న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని దేశీయంగా పెంచేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలను (పీఎల్‌ఐ) ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు ఎల్రక్టానిక్ విడిభాగాల స్థానిక తయారీని సైతం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ ఎస్.కృష్ణన్ వెల్లడించారు.
సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో 99% స్థానికంగానే తయారవుతున్నట్టు చెప్పారు. ‘‘అసెంబ్లీ యూనిట్లకు అదనంగా 10–15 శాతం విలువ జోడింపుపైనే ఆధారపడకూడదు. మనం ఇంకా ఏమి చేయగలమో, విలువ ఆధారిత సరఫరాలో మరింత ముందుకు ఎలా వెళ్లగలమో ఆలోచించాలి’’అని సూచించారు.
ఏ దేశం కూడా మొత్తం వ్యాల్యూచైన్‌లో ఆధిపత్యం చూపించలేదన్నారు. చైనా విషయానికొస్తే వ్యాల్యూచైన్‌లో 40–45% వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు. భారత్ 35–40% సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఎల్రక్టానిక్ ఉత్పత్తుల విడిభాగాలకు సంబంధించి రెండో విడత పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment