ఆరోగ్యం ఆమె హక్కు! | Sakshi special story about International Day of Action for Women Health 2024 | Sakshi
Sakshi News home page

International Day of Action for Women's Health 2024: ఆరోగ్యం ఆమె హక్కు!

Published Tue, May 28 2024 6:31 AM | Last Updated on Tue, May 28 2024 6:49 AM

Sakshi special story about International Day of Action for Women Health 2024

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ ఉమెన్‌ హెల్త్‌ డే!

ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా ఒక హక్కే. ఈ విషయాన్ని ప్రపంచంలోని ప్రతి మహిళా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా మే 28న‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ ఉమెన్‌ హెల్త్‌’ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళ తన ఆరోగ్య సంరక్షణ కోసం అవగాహన పెంచుకోవడంతో ΄ాటు హక్కుగా ఎలా భావించాలో తెలుసుకోవాలి. మహిళల ఆరోగ్య సంరక్షణలో కొనసాగుతున్న ఇబ్బందులు, అవకాశాలను హైలైట్‌ చేసే ఒక ముఖ్యమైన వేడుకగా ఈ రోజును భావించాలి.

మహిళల ఆరోగ్య సంరక్షణలో అసమానతలను తొలగించడానికి లాటిన్‌ అమెరికన్, కరీబియన్‌ ఉమెన్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ 1987లో గ్లోబల్‌ నెట్‌వర్క్‌ (డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్‌)ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సంరక్షణలో మహిళల తక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ నెట్‌వర్క్‌ ఆవిర్భవించింది. మహిళల ఆరోగ్య సేవలు, హక్కులలో నిరంతరంగా వచ్చే అవాంతరాలను పరిష్కరించాలి. మరింత పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించాలనేది ఈ నెట్‌వర్క్‌ ఉద్దేశ్యం.

మొదటిది ప్రసూతి ఆరోగ్యం
మొదట పునరుత్పత్తి, ప్రసూతి సమయాలలో సురక్షితమైన ఆరోగ్య సేవలను ΄÷ందడంపై  దృష్టి సారించడానికి ఈ రోజును కేటాయించారు. ప్రపంచంలో ముప్పై ఏళ్ల క్రితం ప్రసూతి మరణాలు అధికంగా ఉండటంతో తొలుత వాటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత స్త్రీల మానసిక ఆరోగ్యం, హెచ్‌ఐవి, గర్భనిరోధక సాధనాలు, నాన్‌–కమ్యూనికబుల్‌ వ్యాధులు, ఆర్థిక–సామాజిక కారకాల ప్రభావం... వంటి విస్తృత శ్రేణి అంశాలను చేర్చే దిశగా క్రమంగా విస్తరణ జరిగింది. 

ఒక విధంగా చె΄్పాలంటే ఈ అవగాహన అంతర్జాతీయ స్థాయిలో మహిళల ఆరోగ్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి సెమినార్‌లు, శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను స్పాన్సర్‌ చేశాయి. నిధుల పెట్టుబడిని ్ర΄ోత్సహిస్తూ ‘సురక్షిత మాతృత్వం’ అనే థీమ్‌తో సమస్యను చేపట్టాయి. 1987 మే, 28 నుంచి ఈ రోజుకు ఓ ్ర΄ాధాన్యాన్ని కల్పిస్తూ అనేక ప్రభుత్వాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ ΄ûర సమాజ సంస్థలు మహిళల ఆరోగ్యం కోసం తమ చేయూతను అందిస్తున్నాయి. 

అవగాహనే కీలకంగా! 
ఎవరూ ఏ మాత్రం పట్టించుకోని, హాని కలిగించే వ్యాధులతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే క్లిష్టమైన ఆరోగ్య సమస్యలను ఈ రోజు చర్చకు తెస్తూ, వాటిని హైలైట్‌ చేస్తుంది. బహిరంగ సమావేశాల ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తీసుకు వస్తూ, మహిళల ఆరోగ్య సంబంధిత విద్యలను ్ర΄ోత్సహిస్తుంది.  .

ఆరోగ్య హక్కుల కోసం న్యాయవాదిగా!
మహిళల ఆరోగ్య హక్కుల కోసం వాదించడానికి, ఆరోగ్య సంరక్షణలో జెండర్‌ సమానత్వాన్ని ్ర΄ోత్సహించే విధానాల అమలుకు అవసరమైన కార్యక్రమాల ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని వివిధ ్ర΄ాంతాల నుంచి మహిళల ఆరోగ్య న్యాయవాదులు, సంస్థలు, కమ్యూనిటీలను ఒకచోట చేర్చి, వారిలో సంఘీభావాన్ని పెం΄÷ందిస్తుంది. ఈ సమష్టి చర్య మహిళల ఆరోగ్య హక్కుల కోసం చేసే ఉద్యమాలను బలపరుస్తుంది.

మహిళా సాధికారత 
మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సుపై బాధ్యత వహించడానికి ఈ ప్రత్యేకమైన రోజు మహిళలకు ఓ శక్తినిస్తుంది. ఆరోగ్య సమాచారాన్ని వెతకడానికి, సేవలను ΄÷ందడానికి తామే నిర్ణయాత్మక శక్తిలా మారే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా మహిళలను ్ర΄ోత్సహిస్తుంది. 
మహిళల ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వాలు మద్దతునివ్వాలి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో మహిళల ఆరోగ్యం, హక్కులను ్ర΄ోత్సహించే కార్యక్రమాలలో ΄ాల్గొనేలా చేయాలి. ఆరోగ్య నిపుణులు, విధాన రూపకర్తలు, కమ్యూనిటీ నాయకులతో సహా వివిధ సంస్థలు కూడా ఇందులో భాగం కావాలన్నది డబ్ల్యూజిఎన్‌ఆర్‌ఆర్‌ నెట్‌వర్క్‌ ప్రధాన లక్ష్యం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement