
ప్రేమ ఎప్పుడు? ఎక్కడ? ఎలా? చిగురిస్తుందో తెలియదంటారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan) విషయంలోనూ ఇదే జరిగింది. 25 ఏళ్లుగా పరిచయస్తురాలైన గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో ప్రేమలో పడతానని కలలో కూడా ఊహించకపోవచ్చు. కానీ ఏమైంది? రెండేళ్లక్రితం మనసు మాట వినలేదు. గౌరీ గురించే పరితపించసాగింది. ఇది స్నేహం కాదు ప్రేమ అని ఆమిర్‌కు అర్థమయ్యింది. అదే మాట ఆమెతో చెప్పగా తను కూడా సంతోషంగా ఒప్పుకుంది.
60 ఏళ్ల హీరోతో ప్రేమ..
అయితే ఆమిర్ ఖాన్ ఈ ఏడాది 60వ వయసులోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులిచ్చేశాడు. మరి అంతటి పెద్దాయనను ఈవిడ ఎలా ప్రేమించింది? అని సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అనుమానాలకు చెక్ పెట్టింది గౌరి. ఆమిర్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.
ప్రేమకు కారణం అదా!
నా లైఫ్‌లో ఒక జెంటిల్‌మన్ ఉండాలనుకున్నాను. ఎక్కడలేని ప్రేమ కురిపించడంతోపాటు.. దయాగుణం కలిగుండే వ్యక్తి నా జీవితంలోకి వస్తే బాగుండనుకున్నాను అని గౌరి చెప్పింది. ఇంతలో ఆమిర్ అందుకుంటూ.. అప్పుడు నేను నీకు కనిపించాను కదూ.. అంటూ సరదాగా బదులిచ్చాడు. గౌరీ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు. తను పెరిగిందంతా బెంగళూరులోనే కాదు. పెద్దగా హిందీ సినిమాలు కూడా చూడదట!
గౌరీకి ఆరేళ్ల కుమారుడు
నన్ను సూపర్‌స్టార్‌గా చూడదు కానీ పార్ట్‌నర్‌గా మాత్రం భావిస్తోందని ఆమిర్ స్వయంగా పేర్కొన్నాడు. మార్చి 12న ఆమెను తన స్నేహితులు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌కు పరిచయం చేశాడు. ఇకపోతే గౌరీకి గతంలో పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. తను ముంబైలో బిబ్లంట్ అనే సెలూన్ నడుపుతోంది.
చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment