Krishnan
-
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని దేశీయంగా పెంచేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలను (పీఎల్ఐ) ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు ఎల్రక్టానిక్ విడిభాగాల స్థానిక తయారీని సైతం ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త పథకాలపై కసరత్తు చేస్తున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ ఎస్.కృష్ణన్ వెల్లడించారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో 99% స్థానికంగానే తయారవుతున్నట్టు చెప్పారు. ‘‘అసెంబ్లీ యూనిట్లకు అదనంగా 10–15 శాతం విలువ జోడింపుపైనే ఆధారపడకూడదు. మనం ఇంకా ఏమి చేయగలమో, విలువ ఆధారిత సరఫరాలో మరింత ముందుకు ఎలా వెళ్లగలమో ఆలోచించాలి’’అని సూచించారు. ఏ దేశం కూడా మొత్తం వ్యాల్యూచైన్‌లో ఆధిపత్యం చూపించలేదన్నారు. చైనా విషయానికొస్తే వ్యాల్యూచైన్‌లో 40–45% వాటా కలిగి ఉన్నట్టు చెప్పారు. భారత్ 35–40% సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఎల్రక్టానిక్ ఉత్పత్తుల విడిభాగాలకు సంబంధించి రెండో విడత పీఎల్ఐ పథకాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. -
విజేత శశికిరణ్
చెన్నై: ఫాగర్నెస్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. నార్వేలో ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ఆర్యన్ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్ స్కోరుతో శశికిరణ్కు టైటిల్ దక్కింది. ఆర్యన్ చోప్రాకు రెండో ర్యాంక్ లభించింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో 5వ ర్యాంక్‌లో నిలిచాడు. -
వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత
చెన్నై : కర్ణాటక సంగీత ప్రపంచంలో వయోలిన్ త్రిమూర్తుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు టీఎన్ కృష్ణన్. వయోలిన్ త్రిమూర్తుల్లో మిగిలిన ఇద్దరూ లాల్గుడి జీ జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్. వారిద్దరూ ఏడేళ్ల కిందటే కొద్ది నెలల వ్యవధిలో గతించారు. వారిలో ఒకరైన టీఎన్ కృష్ణన్ సోమవారం రాత్రి చెన్నైలో కన్ను మూశారు. కేరళలోని తిరుపణిత్తూర్‌లో నారాయణ అయ్యర్, అమ్మణి అమ్మాళ్ దంపతులకు 1928 అక్టోబర్ 6న జన్మించిన తిరుపణిత్తూర్ నారాయణ అయ్యర్ కృష్ణన్ బాల విద్వాంసుడిగా పదకొండేళ్ల పసితనం నుంచే కచేరీలు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి వద్ద సరిగమలు నేర్చుకుని, సాధన ప్రారంభించారు. తండ్రి నారాయణన్ అయ్యర్ కొచ్చిన్ సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. ఆయన గాత్ర విద్వాంసుడే కాకుండా, బహువాద్య నిపుణుడు. తన తండ్రి తొంభై తొమ్మిదో ఏట కన్నుమూసేంత వరకు తనకు సంగీత పాఠాలు చెబుతూనే వచ్చారని కృష్ణన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. చదవండి: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్ బాల్యంలోనే ఆయన ఆనాటి సంగీత దిగ్గజాలు అరైకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ఎం.డి.రామనాథన్, అళత్తూర్ సోదరులు వంటి వారి గాత్ర కచేరీల్లో వారి పక్కన వయొలిన్ వాయించేవారు. సంగీతంలో మరింతగా రాణించాలనే ఉద్దేశంతో 1942లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత విద్వాంసుడు శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ను కలుసుకుంటే, ఆయన కృష్ణన్ బాధ్యతను పారిశ్రామికవేత్త అయ్యదురైకి అప్పగించారు. అయ్యదురై దంపతులు కృష్ణన్‌ను తమ ఇంట్లోనే ఉంచుకుని, సొంత బిడ్డలా చూసుకున్నారు. అరైకుడి రామానుజ అయ్యంగార్, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ల శిక్షణలో టి.ఎన్.కృష్ణన్ తన సంగీత ప్రజ్ఞకు మరింతగా మెరుగులు దిద్దుకున్నారు. చదవండి: కరోనా: తమిళనాడు మంత్రి కన్నుమూత సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండానే, ఆధునిక పోకడలను అందిపుచ్చుకున్న టి.ఎన్.కృష్ణన్ సంగీత ఆచార్యుడిగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. మద్రాసు సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ డీన్‌గా సేవలందించారు. కేవలం లిపిబద్ధంగా మాత్రమే అందుబాటులో ఉన్న పూర్వ విద్వాంసుల స్వరకల్పనలను యథాతథంగా శ్రోతలకు వినిపించే అరుదైన విద్వాంసుల్లో ఒకరిగా టి.ఎన్.కృష్ణన్ తన సమకాలికుల మన్ననలు చూరగొన్నారు. జాంగ్రీ, బాదం హల్వాలను అమితంగా ఇష్టపడే కృష్ణన్, తన స్వరాలకు బహుశ వాటి మాధుర్యాన్ని అద్దారేమోననిపిస్తుంది ఆయన కచేరీలు వినేవాళ్లకు. దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన కచేరీలు చేశారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, జాకిర్ హుస్సేన్ వంటి హిందుస్తానీ విద్వాంసులతో కలసి చేసిన జుగల్బందీ కచేరీలు ఆయనను ఉత్తరాది శ్రోతలకూ దగ్గర చేశాయి. టి.ఎన్.కృష్ణన్ సోదరి ఎన్.రాజం కూడా వయోలిన్ విద్వాంసురాలే. అయితే, ఆమె హిందుస్తానీ విద్వాంసురాలు. ఆమెతో కలసి కూడా జుగల్బందీలు చేశారు. ఆయన కుమార్తె విజి కృష్ణన్ నటరాజన్, కుమారుడు శ్రీరామ్ కృష్ణన్ సహా ఎందరో శిష్యులు కర్ణాటక సంగీత విద్వాంసులుగా రాణిస్తున్నారు. టి.ఎన్.కృష్ణన్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో ఆయనను ‘పద్మశ్రీ’తో, 1992లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డు (1974), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2006) పొందారు. చెన్నైలోని ది ఇండియన్ ఫైనార్ట్స్ సొసైటీ 1999లో ఆయనను ‘సంగీత కళాశిఖామణి’ బిరుదుతో సత్కరించింది. ఇవే కాకుండా, తన ఎనభయ్యేళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆయన ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు టి.ఎన్.కృష్ణన్ సంగీత రంగానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
బలహీనవర్గాల సంక్షేమమే ఊపిరిగా జీవించారు
సాక్షి, న్యూఢిల్లీ: తుదిశ్వాస వరకు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి దివంగత కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి పీఎస్ కృష్ణన్ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. కేరళకు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పీఎస్ కృష్ణన్ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన సంస్మరణ సభ శనివారం ఢిల్లీలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా కృష్ణన్ సమర్థవంతంగా పూర్తి చేశారన్నారు. ‘వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల ఉన్నతి కోసం కృష్ణన్ నిరంతరం కృషి చేశారు. రాజ్యాంగ పరంగా సంక్రమించే హక్కులు, ప్రజాకేంద్రిత విధానాలను అమలు చేయడం ద్వారా ప్రజా సంక్షేమం జరిగేలా చొరవ తీసుకున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత ద్వారానే సమాజం ముందడుగు వేస్తుందని ఆయన బలంగా విశ్వసించేవారు. పీఎస్ కృష్ణన్ ఒక అసాధారణ వ్యక్తి, మేధావి. తను నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీపడే వారు కాదు’అని ఉపరాష్ట్రపతి అన్నారు. కార్యక్రమంలో పీఎస్ కృష్ణన్ సతీమణి శాంత, కుమార్తె శుభా, అల్లుడు చంద్రశేఖర్ సహా సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయపోరాట యోధుడు
భారతదేశంలో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన అరుదైన వ్యక్తి పి.ఎస్. కృష్ణన్. ఐఏఎస్ అధికారి అయిన క్షణం నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దళిత వాడల్లోనే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. ఎస్సీలకు స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, అత్యాచారాల నిరోధక చట్టం, మండల్ కమిషన్ సిఫారసుల అమలు వంటి అనేక పథకాల అమలుకు అహరహం కృషి చేసిన పి.ఎస్. కృష్ణన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం జీవితాన్ని వెచ్చిం చిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు. అంబేడ్కర్ మరణించినరోజే ఏపీలో ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టిన కృష్ణన్ ఆయన భారాన్ని తన భుజాలపై మోశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే దానిని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళైతే, రాజ్యాంగం నిష్ప్రయోజనకరంగా మారుతుంది. అలాగే రాజ్యాంగం ప్రగతినిరోధకమైనప్పుడు కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు ప్రగతిశీలురవుతే రాజ్యాంగం గొప్పగా మారుతుంది. ఎప్పటికప్పుడు రాజ్యాంగమనే అతిపెద్ద కొలమానంలో ప్రతిపనిని తరచి చూసుకున్న పాలకులు ప్రజల హృదయాల్లోనే కాదు, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాధినేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మలుచుకుంటున్నారంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1949 నవంబర్, 25వ తేదీన రాజ్యాంగ సభ చివరి రోజుకు ఒక రోజు ముందు వ్యాఖ్యానించారు. ఏడు దశాబ్దాల క్రితం అంబేడ్కర్ నోట వెలువడిన వాక్కులు ఈ రోజు అక్షరసత్యాలుగా మనముందు ఆవిష్కృతమౌతున్నాయి. రాజ్యాంగాన్ని సైతం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్న పార్టీలూ, రాజకీయ నాయకులూ నేడు కోకొల్లలు. నిజం చెప్పాలంటే కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన చేయడానికి సైతం వెనుకాడడం లేదు. అన్ని ప్రభుత్వాలలో ఈ తరహా ధోరణి కొనసాగుతూనే వచ్చింది. అయితే కొంతమంది ప్రభుత్వాధికారులు తమకున్న మానవీయ దృక్పథంతో రాజ్యాం గాన్ని ఒక ఆయుధంగా వాడుకొని దేశ సామాజిక సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు. అలాంటి వారిలో ఇటీవల మన నుంచి భౌతి కంగా దూరమైన పి.ఎస్. కృష్ణన్ ఒకరు. భారత్‌లో కులమే అన్ని అనర్థాలకు కారణమనే భావాన్ని మదిలో నింపుకొని, సమానత్వం కోసం తుది శ్వాస వరకు పరితపించిన పీఎస్ కృష్ణన్ నవంబర్ పదవ తేదీన మరణించినప్పటికీ, ఆయన చేసిన కృషి తనను సామాజిక న్యాయపోరాటాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. భారత రాజ్యాంగం వెలుగులో ఆయన ప్రారంభించిన ఎన్నో కార్యక్రమాలు, రూపొందించిన ఎన్నో చట్టాలు భారత సమాజాన్ని సమానత్వం వైపు, సామాజిక న్యాయంవైపు నడిపిస్తాయనడానికి సందేహం అక్కర్లేదు. కేరళలోని తిరువనంతపురంలో 1932, డిసెంబర్ 30 వ తేదీన పి.ఎల్.సుబ్రహ్మణ్యన్, అన్నపూర్ణమ్మలకు పి.ఎస్.కృష్ణన్ జన్మించారు. తిరువనంతపురంలో హైస్కూల్ వరకు చదువుసాగించిన కృష్ణన్ ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో డిగ్రీ పొందారు. మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ చేసి, కాంచీ పురం సచియప్ప కళాశాలలో ఇంగ్లిష్ అ«ధ్యాపకునిగా పనిచేశారు. ఆయన హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే కేరళలో సామాజిక ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. నారాయణ గురు, అయ్యంకాళిల ప్రభావం పి.ఎస్.కృష్ణన్పైన పనిచేసింది. అదే సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగిస్తున్న పోరాటాలను కూడా ఆయన పత్రికల్లో చదివి ఆకర్షితులయ్యారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ, సామాజిక ప్రభావం, తండ్రి చెప్పిన సత్యాలు ఆయనను చిన్నతనంలోనే సామాజిక వివక్షను, అంటరానితనాన్నీ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ విషయాలతో పాటు తాను ప్రత్యక్షంగా చూసిన అసమానతలూ, వివక్ష ఆయన హృదయాన్ని ఎంతగానో రగిల్చాయి. పి.ఎస్.కృష్ణన్ ఐఏఎస్ అధికారి అయిన మరునాటి నుంచే అంటరాని కులాల దయనీయ స్థితిని మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1956 మే 2న ఐఏఎస్ శిక్షణ ప్రారంభమైన రెండు నెలల్లోనే ఢిల్లీ సమీపాన ఉన్న అలీపూర్ పంచాయతీ పరిధిలోని బడ్లీ గ్రామానికి అధ్యయనం కోసం వెళ్ళారు. అధ్యయనంకోసం వెళ్ళిన మిగిలిన బృందంతో విడిపోయి ఎస్సీలు నివసించే బస్తీవైపుకి తనకి తెలియకుండానే అడుగులు వేసేవారు. అదే సందర్భంలో ఈశ్వర్ దాస్ అనే దళితుడు శరీరం నిండా పొక్కులు ఉన్న శిశువును ఎత్తుకొని ఉండడం చూసి కృష్ణన్ చలించిపోయాడు. మరుసటిరోజు ఐఏఎస్ ట్రైనింగ్ స్కూల్డాక్టర్ను తీసుకెళ్ళి, ఆ శిశువుకు చికిత్స చేయించారు. ఇది ఆయన ఆలోచనను మరింత పదునెక్కించింది. ఢిల్లీ పరిసరాల్లోనే ఇలా ఉంటే, మారుమూల పల్లెల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆరోజే ఆలోచించారు పి.ఎస్. కృష్ణన్ శిక్షణను ముగించుకున్న కృష్ణన్ 1956లోనే ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. 1956వ సంవత్సరం భారతదేశం ఒక గొప్ప మేరు పర్వతాన్ని కోల్పోయింది. 1956 డిసెంబర్ 6వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ మహాపరినిర్వాణం పొందారు. అదే సంవత్సరం పీఎస్ కృష్ణన్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టడం కాకతాళీయమే కావచ్చు, కానీ ఆ తరువాత ఆ హోదాలో పి.ఎస్. కృష్ణన్ సాధించిన విజయాలను చూస్తే, అంబేడ్కర్ తన బాధ్యతలను పి.ఎస్. కృష్ణన్ భుజస్కంధాలపై ఉంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ రోజు బలహీన వర్గాల కోసం, ప్రత్యేకించి ఎస్సీల కోసం ఆయన రూపొందించిన పథకాలు, రూపొందించిన చట్టాలను పరిశీలిస్తే మనం ఎవ్వరం కాదనలేం. ఆయన ప్రారంభించిన పథకాలన్నీ, కూడా అనుభవం నుంచి రూపొందినవే. ఊరు బయట ఉన్న దళిత వాడల గాలికూడా తమ మేనుకి సోకనివ్వని అధికారులు అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఆ రోజు అది ఊహించడానికి కూడా వీలు లేనిది. కానీ పి.ఎస్. కృష్ణన్ ఒక గ్రామం వెళితే ముందుగా అంటరాని కులాలు నివసించే చోటకు వెళ్ళేవారు. వాళ్ళు ఏం తింటే అదే తినడం ఆయన ఒక అలవాటుగా మార్చుకున్నారు. అక్కడే ఉండి, పరిస్థితులను, పరిసరాలను గమనించిన కృష్ణన్ వాటిని ఎట్లా మార్చడమో కూడా తెలుసుకున్నారు. అప్పటివరకు భారత ప్రభుత్వంలో మూడే మూడు పథకాలు ఉండేవి. ఆ పథకాలు కూడా 1949కి ముందు బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టారు. అవి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, విదేశీ చదువుకు ఉపకారవేతనాలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు. అవి మినహా ప్రభుత్వాలు ఎటువంటి నూతన పథకాలనూ అమలు చేయడం ప్రారంభించలేదు. ఆ విషయాలను గమనించిన పి.ఎస్. కృష్ణన్ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తించారు. ‘‘అణగారిన వర్గాలు ప్రత్యేకించి, షెడ్యూల్డ్ కులాలు, తెగలను విద్య, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని, అన్ని రకాల సామాజిక వివక్షల నుంచి, దోపిడీ, పీడనల నుంచి విముక్తి కలిగించాలి’’ అని ఆదేశిక సూత్రం పిఎస్. కృష్ణన్ చేతిలో ఒక బలమైన ఆయుధంగా మారింది. ఒకవైపు దళితుల దయనీయ స్థితి, రెండోవైపు రాజ్యాంగం అండదండలు పి.ఎస్. కృష్ణన్‌ను ప్రభుత్వాధినేతలపై పోరాడే స్థైర్యాన్నిచ్చాయి. అందుకే వారి సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు రూపొం దిస్తున్న బడ్జెట్లలో ఈ వర్గాలకు తగిన వాటా లభించాలని వాదిం చారు. వారి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు లేకపోతే, సామాజిక వివక్ష నుంచి వాళ్ళు విముక్తి కాలేరని భావిం చారు. అందుకోసమే మొదటగా ఎస్సీలకోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ను రూపొందించి కేంద్ర ప్రభుత్వం చేత ఒప్పించారు. 1978 లోనే దీనికి అంకురార్పణ జరిగింది. 1980లో ఇందిరాగాంధీ పాలనలో దీనికి బలమైన పునాదులు పడ్డాయి. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సమాంతరంగా అమలు జరగాలని, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న పథకాలలో ఏవైనా బడ్జెట్ లోటు ఏర్పడితే స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్(ఎస్సిఏ)ను అందించాలని సూచించారు. అదే విధంగా అత్యాచారాల నిరోధక చట్టం. మండల్ కమిషన్ సిఫారసుల అమలు, బౌద్ధం తీసుకున్న ఎస్సీలకూ, ఎస్టీలకూ అందేవిధంగా జీవోలు అన్నీ ఈయన చేతి నుంచి వచ్చిన సంక్షేమ ఫలాలేనన్న విషయం చాలామందికి తెలియదు. ఎస్సీ, ఎస్టీలలో అభివృద్ధి చెందిన కొన్ని కులాలు మిగతా వారిని తమతో పాటు తీసుకెళ్ళాలనీ, వారికి నాయకత్వం వహించాలని సూచించారు. రిటైరై ఇప్పటికి ఇరవైఏళ్ళు గడిచిపోయింది. కానీ ఆయన తన సంక్షేమ సాధన, సామాజిక న్యాయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదు. తనకున్న గౌరవాన్ని తనకోసం కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం వెచ్చించిన నిరంతర సామాజిక న్యాయపోరాట యోధుడు ఆయన. బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టు ఇటువంటి వ్యక్తుల చేతుల్లోనే రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరుగుతుంది. ఈ కాలం అధికారులు పీఎస్. కృష్ణన్, ఎస్.ఆర్. శంకరన్‌ల నుంచి అందిపుచ్చుకోవాల్సింది సరిగ్గా ఇదే మరి. అదేమిటంటే అంకితభావం, నిరంతర దీక్ష అణగారిన వర్గాల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో పనిచేయడం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
‘సామాజిక న్యాయ’ రూపశిల్పి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో వివిధ శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేసి దళితుల, ఆదివాసీల, మైనారిటీల, వెనకబడిన వర్గాల సామాజికార్థిక హక్కుల కోసం అహరహం శ్రమించిన మహనీయుడు పీఎస్ కృష్ణన్ 87 ఏళ్ల వయసులో ఆదివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. 1956 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణన్ మరణంతో ఈ వర్గాలు తమ హక్కుల కోసం అంకితభావంతో కృషి చేసిన ఒక చాంపియన్‌ను కోల్పోయాయని చెప్పాలి. ఆయన నిర్వహించిన శాఖలు, ముఖ్యంగా కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శి పదవి ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘సామాజికయుక్తమైనవి’. సమానత్వం, సమన్యాయం గురించి ప్రవచించే ఈ దేశ రాజ్యాంగం... అందుకు విరుద్ధమైన పోకడలతో నిర్మితమై ఉన్న మన సమాజాన్ని శాంతియుతంగా మార్చడానికి వీలైన సాధనమని 50వ దశకంలో తనతోపాటు సర్వీస్‌లో చేరిన తన సహచరులకు, ఇతరులకు ఆరు దశాబ్దాలపాటు తన ఆచరణద్వారా నిరూపించిన గొప్ప వ్యక్తి కృష్ణన్. ఆ విషయంలో ఆయన డాక్టర్ అంబేడ్కర్‌కు ఏకైక సాధికార అనుచరుడు. షెడ్యూల్ కులాలకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రణాళిక(స్పెషల్ కాంపోనెంట్) రూపశిల్పి కృష్ణన్. రాష్ట్రాల్లో ఉండే ఈ ప్రత్యేక ప్రణాళికలకు కేంద్రం సాయం అందించడం, రాష్ట్రాల్లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్పొరేషన్లకు నేరుగా కేంద్ర సాయాన్ని అందించడం వంటివి 1978–80 మధ్య ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. 1989లో వచ్చిన షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధ) చట్టం ఆయనే రూపొందించారు. మానవ మలాన్ని మోసుకెళ్లే అత్యంత అమానుషమైన పనికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన మండల్ కమిషన్ సిఫార్సులు అమలుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపూర్వం, అనితర సాధ్యం. ఈ సిఫార్సులను హేతుబద్ధీకరించి, వాటిల్లోని వైరుధ్యాల పరిష్కారానికి కృష్ణన్ ఎంతో శ్రమించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం, కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖగా నామకరణం చేసింది కూడా ఆయనే. భారత సమాజంలోని అనేకానేక ఉపజాతులకు చరిత్రలో జరిగిన అన్యాయం గురించి ఆయనకున్న పరిజ్ఞానం అపారమైనది. వాటిపై వచ్చే ప్రశ్నలకైనా, ఇక్కడి సామాజిక జీవనం గురించిన ప్రశ్నలకైనా ఆయన ఎంతో సాధికారికంగా, సులభగ్రాహ్యంగా జవాబిచ్చేవారు. ఆ రంగంలో ఆయన చేసిన విస్తృత అధ్యయనం అందుకు కారణం. కేంద్ర ప్రభుత్వం, దాని అధీనంలో ఉండే ప్రణాళిక, విధాన రూపకల్పన సంస్థలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆయన విజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాయి. పాలనా వ్యవహారాల రంగంలో పనిచేసే మన ఉన్నత విద్యాసంస్థలు ఆయన చేసిన పరిశోధన పత్రాలను, ఆయన ఇతర రచనలను సేకరించి భవిష్యత్తరాల ప్రభుత్వోద్యోగులకు, దళిత అధ్యయనాలపై పనిచేస్తున్న యువతరానికి మార్గదర్శకంగా వినియోగిస్తే మన సమాజానికి లబ్ధి చేకూరుతుంది. సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికలుగా ఈ దేశంలో శాంతియుత పరివర్తన సాధ్యమేనని స్వప్నించిన డాక్టర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ఇది తోడ్పడుతుంది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న కృష్ణన్ సతీమణి శాంతి కృష్ణన్, ఆయన భావాలను పుణికిపుచ్చుకున్న కుమార్తె శుభదాయని ఆయన అపారమైన పరిశోధన పత్రాలను, ఇతర రచనలను అందించి ఇందుకు సహకరించగలరని నా దృఢమైన విశ్వాసం. కె.ఆర్.వేణుగోపాల్ వ్యాసకర్త మాజీ ఐఏఎస్ అధికారి, ప్రధాన మంత్రి కార్యదర్శి(రిటైర్డ్) -
రిటైర్డ్ ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ (86) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన 1956 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి కృష్ణన్.. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన అఖిల భారత సర్వీసు అధికారిగా అందరి మన్ననలు పొందారు. మండల్ కమిషన్ సిఫార్సుల్లో ఆయన ముఖ్యభూమిక పోషించారు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్‌ది ప్రముఖపాత్ర. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్‌లోని వివిధ విభాగాల్లో చైర్మన్, సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989, సవరణ చట్టం–2015, సవరణ చట్టం–2018 డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడిగా పనిచేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన కృష్ణన్ మృతి పట్ల భవన్ ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పీఎస్ కృష్ణన్‌కు భార్య శాంతి, కుమార్తె శుభా, అల్లుడు చంద్రశేఖర్ ఉన్నారు. కృష్ణన్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, బృందా కారత్, ఎన్‌సీడీహెచ్చార్ ప్రధాన కార్యదర్శి పాల్ దివాకర్, ఏపీ భవన్ ఇన్చార్జ్ ఆర్సీ భావనా సక్సేనా, ఏఐడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం పీఎస్ కృష్ణన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణన్ జీవితాన్ని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంకితం చేశారని కీర్తించారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలబడ్డ వ్యక్తిగా ఆయన గుర్తుండి పోతారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. -
చిదంబరం అధికార దుర్వినియోగం
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) స్కామ్ కేసులో 63 మూన్స్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా తాను బాధితుడినన్న వాదనను లేవనెత్తారు. దేశంలోనే అతిపెద్ద ఈక్విటీ ఎక్సే్చంజ్ ఎన్ఎస్ఈకి లబ్ధి కలిగించాలన్న దురుద్దేశంతో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్ఎస్ఈఎల్ దెబ్బితినేలా వ్యవహరించారని ఆరోపించారు. రూ.10వేల కోట్ల పరిహారం కోరుతూ చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేపీ కృష్ణన్, ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్ఎంసీ) మాజీ చైర్మన్ రమేష్ అభిషేక్‌లకు ఈ వారంలోనే 63 మూన్స్ లీగల్ నోటీసులను కూడా పంపించింది. ‘‘ఎన్‌ఎస్‌ఈఎల్‌ను అంతం చేయాలన్న దురుద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు ఇది. ఎక్సేంజ్ విభాగం నుంచి మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర జరిగింది’’ అని జిగ్నేష్ షా మీడియాకు తెలిపారు. ఎన్ఎస్ఈఎల్ దేశంలోనే తొలి కమోడిటీ స్పాట్ ఎక్సేంజ్. జిగ్నేష్ షాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (63మూన్స్ పూర్వపు పేరు) పూర్తి అనుబంధ కంపెనీ ఇది. అయితే, ఇన్వెస్టర్లు బుక్ చేసుకున్న ఆర్డర్లను గోదాముల నుంచి డెలివరీ చేయకపోవడంతో రూ.5,600 కోట్ల మేర అవకతవకలు 2013 జూలై 31న వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్ఎస్ఈఎల్ నిలిపివేతకు ఆదేశించింది. ఇదే కేసులో షా 2014 మే నెలలో అరెస్ట్ అయ్యారు. దాంతో దాదాపు అరడజను ఎక్సే్చంజ్లపై ఆయన నియంత్రణ కోల్పోవాల్సి వచ్చింది. ‘‘నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌ను ప్రైవేటు కేసుగా పేర్కొన్నారు. కంపెనీ, వాటాదారుల ద్వారా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుందని ప్రకటించారు. మరి ఎఫ్ఎంసీ ద్వారా ఎందుకు పరిష్కరించలేదు?’’ అని షా సందేహాలు వ్యక్తం చేశారు. -
పీఎస్ కృష్ణన్ కృషి ఎనలేనిది
సాక్షి, హైదరాబాద్: వీపీసింగ్ ప్రధానిగా ఉండగా మండల్ కమిషన్ సిఫార్సుల విషయంలో ప్రముఖ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ కృషి మరువలేనిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. ఎమెస్కో ప్రచురించిన పీఎస్ కృష్ణన్ జీవిత చరిత్ర ‘సామాజిక న్యాయ మహాసమరం’తెలుగు అనువాదాన్ని జైపాల్‌రెడ్డి సోమాజిగూడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఆదివారం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణకర్త ఎమెస్కో విజయ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫార్సుల విషయంలో నాటి ప్రధాని వీపీ సింగ్ సంకల్పం ఏదైనా దానికి రాజ్యాంగబద్ధత కల్పించడంలో కృష్ణన్ కృషి ఎనలేనిదని, కృష్ణన్ వల్లనే ఎంతో ఉన్నతమైన ఉత్తర్వులు వెలువడ్డాయని గుర్తుచేశారు. రచయిత పీఎస్ కృష్ణన్ మాట్లాడుతూ.. తాను కొన్ని ఆదర్శాలు, ఆశయా ల సంఘర్షణతో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చానని, తనకు జన్మభూమి కేరళ అయితే, కర్మభూమి ఏపీ అని అన్నారు. ఈ పుస్తకంలోని అస్పృశ్యతాం శం పుస్తక ప్రచురణకర్తలకు సైతం అస్పృశ్యమైనదేనని, అయితే ఉన్నతాశయంతో పుస్తకాన్ని ప్రచురించిన విజయ్‌కుమార్‌కి, పుస్తక రచనకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన పాత్రికేయులు టంకశాల అశోక్, డాక్టర్ వాసంతీదేవికి కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్ కృష్ణన్ భార్య శాంతా కృష్ణన్ తోడ్పాటుని అందరూ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కేఆర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎస్ఆర్ శంకరన్ సహా అందరం పీఎస్ కృష్ణన్‌ని ఆదిగురువుగా భావించేవారమన్నారు. ముస్లిం రిజర్వేషన్లలో కీలక పాత్ర ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్ ప్రముఖ పాత్ర వహించార ని కాకి మాధవరావు అన్నా రు. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఎస్ఆర్ శంకరన్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న వాళ్లు ఈ సమాజానికి, భవిష్యత్ తరాలకు తమ అనుభవాలను జీవితచరిత్రల రూపంలో అందించాల్సిన ఆవశ్యకతను సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి గుర్తుచేశారు. పీఎస్ కృష్ణన్ పుస్తకం ఆవిష్కరణకు ఇది అత్యంత కీలక సమయమని సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి వసంత కన్నాభిరాన్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కల్పనా కన్నా భిరాన్, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, మాజీ ఐఏఎస్ అధికారి టీఎల్ శంకర్, చక్రవర్తి, జయప్రకాశ్ నారాయణ్, విద్యాసాగర్‌రావు, ఐఏఎస్ అధికారి మురళి, జ్యోతి బుద్ధప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
‘బెస్ట్ బాక్సర్’గా వికాస్ కృషన్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని పొందాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత బాక్సర్‌కు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. పురుషుల 75 కేజీల విభాగంలో వికాస్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో వికాస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ట్రాయ్ ఇస్లే (అమెరికా)ను ఓడించాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాక వికాస్ ఖాతాలో చేరిన మరో పతకం ఇదే. ‘నాకిది గొప్ప పునరాగమనం. గతంలో నా కచ్చితమైన బరువును నియంత్రించుకునేందుకు ఇబ్బంది పడేవాణ్ని. ప్రస్తుతం ఆ సమస్య లేదు. నా టెక్నిక్ కూడా మెరుగయింది. మానసికంగా కూడా నేను దృఢంగా మారాను’ అని వికాస్ తెలిపాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను గెల్చుకున్నారు. -
ఇది విరామం మాత్రమే!
సమ్మెకు సిద్ధంగా ఉండాలిl ఎన్ఏడీ జంక్షన్: ఏడో వేతన సంఘం నిర్ణయాలపై అసంతృప్తితో సమ్మె చేసేందుకు రక్షణ శాఖ ఉద్యోగులు సిద్ధమయ్యారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో సమ్మె వాయిదా వేశామని 7వ పే కమిషన్( వేతన సంఘం) అఖిల భారత కమిటీ సెక్రటరీ జనరల్, జేసీఎం నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఎం. కృష్ణన్ అన్నారు. అయితే ఇది విరామం మాత్రమే అని స్పష్టం చేశారు. ఎన్ఎస్టీఎల్ మానసి ఆడిటోరియంలో డిఫెన్స్ కో ఆర్డినేషన్ కమిటీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వర్క్స్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా ‘7వ వేతన సంఘం సిఫారసులపై ఐక్యపోరాటం– దాని ప్రభావం– ప్రభుత్వ వైఖరి’ అన్న అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పే కమిషన్ ఏర్పాటును పోరాటాల ద్వారానే సాధించుకున్నామన్నారు. 7వ పే కమిషన్ సిఫారసుతో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుందన్నారు. జస్టిస్ మాథూర్ సిఫారసులు సమర్పించడానికి ఒక నెల గడువు కోరగా.. ప్రభుత్వం నాలుగు నెలల సమయం ఇచ్చిందని, ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే అని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన 52 అలవెన్సు లు రద్దు చేశారని మండిపడ్డారు. హక్కుల సాధనకు సెప్టెం బర్ 2న చేపట్టబోయే సమ్మెకు ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏఐడీఈఎఫ్ సంయుక్త కార్యదర్శి జీటీ గోపాలరావు మాట్లాడుతూ బీజేపీ కార్మిక వ్యతిరేకSప్రభుత్వమన్నారు. రక్షణ శాఖ ఉద్యోగులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, అందుకు ఉదాహరణే ఇటీవల ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతు ఘటన అని గుర్తు చేశారు. సైనికులు ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, వారికి కనీసం రిస్క్ అలవెన్స్‌లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే ప్రభుత్వం దిగి వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు. గ్రేడ్ పే రూ.18వేలు నిర్ణయించడం దారుణమని, దీన్ని రూ.26 వేలు చేయాలని డిమాండ్ చేశారు. -
అన్నకు అన్నీ తానై.. ఐఐటీదాకా తీసుకెళ్లాడు!
అన్న అడుగుజాడల్లో తమ్ముడు నడవడం గురించి తెలుసు. తమ్ముడిని భుజానెత్తుకుని ఆడించిన అన్నల గురించి కూడా తెలుసు. మరి తమ్ముడి అడుగులే తన అడుగులుగా నడిచిన అన్న గురించి.. అన్నను భుజానెత్తుకొని అన్నీ తానైన తమ్ముడి గురించి తెలుసా? అయితే మీరు కృషాన్, బసంత్ల ప్రయాణం గురించి తెలుసుకోవాల్సిందే.. అమ్మలో సగం.., నాన్నలో సగం.. ‘అన్న’గా పుట్టాడని చెబుతారు. మరి అలాంటి అన్నకే కష్టం వస్తే..? అమ్మకడుపున అతని తర్వాత పుట్టిన తమ్ముడిదే కదా! అందుకే అన్నకు అన్ని తానయ్యాడు. పెరగడంలో.. తిరగడంలో.. చదవడంలో.. చివరికి జీవితంలో ఎదగడంలో కూడా తోడుగా నిలిచాడు. మరి ఆ అన్నకు తమ్ముడిమీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? తమ్ముడు ఆ అన్నకు ఎలా అండగా నిలిచాడు? తెలుసుకుందాం.. కృషాన్, బసంత్ ఇద్దరు ఒకే తల్లికడుపున పుట్టిన అన్నదమ్ములు. అయితే కృషాన్ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. ఇతరుల సాయం లేకుండా అడుగు కూడా వేయలేని పరిస్థితి. అయితేనేం నేనున్నానంటూ తమ్ముడు బసంత్ అన్నతోపాటు అతని బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. బయటకెళ్లాలన్నా, బడికెళ్లాలన్నా కృషాన్కు బసంత్ తోడుండాల్సిందే. దీంతో ఇద్దరూ ఒకే తరగతిలో చేరారు. చదువులో ఇద్దరూ మెరికలే. అందుకే తమకున్న కష్టాల గురించి ఆలోచించకుండా ఉన్నత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. అదే ఐఐటీలో సీటు సంపాదించడం. లక్ష్యసాధన కోసం ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో చేరారు. కష్టపడి చదివారు. వారి కష్టం వృథా పోలేదు. అన్నదమ్ములిద్దరూ ఐఐటీలో మంచి ర్యాంకు సాధించారు. కృషాన్ వికలాంగుల కోటాలో ఆల్ఇండియా 38వ ర్యాంకు, బసంత్ 3675 ర్యాంకు సాధించారు. మరిప్పుడు విడిపోతారా? బడి నుంచి మొదలైన తమ ప్రయాణం ఐఐటీ సీటు సంపాదించేవరకు సాగింది. అయితే ర్యాంకుల్లో తేడాల కారణంగా వీరిద్దరికి వేర్వేరు కాలేజీల్లో సీటు వచ్చింది. మరిప్పుడు వీరిద్దరు విడిపోతారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు అన్నదమ్ములిద్దరూ ధైర్యం చేయడంలేదు. ‘నా తమ్ముడు చిన్నప్పటి నుంచి నాకెంతో చేశాడు. ఇంతవరకు మమ్మల్ని ఎవరూ విడదీయలేదు. ఇప్పుడు వేర్వేరు కాలేజీల్లో చదవాలనే ఆలోచన వస్తేనే బాధగా ఉందంటున్నాడు అన్న కృషాన్. ‘నేనంటే ఎలాగోలా ఉంటాను. అన్న నాలా ఉండలేడు. అందుకే అన్నను వదిలి వెళ్లడం కష్టంగా ఉందంటున్నాడు తమ్ముడు బసంత్. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది బసంత్ ఆశయం కాగా కంప్యూటర్ ఇంజనీర్ కావాలనేది కృషాన్ లక్ష్యమట. మరి ఈ ఇద్దరు అన్నదమ్ముల మిగతా ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి. -
కృష్ణుడు కాదు...గోవిందుడే
చనిపోయిన తమ్ముడి స్థానంలో కొనసాగి, భారతసైన్యంలో ఉద్యోగం సంపాదించాడు. సెలవుల్లో సొంతూరికి వచ్చినపుడు దోపిడీలకు పాల్పడుతూ, అక్రమంగా ఆయుధాలు విక్రయించాడు. ఈ క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చిత్తూరు (అర్బన్): గోవిందస్వామి అనే వ్యక్తి క్రిష్ణన్ పేరుతో నాలుగు రోజుల క్రితం తమిళనాడు హైకోర్టులో కలకలం సృష్టించాడు. తీరా ఇతను క్రిష్ణన్ కాదని, గోవిందస్వామి అంటూ తమిళనాడు హైకోర్టులోని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అలాగే గోవిందస్వామి ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా పేర్కొన్నారు. దీంతో తీవ్ర గందరగోళానికి గురైన న్యాయమూర్తులు ఇతను ఎవరో తేల్చడానికి ఐజీ, డీఐజీ స్థాయి అధికారి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ( ఆ నివేదిక ఇంకా అందలేదు.) ఈనెల 21న మద్రాస్ హైకోర్టులో ఆ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పత్రికల్లో అదేరోజున వార్త ప్రచురితమైంది. ఈ కథనాన్ని చూసిన చిత్తూరు పోలీసులు ఇక్కడ ఓ కేసులో క్రిష్టన్గా చెప్పుకుంటున్న గోవింద స్వామి నాన్‌బెయిల బుల్ వారెంటు జారీ అయిన నిందితుడని గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం గోవిందస్వామిని అరెస్టు చేసి పలమనేరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ వ్యక్తి చిత్తూరు జైలులో ఉన్నాడు. చిత్తూరు పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పట్టావారిపల్లె తాలూక, పాపిరెడ్డిపల్లెకు చెందిన గోవిందస్వామి (29)కు ముగ్గురు సోదరులు. 2005లో తమ చిన్నాన్నను చంపేసిన కేసులో ముగ్గురూ జైలుకు వెళ్లారు. ముగ్గురిలో గోవిందస్వామి తమ్ముడయిన క్రిష్ణన్ బెయిల్‌పై బయటకొచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయా డు. అప్పటికే అతడు భారత సైన్యంలో సిపాయి ఉద్యోగం కోసం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుండేవాడు. అయితే చనిపోయిన వ్యక్తి పేరు గోవిందస్వామి అంటూ తప్పుడు పేరిచ్చి.. కుటుంబ సభ్యుల సహకారంతో క్రిష్ణన్‌గా మారిపోయాడు. 2006లో క్రిష్ణన్‌కు ఆర్మీ నుంచి ఉద్యోగం వచ్చినట్లు కాల్ లెటర్ వచ్చింది. దీంతో తన తమ్ముడి సర్టిఫికెట్లు తీసుకుని తానే క్రిష్ణన్‌గా చెప్పి భారతసైన్యంలో జవానుగా గోవిందస్వామి చేరిపోయాడు. అయితే సెలవుల్లో తమిళనాడుకు వచ్చేటప్పుడు ఉత్తర భారతంలో పలు చోట్ల లభించే నాటు తుపాకీలు, అక్రమ ఆయుధాలను తీసుకొచ్చి నేరస్తులకు విక్రయించేవాడు. ఈ నేపథ్యంలో 2013, 14 సంత్సరాల్లో జిల్లాలోని వి.కోటలో అక్రమ ఆయుధాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అలాగే మరోచోట దారిదోపిడీ చేసినట్లు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో తాను గోవిందస్వామి అని, తన తమ్ముడు క్రిష్ణన్ చనిపోగా అతడి పేరిట చలామణి అవుతూ దోపిడీలకు పాల్పడం, అక్రమ ఆయుధాలు విక్రయించడం చేసేవాడనని పోలీసుల ఎదుట వాగ్మూలం ఇచ్చాడు. దాని తరువాత 2013లో తవణంపల్లెలో ఓ చోరీ, 2012లో కాణిపాకంలో దోపిడీ చేసింది కూడా తానేనని చెప్పడంతో ఆయా స్టేషన్లలో కేసులు నమోదయ్యా యి. ఇతన్ని అరెస్టు చేసే సమయంలో ఆర్మీ అధికారులు సైతం విషయం తెలియక జవానును అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు అడ్డుపడ్డారు. అయితే దీర్ఘకాలంగా విచారణకు హాజరుకాకపోవడంతో పలమనేరు కోర్టు ఇతనిపై ఎన్బీడబ్ల్యూ (నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్) జారీ చేసింది. అప్పటికే తమిళనాడు హైకోర్టులో ఇతను తన పేరు క్రిష్ణన్ అని చెప్పి, ఓ హత్య కేసులో గోవిందస్వామిగా తన పేరు మార్చి పోలీసులు కేసును తప్పుదారి పట్టించారంటూ పిటిషన్ దాఖలు చేశాడు. మన పోలీసులే ఛేదించారు సమాచారం అందుకున్న చిత్తూరు పోలీసులు నిందితుడిని చెన్నైలో పట్టుకుని అరెస్టు చేశారు. గోవిందస్వామి బతి కే ఉన్నాడని మన పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. ఇతను క్రిష్ణన్ పేరిట సైన్యంలో పనిచేయడాన్ని కూడా పసిగట్టారు. ఇక తమిళనాడులోని ధర్మపురిలో జరిగిన హత్య కేసులో నిందితుడు ఎవరు..? ప్రస్తుతం క్రిష్ణన్‌గా చెప్పుకునే గోవిందస్వామి వివరాలను మన పోలీసు ల సహకారంతో తమిళనాడు పోలీసులు చేస్తున్న దర్యాప్తు సులభతరం కానుంది. -
చనిపోయాడనుకుంటే కోర్టులో ప్రత్యక్షం..
- మద్రాసు హైకోర్టులో కలకలం - హత్య కేసు విచారణలో గందరగోళం సాక్షి, చెన్నై: హత్యకు గురైన వ్యక్తి బతికే ఉన్నానంటూ కోర్టుకు హాజరైన ఘటన మద్రాసు హైకోర్టులో గురువారం కలకలం రేపింది. పోలీసుల కేసు ప్రకారం...తమిళనాడు ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టిలో 2011లో కృష్ణన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి బాలు, రాము తదితర ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కృష్ణన్ చనిపోయినట్లుగా పంచాయతీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీచేసింది. ఈ సర్టిఫికెట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆ తరువాత గోవిందస్వామి అనే వ్యక్తి సైతం హత్యకు గురైనట్లుగా మరో డెత్ సర్టిఫికెట్‌ను పోలీసులు దాఖలు చేయడమేగాక, హత్యకు గురైన కృష్ణన్‌ను గోవిందస్వామి హత్యకేసులో సాక్షిగా చేర్చారు. కృష్ణన్ హత్యకేసులో నిందితులకు యావజ్జీవ శిక్షను విధిస్తూ ధర్మపురి సెషన్స్ కోర్టు జనవరిలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని న్యాయమూర్తులు ఎం.జయచంద్రన్, ఎస్.నాగముత్తుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరపింది. నిందితుల తరపు న్యాయవాది రవిచంద్రన్ కోర్టుకు హాజరై, హత్యకు గురైనట్లుగా భావిస్తున్న కృష్ణన్ బతికే ఉన్నాడని, పోలీసులే ఈ కేసును తప్పుదోవ పట్టించారని వాదించారు. కృష్ణన్ బతికి ఉన్నట్లయితే కోర్టుకు హాజరుపర్చాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ కేసు గురువారం మళ్లీ విచారణకు రాగా కృష్ణన్ కోర్టుకు హాజరయ్యారు. అతన్ని జడ్జిలు విచారిస్తుండగా, ప్రభుత్వ న్యాయవాది మహారాజా మధ్యలో అడ్డుకుని అతను కృష్ణన్‌కాదు, గోవిందస్వామి, ఇతనిపై ఆంధ్రప్రదేశ్‌లో అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వాదించారు. కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతని భార్య సైతం వాంగ్మూలం ఇచ్చిందన్నారు. కేసులోని మలుపులతో బిత్తరపోయిన న్యాయమూర్తులు, కోర్టుకు హాజరైన వ్యక్తి ఎవరు, హతులు ఎవరు, ఆత్మహత్య చేసుకున్నవారు ఎవరో తేల్చేందుకు ఐజీ లేదా డీఐజీ స్థాయి పోలీసు అధికారితో విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. -
అప్పుడు డేటింగ్ చేశా!
‘‘డేటింగా.. అదంటే ఏంటీ? అని అమాయకంగా అడగను. ఎందుకంటే, ఒకప్పుడు నేను డేటింగ్ చేశా. అప్పుడు నాకు కావాల్సినంత తీరిక ఉండేది. ఇప్పుడు డేటింగ్ చేద్దామన్నా కుదరడం లేదు. షూటింగ్స్‌తోనే సరిపోతోంది. ఇక, లవ్‌లో పడటం కూడానా? ఒకవేళ పడ్డా అది ఎంతోకాలం కొనసాగదు. ఎందుకంటే, ప్రేమలో పడితే ఆ కుర్రాడితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. నా ఆనందం గురించే కాదు.. అతని ఆనందం గురించి కూడా ఆలోచించాలి. అంత తీరిక నాకెక్కడుంది? పైగా ఈరోజు హైదరాబాద్‌లో రేపు ముంబయ్‌లో.. ఆ తర్వాత విదేశాల్లో.. ఇలా ఊళ్లు పట్టుకు తిరుగుతుంటాను. నాతో పాటు తనను తీసుకెళ్లలేను. అలాగని, నా ప్రయాణాలను నేను మానుకోలేను. ప్రయాణాలు మానుకుంటే ఉద్యోగం మానుకున్నట్లే. ‘ముంబయ్‌లో షూటింగ్ పెట్టుకోండి. అప్పుడు నాకు ఓకే’ అంటే నన్నెవరూ సినిమాలకు తీసుకోరు. అందుకే ప్రస్తుతానికి ఎవరితోనూ లవ్‌లో పడదల్చుకోలేదు.’’ - కృతీసనన్ -
ఉద్యోగస్తుల భాగస్వామ్యంతోనే కొత్త ఆవిష్కరణలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగస్తుల భాగస్వామ్యంతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని మేనేజ్మెంట్ గురు డాక్టర్ రుషీకేశ టి. కృష్ణన్ పేర్కొన్నారు. ఇలా ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేసిన టయోటా, కాగ్నిజెంట్ వంటి సంస్థలు అనేక కొత్త ఆవిష్కరణలు ద్వారా వ్యాపారంలో విజయం సాధించాయన్నారు. కాని ఈ విషయంలో ఇండియా చాలా వెనకబడి ఉందని, అంతర్జాతీయ ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో 66వ స్థానంలో ఉన్నామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఎల్‌వో) ఏర్పాటు చేసిన ‘ఇన్నోవేషన్... గోయింగ్ బియాండ్ జుగాద్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కృష్ణన్ మాట్లాడుతూ టయోటా ఉద్యోగస్తులు గత 40 ఏళ్ళలో 2 కోట్లకు పైగా ఇన్నోవేటివ్ ఐడియాలను ఇవ్వగా, 2012 ఒక్క సంవత్సరంలోనే కాగ్నిజెంట్ ఉద్యోగస్తులు 1.34 లక్షల ఐడియాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు. మన ఇండియాలో టైటాన్ ఇటువంటి కార్యక్రమాన్నే చేపట్టి అనేక విజయాలను సాధిస్తోందని, 2015 నాటికి ప్రతీ ఉద్యోగి ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పేర్కొన్నారు. మన ఇండియాలో టైటాన్ ఇటువంటి కార్యక్రమాన్నే చేపట్టి అనేక విజయాలను సాధిస్తోందని, 2015 నాటికి ప్రతీ ఉద్యోగి ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకుందని చెప్పారు.