
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాను డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయసులో అమిర్ ఖాన్ రిలేషన్‌లో ఉన్నానంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన తన ప్రీ బర్త్ డే ఈవెంట్‌లో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మీడియా ముందు అందరికీ పరిచయం చేశాడు. దీంతో అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేశారు.
అయితే తాజాగా అమీర్ ఖాన్‌తో రిలేషన్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది గౌరీ. అమిర్ ఖాన్ పుట్టినరోజు పార్టీలో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
అసలు ఎవరీ గౌరీ స్ప్రాట్..
కాగా.. ఇటీవల ముంబయి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో గౌరీతో తన రిలేషన్‌షిప్‌ను అమీర్ ఖాన్ ధృవీకరించారు. దాదాపు ఏడాదిగా తాము డేటింగ్‌లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు ఆరేళ్ల పాప కూడా ఉందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆమె తెలుసని కూడా అన్నారు. అంతేకాకుండా గౌరీ ఇటీవలే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశారని ఆయన ప్రస్తావించారు. కాగా.. ఇప్పటికే అమిర్ ఖాన్ కిరణ్ రావు, రీనా దత్తాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూరుకు చెందిన గౌరీ.. రీటా స్ప్రాట్ కుమార్తె. ప్రస్తుతం ఆమె ముంబయిలోనే ఓ సెలూన్‌ను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment