ్య మైందనీ ఆయన ఆరోపణ. ఈ వలంటీర్లలో 55 శాతం మంది మహిళలే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మహిళా సాధికారత కార్యక్రమాలు ఒక ఉద్యమంగా సాగుతున్న తరు ణంలో ఈ తరహా వ్యాఖ్యలు కచ్చితంగా బురద జల్లడానికీ, పక్కదోవ పట్టించడానికీ ఉద్దేశించినవేననే అభిప్రాయం కలుగు తున్నది. మహిళా సాధికారత అంటే ఏమిటో అర్థమైతే ఈ తరహా దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. మహిళా సాధికారత అనే అంశానికి చాలామంది చాలా రకాలుగా నిర్వచ నాలు చెప్పారు. వాటన్నింటినీ క్రోడీకరిస్తే తేలే విషయం ఒక్కటే. ‘సమస్త జీవన రంగాల్లో భాగస్వామిగా ఉండగలిగే స్వేచ్ఛ – అందలాలను అందుకోవడానికి, వనరులను వినియో గించుకోవడానికి, నిర్ణయాధికార స్వాతంత్య్రానికి సంబంధించి సమాన అవకాశాలు – సాంఘిక కట్టుబాట్లు, వివక్ష లేకుండా తన జీవితంపై తాను సంపూర్ణ హక్కులు కలిగి ఉండటం.’ ఇటు వంటి పరిస్థితులన్నీ ఒనగూడితేనే మహిళా సాధికారత సిద్ధించిందని భావించవలసి ఉంటుంది. ఇటువంటి వ్యవస్థ సాధ్యమవు తుందా అనేది పితృస్వామిక వ్యవస్థల్లో తలెత్తే మొదటి ప్రశ్న. గడచిన కొన్ని దశాబ్దాల పరిణామాలను, కొన్ని పశ్చిమ దేశాలు సాధించిన గణనీయమైన పురోగతిని పరిశీలిస్తే ఇది అసాధ్య మైన విషయం కాదని బోధపడుతుంది. కాకపోతే, ఇందుకు ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు ఈ దిశలో పట్టుదలగా పని చేయవలసి ఉంటుంది. మహిళా సాధికారతకు దోహదపడే అంశాలేమిటి? అందుకు అడ్డుపడే అంశాలేమిటి? స్థూలంగా ఒక ఐదు అంశాలు సాధికారతకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. 1. సాధికారతకు ‘విద్య’ తొలి మెట్టు. తమ జీవిత లక్ష్యాలను ఎంచు కోవడానికి, చేరుకోవడానికి, అందుకు సంబంధించిన నిర్ణ యాలను స్వయంగా తెలివిడితో తీసుకోవడానికి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా మెలగడానికి విద్య దోహదపడుతుంది. 2. రెండో మెట్టు – ‘ఆర్థిక స్వాతంత్య్రం’. ఉత్పాదక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తిలో పెరగాలి. ఆర్థిక వనరులు వారికి కూడా అందుబాటులో ఉండాలి. నిర్ణయాధికార స్థానాల్లో వారికి సమాన అవకాశాలు ఉండాలి. 3. ‘ఆరోగ్యం–సంక్షేమం’ మూడో ముఖ్యాంశం. వైద్య–ఆరోగ్య అవకాశాలు అందు బాటులో ఉండటం. వివక్షకు, హింసకు దూరంగా ఉండటం. 4. ‘రాజకీయ ప్రాతినిధ్యం’ నాలుగోది. వివిధ స్థాయిల్లో వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. వారి జీవితాలపై ప్రభావం చూపే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాలి. 5. సాంఘిక కట్టుబాట్లు ఐదో అంశం. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలి మారకుండా అవరోధంగా ఉండే శృంఖలాలను తెంచుకుంటూ లింగ వివక్షను తొలగించడం. ఈ ఐదు అంశాల్లో పురోగతి సాధిస్తే సూత్రప్రాయంగా మహిళా సాధికారత సాధించినట్టే! ఈ ఐదు అంశాలకూ విరు ద్ధంగా పనిచేస్తే అవే సాధికారతకు ఆటంకాలుగా మారుతాయి. మహిళా సాధికారతలో ప్రభుత్వాల చిత్తశుద్ధి, కృషి ముఖ్యం. ఈ పదాన్ని ఉపయోగించకపోయినా భారత రాజ్యాంగంలో ఇదే తరహా కర్తవ్యబోధ ఉన్నది. రాజ్యాంగ పీఠికల్లోనూ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో వివక్షలేని మహిళా భ్యున్నతికి సంబంధించిన అధికరణాలున్నాయి. పేదరికం, పెరుగుతున్న అసమానతలు, పర్యావరణ ముప్పు అనే మూడు భూతాలు మొత్తం భూగోళానికే ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచ రాజ్యాలన్నీ 2015లో సమావేశమై మెరుగైన ప్రపంచం కోసం 17 లక్ష్యాలను ఏర్పర చుకున్నాయి. ఈ లక్ష్యాలను 2030లోగా సాధించాలన్న గడు వును కూడా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాల్లో ఐదవది మహిళా సాధికారత. తీర్మానమైతే చేసుకున్నారు కానీ, చాలా దేశాల్లో సంకల్పం కొరవడినట్టు కనిపిస్తున్నది. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన స్పృహే ఉన్నట్టు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు – రాజకీయ నేతలు స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకోవడం! పేదరికం నుంచి ప్రజ లను బయటకు తీసుకురావడంపై, అసమానతల తొలగింపుపై వారికి అవసరమైన సామాజిక దృక్పథం లేకపోవడం! ఈ ధోరణికి ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లుగా సాగుతున్న వైఎస్ జగన్ పరిపాలన భిన్నమైనది. అంబేడ్కర్ రాజ్యాంగ ఆశయాలను జగన్ ప్రభుత్వం ఔదలదాల్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గీటురాళ్లుగా పెట్టు కున్నది. ఇందుకు మనం అనేక ఉదాహరణలు ఉటంకించవచ్చు. పేదరికం నుంచి విముక్తి, అసమానతల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమస్థాయి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇదిగో ఈ ఉద్యమంపైనే చంద్రబాబు – ఎల్లో మీడియా – పవన్ కల్యాణ్ టీమ్ బురదజల్లింది. ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారు తుందని శాపనార్థాలు పెట్టింది కూడా దీనిపైనే. మహిళా సాధికా రత విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నది. మహిళా సాధికారతకు దోహదపడే అంశాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణమైన చర్యలను తీసుకున్నది. నాణ్యమైన విద్యావకాశాలను అందరికీ అందు బాటులో తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు చదువులకు దూరం కాకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు పెళ్లి కానుక (కల్యాణమస్తు, షాదీ తోఫా) వర్తిస్తుందనే నియమం వెనుక బాల్య వివాహాలను నిరోధించడంతోపాటు కనీసం ఇంటర్మీడి యట్ పూర్తయ్యే వరకైనా బాలికలు డ్రాపవుట్లుగా మిగలకుండా ఉంటారనే ఆశాభావం కూడా ఉన్నది. ఈ నిబంధనను కూడా విమర్శించి తన సామాజిక స్పృహ స్థాయేమిటో ప్రతి పక్షం వెల్లడించింది. ఈ నాలుగేళ్ల చర్యల ఫలితంగాæ పాఠశాలల్లో బాలికల సంఖ్య పెరిగింది. అమ్మ ఒడి కూడా అందుకు దోహదపడింది. ఇప్పుడు పాఠశాలల్లో బాలికల సంఖ్య సుమారు 48 శాతానికి చేరుకున్నది. డ్రాపౌట్ల సంఖ్య స్థిరంగా తగ్గుతున్నది. ఆర్థిక రంగంలో మహిళల పురోభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో పదహారున్నర లక్షల మంది మహిళలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడమో, పాత వ్యాపారాలను వృద్ధి చేసుకోవడమో జరిగింది. చంద్రబాబు నమ్మకద్రోహంతో నిస్తేజ మైన పొదుపు సంఘాలను ‘ఆసరా’ పథకం ఆదుకున్నది. పునరుజ్జీవం పొందిన పొదుపు సంఘాలకు ఈ నాలుగేళ్లలో బ్యాంకులు ఒక లక్షా పదహారు వేల కోట్ల రుణాలను అంద జేశాయి. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పొదుపు సంఘాలు క్రియాశీల పాత్రను పోషిస్తున్నాయి. 30 లక్షలమంది మహిళలకు ఇళ్ల పట్టాలు లభించి, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రభుత్వ పథకాల ప్రధాన లబ్ధిదారులుగా మహిళలే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. బాబు కేబినెట్లో ఇద్దరు మహిళలుంటే ఇప్పుడు నలుగురున్నారు. గతం కంటే ముఖ్యమైన శాఖలను వారు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు, జడ్పి చైర్మన్ పదవుల్లో 55 శాతం మంది మహిళలే. 50 శాతం నామినేటెడ్ పదవులను వారికి రిజర్వ్ చేశారు. గ్రామ సచివాలయాల్లో 1,38,026 మందిని నియమిస్తే అందులో 77,935 మంది మహిళలు. వలంటీర్లలో 55 శాతం మంది మహిళలు. ఆరోగ్య శాఖలో చేసిన 48 వేల నియామకాల్లో అత్యధికులు మహిళలు. ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందిన లక్షా ముప్ఫయ్‌వేల మందిలో 60 శాతం అమ్మాయిలు. మహిళా సాధికారత దిశలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన కలిగిన ఫలితాల్లో ఇవి కొన్ని మాత్రమే! గర్భిణీలు, బాలింతల దగ్గర నుంచి మహిళల ఆరోగ్య పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వేధింపులకు విరుగుడుగా తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ సూపర్ హిట్టయ్యింది. ఈ విజయాలను పక్కదారి పట్టించడానికే వ్యూహం ప్రకారం మహిళల అక్రమ రవాణా అంశాన్ని పవన్ కల్యాణ్ తెరపైకి తెచ్చారని అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే పవన్ చెప్పినట్టు ఈ మూడేళ్లలో 30 వేలమంది మహిళల అక్రమ రవాణా జరగలేదు. కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన నివే దిక, రాష్ట్ర పోలీసు అధికారుల వివరణ ప్రకారం ఈ మూడేళ్లలో 26,099 మంది ‘అదృశ్య’మయ్యారు. వీటిని మిస్సింగ్ కేసులు అంటారు. ట్రాఫికింగ్ అనరు. ఈ మొత్తంలో 2019కి ముందు అదృశ్యమై అప్పటికి ఆచూకీ లభించని వారి సంఖ్య కూడా కలిసి ఉన్నది. ఈ అదృశ్యమైన వారిలో 23,394 మందిని గుర్తించి, తిరిగి ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఇక మిగిలింది 2705 మంది. ఇది 2021 డిసెంబర్ 31 నాటి లెక్క. ఆ తర్వాత ఇందులో మరెంతమంది ఇల్లు చేరారనే అంశంపై పోలీసు శాఖ ఆ యా కేసులను పరిశీలించవలసి ఉన్నది. కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉన్నది. కానీ, పవన్ తీసిన రాగం, దానికి యెల్లో మీడియా, చంద్రబాబు చేసిన రాద్ధాంతం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే వేలాది మంది అదృశ్యమయ్యారనే అపోహ కలుగుతుంది. ఈ అపోహ కలిగించడమే వారి లక్ష్యం. వందలు, వేలు కాదు. పదిమంది అదృశ్యమైనా, ఒక్కరు అక్రమంగా రవాణా అయినా ఆందోళన చెందవలసిన విష యమే. సిగ్గుపడవలసిన సంగతే! ఈ పరిస్థితులకు కారణాలే మిటి? పేదరికం, అవిద్య, నిస్సహాయత – ఇటువంటివన్నీ కారణాలవుతాయి. మహిళా సాధికారత ద్వారానే వీటిని జయించగలుగుతారు. ఆ దిశలో పనిచేస్తున్న జగన్ ప్రభుత్వ విజయా లను మరపించేందుకే ట్రాఫికింగ్‌ను ముందుకు తెచ్చారనే వాదనకు బలం చేకూరుతున్నది. సాధికారతకు దోహదపడే అంశాలను బలపరచకపోగా అడ్డంకిగా ఉండే సాంఘిక రుగ్మత లను మాత్రం తెలుగుదేశం కూటమి ఎగదోస్తున్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అంటూ చంద్ర బాబు చేసే ప్రచారం ఈ రుగ్మతలకు ఆజ్యం పోసేదే! పైగా ఈ ముఠాలోని ముఖ్యనేతలంతా గతంలో మాట్లాడిన మాటలూ, చేసిన చేష్టలూ మహిళను సాటి మనిషిగా కాక, ఆట వస్తువుగా పరిగణించే దృక్పథానికి ప్రతీకలు. ఇటువంటి శక్తులు మహిళా సాధికారతను సహిస్తాయా? చస్తే సహించవు. లక్షన్నరమంది మహిళలు ఒక్కసారిగా వలంటీర్లుగా సేవారంగంలోకి అడుగు పెట్టి క్రియాశీలంగా వ్యవహరిస్తుంటే తట్టుకోలేని ప్రబుద్ధుడు వారిపై నిందలు మోపడం ఈ అసహనానికి పరాకాష్ఠ! వర్ధెళ్లి మురళి, Vardhelli959@gmail.com -
మహిళల కోసం... మహిళల చేత!
ఆ హాస్పిటల్లో మహిళలే డాక్టర్లు. వార్డ్ బాయ్ అనే పదం వినిపించదు. అన్ని సర్వీస్‌లూ మహిళలే అందిస్తారు. నైట్ షిఫ్ట్ అని వెనుకడుగు వేయడం ఉండదు. ఇరవై నాలుగ్గంటలూ మహిళలే పని చేస్తారు. ఎమ్ఎమ్సీహెచ్... అంటే ముస్లిమ్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇది హైదరాబాద్, చాదర్‌ఘాట్, ఉస్మాన్ పురాలో ఉంది. ఈ హాస్పిటల్ గురించి చెప్పుకోవలసింది చాలానే ఉంది. మహిళల కోసం యాభై మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో సీఈవో నుంచి సెక్యూరిటీ స్టాఫ్ వరకూ అందరూ మహిళలే. నో ప్రాఫిట్ నో లాస్ విధానంలో పని చేస్తున్న ఈ హాస్పిటల్ గురించి సీఈవో డాక్టర్ నీలోఫర్ ఇలా వివరించారు. ► మూడు వందలకు పైగా... ‘‘మహిళా సాధికారతకు చిహ్నం మా హాస్పిటల్. ఇది 200 పడకల హాస్పిటల్. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా మహిళలందరికీ వైద్యసేవలందిస్తాం. విశేషం ఏమిటంటే... మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో మూడు వందల మందికి పైగా మహిళలం సేవలందిస్తున్నాం. ప్రధాన ద్వారం సెక్యూరిటీ నుంచి రిసెప్షన్, ఫార్మసీ, ఫార్మసీ స్టోర్స్ నిర్వహణ, ల్యాబ్ టెక్నీషియన్ లు అందరూ మహిళలే. అంబులెన్స్ డ్రైవర్లు, వెనుక ద్వారం దగ్గర సెక్యూరిటీ దగ్గర మాత్రం మగవాళ్లు డ్యూటీ చేస్తారు. ‘ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ’ నగరంలో స్థాపించిన మూడు స్కూళ్లు, మూడు హాస్పిటళ్లలో ఇది ఒకటి. మహిళల హాస్పిటల్‌గా పేరు వచ్చినప్పటికీ నిజానికి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో చిన్నపిల్లల విభాగం, డర్మటాలజీ, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ విభాగాలు కూడా పని చేస్తున్నాయి. రోజుకు ఓపీ రెండు వందల వరకు ఉంటుంది. అందులో నూట పాతిక వరకు మహిళలే ఉంటారు. నెలకు సరాసరిన రెండు వందల డెలివరీలుంటాయి. ► ట్వంటీ ఫోర్ బై సెవెన్ ! సెక్యూరిటీ, ఫార్మసీ, రిసెప్షన్ ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తుంటాయి. వారంలో ఏడు రోజులూ, రోజులో ఇరవై నాలుగ్గంటలూ డ్యూటీలో ఉంటారు మహిళలు. మీకో సంగతి తెలుసా? మా హాస్పిటల్లో డే కేర్ సెంటర్ ఉంది. మహిళకు తగిన సౌకర్యాలు కల్పిస్తే ఏ షిఫ్ట్‌లోనైనా డ్యూటీ చేయగలరని నిరూపిస్తోంది మా హాస్పిటల్. ఇది టీచింగ్ హాస్పిటల్. వరంగల్, కెఎన్ ఆర్ యూనివర్సిటీలతో అనుసంధానమై ఉంది. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ నుంచి ఏటా ముపై ్పమందికి మహిళలకు అవకాశం ఉంటుంది. హాస్టల్ కూడా ఇదే ప్రాంగణం లో ఉంది. మా హాస్పిటల్లో కెఫెటేరియాతోపాటు లైబ్రరీ కూడా ఉంది చూడండి. వైద్యరంగంలో అమూల్యమైన పుస్తకాల కలెక్షన్ ఉంది. బయటకు ఇవ్వం, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ► వైద్యపరీక్షలిక్కడే! మా దగ్గర పూర్తి స్థాయి ల్యాబ్ ఉంది. 98శాతం టెస్ట్‌లు ఇక్కడే చేస్తాం. కొన్ని ప్రత్యేకమైన కేసులకు మాత్రం శాంపుల్స్ ముంబయికి పంపిస్తాం. ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్, సోనాలజిస్ట్లతోపాటు రేడియాలజిస్ట్ కూడా మహిళే. రేడియాలజీ లో మహిళలు తక్కువగా ఉంటారు. ట్రీట్మెంట్ సమయంలో రేడియాలజిస్ట్ కూడా కొంత రేడియేషన్ ప్రభావానికి గురవుతుంటారు. కాబట్టి మహిళలు తాము గర్భిణులుగా ఉన్నప్పుడు డ్యూటీ చేయడం కష్టం. అందుకే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కొంచెం సంశయిస్తారు. అలాంటిది మా దగ్గర రేడియాలజిస్ట్‌గా కూడా మహిళే డ్యూటీ చేస్తున్నారు. ► నార్మల్ డెలివరీల రికార్డ్! ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన మా హాస్పిటల్ లో మొత్తం డాక్టర్లు పాతిక మంది, మెటర్నిటీ విభాగంలో ఇద్దరు హెచ్వోడీలతోపాటు పన్నెండు మంది డాక్టర్లు, దాదాపు వందమంది నర్సింగ్ స్టాఫ్, ఎనభైకి పైగా హౌస్ కీపింగ్ ఎంప్లాయీస్ విధులు నిర్వర్తిస్తున్నారు. పేట్ల బురుజులో ఉన్న గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తర్వాత అత్యధికంగా ప్రసవాలు జరిగేది మా హాస్పిటల్లోనే. గత ఏడాదికి గాను అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసిన హాస్పిటల్‌గా మా హాస్పిటల్‌కి ప్రశంసలు కూడా వచ్చాయి. మగడాక్టర్లు నియోనేటల్ విభాగంలో మాత్రం ఉన్నారు. ప్రధాన ద్వారం నుంచి కారిడార్‌తోపాటు ముఖ్యమైన ప్రదేశాలన్నీ సీసీటీవీ నిఘాలో ఉంటాయి. ఐసీయూ బెడ్ పట్టే స్థాయి లిఫ్ట్ కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ ఇది చారిటీ హాస్పిటల్ కావడంతో మా దగ్గర ఫీజులు చాలా చాలా తక్కువ. ఓ యాభై ఐదేళ్ల కిందట ఒక మహిళ మగ డాక్టర్ దగ్గర ప్రసవం చేయించుకోవడానికి ఇష్టపడక, ఆ సమయానికి లేడీ డాక్టర్ అందుబాటులో లేక చివరికి ఆ గర్భిణి మరణించిందట. ఆ సంఘటన తర్వాత మహిళల కోసం మహిళలే పని చేసే ఒక హాస్పిటల్ ఉండాలని భావించిన అబ్దుల్ రజాక్ లతీఫ్ ఈ హాస్పిటల్‌ను ప్రతిపాదించారు. యాభై మూడేళ్లుగా మహిళల కోసం మహిళలే ఇరవై నాలుగ్గంటలూ సేవలందిస్తున్నారు’’ అంటూ వివరించారు డాక్టర్ నీలోఫర్. 40 ఇంక్యుబేటర్లు, వార్మర్, ఫొటో థెరపీ సర్వీస్, పుట్టిన బిడ్డ వినికిడి పరీక్ష కోసం ఆడిటరీ టెస్ట్ సౌకర్యం కూడా ఉంది. మా హాస్పిటల్ నిర్మాణం ఎంత ముందు చూపుతో జరిగిందంటే... డెలివరీ రూమ్ నుంచే నియోనేటల్కు, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు కనెక్షన్ ఉంది. అవసరమైతే బిడ్డను ఆ విభాగానికి పంపించి తల్లిని ఈ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. ఇద్దరూ క్షేమంగా ఉంటే మామూలు వార్డుకి లేదా రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
NATA Convention 2023: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డాలస్ లో నిర్వహించిన నాటా కన్వెన్షన్ 2023లో ఎన్నో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో నాటా విమెన్ ఫోరమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతి సానపురెడ్డి, నాటా మహిళా ఫోరం ఛైర్పర్సన్ సభను ఉద్దేశించి స్వాగత ఉపన్యాసంలో తెలుగు మహిళలు చేసిన పనులు స్ఫూర్తిదాయకం అన్నారు. ఏ ఏ అంశాలు? గృహహింస, మహిళా ఆరోగ్యం, స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర, లైంగిక వేధింపులు, హాలీవుడ్ సినిమాలో నటించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. నాటా మహిళా ఫోరం సలహాదారులు కృష్ణవేణి రెడ్డి, లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వినూత్నంగా రూపొందించారు. ఇందులో పాల్గొన్న వారు, నిర్వాహకులు, సమన్వయ కర్తలు అందరూ మహిళలే అవడం, "మా అందరిదీ ఒకే మాట ఒకే బాట" అంటూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఉమాభారతి కోసూరి (నృత్య సాహిత్య కళా భారతి) మధురమైన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మనీ శాస్త్రి (అమేరికోకిలా) మధురమైన గళముతో పాడి వినిపించారు. మహిళా పరివర్తన - దశాబ్దాలుగా 'స్త్రీ' ఎదుగుదల - సంగీత సాహిత్య దృశ్య కథనం విభాగంగా అతివల గురించి అందమైన శ్రవణ దృశ్యాలతో పాటు చక్కని మాటలతో పాటలతో మనసుకు హత్తుకునేలా చేశారు. మహిళా విశిష్టత మహిళా ప్రతిభ - చరిత్రలో తెలుగింటి ఆడపడుచులతో ముఖాముఖి అనే కార్యక్రమంలో ఆడపడుచుల అనుభవాలను, అనుభూతులను, కష్టాలను, ఎదుగుదల, ఈ స్థాయికి ఎలా వచ్చారో ప్రేక్షకులతో పంచుకునే అవకాశం కల్పించారు అమల దుగ్గిరాల (EVP ఎంట్రప్రెస్స్ CIO at USAA ), ఉమా దేవిరెడ్డి (TEDx Leadership Coach),, ప్రేమ రొద్దం (Corporate & Business Immigration Attorney ) స్పూర్తిదాయకమైన స్త్రీలు వారి జీవితంలో ఎన్నుకున్న వృత్తి ఎంతవరకు వారు న్యాయం చేశారో చేస్తున్నారో చర్చించారు. అమ్మ నుండి అంతరిక్ష మహిళ వరకు “మహిళలు తమ జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సంస్కరణలు, మహిళా సాధికారతకు తమవంతుగా మహిళలు తాము వున్నాం అని తెలపడం జరిగింది. అమ్మ నుండి అంతరిక్షం వరకు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు.. ఎందులోనూ తీసిపోరు అన్నట్లు వసంత లక్ష్మి అయ్యగారితో నిర్వహించిన మహిళా మిమిక్రీ కార్యక్రమం అత్యంత జనరంజకంగా సాగింది. ఇన్నాళ్లు మగవాళ్ళు మాత్రమే చేయగలరు అనుకున్న ఈ మిమిక్రీ కళను అత్యంత సమర్థతతో నిర్వహించి కడుపుబ్బా నవ్వించారు. మరికాస్త హాస్యం కోసం ‘టాక్ ఆఫ్ ది టౌన్ 'లో సజితా తిరుమలశెట్టి , కవిత రాణి కోటి ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. మనీ శాస్త్రి వారి మధురమైన గళముతో పాడి వినిపించారు, ఉమాభారతి కోసూరి వ్యాఖ్యాతగా (నరేషన్) సంగీత సాహిత్య సమ్మోహనం - మాన్యుల మన్నన మనల్ని అలరించే ఓ అద్భుతమైన దృశ్యం. ముఖ్య అతిధులుగా వాసిరెడ్డి పద్మ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఛైర్ పర్సన్ అఫ్ TTD LAC in ఢిల్లీ ఉమెన్స్ ఫోరమ్.. మహిళలందరిని ప్రశంసించారు. ఇక్కడి మహిళలు తమ వృత్తిని, తెలుగు సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అనేక జనరంజక కార్యక్రమాలలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న కూచిపూడి నృత్య కళాకారిణి పద్మ శొంఠి నృత్య కార్యక్రమం, మహిళా రక్షణ గురించి వివేక్ తేజ చెరుపల్లి ప్రసంగం తో పాటుగా మహిళలు తనకు తానుగా రక్షణ, భద్రత ఉపాయాలు మెళకువలు తెలిపారు. వైష్ణవి రామరాజు 'సొగసు చూడతరమా' అంటూ మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వేసుకునే మహిళల వస్త్రధారణ తీరులను ప్రదర్శన చేయడం ఈ కార్యక్రమానికి హైలైట్ అయింది. అరుణ సుబ్బారావు (పేరడీ క్వీన్, ఫోక్ సింగర్)- తన పేరడీ తో పాటు కొన్ని ఫోక్ పాటలు కూడా పాడి వినిపించడం ద్వారా ప్రేక్షకులు ఎంతో ఆనందించారు. మహిళ ప్రతిభ మహిళా సాధికారత” (Women Empowerment) విభాగంలో మన తెలుగింటి ఆడపడుచులు పల్లవి శాస్త్రి (Hollywood Producer & Actress) వారి మూవీ "LAND GOLD" (Brilliant Film on Faith Family & Culture in America) కీర్తన శాస్త్రి, Hollywood Producer & Casting Director) మరియు అపూర్వ గురుచరణ్ (Los Angels based Indian Producer) మూవీ "JOYLAND " వారిని 'మహిళా ప్రతిభ' పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాలలో వేటికవే గొప్ప ప్రదర్శనలు అయినప్పటికీ 'పురాతన సంప్రదాయ చీరల ప్రదర్శన' మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 1930 నుండి 1990 వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని చీరల ప్రదర్శన, ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు 40 చీరలు పైగా ఈ ప్రదర్శనలో చూడటం జరిగింది. ఆ కాలంలో వాడిన కాంచీపురం, ధర్మవరం, ఆరణి, వేంకటగిరి, మంగళగిరి, పైతాని, బనారస్, షికార్గ్, కశ్మీరీ పట్టు చీరలు , ఈ కాలంలో దొరకని అపురూప చీర సంపదలను ప్రదర్శించి, ఆహూతులను అచ్చెరువొందేలా చేశారు. ఈ చీరలను చూసి తమ అమ్మమ్మ, నానమ్మ దగ్గర చూసిన చీరలు అని అందరూ తమ గత జ్ఞాపకాల్లోకి జారుకుని, ఆనందానుభూతులకు లోనయ్యారు. సంధ్య పుచ్చలపల్లి (ఫౌండర్ అఫ్ ఆర్తి హోమ్) చీరలు మగ్గం మీద నేయడం ఒకొక్కటిగా వివరించి, నేత కార్మికులకు కృతజ్ఞతలు తెలపడం, చీర యొక్క పుట్టుపూర్వోత్తరాలు వివరించడం విశేషం. ఆఖరున కృష్ణవేణి రెడ్డి శీలం, NATA ఉమెన్స్ ఫోరమ్ Advisor కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, అభిమానులకు, NATA ప్రెసిడెంట్ శ్రీ కొర్సపాటి శ్రీధర్ గారికి మరియు వారి కార్యవర్గానికి NATA ఉమెన్స్ కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి అన్న రీతిలో మహిళల ప్రాధాన్యత, వారి గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రయత్నం అంచనాలను మించి విజయవంతం అయిందని, దీనికి తోడ్పాటు అందించిన వారిందరికి నాటా మీడియా అడ్వైజర్ కోటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
ఆమె పేరే ఓ బ్రాండ్
గుజరాత్‌లోని కచ్‌లో ఒక మారుమూల గ్రామవాసి పాబిబెన్ రబారి. మేకలు, గొర్రెల పెంపకమే ప్రధాన వృత్తిగా ఉన్న పాబిబెన్ ఇప్పుడు 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జరీ ఎంబ్రాయిడరీ, బ్యాగుల తయారీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. హస్తకళాకారిణిగా ఆమె కృషి, సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పాబిబెన్ బాల్యం తీవ్ర కష్టాలతో గడిచింది. ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం, తల్లి కొన్ని ఇళ్లలో పాచిపని చేస్తూ తనను, తన చెల్లెలిని పెంచిన విధానాన్ని, మేకలను, గొర్రెలను మేపుకుంటూ బతికిన రోజులను గుర్తు చేసుకుంటుంది ఆమె. ఉన్న కొద్దిపాటి సమయంలో తల్లి సంప్రదాయ ఎంబ్రాయిడరీ పని చేస్తుండేది. అక్కడి వారి కమ్యూనిటీ వివాహ వేడుకల సమయాల్లో తప్పనిసరిగా ధరించే సంప్రదాయ ఎంబ్రాయిడరీ బ్లౌజులు, దుప్పట్లను తయారు చేసేది. ఒక్కో సంప్రదాయ ఎంబ్రాయిడరీ తయారీకి ఏడాదికి పైగా సమయం పట్టేది. ఈ సంప్రదాయం కారణంగా వారి కమ్యూనిటీలో వివాహాలు ఆలస్యం అయ్యేవి. దీంతో కొన్నాళ్లకు ఈ ఎంబ్రాయిడరీని ఆ కమ్యూనిటీ పక్కనపెట్టేసింది. ఈ సమయంలోనే పాబిబెన్ ఈ సంప్రదాయ ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం సాధించింది. ఒక కళారూపం కనుమరుగు కాకుండా కాపాడాలని నిశ్చయించుకుంది. తమ కమ్యూనిటీలో సంప్రదాయ ఎంబ్రాయిడరీని ప్రతిబింబించే కొత్త రూపాన్ని కనిపెట్టింది. ఇది వేగంగా, తక్కువ శ్రమతో కూడుకున్న కళ కావడంతో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. పాబిబెన్ మొదట నలుగురైదుగురు మహిళలతో కలిసి వివాహ సమయంలో ధరించే ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లను తయారు చేసేది. చదువు లేకపోయినా తమకు వచ్చిన కళను కాపాడాలని, సాటి మహిళలకు ఉపాధి కల్పించాలనుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలను కలిసింది. కళలకు సంబంధించిన ఆ సంస్థల నుండి కొన్ని ప్రాజెక్ట్ వర్క్‌లను తీసుకుంది. ‘కానీ, నన్ను ఒక ఆలోచన ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. ఈ కళ మా సొంతం. కానీ, మాకు సరైన గుర్తింపు వచ్చేది కాదు. మేం తయారు చేసిన వాటిని వేర్వేరు బ్రాండ్ల కింద అమ్మేవారు. దీనినుంచి బయటపడేందుకు, మా హస్తకళకు మేమే ప్రాచుర్యం తెచ్చుకోవాలని ఉండేది. దీంతో పెద్దస్థాయి అధికారులను కలిశాను. వారి సూచనల మేరకు మా కళకు ఒక ఇంటిని ఏర్పాటు చేశాం. చేతివృత్తుల వారికి మార్కెట్ ప్లేస్‌గా ఆ స్థలాన్ని ప్రారంభించాం. మొదట ఇది చిన్న వ్యాపారంగానే ప్రారంభమైంది కానీ, పనితో పాటు గుర్తింపు కూడా రావాలనుకున్నాను. అది ఈ ఏడేళ్ల సమయంలో సాధించగలిగాం’ అని చెబుతుంది పాబిబెన్. పాబిబెన్ మొదటి ఉత్పత్తి స్లింగ్ బ్యాగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పాబీ బ్యాగ్’ అని ఆమె పేరుతోనే ఆ బ్యాగ్‌ను పిలిచేటంత ఘనత సాధించింది ఈ హస్తకళాకారిణి. పాబిబెన్ బ్రాండ్‌తో ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ‘పాబిబెన్.కామ్’ అక్కడి గ్రామీణ మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతోంది. -
Andhra Pradesh: మహిళే మహారాణి
అమ్మ కడుపులోని బిడ్డ మొదలు.. చేతలుడిగిన అవ్వ వరకు.. ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి అందుకు తగ్గ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి.. దాదాపు ప్రతి పథకంలోనూ వారినే లబ్దిదారులుగా గుర్తించి అడుగులు ముందుకు వేస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలతో లక్షలాది మందికి శాశ్వత ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంది. ఫలితంగా నాలుగేళ్లలో మహిళా సాధికారత ఏ మేరకు సాధ్యమైందో ఊరూరా కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతి ఇంట్లోనూ మహిళలకు గౌరవం పెరిగింది. సాక్షి, అమరావతి : ఎక్కడ మహిళలకు గౌరవం దక్కుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడిని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళామణులకు అగ్ర తాంబూలం ఇస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలోని మహిళలు ప్రగతిబాటలో పయనిస్తున్నారు. మహోన్నతంగా మహిళా సంక్షేమం అమలవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తోంది. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలే కేంద్ర బింధువుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నవరత్నాలు వంటి అనేక పథకాల్లో 90 శాతం పైగా మహిళలే లబ్దిదారులున్నారు. తద్వారా ప్రతి ఇంటిలో మహిళకు అత్యంత ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం దోహదం చేస్తోంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, కళ్యాణమస్తు, ఇళ్ల పట్టాలు.. ఇలా అన్ని పథకాల లబ్ధి అక్కచెల్లెమ్మలకే దక్కుతుండటం గమనార్హం. వృద్ధాప్య, వితంతు పింఛన్లు, మహిళల రక్షణ కోసం దిశ బిల్లు, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు లాంటి ఎన్నో కార్యక్రమాలు కచ్చి తత్వంతో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల దశ, దిశ మార్చిన పథకాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. కళ్లెదుటే రాజకీయ సాధికారత ♦ ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతలో సాధించిన అద్భుతాలు గమనిస్తే దేశంలో మరే రాష్ట్రం మనకు సాటిలేదని గర్వంగా చెప్పొచ్చు. రాజకీయ సాధికారత విషయమే తీసుకుంటే.. దేశ వ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లు చర్చకు వచ్చి న దాఖలాలు లేవు. ♦ కానీ, రాష్ట్రంలో ఏ డిమాండ్లు, ఉద్యమాలు లేకపోయినా వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత ఎవరూ అడగకుండానే పదవుల్లో మహిళలకు సమున్నత వాటా దక్కింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో మహిళలకే 50 శాతం కేటాయించేలా ఏకంగా చట్టం చేసిన సీఎం వైఎస్ జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. ♦ నామినేటెడ్ పదవుల్లో 51 శాతంపైగా పదవులు ఇచ్చి న తొలి ప్రభుత్వం వైస్ జగన్ ప్రభుత్వమే. గ్రామాల్లో వార్డు మెంబర్, పట్టణాల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర్నుంచి రాష్ట్ర మంత్రి వరకు మహిళలకు పెద్దపీట వేయడం దేశంలోనే రికార్డు. ♦ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్ చైర్మన్‌గా జకియా ఖానంను నియమించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ, సభ్యుల నియామకం ద్వారా మహిళల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని చాటారు. ♦ గతంలో మహిళలకు తొలిసారిగా హోం మంత్రి ఇచ్చి న ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌దే. ఆ తర్వాత ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్.. మరో రెండడుగులు ముందుకు వేస్తూ రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితతో పాటు తొలి మంత్రివర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణిని, మలి విడతలో రాష్ట్ర హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనితతోపాటు మరో ముగ్గురు మహిళలకు కీలక మంత్రి పదవులు అప్పగించారు. ♦ రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో ఏడుగురు.. 26 జడ్పీ వైస్‌చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలే. 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు కలిపి మొత్తంగా 36 పదవుల్లో 18 మంది మహిళలే ఎన్నికయ్యేలా చేశారు. స్థానిక సంస్థల నుంచి నామినేటెడ్ పదవుల్లోను మహిళలకు అగ్రపీఠం దక్కింది. దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 51 శాతం మహిళలే ఉండటం గమనార్హం. సున్నా వడ్డీ పథకానికి మళ్లీ జీవం ♦ గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిక వడ్డీ ఆగడాల నుంచి మహిళలను ఆదుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పావలా వడ్డీ పథకాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. పొదుపు సంఘాల పేరుతో బ్యాంకు నుంచి తీసుకునే రుణం సకాలంలో చెల్లించే మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తుంది. ♦ 2014 తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ పథకానికి నిధులు విడుదల చేయడం ఆపేశారు. దాంతో పొదుపు సంఘాల మహిళలపై కొత్తగా వడ్డీ భారం పడింది. తద్వారా సుమారు 18.36 శాతం పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మిగిలిపోయాయి. అప్పటి దాకా బాగా నడుస్తున్న ‘ఎ’ కేటగిరిలో ఉండే సంఘాలు కూడా ‘సి’, ‘డి’ గ్రేడ్లలోకి పడిపోయాయి. ♦ 2019లో అధికారంలోకి వచ్చి న సీఎం వైఎస్ జగన్.. సున్నా వడ్డీ పథకానికి తిరిగి జీవం పోశారు. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు చెందిన 1,02,16,410 ఖాతాల రుణాలకు సంబంధించి బ్యాంకులకు ప్రభుత్వం వడ్డీ రూపేణా రూ.3,615.28 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం 99.6 శాతానికి పైగా పొదుపు సంఘాలు తిరిగి ‘ఎ’ గ్రేడ్‌లో చేరాయి. ఆసరాతో కొండంత భరోసా ♦ గత చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో అప్పుల పాలైన పొదుపు సంఘాల మహిళలను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి మహిళా స్వయం సహాయక సంఘాల పేరిట ఉండే బ్యాంకు రుణం మొత్తాన్ని ఈ పథకం కింద నాలుగు విడతల్లో ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ♦ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) వివరాల ప్రకారం ఎన్నికలు జరిగిన ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 7.97 లక్షల పొదుపు సంఘాల పేరిట రూ.25,517 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయా పొదుపు సంఘాలకు చెందిన 78,94,169 మందికి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం రూ.19,178.17 కోట్ల లబ్ధి చేకూర్చింది. శాశ్వత ఉపాధికి ‘చేయూత’ ♦ రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు సైతం ఆర్థిక దన్ను కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశపెట్టింది. అర్హులైన లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 26,39,703 మంది మహిళలకు రూ.14,129.12 కోట్లు అందించింది. ♦ మహిళలకు శాశ్వత జీవనోపాధి కలిగేలా అమూల్, హిందూస్థాన్ యూనీ లీవర్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబుల్, రిలయెన్స్ రిటైల్, అజియో బిజినెస్ వంటి సంస్థలతో ఒప్పందం కుదిర్చింది. ఆయా మల్టీ నేషనల్ సంస్థల సహకారం, ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో రాష్ట్రంలో 5,28,662 కుటుంబాలు వివిధ రకాల వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకొని శాశ్వత జీవనోపా«ధి పొందుతున్నాయి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ.. జగనన్న గోరుముద్ద ♦ రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా గర్భిణులు, బాలింతలకు మంచి ఆహారం అందిస్తున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు, అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి విద్యతోపాటు వారికి అవసరమైన బలమైన ఆహారం, వైద్యం అందిస్తున్నారు. వారికి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నారు. ♦ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో 43,26,782 మందికి రూ.3,590 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. బడికెళ్లే పిల్లలకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా బలమైన ఆహారాన్ని అందిస్తున్నారు. లక్షాధికారి అవుతున్న పేదింటి మహిళ ♦ సొంతిల్లు అనేది సామాన్య, నిరుపేద ప్రజల కల. సీఎం జగన్ ఈ స్వప్నం నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 30,76,675 మందికి రూ.75,670.05 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని మహా యజ్ఞంలా చేపట్టారు. ఇప్పటి వరకు 21,31,564 మంది ఇళ్ల నిర్మాణానికి రూ.9,151.79 కోట్లు ఖర్చు చేశారు. ♦ మరోవైపు వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలపై భారం వేయకుండా కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఇంటిని ప్రభుత్వం అందించడం ద్వారా పేదింటి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను సమకూరుస్తున్నారు. ♦ వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 4,38,088 మంది ఈ వర్గం నిరుపేద అక్క చెల్లెమ్మలకు రూ.1,257.04 కోట్లు అందించారు. కాపు నేస్తం, లా నేస్తం వంటి అనేక పథకాల్లోనూ ఓసీ మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేలు చేస్తోంది. ♦ పేద తల్లిదండ్రులు తమ ఆడబిడ్డ పెళ్లి చేయడానికి పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 16,668 మంది ఆడబిడ్డల తల్లుల ఖాతాల్లో రూ.125.50 కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కారి్మకులకు ఈ పథకాలను వర్తింపజేయడం ద్వారా ఆ వర్గాల్లో సంతోషం నింపారు. అమ్మ ఒడి.. చదువులమ్మ గుడి ♦ ప్రతి తల్లి తన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆకాంక్షిస్తుంది. అటువంటి తల్లుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రతి దశలో విద్యార్థుల చదువుల భారం తల్లిదండ్రులపై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించేలా పథకాలు అమలు చేస్తున్నారు. ♦ మూడేళ్ల వయసులో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే దశ నుంచి పాఠశాల విద్య, ఇంటర్ విద్య, ఉన్నత విద్యను పూర్తి చేసుకొనే వరకు పేద వర్గాల కుటుంబాల్లోని పిల్లల చదువులకు అయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పలు పథకాలు ప్రవేశపెట్టారు. పాఠశాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు వీలుగా 8వ తరగతిలోకి వచ్చే పిల్లలకు ప్రతి ఏటా ఉచితంగా ప్రభుత్వం ట్యాబులు అందిస్తోంది. ♦ ఈ నాలుగేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ.19,674.34 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా 25,17,245 మందికి రూ.4,275.76 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 26,98,728 మందికి రూ.10,636.67 కోట్లు లబ్ధి చేకూర్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 1,858 మందికి రూ.132.41 కోట్లు ఇచ్చారు. -
Narayanamma Niraganti: డాక్టరేట్ కలను ‘సెల్ఫ్ హెల్ప్’ నెరవేర్చింది
కుగ్రామం నుంచి ఈ కామర్స్ దాకా నారాయణమ్మ విజయగాధ నారాయణమ్మ నీరగంటి... ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల అనే చిన్న గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహిళ. చదువంతా ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే. ఆమె ఈ రోజు ఒక ‘ఈ కామర్స్’ సంస్థను స్థాపించి తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి పీహెచ్‌డీలో చేరారు. త్వరలో పట్టానందుకోనున్న నారాయణమ్మ తన ఆకాంక్షల సుమహారాన్ని సాక్షితో పంచుకున్నారు. డ్వాక్రా దారి చూపింది ‘‘మా నాన్న రైతు. పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఐదవ తరగతి వరకు మా ఊరి బడిలో చదివాను. ఆరు, ఏడు తరగతులకు ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనంతపురంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని నన్ను, మా అన్నను చదివించారాయన. అలా ఎనిమిదవ తరగతి నుంచి నేను ఇంటిపని, వంట పని చేసుకుంటూ చదువుకున్నాను. అనంతపూర్‌లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏకి ఆళ్లగడ్డ వెళ్లాను. ఆ తర్వాత పెళ్లితో హైదరాబాద్ రావడం నా ఉస్మానియా కల నెరవేరడానికి మార్గం సుగమం చేసింది. అధ్యయనానికి విద్యాసంవత్సరంలో ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చాలెంజెస్’ అంశాన్ని తీసుకున్నాను. 2010–11 నుంచి రంగారెడ్డి, సత్యసాయి జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను అధ్యయనం చేశాను. మొత్తం ఐదు వందల గ్రూపుల కార్యకలాపాలను తెలుసుకున్న తర్వాత గ్రామీణ మహిళల్లో ఉన్న నైపుణ్యాలు, అవకాశాల మీద ఒక అవగాహన వచ్చింది. ఆర్థిక స్వావలంబనను, స్వయంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగైంది. అవకాశాలు అందివస్తే ఇంకా ఏదో సాధించాలనే తపన కూడా కొందరిలో ఉంది. అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వనరులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు కూడా. ఇలాంటి సమన్వయం కొన్ని చోట్ల లేకపోవడం కూడా గమనించాను. మొత్తానికి మార్కెటింగ్ గురించిన ఆందోళన లేకపోతే ఉత్పత్తి విషయంలో శ్రమించడానికి వాళ్లు వెనుకాడరు. నా అధ్యయనం ఇలా సాగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది. కరోనా కొల్లగొట్టింది కరోనా సమయంలో హోటళ్లతో సహా అన్నీ మూత పడడంతో ఉద్యోగాలు లేక ఏదో ఒక పని దొరికితే చాలన్నట్లు చాలా మంది కనిపించారు. శ్రమించే చేతులున్నాయి, ఆ ఉత్పత్తి అవసరమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అప్పుడు ఈ కామర్స్ రంగంలో ఓ ప్రయత్నం చేశాను. కర్పూరం తయారీ దారుల నుంచి కర్పూరాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికీ చేర్చడంలో విజయవంతమయ్యాను. మీషోలో సరదాగా మొదలు పెట్టిన రీ సేల్ అనుభవమూ తోడైంది. నా మార్కెట్‌ను విస్తరించడానికి శాన్విస్ స్టోర్, భవిత శ్రీ ట్రేడింగ్, ఫ్యాషన్, లేజీ షాపింగ్ వాణిజ్య వేదికలతో సెల్లర్‌గా అమెజాన్‌తో అనుసంధానమయ్యాను. ఆ అనుభవంతో గత ఏడాది నవంబర్‌లో మీథాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. ఏడాది కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుతుందని అంచనా. ఏడాదికి నికర లాభం ఏడెనిమిది లక్షలుండవచ్చు. గ్రామాలకు విస్తరించాలి ఇప్పటి వరకు నా నెట్వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు వంటి కొన్ని చోట్లలోనే ఉంది. ఇక గ్రామాల్లో ఉండే డ్వాక్రా మహిళలను అనుసంధానం చేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాజెక్ట్ గ్రామాల్లో పెట్టాలనేది నా ఆలోచన. ఒక కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువూ నా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీద లభించేటట్లు పటిష్ఠం చేయాలి. అలాగే విదేశాలకు సీమంతం కిట్, ఒడిబియ్యం కిట్, గర్భిణి తినాల్సిన పిండివంటలను ఎగుమతి చేయాలి. ఈ సర్వీస్ ఈ కామర్స్‌లో లేదు. ఈ కామర్స్ వేదిక లైసెన్స్, ట్రేడ్‌మార్క్, కాపీ రైట్స్, పేటెంట్లు, ఫుడ్ లైసెన్స్, వెబ్సైట్ నిర్మాణం, ప్రమోషన్ కోసం మూడు లక్షల వరకు ఖర్చు చేశాను. ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నా ఈ ప్రయత్నంలో గృహిణులు, ఒంటరి మహిళలు, అరవై నిండిన పెద్దవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు. ఉపాధినిస్తోంది మూడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత పీహెచ్డీ కోసం ఉద్యోగం మానుకున్నాను. ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరతానని అప్పుడనుకోలేదు. లెక్చరర్‌గా భర్త సంపాదనకు తోడు నేనూ ఉద్యోగం చేసుకుంటూ , ఇద్దరమ్మాయిలను పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చేసిన ఎంబీయే ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద పీహెచ్డీ నన్ను చిన్న పరిధిలో ఉంచడానికి ఇష్టపడలేదు. ఈ సాహసానికి ఒడిగట్టేలా ప్రోత్సహించాయి. మా గైడ్ శ్రీరాములు గారి పర్యవేక్షణలో నా పరిశోధన పూర్తయింది. డాక్టర్ నారాయణమ్మ అనే పేరు నా చిన్నప్పటి కల’’ అన్నారు నారాయణమ్మ. కల నెరవేరు తున్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ స్వరంలో ఆనందం తొణికిసలాడింది. ఎక్కడి ఆర్డర్‌కి అక్కడే పరిష్కారం ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. నగరాల్లో మహిళలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పిల్లలకు మన రుచులను ఇంట్లో చేసి పెట్టడం వాళ్లకు కష్టమే. అందుకే సౌత్ ఇండియన్ స్నాక్స్ హోమ్మేడ్వి అందిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లో 30కి పైగా మహిళలున్నారు. ఒక ప్రదేశం నుంచి ఆర్డర్ రాగానే అదే ప్రదేశంలో ఉన్న మహిళకు ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ కొనుగోలు, ఆమె శ్రమకు వేతనం ఇస్తాను. ఆమె పిండివంటలు తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుతుంది. మా కొరియర్ నెట్వర్క్ వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి పార్సిల్‌ను కలెక్ట్ చేసుకుని కొరియర్ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు చేరుస్తారు. దాంతో పిండివంటలు తయారు చేసిన రోజే అందుతుండడంతో బాగా క్లిక్ అయింది. – వాకా మంజులారెడ్డి -
విజయానికి చేయూత
నర్సీపట్నంలో కిరాణా షాపు నడుపుకుంటున్నాం. మా ఇంట్లో నలుగురుంటారు. కుటుంబ పోషణకు ఈ దుకాణమే ఆధారం. గతంలో చాలీచాలని ఆదాయంతో ఇబ్బందులు పడేవాళ్లం. కరోనా సమయంలో వ్యాపారం చేయడానికే లేదు. బతుకు కష్టమే అనుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆదుకుంది. గతంలో మాలాంటి వారికి ఎలాంటి సాయం ఉండేది కాదు. మైక్రో ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు చెల్లించలేక నరకం చూశాం. ఈ ప్రభుత్వంలో పథకాలు వరంలా ఆదుకుంటున్నాయి. మెప్మా అందించిన రుణ సాయంతో పాటు, చేయూత డబ్బులతో దుకాణాన్ని విస్తరించుకున్నాం. ఇప్పుడు రోజుకు రూ.800 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది. – కొల్లాన లక్ష్మి, నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద బొడ్డేపల్లికి చెందిన బంగారు లక్ష్మికి భర్త లేడు. తన ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఎన్నో కష్టాలు పడింది. బతుకుదెరువు కోసం ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు అమ్ముకున్నా, పెద్దగా ఫలితం లేకపోయింది. జగనన్న ఇచ్చిన చేయూత పథకం సొమ్ము రూ.18,750కి తోడు కొంత పొదుపు రుణం తీసుకుని ఇంటి వద్దే కిరణా దుకాణం ప్రారంభించింది. మెప్మా ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు సంపాదిస్తోంది. నర్సీపట్నంలో ఉంటున్న పెదపూడి అరుణకుమారి, లక్ష్మి తోడికోడళ్లు. వీరి భర్తలు ఎన్నో ఏళ్లుగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు తయారు చేస్తుంటారు. ప్రభుత్వం వీరికి చేయూత, ఆసరా, రైతు భరోసా కింద ఇచ్చిన నగదును వర్క్‌షాప్‌లో పెట్టుబడిగా పెట్టారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న వీరికి బ్యాంకు రూ.5 లక్షలు రుణంగా మంజూరు చేసింది. పొదుపు నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకున్న వీరు వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ‘మా పని రైతులతో ముడి పడింది. ఆర్డరు రాగానే డబ్బులు ఇవ్వరు.. ముందు పెట్టుబడి పెట్టాలి. అందుకు ప్రభుత్వం ఇచ్చిన సాయం ఉపయోగపడింది. ప్రభుత్వం నుంచి ఇంతగా సాయం గతంలో ఎప్పుడూ అందలేదు’ అని తెలిపారు. ఇలా ఒక్క నర్సీపట్నంలోనే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు 10,071 మంది ఉంటే, వారిలో 4,067 మంది చిరు వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు. విశాఖ, నర్సీపట్నం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: అసలే పట్టణాలు.. ఆపై అదనపు ఖర్చులు.. ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి.. ప్రతి ఖర్చుకు ఓ లెక్క.. అవసరమైన వస్తువు కొనాలంటే మరో అవసరాన్ని వాయిదా వేసుకోవాలి.. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ అడుగులు ముందుకు వేశారు. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ‘వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా’ పథకాలను మహిళా లబ్ధిదారులు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ‘చేయూత’గా ఇస్తున్న రూ.18,750కు తోడు, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహిస్తున్నారు. వయసు పైబడిందని, కుంటుంబానికి భారంగా మారామని కుంగిపోతున్న మహిళలు సైతం ఇప్పుడు సంపాదన మార్గంలో పయనిస్తున్నారు. దాంతో సగటున ఒక్కో మహిళ నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పైగా సంపాదిస్తోంది. పెద్ద చదువులు లేకపోయినా తోచిన చిరు వ్యాపారం చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పుడా మహిళల కళ్లల్లో కుటుంబానికి అండగా నిలబడగలిగామన్న సంతృప్తి కనిపిస్తోంది. ఒక్క గ్రేటర్ విశాఖపట్నంలో చేయూత, ఆసరా లబ్ధిదారులు 2,83,440 మంది ఉంటే, వారిలో 90,491 మంది ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో స్వయం ఉపాధి మార్గాల ద్వారా కుటుంబానికి అండగా ఉన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మారిన రాతలు రాష్ట్ర ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన పేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఈ తరహా ఆర్థిక సాయం పొందిన మహిళలు 5,32,393 మంది ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.998,23,68,750 చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల సాయం అందించింది. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల్లోని మహిళలు చెల్లించాల్సిన బ్యాంకు అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇచ్చిన హామీ మేరకు ఆ సాయాన్ని ‘ఆసరా’ రూపంలో చెల్లిస్తున్నారు. ఇలా పట్టణ ప్రాంతాల్లోని 1,54,921 స్వయం సహాయక సంఘాల్లో 14,75,883 మందికి గత మూడేళ్లల్లో రూ.3,300 కోట్లు చెల్లించారు. పట్టణ ప్రాంతాల్లోని మొత్తం 20,08,276 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అధికారులు స్థానిక యూఎల్బీలో స్వయం ఉపాధి మార్గాలపై సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ఆసక్తి గల వారికి వ్యాపార నిర్వహణ, స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణనిచ్చారు. అసరమైన వారికి మెప్మా రుణాలు ఇప్పించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 2,56,959 మంది, ఆసరా లబ్ధిదారుల్లో 5,19,400 మంది మొత్తం 7,76,359 మంది చిరు వ్యాపారాలు, స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకున్నారు. సమర్థవంతమైన సీఎం జగన్ పాలన వల్లే అక్కచెల్లెమ్మలు ఈ విజయం సాధించారని, ఆర్థికంగా నిలదొక్కుకుని తల రాతలు మార్చుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగనన్న చలవతో నిలదొక్కుకున్నా నా భర్త చనిపోయాడు. ఉన్న ఒక్క బిడ్డను పోషించుకునేందుకు నాకు వచ్చిన టైలరింగ్‌ను వృత్తిగా ఎంచుకున్నాను. ఆర్టర్లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ‘చేయూత’ వరంగా మారింది. వచ్చిన రూ.18,750కు తోడు మెప్మా రుణం తీసుకుని ఎన్ఏడీ సెంటర్లో పళ్ల దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ఈ వ్యాపారంలో రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఆదాయం వస్తోంది. నా కాళ్లమీద బతకగలనన్న భరోసా కలిగింది. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తాననే నమ్మకం ఉంది. ఇదంతా జగనన్న చలవే. – మళ్ల అన్నపూర్ణ, ఎన్ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం ఆత్మవిశ్వాసం పెరిగింది గతంలో నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు సత్తువ తగ్గిపోయింది. పనులకు పిలవడం లేదు. కుటుంబానికి భారం అవుతాననుకున్నాను. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. చేయూత డబ్బులతో రోడ్డు పక్కన కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు నేను రోజూ రూ.400 సంపాదిస్తున్నా. ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉన్నా. ఇదంతా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహమే. – కరణం లక్ష్మి, ఎన్ఏడీ గౌరీనగర్, విశాఖపట్నం -
అక్షర స్వరం
‘రచన చేయడం అంటే తెలుసుకోవడం కూడా’ అనే మాట ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్’ పుస్తక రచన కోసం కలం పట్టినప్పుడు కృతిక పాండేకు అనుభవంలోకి వచ్చింది. ఈ పుస్తకం మనల్ని బాధితుల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ పుస్తక ప్రయాణం సానుభూతి కోసం కాదు. ‘మనలో వారి పట్ల చిన్న చూపు ఉంటే మార్చుకుందాం’ అని చెప్పడం. ‘వారితో కలిసి నడవండి’ అని చెప్పడం. ‘విజేతలకు కష్టాలు అడ్డు కాదు’ అనే సత్యాన్ని గుర్తు చేయడం... అవమానాలు, అనుమానాలు, లింగవివక్ష, వేధింపులు, గృహహింసలు... స్త్రీలు ఎదుర్కొనే సకల సమస్యలకు సమాధానం చెబుతుంది ‘రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్: ఎ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ పుస్తకం. ఇది కాల్పనిక ఊహల సమాహారం కాదు. నిజజీవితానికి చెందిన కథ. నిమృత్కు చిన్నప్పటి నుంచి మూర్ఛ సమస్య ఉంది. ఆ సమస్య తనను నీడలా వెంటాడింది. ‘ఈ సమస్యతో స్కూల్‌కు ఎలా పంపుతాం?’ ‘ఫ్రెండ్స్‌తో సినిమాకు వెళతావా? అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు?’ పెళ్లి వయసులోనూ ఆ సమస్య ముందుకు వచ్చింది. ‘మీ అమ్మాయికి మూర్ఛ సమస్య ఉందా? ముందే చెప్పి బతికించారు’ అని వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నిమృత్కు పెళ్లి జరగడం అనేది అతి కష్టం అనుకునే సందర్భంలో తన సమస్య తెలిసి కూడా ఒక కుటుంబం పెళ్లికి ఒప్పుకుంది. ‘మూర్ఛ’ కారణంగా సంసార జీవితంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి. అయితే ముందు కనిపిస్తున్న ముండ్లబాటను చూసి భయపడలేదు నిమృత్. అక్కడే ఆగిపోయి ఉంటే, వెనుతిరిగి ఉంటే ఆమె జీవితం ఈ పుస్తకంలోకి వచ్చేది కాదు. సమస్యను సవాలు చేసి ముందుకువెళ్లింది. కష్టాలను తట్టుకొని నిలబడింది. ప్రపంచం గుర్తుంచుకోదగిన అసాధారణ విజయలేమీ ఆమె సాధించకపోవచ్చు. అయితే తన జీవితాన్ని జయించింది. కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ఇచ్చింది. తనలాంటి వారెందరికో ధైర్యాన్ని ఇస్తోంది. ‘ఆరోగ్య స్థితిని బట్టి ఎవరూ నిర్లక్ష్యానికి గురి కావద్దు. వారికి సహాయంగా నిలవండి. వారి అడుగులు ముందుకు పడడానికి సహకరించండి’ అని ఈ పుస్తకం సందేశం ఇస్తుంది. కృతిక పాండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం హెడ్‌గా పనిచేస్తోంది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేసిన కృతిక దిల్లీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసింది. డెహ్రడూన్‌కు చెందిన కృతిక ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బెంగళూరులోని ‘మిత్ర జ్యోతి ట్రస్ట్’కు ఇవ్వనుంది కృతిక. -
ఇది కదా.. అసలైన ఐడియా, మహిళా సాధికారికతకు అసలైన నిదర్శనం
ఖాజీపేట : మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు .. అందుకు నిదర్శనం ఖాజీపేటలోని మహిళా చేయూత మార్ట్ చెప్పవచ్చు.. నేటి పోటీ వ్యాపారంలో తట్టుకుని అందరికన్నా భిన్నంగా.. ఆలోచిస్తూ తక్కువ ధరకే సరుకులతో పాటు నాణ్యమైన శుభ్రమైన సరుకులు వినియోగదారులకు ఇస్తున్నారు. ఫలితంగా వ్యాపారం బాగా వృద్ధి చెందడంతోపాటు మంచి లాభాలను గడిస్తున్నారు. ఫలితంగా ఇతర మహిళా మార్టులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మహిళా మార్టులను ఏర్పా టు చేయాలని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఖాజీపేటను ఎంపిక చేశారు. మహిళా మార్టు ఏర్పాటుకు పెట్టుబడిగా ప్రతి సభ్యురాలు రూ.300 చొప్పున గ్రూపు నుంచి రూ. 3వేలు వసూలు చేశారు. ఇలా మండలంలో 950 గ్రూపులకు గాను రూ. 23లక్షలు పెట్టుబడిగా వచ్చింది. 2022 నవంబర్ 28న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా మహిళా మార్టును ప్రారంభించారు. విజయవంతంగా.. ఖాజీపేట లాంటి చోట మహిళామార్టులు విజయవంతంగా నడుస్తాయా అని అందరూ భావించారు. అయితే డ్వాక్రా మహిళల సహకారం.. అధికారుల పర్యవేక్షణతోపాటు మార్కెట్లో లభించే ధరలకంటే తక్కువ ధరకు, నాణ్యమైన సరుకులను వినియోగదారులకు అందించేలా సిబ్బంది కృషి చేశారు. ఫలితంగా 5 నెలల్లోనే రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ విజయవంతంగా మహిళామార్టు నడుస్తోంది. లాభాలు అన్నీ సభ్యులకే మహిళా మార్టులో జరిగే వ్యాపారం వల్ల వచ్చే లాభాలు అన్ని మార్టులో పెట్టుబడి పెట్టిన సభ్యులకే. ప్రతి సంవత్సరం వచ్చిన ఆదాయంలో ఖర్చులను తీసి వచ్చిన ఆదాయాన్ని ప్రతి సభ్యురాలికి అందజేస్తామని అధికారులు అంటున్నారు. ప్రతి నెల ఆడిటింగ్ జరుగుతుందని వారు చెబుతున్నారు. మార్చికల్లా 15 మార్టుల ఏర్పాటు జిల్లాలో 15 మార్టులను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఖాజీపేటలో విజయవంతం కావడంతో వేంపల్లి, పోరుమామిళ్ల, బద్వేలులో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే స్థల పరిశీలన చేపట్టారు. -
International Jazz Day: జాజ్ జాజిమల్లి
జాజ్ జాజిమల్లికి కొత్త అందాన్ని తీసుకువస్తోంది ముంబైకి చెందిన ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. పాశ్చాత్య కళకు దేశీయత జత చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. జాజ్ డ్యాన్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. ముంబైలోని ఆల్–ఉమెన్ జాజ్ టీమ్‌లో శ్వేతన్ కన్వర్, రాధిక మాయాదేవ్, రోషిణి నాయర్, వేదిక అగర్వాల్, దీక్ష, రియా సూద్ అనే డ్యాన్సర్లు ఉన్నారు. ‘స్టీరియోటైప్‌ను బ్రేక్ చేయడానికి జాజ్ టీమ్ ప్రారంభించాం’ అంటుంది ఫౌండర్ శ్వేతన్ కన్వర్.\ డెహ్రాడూన్‌కు చెందిన శ్వేతన్ ఫ్యాషన్ మార్కెటింగ్ స్టూడెంట్. ఒకప్పుడు హాబీగా మాత్రమే ఉన్న జాజ్ డ్యాన్స్ ఇప్పుడు తన కెరీర్‌గా మారుతుందని ఆమె ఊహించలేదు. ‘జాజ్ డ్యాన్స్ అనేది అందరూ అనుకునేంత సులువైన విద్య కాదు. ఎంతో సాధన చేస్తే తప్ప ఆ విద్య మన సొంతం కాదు’ అంటుంది శ్వేతన్. రాధిక మాయదేవ్ పదహారు సంవత్సరాల వయసు నుంచే జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే తన అభిరుచినే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ముందు తల్లిదండ్రులు అడ్డుచెప్పినప్పటికీ కూతురు ఉత్సాహాన్ని గమనించి ఆ తరువాత వారు ఆమోదించారు. కూతురికి లభించిన గుర్తింపుకు సంతోషిస్తున్నారు. కామర్స్ స్టూడెంట్ అయిన రోహిణి నాయర్ మొదట భరతనాట్యం చేసేది. ఆ తరువాత జాజ్ డ్యాన్స్‌లోకి వచ్చింది. ఇది వారి తల్లిదండ్రులకు నచ్చలేదు. అయితే వారిని తన మాటలతో మెప్పించింది. ‘మా అమ్మాయి జాజ్ డ్యాన్సర్’ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది రోహిణి. ‘ప్రయోగాలతోనే ఏ కళ అయినా వృద్ధి చెందుతుంది. కళ ఎప్పుడూ నిలవనీరులా ఉండకూడదు’ అంటున్న వేదిక అగర్వాల్ జాజ్‌కు దేశీయ సొగసును జత చేయడానికి పలు రకాలుగా ఆలోచిస్తుంది. సాధారణంగా జాజ్ డ్యాన్స్ అనగానే శాక్స్ఫోన్ శబ్దాలు, ఇంగ్లీష్ పాటల లిరిక్స్ వినిపిస్తాయి. ‘అలా మాత్రమే ఎందుకు!’ అంటూ ఈ టీమ్ జాజ్ డ్యాన్స్‌కు కొత్త లుక్ తీసుకువచ్చింది. ప్రసిద్ధ బాలివుడ్ పాటలతో జాజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభిచారు. ‘మొదట ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తరువాత ఆనందిస్తారు. ఆ తరువాత ఆమోదిస్తారు’ అనే మాట ఈ టీమ్ విషయంలో నిజమైంది. ‘జాజ్ డ్యాన్స్‌లో బాలీవుడ్ పాటలు ఏమిటి!’ అని ఆశ్చర్య పోయినవారే వారి ప్రదర్శన చూసిన తరువాత ‘ఆహా! అద్భుతం’ అని మెచ్చుకున్నారు. ‘హిందీ సినిమా పాటలకే కాదు సౌత్ ఇండియన్ మ్యూజిక్కు కూడా జాజ్ డ్యాన్స్ జత చేయనున్నాం’ అంటుంది రోహిణి నాయర్. ‘మీరు చూస్తే లావుగా కనిపిస్తారు. ఇంత చక్కగా ఎలా డ్యాన్స్ చేయగలుగుతున్నారు!’ అని చాలామంది రాధిక మాయదేవ్ను అడుగుతుంటారు. ఆమె ఆ సందేహానికి చెప్పే సమాధానం... ‘ప్రతి బాడీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. రిథమ్ ఉంటుంది. ప్రతి బాడీకి డ్యాన్స్ చేసే సామర్థ్యం ఉంటుంది. అందుకు అవసరమైనది సాధన మాత్రమే’ జాజ్ డ్యాన్స్‌లో కంటెంపరరీ, పుంక్, స్ట్రీట్ స్టైల్, లిరికల్ అండ్ కమర్శియల్...అంటూ రకరకాల స్టైల్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అభినందనలు అందుకుంటోంది ఆల్–ఉమెన్ జాజ్ టీమ్. -
Andhra Pradesh: సాధికారత సుస్థిరం
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి మార్గాలను మరింత విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేయూత లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్దేశిత వ్యవధి ప్రకారం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు. ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి కోసం తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా.. లబ్ధిదారులు పథకాన్ని అందుకున్న మొదటి ఏడాది నుంచే స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను పెంచడం వల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడతాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు అవగాహన పెంపొందించి బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి ఉపాధి మార్గాలను సమర్థంగా కొనసాగించాలన్నారు. మహిళలు తయారు చేసే వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలని, దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని సూచించారు. చేయూతతో 9 లక్షల మందికి స్వయం ఉపాధి 45 – 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకూ 9 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హిందుస్తాన్ యూనీ లీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహీంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ లాంటి అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టులు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ–కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్ల లాంటివి చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది ‘ఉపాధి’ వ్యయం రూ.8,800 కోట్లు ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా ఈ ఏడాది 1,500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధి హామీ పనిదినాల రూపంలో రూ.5,280 కోట్లు ఖర్చు చేయనున్నారు. మెటీరియల్ రూపంలో రూ.3,520 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా దీనిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణాలు గడువులోగా పూర్తి కావాలన్నారు. మన్నికగా నాణ్యమైన రోడ్లు.. రహదారుల నాణ్యతపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. రహదారుల పనులు చేసిన మరుసటి ఏడాదే మళ్లీ మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తకూడదన్నారు. ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజనీర్లు రోడ్ల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్ కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు రెండు మహిళా సూపర్ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లను నెలకొల్పుతున్నట్లు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లను ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. ఇప్పటికే 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటయ్యాయని వివరించారు. ఒక్కో సూపర్ మార్టును నెలకు కనీసం రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్లైన్ బుకింగ్, వాట్సాప్ బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల భాగస్వామ్యంతో ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ‘వస్త్ర’ పేరుతో ఏర్పాటైన దుస్తుల తయారీ యూనిట్లో 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, ట్రెండ్స్, అజియో లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుమారు 3 వేల కుటుంబాలకు చేయూత లభిస్తున్నట్లు వివరించారు. -
Sangita Success Story: విజయాన్ని పెట్టెలో పెట్టింది
పిండి కొద్ది రొట్టె ఏమోకాని స్వీటు కొద్ది పెట్టె ఉండాలంటుంది సంగీతా పాండే. స్వీట్ బాక్సులను అందంగా తయారు చేయడం మొదలుపెట్టిన ఈ గోరఖ్‌పూర్ సాధారణ గృహిణి 500 రూపాయల పెట్టుబడితో బయల్దేరి ఆరేళ్లలో 3 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అత్తామామలు, భర్త సహకరించకపోయినా గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పట్టుదలగా విజయం సాధించింది. తనలాంటి 100 మంది స్త్రీలకు ఉపాధి కల్పించడంతో ఆమె పొందుతున్న సంతృప్తి వెల లేనిది. ఆరేడేళ్ల క్రితం. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. మూడవ సంతానంగా కుమార్తె పుట్టాక 9 నెలలు నిండేసరికి ఇక ఇంట్లో ఉంటూ కేవలం అత్తామామల సేవ, వంట వంటి పనులు మాత్రమే చేయకూడదు అనుకుంది సంగీతా పాండే. భర్తకు పోలీసు ఉద్యోగం. బదిలీల మీద తిరుగుతుండేవాడు. ఆర్థికస్థితి అంతంత మాత్రం. తనూ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. భర్త ఒప్పుకోలేదు. అత్తామామలు ఒప్పుకోలేదు. కాని ఎదిరించి తను చదివిన డిగ్రీ అర్హత మీద ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. మొదటిరోజు కూతురితోపాటు హాజరైంది. ఆఫీసువాళ్లు అభ్యంతరం చెప్పడంతో మరుసటి రోజు పాపను ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లింది. మనసు ఒప్పలేదు. పిల్లలను దూరం పెట్టి పని చేసే ఉద్యోగం వద్దు అనుకుని మరుసటి రోజే మానేసింది. కాని ఏదో చేయాలి. ఏం చేయాలి? స్వీట్‌షాపులో డబ్బాలు ఆమె ఒకసారి స్వీట్‌షాపులో స్వీట్స్ కొంటున్నప్పుడు ఎవరో వచ్చి ఖాళీ బాక్సులు స్టాకు పడేసి వెళ్లడం చూసింది. తనక్కూడా అలాంటివి తయారు చేసి అమ్మాలని అనిపించింది. అందుకోసం గోరఖ్‌పూర్‌లో వాటిని తయారు చేస్తున్న ఒకరిద్దరు స్త్రీలను కలిసింది. అయితే వారు ఆమెకు పని గురించి అంతంత మాత్రమే చెప్పారు– పోటీకి వస్తుందని. సంగీతా పాండేకి సృజన ఉంది. కొత్తగా చేసే ఆలోచన ఉంది. అందుకే తానే రంగంలో దిగింది. అప్పటికి తన దగ్గర 1500 ఉన్నాయి. ఓ పాత సైకిలుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ రా మెటీరియల్ కొని తెచ్చింది. 8 గంటల్లో 100 డబ్బాలు తయారు చేసింది. తనే వాటిని సైకిల్ వెనుక కట్టుకుని స్వీట్ షాపులకు అమ్మేందుకు బయలుదేరింది. అవి బాగుండటంతో అమ్ముడుపోయాయి కాని ఇంతకంటే తక్కువకు సరుకు వేస్తున్నారని తెలిసింది. గోరఖ్‌పూర్ రత్న ఇటీవలే ఉత్తరప్రదేశ్ సి.ఎం ఆదిత్యానాథ్ మహిళా అంట్రప్రెన్యూర్‌గా ఎంతో స్ఫూర్తినిస్తున్న సంగీతా పాండేని ‘గోరఖ్‌పూర్ రత్న’ బిరుదుతో సత్కరించాడు. ఇప్పుడు సంగీతా పాండే తయారు చేస్తున్న స్వీట్ బాక్సులు ఢిల్లీ వరకూ వెళుతున్నాయి. స్వీట్లను ఒకదాని మీద ఒకటి కుక్కే విధంగా కాకుండా సంగీతా స్వీట్‌బాక్సులు ఒకదాని పక్కన ఒకటి అంటకుండా అమర్చేలా ఉండటంతో ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయం కోసం కొద్ది స్వీట్లతో ఒక బుట్టను ప్రెజెంట్ చేసేలా కూడా పెట్టెలు తయారు చేస్తోంది. స్వీట్లలోని రకాలను బట్టి ఈ ప్యాకింగ్ బాక్సులు మారిపోతుంటాయి. సృజన, శ్రమ కలిస్తే సక్సెస్ అదే వస్తుందనడానికి మరో ఉదాహరణ సంగీతా పాండే. అసలు కిటుకు రా మెటీరియల్ లక్నో, ఢిల్లీలలో తక్కువకు దొరుకుతుందని, వాటితో కళాత్మకంగా డబ్బాలు తయారు చేసి తక్కువకు ఇవ్వగలిగితే చాలా గిరాకీ ఉంటుందని తెలుసుకుంది సంగీతా పాండే. వెంటనే చురుగ్గా ఉండే నలుగురైదుగురు స్త్రీలను పనిలోకి తీసుకుంది. డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి 2 లక్షలు లోన్ సాధించింది. పనిలోకి దిగింది. కిలో, అరకిలో, పావుకిలో డబ్బాలు మంచి రంగులతో లోపల జలతారు వస్త్రంతో తయారు చేసి గోరఖ్‌పూర్, లక్నోలలో స్టాకు వేయడం మొదలెట్టింది. ‘నాణ్యత విషయంలో ఒక పైసా నష్టం వచ్చినా రాజీ పడకూడదు అనే నియమం పెట్టుకున్నాను’ అంటుంది సంగీతా పాండే. ఆ నాణ్యత, ముస్తాబు వల్ల ఆమె ఖాళీ బాక్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ఆమె నగలు కుదువ పెట్టి మరో 3 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించింది. ఆ తర్వాత బ్యాంకులే వెతుక్కుంటూ వచ్చి 30 లక్షలు లోను మంజూరు చేశాయి. ఒక ఫ్యాక్టరీ ఆవరణ, పని చేసే స్త్రీలు, వీరు కాకుండా ఇళ్ల దగ్గర ఉంటూ పనిచేసే స్త్రీలు వీరంతా ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు. సంగీతా పాండే దూసుకుపోయింది. -
రక్షక దళంలో వీర నారీమణులు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అసలే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం... అక్కడ పోలీస్ డ్యూటీ అంటే కత్తిమీద సాము లాంటిదే.. అలాంటి ప్రాంతంలో మహిళా పోలీసులు డ్యూటీ చేయడం అంటే అసాధ్యం అంటారు. కానీ వనదేవతలు కొలువైన ములుగు జిల్లాలో మహిళా రక్షకభటులే ఆ ప్రాంతానికి రక్షణ కవచంలా మారారు. మారుమూల అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ఆడది అబల కాదు... కనిపించని ‘నాలుగో సింహమేరా పోలీస్’ అని నిరూపిస్తున్నారు. అన్నల ఇలాఖా ఆడ పోలీసులకు అడ్డాగా మారింది. పురుషులతో సమానంగా... సెంట్రీ నుంచి ఎస్హెచ్ఓ వరకు తెలంగాణలో అధికశాతం అటవీప్రాంతం గల జిల్లా ములుగు. అడవే కాదు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన జిల్లాలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అలాంటి ప్రదేశంలో పోలీస్ డ్యూటీ అంటే మగవారికే ముచ్చెమటలు పడుతాయి. కానీ మహిళా పోలీసులు నిర్భయంగా పని చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి వరకు 150 మంది మగవారితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా రిసెప్షనిస్ట్, హెల్ప్‌డెస్క్ లో మహిళా పోలీసులు ఉండడం సహజం. కానీ వెంకటాపూర్‌లో 28 మంది పోలీస్ సిబ్బంది ఉంటే అందులో 22 మంది మహిళలే ఉన్నారు. జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్లేకపోయినా, వెంకటాపూర్ పీఎస్‌ను చూస్తే మహిళా పోలీస్ స్టేషన్ అనక తప్పదు. సెంట్రీ డ్యూటీ నుంచి ఇన్చార్జ్ ఎస్హెచ్ఓ డ్యూటీ వరకు మహిళా రక్షకభటులే నిర్వహిస్తారు. ప్రస్తుతం అందులో సగం మంది ఎస్సై పోస్ట్ కొట్టేందుకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అక్కడికి చేరి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాసేవలో ముందుంటున్నారు. సరిహద్దు ఠాణాల్లో మన మహిళా శివంగులు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్, డెవలప్మెంట్ (బీపీఆర్డీ) గణాంకాల ప్రకారం 2021 జనవరి 1 నాటికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే.. మహిళా పోలీసుల సంఖ్యలో తెలంగాణది 25వ స్థానం. ఈ విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణలో ఉన్న వారు అందులో సగం కంటే తక్కువ. రాష్ట్రంలో మొత్తం పోలీసుల సంఖ్యలో 8.03 శాతం మాత్రమే మహిళలు. వీరిలో 76.5 శాతం క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లే. అదనపు డీజీపీలు అయిదుగురు, ఐజీలు ఇద్దరు, డీఐజీ ఒకరు, ఎస్పీలు 15 మంది, అదనపు ఎస్పీలు 19 మంది, డీఎస్పీలు నలుగురు, ఇన్స్పెక్టర్లు 58 మంది, ఎస్సైలు 514 మంది, ఏఎస్సైలు 214 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 280 మంది, కానిస్టేబుళ్లు 3,630 మంది ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో అన్ని కేడర్లలో 8 వేలకు పైగా ఉండగా.. అందులో మహిళలు వెయ్యి మందికిపైగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తుండటం విశేషం. -
మహిళా రిజర్వేషన్ ఉద్యమం ఉధృతం: కవిత
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘మహిళలకు, దేశానికి సాధికారిత కల్పిద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. ఈ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు’అంటూ రూపొందించిన పోస్టర్‌ను శుక్రవారం ఆమె విడుదల చేశారు. మిస్డ్‌కాల్ కార్యక్రమంతో పా టు వచ్చే నెలలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా గోష్టిలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు పోస్టు కార్డులు రాయాలని కవిత నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలనే డిమాండ్‌తో ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత నిరాహార దీక్ష చేశారు. 18 రాజకీయ పారీ్టలతో పాటు మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. -
అక్కచెల్లెమ్మలకు అగ్రపీఠం
సాక్షి, అమరావతి: తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యున్నతికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. 2023–24 బడ్జెట్లోని జెండర్ బడ్జెట్లో మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కేటాయింపులు ఘనంగా చేసింది. కేవలం మహిళల అభివృద్ధికి రూ.77,914 కోట్లు కేటాయించింది. దీనిని రెండు ప్రధాన విభాగాలుగా చేసింది. ప్రత్యేకంగా నూరు శాతం మహిళల కోసమే ఉద్దేశించిన (పార్ట్–ఎ) పథకాలకు రూ.31,825 కోట్లు కేటాయించింది. మహిళలకు 30 నుంచి 99 శాతం వరకు లబ్ధి కలిగేలా ఉద్దేశించిన పథకాలు పార్ట్–బి ప్రోగ్రామ్‌లో రూ.46,088.7 కోట్లు కేటాయించింది. గతేడాది జెండర్ బడ్జెట్లో రూ.55,015 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాదాపు రూ.23 వేల కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. లింగ ఆధారిత బడ్జెట్ కేటాయింపులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయనుంది. మహిళా సాధికారతకు దోహదం చేసే సంక్షేమ కార్యక్రమాలు, స్వయం ఉపాధి, ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సాహం అందించనుంది. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పయనిస్తోంది. మహిళా సాధికారతలో అగ్రగామిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సాధికారతను సాధించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. మహిళలకు కాంట్రాక్టు, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టమే తెచ్చింది. మహిళలు రాజకీయ రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తోంది. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోకుండా దశాబ్దాలుగా కాలయాపన జరుగుతున్నప్పటికీ, ఎవరూ అడగకుండానే స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి పదవులను మహిళలకే కట్టబెట్టిన సీఎం వైఎస్ జగన్ దేశంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. చిన్నారుల సంక్షేమానికి రూ.20,592.57 కోట్లు రాష్ట్రంలో చిన్నారుల సంక్షేమానికి గతేడాది రూ.16,903 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.20,592.57 కోట్లు కేటాయించడం విశేషం. గతేడాది కంటే ఈ సారి దాదాపు రూ.4వేల కోట్లు అదనంగా కేటాయించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్–ఎ)లో రూ.13,187 కోట్లు కేటాయించింది. 30 నుంచి 99 శాతం వరకు పిల్లలు లబ్దిదారులుగా ఉండే పథకాల్లో రూ.7,405.57 కోట్లు కేటాయించింది. చిన్నారులకు అంగన్వాడీల్లో వైఎస్సార్ పోషణ, వైఎస్సార్ పోషణ ప్లస్ పథకాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్న సంగతి తెల్సిందే. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. ‘దిశ’తో మహిళా భద్రత రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లు తేవడంతో నేర నిరూపణ, శిక్షల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. 2019లో అసెంబ్లీలో ఆమోదించిన దిశ బిల్లుతో 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, నేర విచారణతో శిక్షలు పడేలా చేయగలుగుతున్నారు. 18 దిశ పోలీస్ స్టేషన్లు (అప్‌గ్రేడ్ చేసిన మహిళా పోలీస్ స్టేషన్లు), మహిళలు, పిల్లల భద్రతకు దిశ యాప్, దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. మహిళల కోసం 13 వన్ స్టాప్ కౌన్సెలింగ్ సెంటర్లు, మధ్యంతర లీగల్ షెల్టర్లు, హెల్ప్ డెస్‌్కల ఏర్పాటు, దిశ పెట్రోలింగ్ వాహనాలతో ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పిస్తోంది. -
AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత కోసం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. మహిళా పాడిరైతులను ఏకీకృతం చేయడానికి అదే విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను(ఎండీఎస్‌ఎస్) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం ఈ ప్రాజెక్టును అమలు చేసింది. దళారులను తొలగించి పాడి రైతుల నుంచి నేరుగా 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి రూ.250 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించింది. ఈ విధానం ద్వారా పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు రూ.5-20 వరకు మెరగైన ధర లభిస్తోంది. వైఎస్సార్ ఆసరా.. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం వైఎస్సార్ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ► దీని కోసం బడ్జెట్లో రూ.6,700 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ( ఫైల్ ఫోటో ) వైఎస్సార్ చేయూత ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇచ్చింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయించింది. ఉజ్జావల, స్వధార్ గృహ పథకం మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్జావల', 'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవాగృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట -
మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు భారత్
న్యూఢిల్లీ: భారతదేశం గత 9 ఏళ్లలో మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి వైపు పయనించిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళాస్వయం సహాయక బృందా(ఎస్‌హెచ్‌జీ)లను యూనికార్న్‌ల స్థాయికి తీసుకెళతామని చెప్పారు. మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మేథ్స్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 43%కి చేరుకుంది. స్వయం సహాయ సంఘాలను కూడా ఈ ఏడాది యూనికార్న్‌లుగా మార్చాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం ఎస్‌హెచ్‌జీలకు మద్దతుగా నిలుస్తాం. గత 9 ఏళ్లలో ఎస్‌హెచ్‌జీల్లో 7 కోట్ల మంది మహిళలు చేరారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా అందించిన రుణాలు రూ.6.25 లక్షల కోట్లకు చేరాయి. వ్యవసాయేతర ప్రతి ఐదు వ్యాపారాల్లో ఒకటి మహిళే నడుపుతున్నారు’అని ఆయన చెప్పారు. స్టాక్ మార్కెట్లో నమోదు కాకుండానే 1 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగిన కంపెనీలనే యూనికార్న్‌లంటారు. ‘ముద్రా రుణ గ్రహీతల్లో 70% మంది మహిళలే. వీరు తమ కుటుంబ సంపాదనను పెంచడంతోపాటు దేశానికి నూతన ఆర్థిక మార్గాలను తెరుస్తున్నారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వ భావన స్థాయిలను పెంచడం ద్వారా మాత్రమే దేశం ముందుకు సాగుతుంది’అని ప్రధాని చెప్పారు. విపత్తులొస్తే నష్టాన్ని తగ్గించుకోగలగాలి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారం తీసుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. విపత్తు ముంచుకొచ్చాక స్పందించడం కంటే, ముందుగానే ఫ్యూచర్ టెక్నాలజీస్‌ని వినియోగించుకొని జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలన్నారు. నేషనల్ ప్లాట్‌ఫారమ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్) మూడో సదస్సును శుక్రవారం ప్రారంభించి ప్రధాని మాట్లాడారు. -
నారీ శక్తికి సలాం: మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో మహిళలు అమూల్య పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. మన్ కీ బాత్‌లో క్రోడీకరించిన మహిళల స్ఫూర్తి గాథలను షేర్ చేశారు. నారీశక్తి ఫర్ న్యూ ఇండియా అంటూ హాష్‌ట్యాగ్ జత చేశారు. భారత మహిళల స్ఫూర్తిదాయకత్వంపై ‘హర్ స్టోరీ, మై స్టోరీ...’ శీర్షికతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాసిన వ్యాసాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. ‘‘త్రిపుర నుంచి తిరిగొస్తూ వ్యాసం చదివా. ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అతి సాధారణ స్థాయి నుంచి దేశ అత్యున్నత అధికార పీఠం దాకా ఎదిగిన ఒక స్ఫూర్తిదాయక మహిళ ప్రయాణాన్ని కళ్లకు కట్టిన ఆ వ్యాసాన్ని అందరూ చదవాలి’’ అని సూచించారు. అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ కూడా కొనియాడారు. -
యాప్‌లతో సేఫ్టీకి భరోసా!
అడ్వాన్స్డ్ ఎరాలో ఉన్నాం.. మీట నొక్కే వేగంలో పనులు అయిపోతున్నాయి.. అయినా స్త్రీకి సంబంధించిన విషయంలో సమాజపు ఆలోచనలే ఇంకా ప్రగతి పంథా పట్టలేదు! అందుకే ఇప్పటికీ ఆమెకు భద్రత లేదు! ఆమె సేఫ్టీకి సాంకేతికత యాప్‌ల ద్వారా ఇస్తున్న భరోసా మనసావాచాకర్మణా సమాజం ఇవ్వడం లేదు! ఆ స్పృహను సాధించే వరకు.. మహిళ ఆ సేఫ్టీ యాప్‌లనే నమ్ముకోక తప్పదు!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యూఎన్ఓ ఈ ఏడాది ప్రకటించిన థీమ్.. డిజిటాల్: ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ (DigtALL: Innovation and technology for gender equality). . అవును ఏ ఆవిష్కరణ అయినా.. సాంకేతికతైనా స్త్రీ, పురుష సమానత్వాన్నే చాటాలి. ఈ సమానత్వ పోరు నేటిది కాదు.. దాదాపు 115 ఏళ్ల నాటిది. నాడు అమెరికాలో గార్మెంట్ ఇండస్ట్రీలో ప్రమాదరకమైన పని పరిస్థితులు.. స్త్రీల పట్ల వివక్ష.. అసమాన వేతనాలు వంటి విషయాల్లో మార్పు కోసం మహిళల సమ్మెతో మొదలైన పోరాటం.. అన్ని రంగాల్లో.. అన్ని విషయాల్లో జెండర్ ఈక్వాలిటీ దిశగా ఇంకా కొనసాగుతూనే ఉంది. శతాబ్దం మారింది.. అయినా సమానత్వ సాధన కోసం ఇంకా థీమ్స్‌ను సెట్ చేసుకునే దశ, దిశలోనే ఉన్నాం. ‘కాలం మారింది.. ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు కనపడుతున్నారు.. వినపడుతున్నారు కదా!’ అని మనకు అనిపించినప్పుడల్లా.. ఒక్కసారి స్త్రీల మీద జరుగుతున్న క్రైమ్ రికార్డ్స్‌ను ముందేసుకుందాం! అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కదా అని ఎత్తుకున్న తల దించేసుకుంటుంది. స్వేచ్ఛ ఉంటేనే సమానత్వం సిద్ధిస్తుంది. భద్రత ఉంటేనే ఆ స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. ఇంట్లో హింస.. బయట హింస.. ఆఖరకు ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నా హింసే. ఈ వాక్యాలు రొడ్డకొట్టుడులా అనిపిస్తున్నాయి. అంటే పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదనే కదా! అందుకే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ సాధించాలంటే ముందు ఆడపిల్ల సురక్షితంగా ఉండాలి. ఇంటా.. బయటా బేఫికర్‌గా మసలగలగాలి! పోలీసులు, చట్టాలు ఉన్నాయి కదా అని తట్టొచ్చు! ‘నాకు సేఫ్టీ లేదు.. భయంగా ఉంది’ అని అమ్మాయి చెబితేనే కదా.. పోలీసులు స్పందించేది. ఆ అభద్రతను రిజిస్టర్ చేస్తేనే కదా.. రక్షణ చట్టాలు వచ్చేవి. ఇదంతా జరగాలంటే సమాజంలో అవగాహన రావాలి. అమ్మాయిలను చూసే తీరు.. వాళ్లతో ప్రవర్తించే పద్ధతులు మారాలి. వాళ్ల పట్ల మర్యాద పెరగాలి. వీటన్నిటికీ మగపిల్లలకు జెండర్ సెన్సిటివిటీ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో.. తనున్న పరిస్థితి పట్ల ఎరుక.. దాన్నుంచి బయటపడే చొరవ అమ్మాయిలకూ అంతే అవసరం. ముందు తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గుర్తించే ధైర్యం.. తెగువ చేయాలి. అందుకు ఇప్పుడు సాంకేతికత బోలెడంత సాయాన్ని అందిస్తోంది. యాప్‌ల రూపంలో! అలా ఫోన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాల్సిన విమెన్ సెక్యూరిటీ యాప్‌లు కొన్ని ఇక్కడ.. దిశ ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో యాప్‌ను ఓపెన్‌చేసి.. మూడుసార్లు షేక్ చేయగానే ఫోన్లోని జీపీఎస్ యాక్టివేట్ అయ్యి.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, డ్యూటీలో ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తుంది లొకేషన్‌ను పంపించి. ఒకవేళ ఫోన్ షేక్ చేయకుండా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కినా.. మీ సమాచారం మీరున్న ప్రాంతానికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లు, ఆన్ డ్యూటీ పోలీసులకు చేరుతుంది. వెంటనే సహాయ సిబ్బంది మీ దగ్గరకు చేరుకుంటారు. ఈ యాప్ సహాయంతో 100 నంబర్, లేదా ఈ యాప్‌లో ఉన్న ఇతర హెల్ప్ లైన్ నంబర్స్కూ కాల్ చేయవచ్చు. ఈ యాప్ ప్రమాదస్థలికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలనే కాక.. ఇతర సేఫ్టీ ప్లేసెస్, ఆసుపత్రులు, ఇతర హెల్ప్‌లైన్ నంబర్లనూ అందిస్తోంది. విమెన్ సేఫ్టీ (Women Safety) ఈ యాప్‌లోని బటన్‌ను ఒక్కసారి తడితే చాలు.. మీరు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి.. లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ సహా మీ ఫోన్లో మీరు ఫీడ్ చేసుకున్న ఎమర్జెన్సీ నంబర్లకు చేరిపోతుంది. ఇందులోని బటన్లు మూడు రంగుల్లో ఉంటాయి. అంటే మీరున్న పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా రంగుల్లో ఉన్న బటన్స్‌ను నొక్కాలి. షీ టీమ్స్ మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ వింగ్ 2014లో ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధికే వీరి సేవలు పరిమితమైనా.. తర్వాత ఏడాదికి అంటే 2015కల్లా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 112 యాప్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆల్ ఇన్ వన్ యాప్ ఇది. ఉపయోగించడం చాలా తేలిక. ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఈ యాప్‌ను సింగిల్ ట్యాప్ చేస్తే చాలు.. మీరున్న డేంజర్ సిచ్యుయేషన్‌కు సంబంధించి అలారమ్ మోగుతుంది. తక్షణమే సహాయక చర్యల సిబ్బందీ స్పందిస్తారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఫోన్లకూ సెట్ అవుతుంది. ఈ 112 యాప్ మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. కీ ఫీచర్స్ ఏంటంటే.. ఎమర్జెన్సీ అలారమ్‌ను పంపించేందుకు ఇందులో ఆడియో/విజువల్ మీడియా ఉంటుంది. 24 గంటలూ ఈ యాప్ ద్వారా భద్రతా సేవలు పొందవచ్చు. అదనంగా.. సంఘటనల విచారణలోనూ తనవంతు సాయం అందిస్తుంది. మై సేఫ్టీపిన్ (My SafetyPin) డేటా మాపింగ్ టెక్నిక్స్ సాయంతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సేఫ్‌గా ఫీలయ్యేందుకు సాయపడుతుందీ అప్లికేషన్. వెలుతురు, వైశాల్యం, సెక్యూరిటీ గార్డ్స్, కాలిబాట, ప్రజా రవాణా వ్యవస్థ, జెండర్ యూసేజ్, భావోద్వేగాలు.. మొదలైన తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు. ఒకవేళ మీరు రాంగ్రూట్ని ఎంచుకున్నా ఇది వెంటనే మీ కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తుంది. భద్రమైన దారిని ఎంచుకునేందుకు మీకు తోడ్పడుతుంది. మీరు తప్పిదారి అంత భద్రతలేని ప్రాంతంలోకి వెళ్లినా.. ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. సెర్చింగ్‌లో మీ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు.. ఇతర సౌకర్యాల గురించీ మీకు సమాచారం ఇస్తుంది. దేశంలోని నగరాలను సురక్షిత నగరాలుగా మార్చడమే ‘మై సేఫ్టీపిన్’ లక్ష్యం. షీరోస్ ఇప్పుడున్న లీడింగ్ విమెన్ యాప్స్‌లో యూనిక్ యాప్ ఇది. మహిళల భద్రతకు సంబంధించే కాదు కెరీర్ గైడెన్స్, ఫ్రీ హెల్ప్ లైన్, రెసిపీలు మొదలు బ్యూటీ టిప్స్, ఇంట్లో ఉండే పనిచేసుకునే ఉపాధి అవకాశాల నుంచి కొత్త కొత్త పరిచయాలు, ఉచిత న్యాయ సలహాల వరకు మహిళలకు అవసరమైన చాలా అంశాల్లో ఈ యాప్ సహాయమందిస్తుంది. మీ నెలసరినీ ట్రాక్ చేస్తూ సూచనలిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది దీని గోప్యత, భద్రత. మీ ఫొటోలు, వీడియోలు మొదలు మీ వ్యక్తిగత సమాచారాన్నంత గోప్యంగా.. భద్రంగా ఉంచుతుంది. దీని సేవలను ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్.. రెండు ఫోన్లలోనూ పొందవచ్చు. స్మార్ట్ 24 గీ సెవెన్ ( స్మార్ట్ 24 X7) దీనితో ఇరవైనాలుగు గంటల కస్టమర్ సర్వీస్ సెంటర్‌తో సపోర్ట్ పొందవచ్చు. ఇది ఇటు యాపిల్ అటు ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్ అవుతుంది. ఆపదలో ఉన్న మహిళలు తమ దీని ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు చుట్టుపక్కలనున్న ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, అంబులెన్స్ సర్వీసెస్‌కూ పంపిచవచ్చు. వాటి సహాయం పొందవచ్చు.ఆపదలో ఉన్న వాళ్లు బటన్ నొక్కగానే ఆ ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్లు సేవ్ చేసుకున్న అయిదు ఎమర్జెన్సీ నంబర్లకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది. ఒకవేళ జీపీఆర్ఎస్ అందుబాటులో లేకపోతే.. ఎస్మ్మెస్లు వెళ్తాయి. స్మార్ట్ 24 ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ సెంటర్ వాళ్లూ వెంటనే కాల్ చేస్తారు. బీసేఫ్ (bSafe) మహిళల మీద జరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులను నివారించడమే కాక దురదృష్టవశాత్తు ఇలాంటి నేరాలు జరిగితే.. సంబంధించిన సాక్ష్యాధారాలనూ అందిస్తుంది. వాయిస్ యాక్టివేషన్, లైవ్ స్ట్రీమింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్, ఫాల్స్ కాల్, ఫాలో మీ, లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్‌తో మహిళల భద్రతకు భరోసానిస్తోంది. బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు.. ఎస్ఓఎస్ సిగ్నల్‌ను సెండ్ చేసేస్తుంది. దీని ద్వారా.. అత్యవసర వేళల్లో ఫొటోలు తీసుకుని.. వాటిని పోస్ట్ చేయొచ్చు. మీరున్న చోటును మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. దీన్ని ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ రెండు ఫోన్లలోనూ డౌన్లోడ్ చేçసుకోవచ్చు. నిర్భయ ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఫోన్లో డౌన్లోడ్ అయ్యాక.. ఒక్కసారి బటన్‌ను ప్రెస్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ బటన్ నొక్కడం వీలు పడకపోతే ఫోన్ షేకింగ్ ద్వారా, ఎస్సెమ్మెస్‌ల ద్వారా.. ఫోన్ కాల్ ద్వారా కూడా మన పరిస్థితిని తెలియజేయవచ్చు. అయితే వీటికి డేటా ప్లాన్, జీపీఎస్ అవసరం ఉంటాయి. ఆపదలో ఉన్నవారి లొకేషన్‌ను ఇది ప్రతి రెండు గంటలు.. లేదా ప్రతి మూడువందల మీటర్లకు మారినప్పుడల్లా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపిస్తూంటుంది. ఎస్ఓఎస్ – స్టే సేఫ్ ఇది ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో ఈ యాప్ యాక్టివేట్ అయితే చాలు.. ఫోన్ లాక్ మోడ్‌లో ఉన్నా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేసుకునేంత టైమ్ ఉండదు. వెంటనే స్పందించాలి. అందుకే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఆపదలో ఉన్నామని తెలియగానే ఫోన్‌ను రెండుమూడు సార్లు షేక్ చేయాలి.. అంతే.. మనకు సంబంధించిన సమాచారం.. మనమున్న లొకేషన్ సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి వెళ్లిపోతాయి. ఒకవేళ షేక్ చేయడం తికమక వ్యవహారంలా అనిపిస్తే ఈ యాప్ హోమ్ బటన్‌ను ప్రెస్ చేసినా చాలు.. మన సమాచారం, లొకేషన్ సహా మప ఫోన్ బ్యాటరీ ఏ స్థితిలో ఉందో కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి చెప్పేస్తుంది. అంతేకాదు ఆడియో రికార్డింగ్‌నూ పంపుతుంది. రక్ష (Raksha) భద్రతతో కూడిన స్వావలంబన.. ఈ యాప్ లక్ష్యం. అందుకే అహర్నిశలూ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడమూ తేలికే. మీరు ఆపదలో చిక్కుకున్నారని మీకు అనిపించిన వెంటనే యాప్‌లో సూచించిన బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు.. మీరున్న లొకేషన్ సహా మీకు సంబంధించిన అలర్ట్స్ అన్నీ మీ కుటుంబ సభ్యులకు చేరుతాయి మీ వాళ్ల ఫోన్ నంబర్ల ద్వారా. నెట్వర్క్ లేకపోయినా.. ఈ యాప్ స్పందిస్తుంది. వాల్యూమ్ కీని మూడు సెకండ్ల పాటు ప్రెస్ చేస్తే చాలు.. మీ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. ఇందులో ఎస్ఓఎస్ కూడా ఉన్నందున.. ఇంటర్నెట్ లేని ఏరియాల్లో .. ఎస్సెమ్మెస్ ద్వారా మీకు సంబంధించిన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు చేరవేస్తుంది. ఐయామ్ శక్తి (Iam Shakthi) ఇదీ యూజర్ ఫ్రెండ్లీనే. ఫోన్లోని పవర్ బటన్‌ను రెండు సెకండ్ల వ్యవధిలో అయిదుసార్లు నొక్కితే చాలు.. ఫోన్లో ముందుగా సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు లొకేషన్ సహా సమాచారం వెళుతుంది. బటన్ నొక్కిన వెంటనే లొకేషన్‌ను ట్రేస్ చేయలేకపోతే.. ట్రేస్ అయిన వెంటనే మళ్లీ అలర్ట్ మెసేజెస్ను పంపిస్తుంది. విత్యు (WithYou) ఇది కూడా ‘స్పాట్ఎన్సేవ్’ లాంటిదే. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్లోని పవర్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే .. మనకు సంబంధించిన సమాచారమంతా లొకేషన్ సహా.. అంతకుముందే సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు వెళుతుంది.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి. స్పాట్ఎన్సేవ్ ఫీల్ సెక్యూర్ ఇప్పుడున్న అన్ని సేఫ్టీ యాప్లోకెల్లా అడ్వాన్స్డ్ యాప్ ఇది. దీన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాచీలా మణికట్టుకు ధరిస్తే చాలు. అవును రిస్ట్ బ్యాండ్‌లా! డేంజర్ సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీ ఫోన్ పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేయాలి అంతే.. రిస్ట్బ్యాండ్లోని యాప్ యాక్టివేట్ అయ్యి మీరు ముందే సెట్ చేసి పెట్టుకున్న మీ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్‌కి.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి.. మీరున్న లొకేషన్ సహా వివరాలను అందిస్తూంటుంది. ఒకవేళ మీరు ఫోన్‌ను ఉపయోగించే స్థితిలో లేకపోతే రిస్ట్బ్యాండ్కున్న బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేసినా చాలు బ్లూటూత్ సాయంతో యాప్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇటు చూడండీ.. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో)–2021 నివేదిక ప్రకారం.. దేశంలో మహిళల మీద జరుగుతున్న హింస 2020 సంవత్సరం కన్నా 2021లో 15.3 శాతం పెరిగింది. 2020లో 3,71,503 కేసులు నమోదైతే 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు ఈ హింసాత్మక సంఘటనల రేటు 64.5 శాతంగా నమోదైంది. 2020లో ఇది 56.5 శాతం. వీటిల్లో 31.8 శాతం గృహహింస కేసులే. మిగతావన్నీ వేధింపులు, కిడ్నాప్‌లు, లైంగికదాడుల కేసులు. మహిళల మీద జరుగుతున్న హింసలో అసోం రాష్ట్రం మొదటి స్థానపు అప్రతిష్ఠను మూటగట్టుకుంది. తర్వాత స్థానాల్లో ఒడిశా, హరియాణా, తెలంగాణ, రాజస్థాన్‌లు నిలిచి ఆ అవమానపు భారాన్ని మోస్తున్నాయి. షాకింగ్ ఏంటంటే.. గతంలో కన్నా తెలంగాణలో మహిళల మీద హింస పెరిగినట్టు చూపిస్తోంది ఎన్సీఆర్బీ. అత్యంత తక్కువ కేసులతో నాగాలాండ్ కాస్త మెరుగైన రాష్ట్రంగా కనిపిస్తోంది. మూడేళ్లుగా ఇది ఈ రికార్డ్‌నే మెయిన్టైన్ చేస్తోంది. హింస పెట్రేగుతున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు నిలిచి తలవంచుకుంటున్నాయి. 2021 సంవత్సరం CEOWORLD మ్యాగజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోకెల్లా తొలి స్థానంలో నిలిచిన దేశం నెదర్లాండ్స్. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్వీడన్లు ఉన్నాయి. డెన్మార్క్ నాలుగో స్థానాన్ని పొందింది. చిత్రమేంటంటే.. అందరికీ పెద్దన్నలా వ్యవహరించే అమెరికా మొదటి పది స్థానాల్లో ఎక్కడా లేదు. 20వ స్థానంలో ఉంది! యునైటెడ్ కింగ్‌డమ్‌ది పదిహేడో స్థానం. మన గురించీ చెప్పుకోవాలి కదా.. మహిళల భద్రత విషయంలో మన పరువుకు దక్కిన ప్లేస్.. నలభై తొమ్మిది! -
ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐదు రోజుల ముందు ముంబై మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్ల నిర్వహణ బాధ్యతను మొత్తం మహిళా సిబ్బందికే అప్పగించింది. మహిళా సాధికారతను చాటిచెప్పెందుకు ఇలా చేసింది. దీంతో ఈ రెండు మెట్రో స్టేషన్లలో పూర్తిగా మహిళా సిబ్బందే కన్పించనున్నారు. స్టేషన్ మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు మొత్తం 76 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించున్నారు. వీరికి మూడు షిఫ్టుల్లో డ్యూటీ ఉంటుంది. రవాణా రంగంలోలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మెట్రో అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా తాత్కాలికంగా ఈ రెండు స్టేషన్లను మహిళా సిబ్బందికి అప్పగించలేదని, ఇకపై ఈ స్టేషన్ల బాధ్యత శాశ్వతంగా మహిళా ఉద్యోగులే చూసుకుంటారని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మహిళా అనుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్లు ఈ ఏడాది జనవరిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం గమనార్హం.నెల రోజుల్లోనే వీటి బాధ్యతలను పూర్తిగా మహిళలకు అప్పగించారు. చదవండి: మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ.. -
ఆకాశమంత అవకాశం
రేయనా బర్నావీ సౌదీ అరేబియా ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించ నుంది. మహిళాసాధికారత విషయంలో సౌదీ మరో అడుగు ముందుకు వేసింది.. గత వైఖరికి భిన్నంగా సౌదీ అరేబియా మహిళా సాధికారత, హక్కులకు పెద్ద పీట వేస్తోంది. తనను తాను కొత్తగా నిర్వచించుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు... మేల్ గార్డియన్ లేకుండా మహిళలు డ్రైవింగ్ చేయకూడదు, విదేశాలకు వెళ్లకూడదు అనే ఆంక్షలు ఉన్న దేశంలో ఎంతో మార్పు వచ్చింది. దీనికి బలమైన ఉదాహరణ... సౌదీ అరేబియా తొలిసారిగా రేయనా బర్నావీ అనే మహిళను స్పేస్ మిషన్ ఎఎక్స్–2కు ఎంపిక చేయడం. సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ప్రోగ్రాం, ప్రైవెట్ స్పేస్ కంపెనీ ఆక్సియం స్పేస్ (యూఎస్) భాగస్వామ్యంతో చేపట్టిన స్పేస్ మిషన్‌లో 33 సంవత్సరాల బర్నావీ సౌదీ అరేబియా ఫస్ట్ ఉమెన్ ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించబోతోంది. న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్శిటీ నుంచి బయోమెడికల్ సైన్స్‌లో పట్టాపుచ్చుకున్న బర్నావీ రియాద్‌లోని అల్ఫైసల్ యూనివర్శిటీలో బయోమెడికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. క్యాన్సర్ స్టెమ్ సెల్ రిసెర్చ్‌లో తొమ్మిది సంవత్సరాల అనుభవం ఉంది. కొన్ని నెలల్లో ్ర΄ారంభం కానున్న తమ స్పేస్మిషన్ను దృష్టిలో పెట్టుకొని సౌదీ స్పేస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఒక వీడియో విడుదల చేసింది. భావుకత నిండిన ఆ వీడియోలో కొన్ని వాక్యాలు ఇలా ఉంటాయి... సగర్వంగా తల పైకెత్తి చూడు/ ఆకాశంలో అసంఖ్యాకమైన నక్షత్రాలు కనిపిస్తాయి వాటిని పలకరించాలి/ పరిచయం చేసుకోవాలి/ పేరు పెట్టాలి/ నక్షత్రాలు నీ స్నేహితులు కావాలి అంతరిక్షం అనేది నీ అపురూపమైన ఇష్టం కావాలి/ ఆకాశ మార్గంలో నీదైన దారి వెదుక్కో అధ్యయనం చేయాలి/పరిశోధించాలి/ కొత్త విషయాలను ఆవిష్కరించాలి/నీ తరానికి స్ఫూర్తిగా నిలవాలి నీ మార్గంలో నువ్వు ఒంటరివి కావు/ నీ పూర్వీకులెందరో ఆ బాటలో నడిచారు/ గొప్ప విజయాలు సాధించారు/ నీ కలను ఆవిష్కరించే సమయం వచ్చింది ఆ కలకు రెక్కలు ఇచ్చే సమయం వచ్చింది... లెట్ ఇట్ ఫ్లై! వీడియో తొలి దృశ్యంలో ఒక మహిళ కనిపించడం యాదృచ్ఛికం కాక΄ోవచ్చు. అంతరిక్ష విషయాల్లో, విజయాల్లో మహిళలు ముందుండబోతున్నారు అని ప్రతీకాత్మకంగా చెప్పడం కావచ్చు! -
సాధికారతకు చిరునామా.. మహిళా ప్రాంగణం
ఎన్టీఆర్ స్వగ్రామమైన కృష్ణాజిల్లా నిమ్మకూరులోని నందమూరి తారకరామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రం (మహిళా ప్రాంగణం) అక్కడికి అడుగుపెట్టే అతివకు ఆత్మవిశ్వాసం అందిస్తోంది. దాదాపు 7.66 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏకకాలంలో 250 మంది శిక్షణ పొందే హాలు, హాస్టల్, డైనింగ్ వంటి సౌకర్యాలతో సేవలు అందిస్తోంది. గతంలో నిర్లక్ష్యానికి గురై, ఆపై కరోనా సమయంలోను అంతగా సేవలందించలేకపోయిన ఈ ప్రాంగణంపై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ వహించడంతో గురుతర పాత్ర పోషిస్తోంది. ఏడాది కాలంలో మహిళా శిశు సంక్షేమశాఖ అంగన్వాడీ కార్యకర్తలకు, వైద్య ఆరోగ్యశాఖ ఆశా వర్కర్లకు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రీపైమరీ, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనరీ, బ్యూటిషియన్ కోర్సుల్లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడం విశేషం. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రింటింగ్ యూనిట్లో అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన రిజిస్టర్లు, రశీదులు, విద్యార్థులకు నోట్ పుస్తకాలతోపాటు పోలింగ్ కోసం బ్యాలెట్ పేపర్లు సైతం ముద్రించడం విశేషం. ఇదే ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలకు స్వధార్ గృహాన్ని నిర్వహిస్తున్నాం. – వి.శ్రీలక్ష్మి, జిల్లా మేనేజర్ సాక్షి, అమరావతి: నిమ్మకూరులోని మహిళా ప్రాంగణం గురించి జిల్లా మేనేజర్ వి.శ్రీలక్ష్మి సాక్షి ప్రతినిధికి తెలిపినట్లు.. రాష్ట్రంలో 13 నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రాలు 26 జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులకు విశేషసేవలు అందిస్తున్నాయి. పట్టణ, గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపి సాధికారత సాధించేలా అవసరమైన ఉపాధి, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నాయి. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా శిక్షణ కార్యాక్రమాల ద్వారా అవగాహన పెంచుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో భారీస్థాయిలో ఉపాధి ఆధారిత కార్యకలాపాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభ్యున్నతి కోసం కృషిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రతి ప్రాంగణంలో సదుపాయాలు రాష్ట్రంలోని ప్రతి మహిళా ప్రాంగణం (శిక్షణా కేంద్రం) ఒక జిల్లా మేనేజర్ పర్యవేక్షణలో సమర్థంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో ప్రాంగణం సుమారు 8 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రతి ప్రాంగణంలో 200 నుంచి 250 మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చేలా వసతి సౌకర్యాలు కల్పించారు. కార్యాలయ భవనం, థియరీ, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చేందుకు అనుకూలమైన గదులు, నైపుణ్య శిక్షణతోపాటు ఆయా వస్తువుల తయారీ సెంటర్లు, వర్కుషెడ్లు, డార్మిటరీలతో హాస్టలు సదుపాయం, డైనింగ్ హాలుతో విస్తృతమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేశారు. ఉపాధి శిక్షణ స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణలో మహిళా ప్రాంగణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టమాటా ప్రాసెసింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, అలంకరణలు, బ్యూటీషియన్ కోర్సులు, కంప్యూటర్ ఆపరేటర్, ప్రీప్రైమరీ టీచర్ ట్రైనింగ్, నర్సింగ్, షీ ఆటో కార్ డ్రైవింగ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు స్థానికంగా డిమాండ్ ఉండే అనేక ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఉద్యోగినులకు వృత్తి సామర్థ్యం పెంపు ప్రభుత్వ ఉద్యోగినులు వృత్తి సామర్థ్యం పెంచుకునేలా ఈ కేంద్రాల్లో వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, మెప్మా సిబ్బంది వంటి అనేక విభాగాల్లో ఉద్యోగినులు ఇక్కడ శిక్షణ పొంది వృత్తి సామర్థ్యం పెంచుకున్నారు. గత రెండేళ్లలో రూ.6.30 కోట్ల ఖర్చుతో 13 కేంద్రాల్లో 26 జిల్లాలకు చెందిన 86 వేలమందికి శిక్షణ ఇచ్చారు. -
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్‌లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్‌న్‌లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో