Gauri Spratt
-
అమిర్ ఖాన్‌తో డేటింగ్.. తొలిసారి అలా కనిపించిన గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. తాను డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయసులో అమిర్ ఖాన్ రిలేషన్లో ఉన్నానంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన తన ప్రీ బర్త్ డే ఈవెంట్లో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మీడియా ముందు అందరికీ పరిచయం చేశాడు. దీంతో అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే తాజాగా అమీర్ ఖాన్‌తో రిలేషన్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది గౌరీ. అమిర్ ఖాన్ పుట్టినరోజు పార్టీలో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అసలు ఎవరీ గౌరీ స్ప్రాట్..కాగా.. ఇటీవల ముంబయి నిర్వహించిన ప్రెస్మీట్లో గౌరీతో తన రిలేషన్‌షిప్‌ను అమీర్ ఖాన్ ధృవీకరించారు. దాదాపు ఏడాదిగా తాము డేటింగ్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు ఆరేళ్ల పాప కూడా ఉందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆమె తెలుసని కూడా అన్నారు. అంతేకాకుండా గౌరీ ఇటీవలే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశారని ఆయన ప్రస్తావించారు. కాగా.. ఇప్పటికే అమిర్ ఖాన్ కిరణ్ రావు, రీనా దత్తాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూరుకు చెందిన గౌరీ.. రీటా స్ప్రాట్ కుమార్తె. ప్రస్తుతం ఆమె ముంబయిలోనే ఓ సెలూన్‌ను నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
ప్రేయసితో వయసు ముదిరిన హీరో చెట్టాపట్టాల్.. మాజీ భార్యలకూ సంతోషమే!
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan). 60 ఏళ్ల వయసులో తాను డేటింగ్లో ఉన్నానని నిర్మొహమాటంగా మీడియాకు వెల్లడించాడు. గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో ప్రేమలో ఏడాదికాలంగా ప్రేమలో ఉన్నానని తన బర్త్ సందర్భంగా వెల్లడించాడు. ఆమె కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా నియమించి తనపై ప్రేమను చాటుకున్నాడు.వైరల్‌గా మారిన వీడియోఅయితే ఆమిర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లయిన విషయం తెలిసిందే! రీనా దత్తా (Reena Dutta), కిరణ్ రావు (Kiran Rao)లను పెళ్లి చేసుకోగా ఇద్దరికీ విడాకులిచ్చేశాడు. అలా అని వారితో శత్రుత్వమేమీ పెంచుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితుల్లా మాత్రం ఇప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఫిబ్రవరి నెలలో మాజీ భార్యలతో ఆమిర్ ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.అందరూ ఒకేచోట..క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) - సఫా మీర్జాల 9వ పెళ్లి రోజుకు ఆమిర్ వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. మాజీ భార్యలతో పాటు ప్రేయసి గౌరీని కూడా తీసుకెళ్లాడు. ఈ వీడియోను ఇర్ఫాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆమిర్ మాజీ భార్యలు, ప్రియురాలు ఒకేచోట సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఇంత మోడ్రన్ ఫ్యామిలీని ఎక్కడా చూడలేదంటున్నారు నెటిజన్లు.సినిమాఆమిర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సితారే జమీన్ పర్ మూవీ చేస్తున్నాడు. ఇది 2007లో వచ్చిన తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ సినిమాలో కూడా భాగం కానున్నాడు. View this post on Instagram A post shared by Irfan Pathan (@irfanpathan_official) చదవండి: ఛాతి నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్