అప్పుడు డేటింగ్ చేశా!
‘‘డేటింగా.. అదంటే ఏంటీ? అని అమాయకంగా అడగను. ఎందుకంటే, ఒకప్పుడు నేను డేటింగ్ చేశా. అప్పుడు నాకు కావాల్సినంత తీరిక ఉండేది. ఇప్పుడు డేటింగ్ చేద్దామన్నా కుదరడం లేదు. షూటింగ్స్‌తోనే సరిపోతోంది. ఇక, లవ్‌లో పడటం కూడానా? ఒకవేళ పడ్డా అది ఎంతోకాలం కొనసాగదు. ఎందుకంటే, ప్రేమలో పడితే ఆ కుర్రాడితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి.
నా ఆనందం గురించే కాదు.. అతని ఆనందం గురించి కూడా ఆలోచించాలి. అంత తీరిక నాకెక్కడుంది? పైగా ఈరోజు హైదరాబాద్‌లో రేపు ముంబయ్‌లో.. ఆ తర్వాత విదేశాల్లో.. ఇలా ఊళ్లు పట్టుకు తిరుగుతుంటాను. నాతో పాటు తనను తీసుకెళ్లలేను.
అలాగని, నా ప్రయాణాలను నేను మానుకోలేను. ప్రయాణాలు మానుకుంటే ఉద్యోగం మానుకున్నట్లే. ‘ముంబయ్‌లో షూటింగ్ పెట్టుకోండి. అప్పుడు నాకు ఓకే’ అంటే నన్నెవరూ సినిమాలకు తీసుకోరు. అందుకే ప్రస్తుతానికి ఎవరితోనూ లవ్‌లో పడదల్చుకోలేదు.’’
- కృతీసనన్