PLI Scheme
-
పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, హోల్‌టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలురిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్‌ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలునిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు. -
వేగంగా వృద్ధి చెందుతున్న రంగం
ఉత్పత్తి ఆధారిత ప్రోత్రాహకాల(పీఎల్ఐ) వల్ల మొబైల్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. పీఎల్ఐ పథకం కింద ఈ రంగం ఇప్పటికే లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగం వాటా 17.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2024లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ చూపినట్లు తెలిపారు.ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు‘పీఎల్ఐ పథకం వల్ల దేశీయంగా మొబైల్ ఉత్పత్తి రంగంలో ప్రాథమికంగా రూ.9,100 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వీటివల్ల రూ.6.61 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2014-15లో వీటి ఎగుమతులు కేవలం రూ.1,566 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దాదాపు రూ.1.2 లక్షల కోట్లు విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రంగం దాదాపు రూ.8.12 లక్షల కోట్లు ఉత్పత్తిని సాధిస్తుందని అంచనా. పీఎల్ఐ పథకం వల్ల మొబైల్ తయారీ రంగంలో దాదాపు లక్షకు పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వృద్ధికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో తోడ్పడింది’ అని కృష్ణన్ తెలిపారు. -
తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?
కేంద్రం జులై 23న ప్రవేశపెట్టే బడ్జెట్ 2024-25లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) పెంచుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా రానున్న బడ్జెట్లో ప్రకటనలు వెలువడుతాయని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.భారతదేశ ఆర్థిక వృద్ధి, ఉపాధిని పెంపొందించేందుకు తోడ్పడే తయారీ రంగానికి కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2024 ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పీఎల్ఐ పథకంలో భాగంగా తయారీ రంగానికి రూ.6,200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మునుపటి సంవత్సరం అంచనా రూ.4,645 కోట్లతో పోలిస్తే 33% ఎక్కువగా ఉంది. ఈ నిధులు మొబైల్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి 14 రంగాల్లో ఉత్పత్తుల తయారీకి, సప్లై చైన్‌కు ఉపయోగపడుతాయని మంత్రి చెప్పారు. అయితే ఈసారి పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో తయారీ రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.2021లో పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి తయరీ రంగం రూ.1.03 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించింది. దీని వల్ల రూ.8.61 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, విక్రయాలు జరిగాయి. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 6.78 లక్షల మందికి పైగా ఉపాధి కలిగినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అయితే, లెదర్, గార్మెంట్స్, హాండ్లూమ్స్, నగలు, తోలు, వస్త్రాల తయారీ వంటి రంగాల్లో పరిమితంగానే ఉపాధి లభించింది. ఈ పరిశ్రమలపై తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందినవారు చాలా మంది ఆధారపడుతారు. దీనిపై మరింత కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బడ్జెట్లో ‘ఫేమ్ 3’ ప్రకటన ఉండదు: కేంద్రమంత్రిఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికాం ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే పీఎల్ఐ పథకం ద్వారా రూ.3.20 లక్షల కోట్లకు మించి ఎగుమతులు జరిగాయి. రాబోయే ఐదేళ్లలో ఉత్పత్తి, ఉపాధి, ఆర్థిక వృద్ధిని మరింత పెంచడమే ఈ పథకం దీర్ఘకాలిక లక్ష్యం. పీఎల్ఐ పరిధిలోని 14 రంగాలలో మొత్తం 746 దరఖాస్తులు ఆమోదించారు. ఈ రంగాల్లో రానున్న రోజుల్లో దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
‘పీఎల్ఐ శాశ్వత సబ్సిడీ కాదు’
డ్రోన్ పరిశ్రమ పురోగతికి కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ఎంతో ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వ శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. న్యూదిల్లీలో పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పీఎల్ఐ పథకాన్ని పరిశ్రమలు శాశ్వత సబ్సిడీగా పరిగణించకూడదు. ఆయా రంగాలను ఈ సబ్సిడీపై ఆధారపడేలా చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇది వాటి పురోగతికి అందించే ప్రోత్సాహకం మాత్రమే. డ్రోన్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతిక పురోగతి రైతులకు అధిక నాణ్యత గల పంటలను అందించాలి. పంటల దిగుబడిని పెంచేలా సహకరించాలి. అందుకు అనువుగా మరిన్ని పరిశోధనలు జరగాలి. గ్రామ స్థాయిలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసి మహిళా సాధికారత కల్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ప్రధానమంత్రి ‘నమో డ్రోన్ దీదీ’ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్డీఏ కూటమి మూడో టర్మ్ పరిపాలనలో మూడు రెట్లు వేగంతో పని చేస్తాం. మూడు రెట్ల ఫలితాన్ని అందిస్తాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వెనక చైనా హస్తం‘గ్రామ స్థాయిలో డ్రోన్ల వాడకం వల్ల సహకార రంగం, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లకు ఆదాయం సమకూరుతుంది. వీటికి డ్రోన్లు అందించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పరిశ్రమలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి 2024 ప్రథమార్థంలో 18 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లకు అనుమతులిచ్చాం. 2023లో 17 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి’ అని మంత్రి పేర్కొన్నారు. -
‘పీఎల్ఐ పథకం విస్తరణ’... ఏ రంగానికి.. ??
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వస్త్ర రంగానికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ (ఐఐజీఎఫ్)లో పాల్గొని మాట్లాడారు.‘జౌళి రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకంలో భాగంగా రూ.10,000 కోట్లు అందిస్తున్న కేంద్రం..దీన్ని గార్మెంట్స్ రంగానికి విస్తరించాలని యోచిస్తోంది. వస్త్ర రంగంలో ఎగుమతులను పెంచుకోవడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.13 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులను పరిశ్రమ లక్ష్యంగా నిర్ణయించింది. దేశంలో మ్యాన్ మేడ్ ఫైబర్(ఎంఎంఎఫ్) అపెరల్, ఫ్యాబ్రిక్స్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐదేళ్ల వ్యవధికిగాను 2021లో పీఎల్ఐలో భాగంగా రూ.10,683 కోట్ల ఇచ్చేందుకు ఆమోదించింది. పరిశ్రమ తన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాన్ని గార్మెంట్స్(వస్త్ర) రంగానికి విస్తరించాలని యోచిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ టెక్స్టైల్స్ పరిశ్రమ మార్కెట్ పరిమాణం సుమారు 165 బిలియన్ డాలర్లుగా(రూ.13 లక్షల కోట్లు) ఉంది. దాన్ని రానున్న రోజుల్లో 350 బిలియన్ డాలర్ల(సుమారు రూ.27 లక్షల కోట్లు)కు పెంచాల్సి ఉంది. ఈ రంగంలో చైనా కంటే ముందుండేందుకు మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈకామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచే అవకాశాలను అన్వేషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘గ్రీన్ టెక్స్టైల్స్, రీసైక్లింగ్‌పై దృష్టి సారించాలి. గ్లోబల్ బ్రాండ్లకు సరఫరాదారులుగా మారకుండా దేశీయ కంపెనీలు తమ సొంత బ్రాండ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుల పథకం(ఎస్ఐటీపీ)ను పునరుద్ధరించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త టెక్స్టైల్ పార్కులను రూపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటికే 54 టెక్స్టైల్ పార్కులు మంజూరయ్యాయి. -
వేరబుల్స్ రంగానికీ పీఎల్ఐ స్కీమ్.. కేంద్రానికి ఎంఏఐటీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, వేరబుల్స్ తయారీకి సంబంధించి మరో రెండు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ( పీఎల్ఐ ) పథకాలను రూపొందించాలని ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటి) ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ఎన్నికల తర్వాత ట్యాక్స్‌ల్లో మార్పులు, చైనా పౌరుల వీసా సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఎంఏఐటీ విజ్ఞప్తిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.ఎంఏఐటీ విభాగం కేంద్ర ప్రభుత్వం తరుపున దేశంలో ప్రైవేట్ ఐటీ హార్డ్ వేర్ రంగాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరిస్తుంది. ఆయా కంపెనీల కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. వాటి వృద్ది కోసం పాటు పడుతుంది.ఆ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న డిక్సాన్ టెక్నాలజీస్, డెల్, హెచ్‌పీ,గూగుల్ కార్యకలాపాలు, నిబంధనలకు మేరకు పనిచేస్తున్నాయా? వంటి అంశాలపై రివ్యూ నిర్వహించనుంది.ఈ తరుణంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ,వేరబుల్స్ విభాగంలో సైతం పీఎల్ఐ స్కీంను రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, వేరబుల్స్ తయారీ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఎగుమతులు, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు అవకాశాలను ఆకర్షించడం, దేశీయంగా ఆ రంగాల్సి ప్రోత్సహించడంతో పాటు అపారమైన అవకాశాల్ని సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. -
భారత్‌లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ ఉత్పత్తుల్లో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్‌లోనే తయారవుతోందని ప్రధానిమోదీ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ..‘ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది. గ్లోబల్‌గా తయారువుతున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఐఫోన్‌తోపాటు యాపిల్ ఉత్పత్తులను కూడా భారత్ రికార్డు సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం ద్వారానే ఇది సాధ్యమైంది’ అని అన్నారు.2028 నాటికి మొత్తం ఐఫోన్లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి త్రైమాసికానికి సంబంధించి యాపిల్ ఉత్పత్తుల షిప్మెంట్లో దేశం రికార్డు స్థాయిని చేరుకుంది. దేశంలోని యాపిల్ ఉత్పత్తుల్లో ఏడాదివారీగా 19 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ తెలిపింది.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనల ద్వారా తెలిసింది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..
భారత్ వస్తు ఎగుమతులు 2024-25 ఏడాదికిగాను 500 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.41.5 లక్షల కోట్లు) చేరవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) అంచనా వేసింది. సుమారు 400 బిలియన్ డాలర్ల విలువచేసే సేవల ఎగుమతులుతోడైతే మొత్తంగా ఎక్స్‌పోర్ట్స్ 900 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫియో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. 2023-24లో దేశం మొత్తం ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్నారు. అంతకుముందు ఏడాది కంటే 2023-24లో వస్తు ఎగుమతులు 3% తగ్గి 437 బి.డాలర్లు (సుమారు రూ.36.27 లక్షల కోట్లు)గా నమోదైనట్లు అశ్వనీ చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సేవల ఎగుమతుల్లో ఇంజినీరింగ్, అడ్వర్టైజింగ్ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ విస్తరణ వల్ల వ్యాపార ఎగుమతులు మరింత పెరుగుతాయి. భారత్ నుంచి యూఎస్, యూరప్‌కు అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, హై అండ్ మీడియం టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్, డయాగ్నొస్టిక్ పరికరాలకు డిమాండ్ ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి..ఫియో వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ..‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం ద్వారా లబ్ధిపొందిన చాలా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుతున్నాయి. 2023-24లో రెండంకెల క్షీణతను చూసిన దుస్తులు, పాదరక్షలు, డైమండ్లు, ఆభరణాల వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు ఈసారి మెరుగైన ఫలితాలు నమోదు చేయబోతున్నాయి. ఈసారి ఆశించిన విధంగానే రుతుపవనాలు వస్తాయి. ప్రభుత్వం తృణధాన్యాల ఎగుమతులపై ఉన్న కొన్ని పరిమితులను తొలగించవచ్చు’ అని చెప్పారు. -
ఫార్మాకు కొత్త పీఎల్ఐ పథకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగానికి కొత్త ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) తయారీకి అవసరమైన కీలక రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తద్వారా కీలక రసాయనాల ఉత్పత్తుల కోసం భారతీయ కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్ధేశం. ఫార్మాతో ముడిపడి ఉన్న అన్ని విభాగాలు ప్రస్తుత పీఎల్ఐ కింద కవర్ కాలేదు. దీని కారణంగా ఈ రసాయనాలు ఇప్పటికీ చైనా నుండి పెద్దమొత్తంలో భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. అయితే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే నూతన పీఎల్ఐ కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే తదుపరి కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదిత పథకం భాగం కావచ్చు. ప్రస్తుత పథకానికి సవరణ.. భారత్‌కు దిగుమతి అవుతున్న ఫార్మా ముడిపదార్థాల్లో 55–56 శాతం వాటా చైనాదే. 2013–14లో దిగుమతైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌లో చైనా వాటా విలువ పరంగా 64 శాతం, పరిమాణం పరంగా 62 శాతం వృద్ధి నమోదైంది. 2022–23 వచ్చేసరికి ఇది వరుసగా 71 శాతం, 75 శాతానికి ఎగబాకింది. చైనా నుంచి ముడిపదార్థాల (బల్క్ డ్రగ్) దిగుమతులు 2013–14లో 2.1 బిలియన్ డాలర్లు, 2018–19లో 2.6 బిలియన్ డాలర్లు, 2022–23 వచ్చేసరికి 3.4 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. చైనాలో ఈ రసాయనాల తయారీ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ఏపీఐల ఉత్పత్తికై భారతీయ తయారీ సంస్థలు చైనా నుంచే వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రసాయనాలు కాలుష్యకారకాలు. ఈ రసాయనాలను పీఎల్ఐ పరిధిలోకి చేర్చేందుకు ప్రస్తుత పథకాన్ని సవరించడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. జాప్యాలకు దారితీయవచ్చు.. ప్రస్తుతం ఉన్న ఫార్మా పీఎల్ఐ పథకం కింద పరిశ్రమకు కీలక స్టారి్టంగ్ మెటీరియల్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను స్థానికంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫార్మా సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రస్తుత పీఎల్ఐ పథకం కవర్ చేయడం లేదు. అయితే ఏపీఐల తయారీలో వాడే రసాయనాల ధరలను చైనా తగ్గించింది. పీఎల్ఐ పథకంలో భాగం కాని కంపెనీలు చైనా నుంచి ఈ రసాయనాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటున్నాయి. కీలక ఔషధ ముడి పదార్ధాల కోసం ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం భారత ఫార్మా పరిశ్రమకు ప్రమాదం కలిగించే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం ఏమంటే సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడినట్టయితే మందుల కొరత, తయారీ జాప్యాలకు దారితీయవచ్చు. -
పోటీతత్వంతోనే అంతర్జాతీయంగా రాణింపు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆరంభ మద్దతుగానే పరిశ్రమ చూడాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమ మరింత వృద్ధి చెందాలంటే పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పీఎల్ఐ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు, దీని కింద ప్రయోజనం పొందిన సంస్థలు నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మలచాలన్నది ప్రభుత్వ యోచన అని, ఈ విషయంలో అసలైన సుదీర్ఘ ప్రయాణం ముందున్నట్టు చెప్పారు. పీఎల్ఐ పథకంపై నిర్వహించిన కార్యక్రమంలో వందలాది భాగస్వాములు, అధికారులు పాల్గొన్నారు. ‘‘ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడే విధంగా మిమ్మల్ని మార్చాలని కోరుకోవడం లేదు. మీ కృషిని ఆరంభించేందుకు ప్రోత్సాహంగానే (కిక్‌స్టార్ట్) దీన్ని చూడాలి. కానీ, అంతిమంగా పోటీయే నిలుస్తుంది. ఒకరితో మరొకరు, ప్రపంచంతోనూ పోటీ పడి రాణించాల్సి ఉంటుంది’’అని గోయల్ చెప్పారు. సౌకర్యమని చెప్పి దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, పరిశ్రమ క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారించాలని సూచించారు. భారత్‌ను తయారీ శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం, లబ్దిదారులు (కంపెనీలు) మధ్య సహకారం అవసరమని, ఒకరికొకరి మద్దతు కూడా కీలకమన్నారు. విలువ జోడించాలి.. భారత తయారీలో స్థూల విలువ జోడింపు (జీవీఏ/విడిభాగాలు కూడా ఇక్కడే తయారైనవి) కేవలం 17.4 శాతమే ఉందని, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు, మరింత మంది ఉపాధి కల్పనకు ఇది చాలదని డీపీఐఐటీ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ అన్నారు. పరిశ్రమ మరింత విలువను జోడించడంపై దృష్టి సారించాలని సూచించారు. మొబైల్, వైట్గూడ్స్లో దేశీయంగా ఉత్పత్తుల తయారీకి విలువ తోడవుతున్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, వీటి పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చెప్పారు. 10 ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు, 14పీఎల్ఐ పథకాలకు సంబంధించి రంగాల వారీ ముఖ్య సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. -
రూ. 25,813 కోట్ల పెట్టుబడులు.. 56,171 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద రూ. 25,813 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 56,171 ఉద్యోగాల కల్పన జరిగింది. కేంద్ర ఫార్మా విభాగం (డీవోపీ) వార్షిక సమీక్షలో ఈ విషయాలు వెల్లడించింది. స్కీముకు ఎంపికైన సంస్థలు రూ. 1,16,121 కోట్ల మేర విక్రయించినట్లు డీవోపీ తెలిపింది. దేశీయంగా ఔషధాల తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా పీఎల్ఐ స్కీము ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2020–2021 నుంచి 2028–2029 మధ్య కాలంలో ఇది అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద 55 సంస్థల దరఖాస్తులు ఆమోదం పొందాయి. నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలో అందించేందుకు తలపెట్టిన ’ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద ఈ ఏడాది 10,000 రిటైల్ అవుట్‌లెట్స్ ప్రారంభించాలన్న లక్ష్యం కూడా డీవోపీ పూర్తయినట్లు పేర్కొంది. పీఎంబీజేపీ కింద 1,965 ఔషధాలు, 293 సర్జికల్ పరికరాలు ఉన్నాయి. -
ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని దేశీయంగా పెంచేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలను (పీఎల్ఐ) ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు ఎల్రక్టానిక్ విడిభాగాల స్థానిక తయారీని సైతం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ ఎస్.కృష్ణన్ వెల్లడించారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో 99% స్థానికంగానే తయారవుతున్నట్టు చెప్పారు. ‘‘అసెంబ్లీ యూనిట్లకు అదనంగా 10–15 శాతం విలువ జోడింపుపైనే ఆధారపడకూడదు. మనం ఇంకా ఏమి చేయగలమో, విలువ ఆధారిత సరఫరాలో మరింత ముందుకు ఎలా వెళ్లగలమో ఆలోచించాలి’’అని సూచించారు. ఏ దేశం కూడా మొత్తం వ్యాల్యూచైన్‌లో ఆధిపత్యం చూపించలేదన్నారు. చైనా విషయానికొస్తే వ్యాల్యూచైన్‌లో 40–45% వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు. భారత్ 35–40% సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఎల్రక్టానిక్ ఉత్పత్తుల విడిభాగాలకు సంబంధించి రెండో విడత పీఎల్ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఊరట.. తగ్గనున్న బ్యాటరీల ధరలు!
న్యూఢిల్లీ: విద్యుత్తు వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్తే. ఎందుకంటే విద్యుత్తు వాహనాల్లో అత్యంత ఖరీదైన భాగమైన బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఏర్పడింది. దేశం విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా బ్యాటరీలపై మరో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని చెప్పారు. అమ్మకాల పెరిగే బ్యాటరీల ధరలు తగ్గుతాయని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అందుకే స్టోరేజీ బ్యాటరీలకు సంబంధించి పీఎల్ఐ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో బ్యాటరీల తయారీ సామర్థ్యం పరిమితంగా ఉన్నందునే ధరలు అధికంగా ఉన్నాయని, దీనికి తోడు ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణఙంచే దూరం కూడా తక్కువగా ఉండటం వల్లనే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతగా ఊపందుకోవడం లేదని ఆయన వివరించారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలకు రూ.18,100 కోట్లతో కేంద్ర సర్కారు 2021 మే నెలలో పీఎల్ఐ ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. దీని ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ఉద్దేశ్యం. దీని ద్వారా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని దేశీయంగా సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది. ఏసీసీ అనేది బ్యాటరీ స్టోరేజీలో అత్యాధునిక టెక్నాలజీతో కూడినది. విద్యుత్‌ను ఎలక్ట్రో కెమికల్ లేదా కెమికల్ ఎనర్జీ రూపంలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు తిరిగి విద్యుచ్ఛక్తి మారుస్తుంది. ఈవీల వాడకం వల్ల దేశీయంగా కాలుష్యం తగ్గుతుందని మంత్రి సింగ్ చెప్పారు. జమ్మూ కశ్మీర్లో లిథియం నిల్వలు బయటపడడాన్ని అదృష్టంగా పేర్కొన్నారు. విద్యుత్‌కు భారీ డిమండ్.. సోడియం అయాన్ బ్యాటరీలపై పరిశోధనలు జరుగుతున్నాయని, సత్పలితాలు వస్తే మంచిదని మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ప్రత్యామ్నాయ కెమిస్ట్రీ అనేది తప్పనిసరిగా పేర్కొన్నారు. ‘‘విద్యుత్‌కు డిమాండ్ ఆగస్ట్‌లో 20 శాతం పెరిగినట్టు మంత్రి చెప్పారు. సెప్టెంబర్‌లోనూ 20 శాతం పెరిగిందని, అక్టోబర్‌లో మొదటి 14 రోజుల్లో 16 శాతం అధిక డిమాండ్ నమోదైనట్టు వెల్లడించారు. -
పీఎల్ఐ ద్వారా ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు రూ.1000 కోట్లు
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) సాధికార కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలకు రూ.1000 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద మొత్తం రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా.. 2023 మార్చికి ప్రభుత్వం రూ.2,900 కోట్లు పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇదే తొలి నగదు పంపిణీ. ఎలక్ట్రానిక్ తయారీ, వైట్ గూడ్స్, జౌళి, ఔషధ పరికరాల తయారీ, వాహన, స్పెషాలిటీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, సోలార్ పీవీ మాడ్యుల్స్, అడ్వాన్డ్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్స్, ఔషధ వంటి 14 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశీయ తయారీ, ఉద్యోగాల సృష్టి, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు 2021లో ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది. పీఎల్ఐ పథకం కింద ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న 32 భారీ సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో 10 కంపెనీలు మొబైల్ తయారీ సంస్థలే. ఈ పథకం కింద అదనంగా రూ.10లక్షల కోట్ల ఉత్పత్తి; 7 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా. -
ఫార్మా, డ్రోన్లు, టెక్స్టైల్స్ పీఎల్ఐలో మార్పులు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్, డ్రోన్లు, టెక్స్టైల్స్ రంగాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద కేంద్రం మార్పులు చేయనుంది. ఈ రంగాల్లో తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా రాయితీలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి అనధికారికంగా వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటివరకు 14 రంగాలకు పీఎల్ఐ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించి, దరఖాస్తులను సైతం స్వీకరించింది. మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా కొనసాగిన సంప్రదింపుల్లో భాగంగా ఈ రంగాలకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు సదరు సీనియర్ అధికారి తెలిపారు. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందనున్నట్టు పేర్కొన్నారు టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు నిర్వచనం మార్చనున్నట్టు చెప్పారు. అలాగే, డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు కేటాయించిన రూ.120 కోట్లను పెంచనున్నట్టు వెల్లడించారు. వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడీ లైట్లు) రంగాలకు పీఎల్ఐ కింద నగదు ప్రోత్సాహకాలను ఈ నెల నుంచే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 2023 మార్చి నాటికి రూ.2,900 కోట్లను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎల్ఐ కింద వైట్ గూడ్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు తదితర 14 రంగాలకు కేంద్రం రూ.1.97 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే, కొన్ని రంగాలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో కొన్ని రంగాలకు సంబంధించి మార్పులు చేయాల్సి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి లోగడ సంకేతం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్స్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాల్లో పీఎల్ఐ పట్ల పెద్దగా స్పందన లేకపోవడంతో మార్పులకు కేంద్రం పూనుకున్నట్టు తెలుస్తోంది. -
మిల్లెట్ ఫుడ్స్‌కు పీఎల్ఐ: కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి
మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమకు కేంద్ర సర్కారు రెండో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి అనితా ప్రవీణ్ తెలిపారు. ఈ పథకం ఆమోదం దశలో ఉందని, దీని కింద రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టు చెప్పారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!) ఆహారోత్పత్తుల శుద్ధి పరిశ్రమకు మొదటి దశ పీఎల్ఐ కింద రూ.800 కోట్లు ప్రకటించగా, గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇది ఆరంభమైనట్టు చెప్పారు. మొదటి దశలో 30 సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయినట్టు వెల్లడించారు. ఇప్పుడు రెండో విడత కింద మరో రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆహార శుద్ధి యూనిట్లకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రం నుంచి రూ.10,900 కోట్ల నిధులకు ఆమోదం లభించినట్టు చెప్పారు. దీన్నుంచి రూ.800 కోట్లను మొదటి దశ పీఎల్ఐ కింద మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద ఆహార శుద్ధి పరిశ్రమలోని చిన్న యూనిట్లకు సాయం చేస్తున్నట్టు అనితా ప్రవీణ్ వెల్లడించారు. -
యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే..
ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌కు ఈ రెండు టెక్ దిగ్గజాలు దరఖాస్తు చేయలేదు. ఐటీ హార్డ్‌వేర్ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనేందుకు డెల్, లెనోవో, హెచ్పీతో సహా దాదాపు 40 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అంగీకరించాయి. అయితే యాపిల్, శాంసంగ్ కంపెనీలు మాత్రం వద్దనుకున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆ రెండు కంపెనీలు పీఎల్ఐ స్కీమ్‌ను వద్దనుకోవడానికి ప్రాథమిక కారణం స్మార్ట్ఫోన్లతో పోలిస్తే భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు మార్కెట్ చాలా తక్కువగా ఉండటమే. ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌లో భారత్‌లో ఉన్నది కేవలం 2.4 శాతం మాత్రమే. కానీ స్మార్ట్ఫోన్లకు మాత్రం భారత్‌లో అత్యధిక మార్కెట్ ఉంది. పైగా యాపిల్, శాంసంగ్ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు కావు. కాబట్టి చైనా, వియత్నాం వంటి దేశాల నుంచి తయారీ కేంద్రాలను భారత్‌కు తరలించడం ఆర్థికంగా అంత లాభదాయకం కాదు. ఎక్కువ ఆదాయం వాటి నుంచే.. యాపిల్ కంపెనీకి ఆదాయం ప్రధానంగా ఐఫోన్ ఉత్పత్తుల నుంచే వస్తోంది. మాక్‌లు, ఐపాడ్ల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా చాలా తక్కువ. అందువల్లే ఈ సంస్థ భారత్‌లో మాక్‌లు, ఐపాడ్ల తయారీకి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ ప్రభుత్వ ఇన్‌వాయిస్‌లలోని వ్యత్యాసాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఆ కంపెనీ పీఎల్ఐ స్కీమ్‌లో పాల్గొనకపోవడానికి కారణం కావచ్చు. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) PLI 2.0 స్కీమ్ భారత్‌లో తయారు చేసే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలతో సహా వివిధ సాంకేతిక ఉత్పత్తులను కవర్ చేస్తుంది. చాలా కంపెనీలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌కు మించి దరఖాస్తులు వచ్చాయి. -
వృద్ధికి ‘తయారీ’ సహకారం అంతంతే
న్యూఢిల్లీ: తయారీ రంగానికి ప్రస్తుతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ద్వారా అందుతున్న చేయూత వల్ల సమీప మూడేళ్లలో దేశ ఆరి్థక వ్యవస్థకుకానీ లేదా ఎగుమతుల రంగానికిగానీ పెద్దగా జరిగే ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. ఆసియా సరఫరా చైన్ ఇటీవల పాక్షికంగా చైనా నుంచి మారడం, దేశ ఎలక్ట్రానిక్ రంగంలో ఇటీవల అందుతున్న భారీ ప్రోత్సాహకాల వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధికి తయారీ తక్షణం అందించే సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా పేర్కొన్నారు. అయితే చైనా నుంచి సరఫరాల చైన్ నిరంతరం కొనసాగడం, దేశంలో వ్యవస్థాగత సంస్కరణలు వల్ల దీర్ఘకాలంలో భారత్ ఎకానమీకి ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న ఆమె, దీనివల్ల 2023 నాటికి వార్షికంగా 6.25 శాతం నుంచి 6.75 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల రేటు ఉంటుందని అన్నారు. వార్షికంగా 40 లక్షల ఉద్యోగల కల్పనా సాధ్యమవుతుందని విశ్లేíÙంచారు. పూర్తి ఆశావహ పరిస్థితుల్లో వృద్ధి 6.75 శాతం నుంచి 7.25 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కూడా పేర్కొన్నారు. తయారీ రంగ ధోరణులు మారాలి... దేశంలో తయారీ రంగం పరిస్థితి గురించి ఆమె ప్రస్తావిస్తూ, తగిన ఉత్పాదక పురోగతి వ్యవస్థ లేనప్పుడు దానివల్ల ఎకానమీలకు పెద్దగా ప్రయోజనం ఒనగూడదన్నారు. తగిన ఉత్పాదక పరిస్థితి సానుకూలంగా ఉండడం అంటే విడిభాగాలను అధికంగా దిగుమతి చేసుకోవడం, వాటిని స్థానికంగా అసెంబ్లింగ్ చేసుకోవడానికి బదులు వాటినిసైతం స్థానికంగా తయారీ చేసుకోవడం, అందుకు ఒనరులను మెరుగుపరచుకోవడంగా ఆమె అభివరి్ణంచారు. ‘‘భారత్ భారీగా దిగుమతులు చేసుకుంటోంది. ఎక్కువ ఎగుమతి చేస్తోంది. ఇలాంటి విధానాల వల్ల వాస్తవిక ప్రయోజనం అంతంతే. ఇక్కడ మొబైల్ రంగాన్ని మంచి ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ భారత్ చైనా తర్వాత రెండవ అతిపెద్దదిగా మారింది. అయినప్పటికీ, ప్రపంచ మొబైల్ ఉత్పత్తిలో భారత్ వాటా ఇప్పుడు 7 శాతం లోపే ఉంది. స్థానికంగా తయారీ, వనరుల సమీకరణ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ఈ రంగంలో మనం 25 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.’’ అని గుప్తా గురువారం ఒక కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విలేకరులతో అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► డాలర్‌తో రూపాయి మారకపు విలువ డిసెంబర్ వరకూ సగటున 82–83గా ఉంటుంది. తరువాత క్రమంగా మార్చి నాటికి 79కి బలపడే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు రూపాయి బలపడటానికి ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ► దేశీయ ఈక్విటీలు ఇప్పుడు అధిక విలువలో ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరం ‘‘అండర్ వెయిట్’’ కలిగి ఉన్నాయి. దీనవల్ల ఈక్విటీలు భారీగా పెరిగే అవకాశం ఏదీ లేదు. ► ఆగస్టులో సైతం రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం పైనే కొనసాగవచ్చు. ► మూలధన పెట్టుబడులు ఏదన్నా జరిగితే... అది ప్రభుత్వం ద్వారానే జరుగుతోంది. కార్పొరేట్ల నుంచి పెద్దగా లేదు. రానున్న 12 నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. వ్యవస్థలో తగిన మూలధన పెట్టుబడులు ప్రస్తుతం కొనసాగుతుండడం దీనికి కారణం. దీనికితోడు వడ్డీరేట్ల పెరుగుదల్ల వల్ల గృహ వినియోగ ధోరణి కూడా తగ్గుతోంది. -
రూ.13,000 కోట్ల పీఎల్ఐ ప్రోత్సాహకాలు: 4 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లను మంజూరు చేయనుంది. ఇక మీదట పీఎల్ఐ కింద ఏటా ఇచ్చే ప్రోత్సాహకాల మొత్తం గణనీయంగా ఉంటుందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇలా విడుదల చేసే మొత్తం రూ.13వేల కోట్లుగా ఉండొచ్చన్నారు. పీఎల్ఐ కింద కేంద్ర సర్కారు 14 రంగాలకు ప్రోత్సహకాలను ఇప్పటి వరకు ప్రకటించగా, మరిన్ని రంగాలు సైతం ప్రోత్సాహకాల కోసం డిమాండ్ చేస్తున్నాయి.(గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) టెలీకమ్యూనికేషన్స్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా రంగాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే వీటిల్లో సోలార్ పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాలకు పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల విడుదల మొదలు కావాల్సి ఉంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో పోటీ పడడం అనే లక్ష్యాలతో కేంద్ర సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. (Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!) 4 లక్షల మందికి ఉపాధి.. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, చైనా నుంచి నిపుణుల సాయం పొందేందుకు వీసా మంజూరులో సమస్యలను భాగస్వాములు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పీఎల్ఐ కింద ఇప్పటికే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినట్టు తెలిపారు. ఆటబొమ్మలు, ఇతర రంగాలకు పీఎల్ఐ అభ్యర్థనలు అంతర్గత మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉన్నట్టు సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయగా, తర్వాత అక్టోబర్ 31 వరకు వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై సింగ్ మాట్లాడుతూ.. ఇది స్వేచ్ఛాయుత లైసెన్సింగ్ విధానమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీని పట్ల పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు. -
రూ.13,000 కోట్ల పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లను మంజూరు చేయనుంది. ఇక మీదట పీఎల్ఐ కింద ఏటా ఇచ్చే ప్రోత్సాహకాల మొత్తం గణనీయంగా ఉంటుందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇలా విడుదల చేసే మొత్తం రూ.13వేల కోట్లుగా ఉండొచ్చన్నారు. పీఎల్ఐ కింద కేంద్ర సర్కారు 14 రంగాలకు ప్రోత్సహకాలను ఇప్పటి వరకు ప్రకటించగా, మరిన్ని రంగాలు సైతం ప్రోత్సాహకాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. టెలీకమ్యూనికేషన్స్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా రంగాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే వీటిల్లో సోలార్ పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాలకు పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల విడుదల మొదలు కావాల్సి ఉంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో పోటీ పడడం అనే లక్ష్యాలతో కేంద్ర సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. 4 లక్షల మందికి ఉపాధి.. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, చైనా నుంచి నిపుణుల సాయం పొందేందుకు వీసా మంజూరులో సమస్యలను భాగస్వాములు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పీఎల్ఐ కింద ఇప్పటికే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచి్చనట్టు తెలిపారు. ఆట»ొమ్మలు, ఇతర రంగాలకు పీఎల్ఐ అభ్యర్థనలు అంతర్గత మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉన్నట్టు సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయగా, తర్వాత అక్టోబర్ 31 వరకు వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై సింగ్ మాట్లాడుతూ.. ఇది స్వేచ్ఛాయుత లైసెన్సింగ్ విధానమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీని పట్ల పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు. -
కెమికల్స్, పెట్రోకెమికల్స్‌కు పీఎల్ఐ
న్యూఢిల్లీ: కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ తరహా ఉత్పత్తులకు భారత్‌ను తయారీ కేంద్రంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీ రంగం నిర్వహిస్తున్న మూడో ఎడిషన్ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. కఠినమైన కాలుష్య నియంత్రణలు, పెరుగుతున్న కారి్మక వ్యయాలతో రసాయనాల పరిశ్రమలోని అంతర్జాతీయ కంపెనీలు తమ తయారీ వసతులను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నాయని.. వీటి తయారీకి భారత్ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగే అవకాశాలు, సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. దీనికితోడు ఈ ఉత్పత్తులకు భారత్ సైతం పెద్ద వినియోగ కేంద్రంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశీయంగా మిగులను ఎగుమతి చేసుకోవచ్చని, ఇందుకు ప్రభుత్వం విధానాల పరంగా మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘‘భారత్ తయారీ కేంద్రంగా అవతరించేందుకు మేము సానుకూలంగా ఉన్నాం. అందుకే కెమికల్స్, పెట్రోకెమికల్స్‌కు పీఎల్ఐని పరిశీలిస్తున్నాం. సుస్థిరత, కర్బన ఉద్గారాల విడుదల, కాలుష్యం, బూగర్భనీటి కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ అదనపు సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. 2047 నాటికి ఇంధన పరంగా స్వావలంబన, 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రతీ పరిశ్రమ, రంగం తన వంతు సహకారం అందించకపోతే ఈ లక్ష్యాలు సాకారం కావు’’అని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. పర్యావరణ అనుకూలమైన వృద్ధికే తమ ప్రాధాన్యం అని చెప్పారు. కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రోత్సాహకానికి ప్రభుత్వం రూ.19,744 కోట్లను ప్రకటించడాన్ని గుర్తు చేశారు. -
పీఎల్ఐ స్కీముపై అభిప్రాయాలు చెప్పండి - కేంద్రం
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని మరింత సమర్ధమంతంగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్కీముపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా పరిశ్రమ వర్గాలను కోరింది. స్కీము అమలు గురించి చర్చించేందుకు జూన్ 27న వర్క్‌షాప్ నిర్వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పీఎల్ఐ అమలు ప్రక్రియలో లబ్ధిదారులకు ఏవైనా సవాళ్లు, సమస్యలు ఉంటే వాటిని అమలు చేస్తున్న శాఖలు లేదా విభాగాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. తద్వారా సానుకూలమైన సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు, స్కీమును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని పేర్కొంది. రూ. 3,400 కోట్లకు క్లెయిమ్స్ వచ్చినప్పటికీ 2023 మార్చి ఆఖరు నాటికి స్కీము కింద ప్రభుత్వం రూ. 2,900 కోట్లు మాత్రమే విడుదల చేసిన నేపథ్యంలో వర్క్‌షాప్ నిర్వహణ ప్రాధాన్యం సంతరించుకుంది. పీఎల్ఐ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి వారితో తరచుగా సంప్రదింపులు జరపాలని వివిధ విభాగాలకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2021లో టెలికం, ఫార్మా తదితర 14 రంగాలకు రూ. 1.97 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం పీఎల్ఐ స్కీమును ప్రకటించింది. -
పీఎల్ఐని సులభతరం చేయాలి
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) కింద కంపెనీలకు ఇచ్చే ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల విషయంలో అర్హత నిబంధనలను సరళీకరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అనే పరిశోధనా సంస్థ (జీటీఆర్ఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ఈ పథకం కింద ప్రకటించిన ప్రోత్సాహకాలు దుర్వినియోగం కాకుండా రక్షణ కూడా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర సర్కారు భారత్‌లో తయారీని పెంచి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, స్వావలంబన సాధించేందుకు పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. దీని కింద 14 రంగాల్లో అదనపు ఉత్పత్తిని సాధించేందుకు రూ.1.97 లక్షల కోట్ల ద్రవ్య ప్రోత్సాహకలను ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో జీటీఆర్ఐ చేసిన సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కంపెనీలు కాంట్రాక్టు తయారీదారులు లేదా గ్రూపు సంస్థల మద్దతుతో ఉత్పత్తి గణాంకాల్లో మోసాలకు పాల్పడే అవకాశం లేకపోలేదని జీటీఆర్ఐ హెచ్చరించింది. ఇందుకు 2003–06 మధ్య టార్గెట్ ప్లస్ పథకం కింద జరిగిన దుర్వినియోగాన్ని ప్రస్తావించింది. ‘‘పీఎల్ఐ పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ విభాగాలు గతంలో టార్గెట్ ప్లస్ పథకం దుర్వినియోగాన్ని అధ్యయనం చేసి, అప్రమత్తంగా ఉండాలి. త్రైమాసికం వారీగా ప్రోత్సాహకాలను విడుదల చేసే సమయంలో ఈ రిస్క్ మరింత పెరుగుతుంది’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ సూచించారు. విడిభాగాల తయారీని ప్రోత్సహించాలి.. నిర్ధేశిత పెట్టుబడులు, ఉత్పత్తి, అమ్మకాలు, స్థానిక విడిభాగాలు/ముడి పదార్థాల వినియోగం తదితర అర్హత నిబంధనల్లో అన్నింటికీ తయారీ దారులు అర్హత పొందలేకపోవచ్చని జీటీఆర్ఐ తన నివేదికలో ప్రస్తావించింది. ‘‘చాలా కేసుల్లో ఉత్పత్తి అసలు విలువ లేదా ఇన్వాయిస్ వ్యాల్యూని తెలుసుకోవడం కష్టం. నిబంధనలు తక్కువగా, పారదర్శకంగా ఉండాలి’’అని పేర్కొంది. తుది ఉత్పత్తికి బదులు విడిభాగాల స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇవ్వడం మెరుగైన విధానంగా అభిప్రాయపడింది. ఐరోపా యూనియన్ విధించిన కార్బన్ బోర్డర్ పన్నును త్వరలో మరిన్ని దేశాలు కూడా అనుసరించొచ్చని, ఈ అనుభవాల నేపథ్యంలో భారత్ శుద్ధ ఇంధన టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయాలని సూచించింది. -
ఆటబొమ్మలకు త్వరలో పీఎల్ఐ
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద తోలు, పాదరక్షలు, ఆటబొమ్మలు, నూతన తరం సైకిళ్ల విడిభాగాలకు ప్రోత్సాహకాల ప్రతిపాదన పురోగతి దశలో ఉందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వివిధ శాఖలు తమ పరిధిలో పీఎల్ఐ కింద ఆశించిన మేర పురోగతి లేకపోతే దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాల్లో ఉత్పత్తిని పెంచేందుకు, భారత్‌లో తయారీకి ఊతమిచ్చేందుకు పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. కానీ 2023 మార్చి నాటికి రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా, కేవలం రూ. 2,900 కోట్ల ప్రోత్సాహక నిధులనే కేంద్రం మంజూరు చేసిన నేపథ్యంలో రాజేష్ కుమార్ స్పందించారు. ఐటీ రంగం మాదిరే కొన్ని సవరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇతర రంగాలకూ ఏర్పడొచ్చన్నారు. ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులకు సంబంధించి గత నెలలో కేంద్ర సర్కారు పీఎల్ఐ 2.0ని ప్రకటించడం గమనార్హం. ‘‘పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్లు వినియోగం అవుతాయనే నమ్మకం ఉంది. కాకపోతే విడిగా ఒక్కో పథకంలో అవసరమైతే దిద్దుబాటు, సవరణలు ఉంటాయి’’అని రాజేష్‌కుమార్ సింగ్ వెల్లడించారు. మొబైల్స్ తయారీలో కావాల్సిన విడిభాగాల తయారీ దేశీయంగా 20 శాతమే ఉండగా, దాన్ని 50 శాతానికి తీసుకెళతామని రాజేష్ కుమార్ తెలిపారు. చైనాలో ఇది 49 శాతం, వియత్నాంలో 18 శాతమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ ఫెయిల్యూర్ పథకం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే భారతదేశంలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ ఎగుమతులపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా రాజన్ పీఎల్ఐ పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన సంగతి గమనార్హం. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) దీనికి సంబంధించి ‘ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా?’ అనే పేరుతో వెల్లడైన పరిశోధనా నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ్ రాజన్ షేర్ చేశారు. దేశంలో నిజమైన తయారీ కంటే దిగుమతి అయిన విడిభాగాల అసెబ్లింగ్ ద్వారా వృద్ధి సాగుతోందని విమర్శించారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ స్కీమ్ సమర్థతను ప్రశ్నించారు. భారతదేశంలో ఫోన్‌ను పూర్తి చేయడానికి మాత్రమే సబ్సిడీ ఇస్తోంది తప్ప, భారతదేశంలో తయారీ విలువ జోడింపునకు కాదనీ, ఇదే ఈ పథకంలోని ప్రధాన లోపమన్నారు. (Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! జూన్ 1 తర్వాత పెరగనున్న ధరలు) భారతదేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో మొత్తం మొబైల్ ఫోన్ దిగుమతిపై సుంకాలను పెంచింది. అలాగే 2020లో మొబైల్ ఫోన్ల స్థానిక ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం పీఏల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. 4 శాతం నుండి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం ఐదేళ్లపాటు వర్తిస్తుంది.దేశంలో తయారీ సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన ఉద్దేశ్యంగా వివిధ రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల పీఎల్ఐ స్కీమ్‌లను కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్‌ల అమలుతీరును వివరిస్తూ రాజన్‌తో పాటు మరో ఇరువురు ఆర్థికవేత్తలు రాహుల్ చౌహాన్, రోహిత్ లంబాలు ఈ రీసెర్చ్ నోట్‌ను రూపొందించారు. భారతదేశం నిజంగా మొబైల్ తయారీ దిగ్గజం కాలేదని వీరు వాదించారు. చౌహాన్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోని ఫామా-మిల్లర్ సెంటర్లో పరిశోధనా నిపుణుడు, లాంబా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?) పీఎల్ఐ స్కీంతో పెరిగిన ఎగుమతులు సీఈఏ ప్రకటన ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) గత నెలలో భారతదేశంలో మొబైల్ ఫోన్ ఎగుమతులను ప్రకటించింది. 2022లోని నమోదైన 45,000 కోట్ల నుండి 2023లో 90,000 కోట్లను అధిగమించాయని తెలిపింది. దీనికి పీఎల్ఐ స్కీం ప్రధానమని ప్రకటించింది. కాగా గతంలోనే పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన రాజన్ స్మార్ట్ఫోన్ల, ఉత్పత్తి ధరలపై కొన్ని ఉదాహరణలుకూడా ఇచ్చారు. ఏప్రిల్ 2018లో మొబైల్ దిగుమతులపై కస్టమ్ సుంకాలు 20 శాతంగా పెంచారనీ, ఇది తక్షణమే దేశీయ ధరలపెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు. తయారీదారులు ఇండియన్ కస్టమర్లపైనే భారాన్ని మోపు తారని కూడా చెప్పారు. ఉదాహరణకు, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ అమెరికాలో చికాగోలో పన్నులతో సహా రూ. 92,500లోపు అందుబాటులో ఉంటే ఇదే ఫోన్ ఇండియాలో దాదాపు 40 శాతం పెరిగి రూ.1,29,000గా ఉంటుందని లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే.