ఐఫోన్ కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తమ భారత విభాగంలో మహిళలకు ప్రాధాన్యమివ్వడంపై మరింతగా దృష్టి పెడుతోంది. మహిళలను కేవలం అసెంబ్లింగ్ విభాగానికే పరిమితం చేయకుండా డిజైన్, టెక్నాలజీ సంబంధ హోదాల్లో సారథ్యం వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు తెలిపారు.
మహిళలు తమ కెరియర్‌లో పురోగతి సాధించేందుకు కంపెనీ మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు లియు పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. ఫాక్స్‌కాన్‌కు సంబంధించి భారత్‌లో మొత్తం 48,000 మంది ఉద్యోగులు ఉండగా, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలు ఉన్నట్లు లియు వివరించారు. సంస్థ ఇటీవలే చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ఆవిష్కరించింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!
ఫాక్స్‌కాన్ రూ.25,000 కోట్లతో కర్ణాటకలో మొబైల్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. దీనితో 40,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ యూనిట్ ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment