దేశంలో తయారవుతున్న ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్‌ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
భారతదేశంలో యాపిల్(Apple) ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?
యాపిల్ 2024లో దేశీయంగా 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.08 లక్షల కోట్లు) ఎగుమతుల మార్కును సాధించింది. భవిష్యత్తులో వీటి విలువ ఏటా 30 బిలియన్ డాలర్లకు చేర్చాలనేలా లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌లో భారతదేశం ఉత్పాదక(Productivity) వాటా ప్రస్తుతం 14%గా ఉందని, దాన్ని భవిష్యత్తులో 26%కి పైగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment